top of page

FEMTOS

 

1. వచ్చీ పోయే అతిథులే

జ్ఞాపకాలు...నా ఏకాంత మనోమందిరానికి ll 08/07/14 ll

 

2. ఒడిసిపట్టడం నేర్చుకున్నా 

జారిపోతున్న బంధపు అనుబంధాలను  ll 08/07/14 ll

 

3. తావికెంత మురిపెమో 

పసిమొగ్గ విరియగానే  ll 08/07/14 ll

 

4. ఎదగాయాలకు లేపనాలు  

నీ స్నేహపు ఓదార్పులు   ll 09/07/14 ll

 

5. ఏరుకుంటున్నా 

జ్ఞాపకాల ముక్కల్ని...పగిలిన గుండెల్లోంచి   ll 09/07/14 ll

 

6. వెదుకుతున్నా 

లిపిలేని కంటి బాసలోని అర్ధాన్ని  ll 09/07/14 ll

 

7. దాచుకున్నా ..మదిపుటల్లో

బాల్యపు జ్ఞాపకాలన్నీ ..నెమలికన్నులుగా   ll 10/07/14 ll

 

8.ఎంతబావుందో 

మాటలపై అల్లుకున్న నీ మౌనం   ll 10/07/14 ll

 

9. కనుమబ్బులదాగిన

శ్రావణమేఘాలు, నీ చూపుల్తో .. జల్లులై పోతూ  ll 10/07/14 ll 

 

10. పులకిస్తోంది... మధుమాసం

చిగురాకుల సవ్వడితో  ll 11/07/14 ll

 

11. ఊహల పూరెమ్మలెన్నో 

నీ తలపుల వనంలో వీచికలైపోతూ  ll 11/07/14 ll

 

12. చిరునవ్వుల జల్లులెన్నో

మది మాగాణిలో సిరులొలికిస్తూ  ll 11/07/14 ll

 

13. వెతలలోయల్లోకి నెట్టేస్తూ 

వెంటాడే జ్ఞాపకాల సమూహాలెన్నో  ll 12/07/14 ll

 

14. జలకమాడుతోంది...మది 

నీ ఊహల పన్నీటి తొలకరులతో  ll 12/07/14 ll

 

15. మదికాన్వాసుపై 

చిత్రంగా ఒదిగిపోయే, ఊహల చిత్తరువులెన్నో  ll 12/07/14 ll

 

16. ఇరు మనసుల సంగమమే 

 బాసల వెల్లువలో పొంగిపొరలుతూ  ll 14/07/14 ll

 

17. మౌనాల పొదలమాటున 

గుభాలించే గులాబీలే ... నీ తలపులు  ll 14/07/14 ll

 

18. పరిశోధకురాలినే 

నిరంతరం నీ మనోశాస్త్రాన్ని శోధిస్తూ  ll 14/07/14 ll

 

19. వలపు విరులెన్నో 

తలపుల తొలకరితో   ll 16/07/14 ll

 

20. ఎదను చిలుకుతూ 

నీ మమతల వెన్నలు ఎన్నో   ll 16/07/14 ll

 

21. ఊసుల సెలయేరులెన్నో ...

పొంగిపోతున్నాయి ...జ్ఞాపకాలప్రవాహాలుగా  ll 16/07/14 ll

 

22. అభిమానం, అత్మీయతలు 

అంగడి సరుకులే ఇపుడు  ll 17/07/14 ll

 

23. జ్ఞాపకాల చిగురులెన్నో 

మోడువారిన మదితోటలో   ll 17/07/14 ll

 

24. విహారానికెళ్ళాయి ఊహలు 

నీ బాసలేవో స్పృశిస్తుంటే   ll 17/07/14 ll

 

25.. అసువులే విడుస్తాను 

మరుజన్మకైనా నీవనుగ్రహిస్తానంటే  ll 18/07/14 ll

 

26. ఒంటరిని చేసి వేధిస్తూ

మదిని వీడని జ్ఞాపకాలెన్నో  ll 18/07/14 ll

 

27. రగిలే గేయాలెన్నో 

నీ ప్రేమ గాయాలతో   ll 18/07/14 ll

 

28. గాలి ఊపే ఊయలలకు

తొలి చిగురుకెంత పులకింతనో   ll 19/07/14 ll

 

29. కలల సౌధం  కూలిపోతుంటే 

కంటి బిందువులకు ...ఆర్తనాదాలెన్నో  ll 19/07/14 ll  

 

30. నిశ్శబ్ద బాణాలెన్నో

కాలపు సంకెళ్ళను తెంచేస్తూ   ll 19/07/14 ll 

 

31. నీ మాటలకెంత సౌరభం 

పూల నీడలకంటిన పరిమళంలా  ll 20/07/14 ll 

 

32. అవనికెంత మురిపేమో 

మంచుపొరల కోకచుట్టి   ll 20/07/14 ll 

 

33. సిగ్గుపూలను జార్చుతూ 

తరువులకెన్ని విరుపులో  ll 20/07/14 ll

 

34. మదికెన్ని జైత్రయాత్రలో 

చైత్ర కోయిలవై... మైత్రి రాగమాలపిస్తుంటే  ll 21/07/14 ll  

 

35. శృతిచేస్తున్నాయి ఊహలు 

మదిగుహలో... ప్రకంపనలతో ll 21/07/14 ll  

 

36. అలవోకగా తాకుతూ 

అల్లరిపెట్టే తలపుల చిరుగాలులెన్నో  ll 21/07/14 ll  

 

37. గిలిగా నవ్వకలా 

గాలిసైతం కనుగీటేస్తోంది   ll 24/07/14 ll  

 

38. చందనపు చినుకులెన్నో 

నీ అనునయ గంధాలనద్దుకుంటుంటే  ll 24/07/14 ll  

 

39. మదిమబ్బుల్లో దాగింది నీవే 

నిండుచంద్రునిలా మెరిసి మురిపిస్తూ   ll 24/07/14 ll  

 

40. అమరగీతమైపోతోంది 

పెదవులపై నర్తిస్తూ నీ నామం  ll 26/07/14 ll  

 

41. వసంతమెపుడూ నా చెంతనే 

తలపుల పరిమళాలను నింపుకుని ll 26/07/14 ll  

 

42. స్వరాంజలినే అర్పిస్తా 

బ్రతుకే బాణీలుగా కట్టి  ll 26/07/14 ll 

 

43. అలనాటి పసిప్రాయం 

నెమలి పింఛాలతో స్పృశిస్తూ ll 27/07/14 ll

 

44. ఉత్తుంగ సంద్రమౌతోంది మది 

నీ జ్ఞాపకాల అల్పపీడనంతో ll 27/07/14 ll 

 

45. ఒంటరి మదికెంత దిగులో 

గగనమంత శూన్యాన్ని నింపేసుకుంటూ   ll 27/07/14 ll

 

46. సిగ్గు చీర తొలగిపోతోంది 

వలపు జోరు పెరగగానే  ll 28/07/2014 ll 

 

47. తామరకెంత తన్మయత్వం ? 

కొంటెకిరణం కనుగీటగానే  ll 28/07/2014 ll 

 

48. సిగ్గుల పంటలే 

గోరింటకు ఈడొచ్చిందంటే  ll 28/07/2014 ll

 

49.పరిమళాల వనంలో 

మందహాసపు మధుమాసాలెన్నో  ll 29/07/14 ll 

 

50. ప్రణయ తాళమేస్తూ

 హృదయానికెంత తన్మయత్వమో   ll 29/07/14 ll 

 

51. పసిపాపనే అవుతున్నా 

నీ కలలవడిలో నిదురిస్తూ   ll 29/07/14 ll 

 

52. నీ ఊసుల వీవనలు

మదిగోడలను మృదువుగా తాకుతూ ll 30/07/14 ll

 

53. నీ భావగీతికలు

తలపుతుమ్మెదలను నర్తింపచేస్తూ  ll 30/07/14 ll

 

54. చెదరని నీ స్మృతులు 

గుండె పుస్తకంలో సువర్ణాక్షరాలుగా  ll 30/07/14 ll 

 

55. ప్రేమ మరణించింది 

మనస్సు లేనిచోట మనలేక  ll 31/07/14 ll  

 

56. మదికెరటం అలసిపోతోంది 

కలలో ఘోషలో చిక్కుకుని  ll 31/07/14 ll  

 

57. దరిచేరని నీకై 

ఎన్ని వేల నిమిషాలను లెక్కిస్తున్నానో ! ll 31/07/14 ll

 

58. ఎంతాశనో  ఏకాంతానికి 

నీ తలపులను గాఢoగా హత్తుకోవాలని .ll 01/08/14 ll  

 

59. నిద్దుర బరువైపోతోంది 

నీ కలల అలజడికి  ll 01/08/14 ll  

 

60. జ్ఞాపకాల ఆనవాల్లెన్నో 

ఆవేదనలను మోస్తూ ll 01/08/14 ll

 

61. చుంబించే అధరబింబాలతో 

పండే సూర్యోదయపు సిగ్గులెన్నో  ll 02/08/14 ll  

 

62. ఇంత గారాలమారాములా ? 

నచ్చావని చెప్పడం తప్పైపోయిందేమో  ll 02/08/14 ll 

 

63. సుమకాంతల కౌగిళ్ళలో 

సురాపాన మత్తులో ఖైదీలౌతూ మధుపాలు  ll 02/08/14 ll

 

64 మదికమలాన్ని గిచ్చేస్తూ 

నీయూహల  భ్రమరాలెన్నో   ll 03/08/14 ll

 

65 మనసుతెరను తీస్తున్నా 

మొహమాటపుపొరను తొలగిస్తూ   ll 03/08/14 ll

 

66 కనుపాపలకు ఎన్ని సిగ్గులో 

నీ కలలను హత్తుకుంటుంటే   ll 03/08/14 ll

 

67.విరామచిహ్నం పెట్టేసా 

నీ తలపుల మంత్రాలకు  ll 06/08/14 ll

 

68.నవ్వుల ముత్యాలు జార్చకలా

రాశులను నింపుకునే చోటులేదిక  ll 06/08/14 ll

 

69. జ్ఞాపకాలకు గిరిగీయవూ 

నా దగ్గరకు రానీయకుండా  ll 06/08/14 ll

 

70. మూడు ముళ్ళూ వేస్తావనే 

ఆ మూడు పదాలూ నేర్చుకొచ్చాను  ll 07/08/14 ll

 

71. తూరుపింటి బిడ్డడికి 

పడమటింట లాలిపాట  ll 07/08/14 ll 

 

72. చినుకుపూలాభిషేకాలతో 

తలంటుకుంటూ తరువులు   ll 07/08/14 ll

 

73.చెక్కిలిని గిచ్చేస్తూ 

నీ ఊహల  కందిరీగలెన్నో ll 12/08/14 ll

 

74. కన్నీటి స్నానాలెన్నో 

నవ్వులోను, ఏడుపులోనూ ll 12/08/14 ll

 

75. హృదయానికెంత భారమో 

నీ ఊసులను మోస్తూ  ll 12/08/14 ll

 

76. మదిగదిలో మసులుతూ 

వదిలిపోని నీ జ్ఞాపకాలు ఎన్నెన్నో  ll 18/08/14 ll

 

77. కలల వధువులే 

ఊహలమేనాలోఊరేగొచ్చే నీ ఊసులు  ll 18/08/14 ll

 

78. మనోఫలకంపై చెక్కుతున్నా 

చెదిరిపోని నీ స్వప్నాలనే..శిల్పాలుగా   ll 18/08/14 ll 

 

79. నిన్నల్లో మిగిలిపోతూ 

నేడు తరలి వెళ్ళిపోయే జ్ఞాపకాలెన్నో  ll 19/08/14 ll

 

80.మనోతీరాన్నికోసేస్తున్నాయి 

పడిలేచే నీ స్మృతుల కెరటాలు  ll 19/08/14 ll

 

81. కన్నీటి క(వ)డగండ్లెన్నో 

మదిమబ్బు వర్షిస్తుంటే  ll 19/08/14 ll

 

82. నీ అధరహాసాలు 

సుధలజడులెన్నో కురిపిస్తూ  ll 20/08/14 ll

 

83. కల చెదిరింది 

ముగిసిన మన కథలా   ll 20/08/14 ll

 

84. జ్ఞాపకాల గీతికలెన్నో 

హృదయార్పణతో ఆలపిస్తూ  ll 20/08/14 ll

 

85. ఓ వింత కల 

నా కలలన్నీ నిజమైనట్లు  ll 22/08/14 ll 

 

86. ఆశల పల్లవులే 

మనోవనంలో చిగురిస్తూ  ll 22/08/14 ll    

 

87. వెతల కథలెన్నో 

 వ్యధల సీమలో విహరిస్తూ   ll 22/08/14 ll    

 

88. అవినాభావ సంబంధమే

హృదయానిది...నయనానిది ll 23/08/14 ll 

 

89. కలల జిలుగులేవో

మెరిసిపోతున్నాయి ...కనుగవ్వలపై ll 23/08/14 ll 

 

90. భువన భవనానికి

వెన్నెల చీరలే... వెండిపరదాలు ll 23/08/14 ll

 

91. జాబిలమ్మకెన్ని హొయలో 

అలలఅద్దంపై ప్రతిబింబిస్తూ  ll 24/08/14 ll

 

92. ప్రతి పరీక్షా నెగ్గే జీవితం 

మరణపు పరీక్షలో మాత్రం ఓడిపోతూ ll 24/08/14 ll

 

93.  చిరుజల్లులే...తలంబ్రాలు 

నింగీనేలల పరిణయానికి  ll 24/08/14 ll

 

94. ఎన్నటికి తీరేనో ?

నీ తలపుల బాకీలు  ll 25/08/14 ll

 

95. గాయం చేసే ముళ్ళెన్నో 

హృదయకుసుమం చుట్టూ   ll 25/08/14 ll

 

96. నీ ఊసుల మొలకలు 

బీడువారిన మనోక్షేత్రంలో... చిగురిస్తూ  ll 25/08/14 ll

 

97. మనమని వేరుగా లేముగా ?

నీదీ, నాదని భేదమెందుకు   ll 26/08/14 ll

 

98. అంతరాలు 

నీకూ, నాకే ..మనకు కాదుగా ll 26/08/14 ll

 

99. విత్తంపై ఆశెందుకు 

చిత్తంలో నీవుండగా  ll 26/08/14 ll

 

100. మకరందపు  ప్రవాహాలే

నీ స్వరపారిజాతాలకు  ll 27/08/14 ll

 

101.తేలియాడుతోంది 

మనస్సు నావ...వలపువాగుల్లో  ll 27/08/14 ll

 

102. జారిపోతున్నా 

చెక్కిలిపై "చుక్కనై"   ll 27/08/14 ll

 

103. కవ్వించే కలలెన్నో 

కొంటె కందిరీగలైపోతూ   ll 28/08/14 ll

 

104. వెన్నెల జాగారాలే 

కోరికలో తీరంలో  ll 28/08/14 ll 

 

105. నీ ధ్యానమే 

నాకు  జీవితమైపోతూ   ll 28/08/14 ll

 

106. హృదయానికెంత వేదనో  

కన్నీటి ఉప్పెనలో కొట్టుకుపోతూ   ll 30/08/14 ll

 

107. అమ్మంటే 

గుడిలేని దైవం ...పూజలెరుగని దేవత  ll 30/08/14 ll

 

108. గతం పిలుస్తూంది 

జ్ఞాపకాల త్రవ్వకాలతో   ll 30/08/14 ll

 

109. ప్రతిక్షణం వసంతమే 

నువ్వే ప్రపంచమైపోతుంటే  ll 01/09/14 ll

 

110. ఎండమావిలో సాగిపోతూ 

ఊహల పూల పడవలెన్నో  ll 01/09/14 ll

 

111. ఇద్దరి లోకం ఒక్కటే 

ఊహల రెక్కలపై ఊరేగుతూ  ll 01/09/14 ll

 

112. జనంతో పనేమిటి ?

మనం ఒకటయ్యాక   ll 11/09/14 ll

 

113. తెలియకుంది 

మరణించిన హృదితో ..జీవించడమెలాగో  ll 11/09/14 ll

 

114. చిరునవ్వుల విరులెన్నో  

పెదవికొమ్మన విరబూస్తూ  ll 11/09/14 ll

 

115. మాటల గాట్లే 

మదికి మచ్చలను మిగులుస్తూ ll 12/09/14 ll

 

116. నవ్వుల లేపనాలెందుకు 

గాయాలను మీటుతూ   ll 12/09/14 ll

 

117.  ప్రతిపేజీలో నీ జ్ఞాపకాలే 

నా జీవితకధను మొత్తం నింపేస్తూ   ll 12/09/14 ll

 

118. జాబిలి మొగ్గ 

చీకటి మడుగులో వికసించే కమలమే  ll 13/09/14 ll

 

119. అమృతవర్షమే 

నువ్వు పలికే ప్రతి పలుకులో  ll 13/09/14 ll 

 

120. వింతగా ఉంది కదూ ? 

నేను లేని నాలో నీతో జీవిస్తూ గడపడం  ll 13/09/14 ll

 

121 బ్రతికేస్తున్నా ఏదో ఒకలా 

జీవించడం చేతగాక  ll 14/09/14 ll

 

122. తడిచి ముద్దైపోతున్నాను 

నీ మందహాసాభిషేకాలతో  ll 14/09/14 ll 

 

123. ఆశల కలువలెన్నో 

మానసతటాకంలో సుమిస్తూ  ll 14/09/14 ll 

 

124. నీ ఏకాంతం 

నను ఒంటరిని చేస్తూ   ll 15/09/14 ll  

 

125. వేదనాసుమాలే 

బాష్పసరస్సుల్లో సుమిస్తూ  ll 15/09/14 ll     

 

126. జ్ఞాపకాలే లేపనాలు 

నువ్వుచేసే ప్రతి గాయానికి  ll 15/09/14 ll    

 

127. దిగులు ముసుగేసేసాను 

నీ ఎడబాటు మిగిల్చే భారమైన హృదితో  ll 16/09/14 ll    

 

128. రాకపోకలు దేనికి ?

నాలోనినీకు ...ఉండరాదా స్థిరమై ఓచోట  ll 16/09/14 ll      

 

129. అక్షరపు రాళ్లనే

విసిరేస్తున్నా...భావసంద్రంలో  ll 16/09/14 ll     

 

130 భావాల పుట్టుక 

బాధలకే తెలుస్తుంది   ll 18/09/14 ll    

 

131. హృదయం విలపిస్తోంది 

నాలో లేని నీకై తడుముకుంటూ   ll 18/09/14 ll    

 

132. కష్టమే జయించడం  

మరణాన్ని....మానసిక, శారీరకాలుగా  ll 18/09/14 ll     

 

133. నీ నవ్వుల తొలకరులకు  

పరిమళించే నెత్తావులెన్నో  ..మనోవనంలో   ll 20/09/14 ll    

 

134. మదిని తాకుతున్నాయి 

నీ ఊసుల మరువాలెన్నో   ... మల్లెచెండులై   ll 20/09/14 ll    

 

135. ఇరు హృదయసంగమంలో 

సాగిపోయే.. ఊహల సెలయేరులెన్నో  ll 20/09/14 ll

 

136. గుర్తుకొస్తున్నాయి 

కన్నీటితో కడిగేసిన జ్ఞాపకాలన్నీ  ll 21/09/14 ll 

 

137. నీ పలుకుల నాదాలేవో 

హృదయాన్ని శృతిచేస్తూ   ll 21/09/14 ll 

 

138. జ్ఙాపకాల గూళ్ళెన్నో 

ఎదమూలల్లో అల్లుకుపోతూ   ll 21/09/14 ll 

 

139. దోచేస్తున్నాయి హృదయాన్ని 

నీ పలకరింపుల ప్రత్యూష పవనాలు   ll 22/09/14 ll 

 

140. అక్షర నక్షత్రాలెన్నో 

కవనగగనంలో మెరిసిపోతూ   ll 22/09/14 ll 

 

141. ఊహలనే తివాచీలుగా

పరుస్తున్నా....నువ్వు నడిచే దారంతా  ll 22/09/14 ll

 

142. లోకం విస్తుపోతోంది 

నీతోడిదే నాకు లోకమైపోయిందని  ll 23/09/14 ll

 

143. మనిషినయ్యాను 

మమత విలువ తెలిసినప్పటినుండి  ll 23/09/14 ll

 

144. నేనంటే నాకెంత మురిపెమో

నాలో నిను దాచుకున్నాక  ll 23/09/14 ll

 

145. అలసిపోతోంది మౌనం . 

మాటల మాటున దాగి    ll 25/09/14 ll

 

146. తట్టుకోవడం కష్టమే 

మనోసాగరపు ఉరవడిని   ll 25/09/14 ll

 

147. బారులు తీరిపోతున్నాయి 

ఎక్కడ లేని జ్ఞాపకాలు....ఎగబడిపోతూ   ll 25/09/14 ll

 

 

148. ఓడిపోతున్నాయి మాటలు

మౌనాలుగానే మిగిలిపోతూ  ll 26/09/14 ll

 

149. నిశీధికెన్ని హొయలో 

వెన్నెలవేదికపై నర్తిస్తూ ll 26/09/14 ll 

 

150. నీ పలుకుల నెత్తావులే

మత్తకోకిల రాసాంత కూజితాలు   ll 26/09/14 ll

 

151. బృందావనిలో ఆమనులెన్నో 

కన్నయ్య మోవిపై సుమాలై విరుస్తూ  ll 27/09/14 ll

 

152. దివ్వె మొలకలే 

నీ అధరపు నవ్వుల వెలుగులు  ll 27/09/14 ll

 

153. కువ కువల సంధ్యారాగాలే 

ఊహలపల్లకీలో ఊరేగుతూ ..మదికి  ll 27/09/14 ll

 

154. జాలువారుతూ చెలినవ్వులు 

జాబిలమ్మ వెన్నెల్లో నన్ను తడుపుతూ ll 28/09/14 ll

 

155. చంచల విన్యాసాలే 

 హరిణాల నయనాలకు ll 28/09/14 ll

 

156 మృత్తికకెంత పరవశం ! 

స్వాతిముత్యాలు ఆర్తిగా హత్తుకోగానే ll 28/09/14 ll

 

157. గాయాలై  స్రవిస్తున్నాయి 

దెబ్బతిన్న జ్ఞాపకాలన్నీ   ll 29/09/14 ll 

 

158.వేదనాప్రసవాలే మదికి  

నాలో నేనే రమిస్తుంటే ll 29/09/14 ll 

 

159. తడిచి  మద్దైపోతున్నా  

నీ ఊసుల తుంపరలలో  ll 29/09/14 ll 

 

160. మునకలేస్తోంది మది 

ప్రణయ ఝురుల ఉరవడులతో  ll 30/09/14 ll

 

161. లిపిలేని బాషనే 

ఘోషించే మూగ మనస్సుది కూడా  ll 30/09/14 ll

 

162. అశ్రువులై జారిపోతున్నాయి 

కన్నీటి అంచున... వేదనల బిందువులు   ll 30/09/14 ll

 

FEMTOS

© 2013 by Komal Vadday

bottom of page