SIRI
MALLELU
1. మాటలు మౌనాన్నే ఆశ్రయించాయి _ నీ తీయనిస్వరం వినగానే ll15- 10 -2013ll
2. నీ ఊహలన్నీ వసంత కుసుమాలే _ ఎడారి మదికి నిత్య పరిమళమిస్తూ ll15- 10 -2013ll
3. రెప్పల మాటున ముకుళాలు _ చెక్కిలిపై విచ్చుకుంటున్నాయి నీ చూపుల తాకిడికి ll15- 10 -2013ll
4. హృదికి చినుకు అందెల నర్తనాలే_ నిను తలిచే ప్రతీ క్షణంలో ll16- 10 -2013ll
5.నవరత్నాలే _ నా నడుము వంపుల్లో జారే నీ చూపుల మంచు బిందువులు ll16- 10 -2013ll
6. ఒళ్ళంతా తుళ్ళింతలే _ తలంబ్రాలను జార్చుతూ తనువును మీటే వేళ్ళ అల్లరికి ll16- 10 -2013ll
7. మరుమల్లెలు మత్తిల్లు ( సిగ్గిల్లు ) తున్నాయి _ నీ సోయగాల పరిమళాలకు ll17- 10 -2013ll
8. వలపుల దోసిలి పట్టవా _ నా తలపుల ( ఊహల ) ముత్యాలతో నింపుతాను ...(నింపాలి ) ll17- 10 -2013ll
9. మది మొబైల్ స్విచ్ ఆఫ్ చేసావా _" మిస్సు" డు కాల్స్ మూగబోతున్నాయ్ ll17- 10 -2013ll
10 . మదికి నేర్పేవి నర్తనాలే _ నీ ఊహలసొదలు ఏవేవో రొదలతో ll18- 10 -2013ll
11. నా హృదయంలో ఉప్పుటేరులు _ నీ కంటి వెతల బిందువులతోనే ll18- 10 -2013ll
12. నా సిగ్గులన్నిటినీ పోగేసి పెట్టుకుంటున్నా _ కెంపుల సరాలు అల్లుదామని ll18- 10 -2013ll
13. మది కోకిలకెపుడూ మదన స్వరాలే _ వలపు చిగురులు మరిగి ll19- 10 -2013ll
14. మనో పుస్తకం మసకబారుతోంది _ నీ జ్ఞాపకాల పేజీలను తిరగేస్తుంటే ( చదువుతుంటే ) ll19- 10 -2013ll
15. మది చివురులనుండి జారే మంచు బిందువులే _ నీపై పెంచుకున్న నా ఆశలు ll19- 10 -2013ll
16 . ప్రేమ గ్రహణం విడువని ( పట్టిన ) జాబిలినే _ నీ తలపుల గగనంలో ll20- 10 -2013ll
17 . సిగ్గుల తడికి ముడుచుకున్న కమలాలే _ వలపు కొలనులో చిలిపి ఊహలు ll20- 10 -2013ll
18 . వలపుల గీతాలాపనే _ మది రెమ్మన ఊయలలూగే ఊహల కోయిలకెపుడూ ll20- 10 -2013ll
19 . మది గులాబీ చుట్టూ నీ జ్ఞాపకాల కంటకాలే _ తీయని గాయాలను రేపుతూ ll21- 10 -2013ll
20 . గడిచిన బాల్యమే కావాలి _ వరంగా ll21- 10 -2013ll
21. ఎన్ని జన్మలైనా వేచిఉంటా _ అమ్మకు అమ్మనై పుట్టి ఋణం తీర్చుకునే బాగ్యానికై ll21- 10 -2013ll
22. నా చెక్కిలిపై సిగ్గుల గోరింటలు _ నీ కొనగోటిమీటుకే ll22- 10 -2013ll
23 . తన ప్రతిరూపాన్ని పంపాడు నాన్నగా _ రూపాన్ని చూపమని దైవాన్ని కోరితే ll22- 10 -2013ll
24 . అంతరంగపు అరలన్నీ నిండిపోతున్నాయి ( నిండి పోయేది ) _ నీ జ్ఞాపకాల పుస్తకాలతోనే ll22- 10 -2013ll
25 . హృది గగనపు వీధులంతా వలపు తారల బారులే _ నీ జ్ఞాపకాలై మెరిస్తూ ( వెలుగుతూ ) ll22- 10 -2013ll
26. జ్ఞాపకాలని తోక్కేస్తూ నీ తలపులు _ కాళీయమర్దనం చేసే కన్నయ్య పాదాల్లా ll23- 10 -2013ll
27. ఊహల రెప్పల మాటునే దాచి పెడుతున్నా _ చిగురిస్తున్న స్వప్నాలను ll23- 10 -2013ll
28 . ఓర్చుకుంటూనే ఉంటా, వేయి జన్మలైనా _ నీ జ్ఞాపకాల గాయాలను ll24- 10 -2013ll
29 . మట్టిపూల పరిమళమే మనోధాత్రికి _ నీ తలపుల తొలకరికి ll24- 10 -2013ll
30. మదిలో అత్తరుల పరిమళమే _ నీ స్వర సుమాలతో ll24- 10 -2013ll
31 . మది కొలనులో విచ్చిన(విరసిన) కలువలు _ నీ చిలిపి ఊహలతోనే ll24- 10 -2013ll
32 . తలపుల తారకలు _ నీ విరహాకాశంలో తళుకులీనుతూ ll25- 10 -2013ll
33 . నా మదిలో ప్రేమజ్యోతులను వెలిగేది _ నీ మురిపాల చమురుతోనే ll25- 10 -2013ll
34. నా ఊహల ప్రశ్నాపత్రం లీక్ చేసుకున్నా _ నీ ప్రేమ పరిక్షలో ఫెయిల్ అయిపోయా ll26- 10 -2013ll
35 . గట్టున ఉన్న పిల్ల కోసమా _.పిల్ల కాలువకు " షి "కార్ అంటే ll26- 10 -2013ll
36 . మనో మార్గమంతా విశాలమే _ తలపుల వాహనాల జోరెంత ఉన్నా ll26- 10 -2013ll
37 . పుస్తకంగా మార్చాలి _ ప్రింట్ తీసుకుని పెట్టుకున్న నీపై 'ఫీలింగ్స్' ని ll27- 10 -2013ll
38 . ఊహల వంతెనలే నిర్మించుకుంటున్నా _ నీ తలపుల సాగరాన్ని దాటాలని ll27- 10 -2013ll
39 . నీ తలపుల చిగురులతో సుసంపన్నమే _ మనో క్షేత్రమంతా ll27- 10 -2013ll
40 . మది కొలనులో వెన్నెలనై ఈదుతున్నా _ నీ జ్ఞాపకాల చీకట్లను చీల్చాలని ll28- 10 -2013ll
41 . బాషకందని ఆనందాలే _ పసి మువ్వనై నీ ఊహల ఊయల ఊగుతుంటే ll28- 10 -2013ll
42 . మనో పుస్తకాంలో అక్షరాలు మసకగా _ నీ జ్ఞాపకాలిచ్చిన కన్నీటిపొరలతో ll28 10 -2013ll
43 . ఉప్పునీటిసరస్సుల నిలయాలే నా కళ్ళు _ నీ జ్ఞాపకాల వేదనతో నిండిపోతూ ll29- 10 -2013ll
44 . సాహితీ క్షేత్రమంతా పిల్లమొలకలు _ నీ భావాక్షరాల చిగురులతో ll29- 10 -2013ll
45 . మనో సరస్సులో ఈదులాడే మీనాల సందడులే _ నీ చిలిపి జ్ఞాపకాలు ll29- 10 -2013ll
46 . వెలిగే నా కంటిపాపలే _ హృదిలో వెలుగుతున్న నీ ఆశలు ll30- 10 -2013ll
47 . అక్షరకుసుమాల పరిమళాలే _ సాహితీ నందనమంతా ll30- 10 -2013ll
48 . యెద కోయిల కువ కువలే _ తలపుల కాంబోజీ రాగాలతో ll30- 10 -2013ll
49 . విశ్వామిత్రుడినర్ధిస్తున్నా ప్రతిసృష్టి చేయమని_ చంద్రుడినందుకుందామని ll31- 10 -2013ll
50 . 'పూజ' 'అర్చన'లను కూడా తీసుకురా అంటావేమిటి_ "శాంతి " కోసమే గుడికంటే ll31- 10 -2013ll
51 . తారాగృహాలకు శశాంకుడేసేవి మదనబాటలే _ వెన్నెల చెంత లేకుంటే ll31- 10 -2013ll
52 . నాన్న ప్రేమ ఎపుడూ అక్షయ పాత్రనే _ తోడే కొద్దీ ఊరే ఊట బావిలా ll1- 11 -2013ll
53 . మౌనంతోనే ముచ్చటిస్తున్నా _ ఎటు తిరిగినా నీ జ్ఞాపకాలే అగుపిస్తుంటే ll1- 11 -2013ll
54 . అక్షర కెరటాలెన్నో ఎగిసి పడుతున్నాయి _ భావాల తీరాన్ని చేరుతూ ll1- 11 -2013ll
55 . ఎదురింటి 'సంధ్య'కే నా ప్రేమవందనం అంటావే _ "త్రి" సంధ్యా వందనమంటే ll2- 11 -2013ll
56 . దిల్ (DILL) ని కిల్ (KILL) చేస్తూనే ఉంటావు - ఎంత డీప్ (DEEP) గా లవ్ (LOVE ) చేస్తున్నా ll2- 11 -2013ll
57 . నీ ఊహల పుస్తకం నుండి జారిన పేజీనే _ జ్ఞాపకాల అక్షరాలను భారంగా మోస్తూ ll2- 11 -2013ll
58 . మిణుగురుల మెరుపులే ఆశాజ్యోతులు _ నీ జ్ఞాపకాల నిశీధిలో ll4- 11 -2013ll
59 . రణోత్సాహమే _ నీ తలపుల పంచ కళ్యాణీలను స్వారీ చేస్తుంటే ll4- 11 -2013ll
60 . కలనైనా కానరావు _ గుండెల్లోను , గుర్తుల్లోను మాత్రమే దాగుండి పోతూ ll4- 11 -2013ll
61 . కనులకెందుకో నిదుర లేమి _ గుబులు గుండెకైతే ll5- 11 -2013ll
62 . స్వప్న కుసుమాలై వాడి పోతున్నాయి _ కంటి లతలకు విరిసిన ఆశలన్నీ ll5- 11 -2013ll
63 . కన్నీటి వనరులెన్నో _ గుండెల్లో కంటకాల వనాలకి ll5- 11 -2013ll
64 . కలలకి మాత్రం పరిమితం చేసావు _ రెప్పల బయటకు నెట్టేసి ll 6- 11 -2013ll
65 . దిల్ లో నీ కబ్జాలు _అడగకుండా ఆక్రమించడమే ముద్దంటూ ll 6- 11 -2013ll
66 . ప్రతి రోజూ మాఘమాసమే _ మనో వేణువు కళ్యాణరాగాలనాలపిస్తుంటే ll 6- 11 -2013ll
67 . తేనెల జలపాతాలే _ యెదతీరాన్ని అలలై తాకే నీస్వర తరంగాలు ll 7- 11 -2013ll
68 . ప్రేమ వారధిని నిర్మిస్తున్నాను _ ఏడేడు జన్మల బంధాలను కలుపుకుంటూ ll 7- 11 -2013ll
69 . రాత్రిలో స్నానమాడిన చెరకువింటి ముక్కలు _ నా మామ కనుబొమలు ll 7- 11 -2013ll
70. ఎగిసిపడే కెరటాలే _ మనోసాగరతీరం తాకే నీ తలపులు ll 8- 11 -2013ll
71. హృదయం నిండా ప్రేమ గాయాలే _ నీ చూపుల తూటాలతో ll 8- 11 -2013ll
72. మనో కుసుమంపై వాలిన గండు తుమ్మెదవే _ వలపు మకరందాలను గ్రోలేస్తూ ll 8- 11 -2013ll
73. ఆశల తోరణాలు కట్టి వేచి ఉన్నా , మధువని రాధికనై _ మనో బృందావనిలో ll12- 11 -2013ll
74. కోయిలమ్మ మూగనోము _ నీ పలుకులు విన్నందుకే ll12- 11 -2013ll
75. నీవే పూలకారువైతే ...నీ ఊహలు పూలతేరుమీదేగా పరుగులు తీసేది ll12- 11 -2013ll
76. మది భాండమెప్పుడూ అక్షయమే _ నీ తలపుల ముత్యాలను నింపుకుని ll13- 11 -2013ll
77. రతీదేవి అలిగింది _ మన్మధబాణం తనమీద వేయడం లేదని ll13- 11 -2013ll
78. దొంగిలించిన నీ నవ్వులతో ఖజానా నింపుకుంది _ నీలాకాశం ll13- 11 -2013ll
79. మరీచికల నీడలే _ గుండెలో నిరాశలైన ఆశలు ll13- 11 -2013ll
80. నను నేను కోల్పోతూనే ఉన్నాను _ నిను మరచిన ( తలచిన ) ప్రతి గడియలోనూ ll14- 11 -2013ll
81. ఊహలన్నీ గువ్వలై ఎగిరి పోతున్నాయి _ మది గూటిని వదిలేసి ll14- 11 -2013ll
82. నీ ఊహా వసంతాన్నే వెదజల్లుతోంది _ ఎన్నిఋతువులు మారినా ll15- 11 -2013ll
83. మది గులాబీ చుట్టూ నిట్టూర్పుల ముళ్ళులే _ విరగబడి నవ్వుతూ ll15- 11 -2013ll
84. మనో గగనమంతా తారాకుసుమాలే _ ఊహావెన్నెల పుప్పొడులను అద్దుకుని ll15- 11 -2013ll
85. ఏకాంతశిశిరంతోనే సహవాసం చేస్తున్నా _ ఒంటరి కోయిలనై ll16- 11 -2013ll
86. కనులు తెరిచినా కల "వరింతలే " _ కలలో నీ చిలిపి అల్లరికి ll16- 11 -2013ll
87. కనులకేందుకో వడగళ్ళ వానలు ?_ ముసురు పట్టింది మనస్సుకైతే ll16- 11 -2013ll
88. ముక్కలైన హృదయం ఆశల రెక్కలను తొడుగుతోంది _ నిను చేరాలనే ll17- 11 -2013ll
89. గులాబీల బారులు _ నీ పెదవులపై చిరునవ్వులుగా మారాలని ll17- 11 -2013ll
90. నీ తలపులతో "రణాలే " _ మది లోగిలికెపుడూ ll17- 11 -2013ll
91. ఊహలకెంత లోకువ _ నీ జాడ లేకున్నా నిన్నే తలుస్తున్నానని ll18- 11 -2013ll
92. నా ఆశకెంత అత్యాశ _ రెక్కలు తొడిగి అంబరానికి ఎగరాలని ll18- 11 -2013ll
93. నీ ప్రేమనే స్రవిస్తోంది _ మాటల తూటాలతో హృదయాన్ని పేల్చేసినా ll18- 11 -2013ll
94. నిలువుదోపిదీకి గురయ్యాను _ నీ చూపుల తాకిడితోనే ll19- 11 -2013ll
95. మది పరకాయ ప్రవేశం చేస్తోంది _ నీలో ఉన్న నన్ను చూసుకోవాలని ll19- 11 -2013ll
96. భావాలన్నీ బాసల కట్నాలుగా ఇచ్చేశాను _ నీ బంధమై నిలిచిపోవాలని ll19- 11 -2013ll
97. ప్రేమ పుష్పాలనే అర్పిస్తున్నా _ మదిలో కొలువై ఉన్న నీ మూర్తికి ll20- 11 -2013ll
98. మధువుల జలపాతాలే _ కూనలమ్మతో పోటీకి దిగే నీ స్వరధారలు ll20- 11 -2013ll
99. మనో లతలన్నీ విరగపూసాయి _ నీ నవ్వుల పూవులతో ll20- 11 -2013ll
100. ప్రేమజలాన్ని పోయవూ వనమాలివై _ పసిమొగ్గలుగానే వాడిపోతున్న ఆశలపై ll21- 11 -2013ll
101. నా కన్నీటి సంద్రాన తేలియాడుతూ _ నీ ఊహల నౌకలెన్నో ll21- 11 -2013ll
102. మదివేణువు నీ గేయాలనే ఆలపిస్తోంది _ నువ్వెన్ని గాయాలు చేస్తున్నా ll21- 11 -2013ll
103. నీ గుండె లయలో నేనే ఉంటా _ ప్రతీ స్పందనను లెక్కిస్తూ ll 03-12-13 ll
104. మదిని సిరి మువ్వలై తాకుతున్నాయి _ నీ ఊసులన్నీ ll 03-12-13 ll
105. నన్ను చదువుకుంటున్నా _ నాలో ఉన్న నిన్ను అర్ధం చేసుకుందామనే ll 03-12-13 ll
106. మౌనంగా మత్తుగా తాకుతున్నాయి _ మదనుని నేర్పునే సవాల్ చేసే నీ చూపులు ll 04-12-13 ll
107. కలల సౌదాలన్నీ కూలిపోతున్నాయి _ నా కన్నీటి ప్రవాహానికి ll 04-12-13 ll
108. వెలుగుల అద్భుతాలేవో ఆవిష్కరిస్తున్నాయి _ నీ కంటి చందమామలు ll 04-12-13 ll
109. స్మృతి సంకెళ్ళనే బిగించుకుంది హృది _ నిను మరచిన పశ్చాత్తాపంతో ll 05-12-2013 ll
110. ఆశల మిణుగురులెన్నో , మనో నిశీధిలో _ తారా దీపాలై ll 05-12-2013 ll
111. రెప్పలమాటునే వేచి ఉన్నా _ నీ కలగా మారాలనే ll 05-12-2013 ll
112.తలపులకెన్ని తంటాలో _ నిను వీడి ఉండలేక ll 06-12-13 ll
113. మది సొమ్మసిల్లిపోతోంది _ నీ జ్ఞాపకాల వడదెబ్బకు ll 06-12-13 ll
114. మది వాకిలిపై అద్దుకున్నా, రంగవల్లులు గా _ నీ బాసలనే ll 06-12-13 ll
115. కన్నీరుగా జారిపోతున్నాయి , నీ జ్ఞాపకాలు _ మదిని నువ్వు ముక్కలు చేస్తుంటే ll 07-12-2013 ll
116. నీ దీక్షనే పూనాను _ నియమాలెంత కష్టమైనవైనా ll 07-12-2013 ll
117. ఏరుకుంటూనే ఉన్నాను _ నీ చూపులనుండి జారిపోయే దృశ్యాలను ll 07-12-2013 ll
118. మురిపించే మువ్వలే _ ఎదలోతుల్లో ఒదిగున్న నీ ఊహలు ll 09/12/13 ll
119. మందార మొగ్గలు పిల్లి మొగ్గలేస్తున్నాయి చెక్కిలిపై _ మునిగోటితో మీటుతుంటే ll 09/12/13 ll
120. ఏకాంత నిశీధిలో మిణుగురునే _ ఆశలు , నిశ్శబ్దమేలుతుంటే ll 09/12/13 ll
121. కరిగి పోతున్నాయి కర్పూరంలా సిగ్గులన్నీ _ నీ చూపుల వేడిమికి ( తాకిడికి ) ll 10/12/13 ll
122. యెదను తడిపేస్తున్నాయి హిమప్రవాహాలై _ నీ తలపుల చినుకులు ll 10/12/13 ll
123. నిన్నటి కలగానే మిగిలాను _ నీ కనుల మాటునే దాగుండిపోతూ ll 10/12/13 ll
124. కళల గురించి చెప్పమంటే _ చంద్రకళ నా ?సూర్యకళ నా ? అంటావేమిటి ? ll 11/12/13 ll
125. కనుపాపల్లో నింపుకుంటున్నా నీ పరిచయాన్ని _ కలనైనా మరువకూడదనే ll 11/12/13 ll
126. మయూరాలు సైతం విస్తుపోతున్నాయి _ నీ నడకల్లోని హొయలకు ll 11/12/13 ll
127. ఊహాగగనంలో ఆశల హరివిల్లే _ నా కన్నుల్లో నీ కలలు ll 12/12/13 ll
128. అక్షర పుష్పాలపై భావాల పుప్పొడి _ కవనవనంలో పరిమళిస్తూ ll 12/12/13 ll
129. ఎలకోయిలనై వేచి ఉన్నా _ చైత్రంలో నీ మైత్రి కోసమే ll 12/12/13 ll
130. ప్రమోదం కాదు విషాదం _ నా ఊహలను నువ్వు ఉరితీస్తుంటే ll 13/12/13 ll
131. తొలి సిగ్గులేవో జాలువారుతున్నాయి చెక్కిలిపై _ నీ నోట నా నామం వింటుంటే ll 13/12/13 ll
132. చరవాణికి చిలిపి ప్రకంపనలే _ నీ చిత్రం ముఖచిత్రమైనప్పటినుండీ ll 13/12/13 ll
133. స్మృతి పధంలో నిన్నే స్మరిస్తూ _ తన్మయత్వంతో నాలో నేను ll 19/12/13 ll
134. ఎక్కుపెడుతున్నాను , అక్షరాలనే ఆయుధంగా _ బూజుపట్టిన వ్యవస్థపై ll 19/12/13 ll
135. నీ కలల్లోనే తేలిపోతున్నాను _ ప్రక్కనే నువ్వున్నావన్న ద్యాసను మరచి (విడిచి ) ll 19/12/13 ll
136. నను నేను మరచిన క్షణం _ నిను నేను వలచిన క్షణమే ll 20/12/13 ll
137. నీ చిత్తమెపుడూ ప్రళయమే _ ఘర్జించే మేఘంలా , ll 20/12/13 ll
138. చిగురుటాకుల లేఖలే వ్రాస్తున్నాను _ ఎదనిండిన భావాలతో ll 20/12/13 ll
139. గోధూళి తెరలో మలి సంధ్యలే _ మబ్బు మాటున దాగిన జాబిలమ్మ సోయగాలు.ll 21/12/13 ll
140. వేకువనే అయ్యాను _ చిగురుచెక్కిలిపై మంచు బిందువునై జారాలనే .ll 21/12/13 ll
141. చిగురుమావిపై వసంత కోయిల సందడులే హృదికి _ నువ్వు తలపుకొస్తే.ll 21/12/13 ll
142. మది మాటునే మౌనపోరాటం _ వేసారిన మనస్సుకు .ll 22/12/13 ll
143. సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి _ ఎద లయకు శ్రుతివై నువ్వు జత చేరితే .ll 22/12/13 ll
144. ఎదమడుగులో వాడిపోయే కలువలు _ నీపై నా ఆశలు.ll 22/12/13 ll
145. నీ నవ్వుల ఉషోదయాలు _ నిరాశా తిమిరపు తెరలను తొలగిస్తూ .ll 23/12/13 ll
146. వసంతరాగాల సుప్రభాతమాలపిస్తున్నా _ మధుమాసపు కోయిలనై ll 23/12/13 ll
147. తెలిమంచు పూలార్చనలే _ భానుమూర్తి పసిడి కిరణాల సోయగాలకు ll 23/12/13 ll
148. ఆనందపు విరి జల్లులే _ ఆమనివై నువ్వు అరుదెంచితే ll 24/12/13 ll
149 .నా కన్నుల్లో నీ రూపమే _ దీపంగా వెలుగులు చిమ్ముతూ ll 24/12/13 ll
150. పగలబడి నవ్వాయేమో లతలన్నీ _ మా పెరటి విరులైనాయి ..ll 24/12/13 ll
151. ఇంత అలుసెందుకు నా ప్రేమంటే _ వలచి వచ్చాననే చులకనేగా ll27/12/13 ll
152. కన్నుల్లో మెరుపుల తళుకులే _ నీ ప్రియరూపం కాంచుతుంటే ll 27/12/13 ll
153. పరవశమే _ నీ ప్రేమ అంచులను స్పృశిస్తుంటే ll 27/12/13 ll
154. భ్రమగానే మిగిలిపోయింది _ కరిగిపోయిన నా స్వప్నం ll 31/12/13 ll
155. నిశబ్దంలో చిరు శబ్దంలా _ నీ జ్ఞాపకం ll 31/12/13 ll
156. తన్మయత్వమే _ నా తలపులు నీ ప్రేమ కక్ష్యలోనే తిరుగుతుంటే ll 31/12/13 ll
157. వసంతమే వర్షిస్తోంది _ నీ బాటకు పూల తివాచీని పరచాలని కాబోలు ll 02/01/14 ll
158. శాశ్వత పూజారిణినే _ నీకు ప్రేమ దీపారాధన చేస్తూ ll 02/01/13 ll
159. కన్నీటి హారతులే _ నీకై వేసారిన నా కనులతో ll 02/01/14 ll
160. ముద్దుల కూననే అవుతున్నా _ నువ్వింతగా లాలిస్తుంటే ll 06/01/14 ll
161. భ్రూణ హత్యలు _ మానవ జాతి నిర్మూలనకి సన్నాహాలు ll 06/01/14 ll
162. నిత్యం శివరాత్రి జాగరణలే _ నీ జ్ఞాపకాలతో ll 06/01/14 ll
163. చిగురాకుల లేఖలపై లిఖిస్తున్నా హిమబిందువులతో _ ప్రేమాక్షరాలను ll 07/01/14 ll
164. నీరాంజనాలే అర్పిస్తున్నా _ జీవితమంతా నీకే కానుక చేస్తూ ll 07/01/14 ll
165. శ్వాసవే _ నిశ్వాసవై నను వీడి పోతూ ll 07/01/14 ll
166. గ్రహణం పట్టిన జాబిలినే _ శారద యామినిలో ll 16/01/14 ll
167. నను వీడిన క్షణం _ నీ ఉనికే నా ఊపిరని గుర్తించిన తరుణం ll 16/01/14 ll
168. ఇంత చాకచక్యమా ?_హృదయాన్ని చిద్రం చేయడంలో ll 16/01/14 ll
169. ఆవిరై మిగిలిపోతోంది _ ఆదమరిచి జారిన కన్నీటి ముత్యం ll 17/01/14 ll
170. నీ పెదవులపై నాట్యమాడుతోంది _ మకరందాలలో మునిగిన నా నామం ll 17/01/14 ll
171. మౌనికనై వేచి ఉంటా_ నీ ప్రత్యూషపు పద ధ్వనులకై ll 17/01/14 ll
172. మధుమాలికనే అవుతున్నా _ నీ నవ్వుల ధారలలో తడిసి మురిసి ll 18/01/14 ll
173. శ్రావ్య గీతికనే _ నీ స్వరంతో, లయనై జత పడుతూ ll 18/01/14 ll
174. ప్రేమాక్షితనే నేను _ నాకే సొంతమైన ,నీ హృదయపు ప్రేమ సామ్రాజ్యంలో ll 18/01/14 ll
175 . పరవసిస్తున్నా, మాధవుని మాటల వేణువులకు _ రాగ దీవిలో రాధికనై ll 19/01/14 ll
176. చినుకు అందెలకు నర్తించే చంద్రవంకనే _ వినీలవనిలో విపంచినై ll 19/01/14 ll
177.కస్తూరి లేఖనై పరిమళిస్తున్నా _ నీ జ్ఞాపకాలే కుసిమిస్తుంటే ll 19/01/14 ll
178. ముత్యాలరాసులు చిన్నబోతున్నాయి_నీదరహాసపు జిలుగులకు (వెలుగులకి) ll 20/01/14 ll
179. సుదీపికలే _ నా కన్నుల వెలిగే నీ వర్చస్సులు ll 20/01/14 ll
180. పిచ్చి మదికి యెంత ఆత్రమో ? _ నీ సప్త జన్మల బంధమై నిలవాలని ll 20/01/14 ll
181. చూపులు మత్తిల్లుతున్నాయి _ నీ సుకు"మారానికి" ll 21/01/14 ll
182. ఏ మంత్రం వేసావో హృదికి _ కలనైనా నీ వలపే ll 21/01/14 ll
183. సూటిగా తాకుతున్నాయి నీ జ్ఞాపకాలు _ ముళ్ళై గుచ్చుకుంటూ యెదలో ll 21/01/14 ll
184. నిశీధి నైరాశ్యం _ నీ మదిలో నాకు చోటు లేదని తెలిసిననందుకే ll 22-01-2014 ll
185. నీ శ్వాసల వెచ్చని వీచికలకై వేచి ఉన్నా _ వెన్నెల రేయిలో తారకనై ll 22-01-2014 ll
( OR) నీ శ్వాసల వెన్నెల వీచికలకై వేచి ఉన్నా _ రేయిలో తారకనై ll 22-01-2014 ll
186. ముత్యాలు తమ ఖజానాను నింపుకుంటున్నాయి_నీదరహాసాల్ని ఏరుకుని ll 22-01-2014 ll
187. అప్రయత్నంగా నా మనస్సు ఎదురుచూసేది _ నీ ప్రేమను పొందాలనే ll 28/01/14 ll
188. కలకాలం తోడై ఉంటావనుకున్నా _ చీకటిలో ఛాయలా వీడిపోతావనుకోలేదు ll 28/01/14 ll
189. ఆశల కుసుమాలు వాడి పోతున్నాయి _ జ్ఞాపకాల పరిమళాలను విడుస్తూ ll 28/01/14 ll
190. నీ పేరునే గుండె చప్పుడుగా మార్చుకుంటోంది _ నువ్వు వెలివేసిన నా హృదయం ll 03/02/14 ll
191. కనుపాప నిను దాచుకుంటోంది _ కమ్మని స్వప్నంగా ll 03/02/14 ll
192. రోజులెంత శూన్యంగా గడుస్తున్నాయో _ నీ పలుకులు వినకుంటే ll 03/02/14 ll
193.నీ ప్రేమ దివ్వెలనే వెలిగిస్తున్నా, ఆరని జ్యోతులుగా _ హృదయ యామినిలో ll 04/02/14 ll
194. ఋతువులన్నీ కరిగిపోతున్నాయి _ ఎదురుచూపులోనే ll 04/02/14 ll
195. నా ఊపిరంతా వేదనా భరితమే _ నీ ఊసులు లేక ll 04/02/14 ll
196. నా గుండెకు లయ దేనికో _నువ్వు శ్వాసిస్తే ll 05/02/14 ll
197. మనస్సు మైదానం బీడువారుతోంది _ ప్రేమ చినుకులను చిలకరించవా ? ll 05/02/14 ll
198. నన్ను నాకంటే గొప్పగా చూపిస్తుంది _ నీ ప్రేమ దర్పణం ll 05/02/14 ll
199. కలలన్నీ జారిపోతున్నాయి _ కన్నీళ్లుగానే ll 06/02/14 ll
200. కళ్ళతోనే చదువుతున్నా _ నీ మనోభావాలను ll 06/02/14 ll
201. గడ్డి పూలకెంత సంబరమో _ మంచు చెంగును కప్పుకుని ll 06/02/14 ll
202. జ్ఞాపకాలై మదిని మెలిపెడుతున్నాయి _ మనం కన్న కలలన్నీ ll 07/02/14 ll
203. విషాదమైనా అమృతమయమే _ నీవిచ్చేదైతే ll 07/02/14 ll
204. నీ కన్నుల్లో ఏ లిపికీ అందని భావాలే _ కొంటె సైగలేవో చేసేస్తూ ll 07/02/14 ll
205. సహనంలోనూ గెలుపు నీదే _ ఓర్పుకే ఓనమాలు నేర్పిస్తూ ll 10/02/14 ll
206. వసంతమే మత్తిల్లిపోతోంది _ కొత్త చివుళ్ళు తిన్న మత్తకోకిలలా ll 10/02/14 ll
207. గ్రీషాన్ని పలుకరించే వర్షపుజల్లులే _ నీతీయని పలుకుల స్వరాలు ll 10/02/14 ll
208. మనో పుస్తకమంతా నింపేసాను _ నీ ప్రేమ లేఖలతోనే ll 12/02/14 ll
209. జతపడాలనేగా _ మాటల వంతెనలను నిర్మిస్తున్నావ్ ll 12/02/14 ll
210.నాకు నేను అపరిచితనే_నువ్వు జ్ఞప్తికి వచ్చిన క్షణంలో ll 12/02/14 ll
211. నీ జ్ఞాపకాల మొగ్గలే_ నా కలలవనంలో వికసిస్తూ ll 13/02/14 ll
212. నా ఊహల చిత్రాలే _ మది అల్మారాలో దాచుకున్న నీ ఊసులన్నీ ll 13/02/14 ll
213. ఊహల గొలుసులతో బందీని చేసాను _ నిను, నా మనోదుర్గం లో ll 13/02/14 ll
214. కురులను మత్తెక్కిస్తునాయి _ మరులు గొలిపే విరులు ll 15/02/14 ll
215. ఋతుశోభలకు ధీటుగా _ నీ దరహాసపు సోయగం ll 15/02/14 ll
216. చైత్ర వీణియకెన్ని ఆలాపనలో_ తుమ్మెదల ఝుంకారాలతో ll 15/02/14 ll
217. విషాదగీతికనే అనుకున్నా _ నా తలరాతను నీవు మార్చేవరకు ll 18/02/14 ll
218.ఏం మాయ చేసావో _ నీ పలుకులనే ఆలకిస్తోంది ...నీదైపోయిన నా మనస్సు ll 18/02/14 ll
219. హృదయ క్షేత్రమంతా నీ జ్ఞాపకాల విత్తులే _ మదిని చీల్చుకుంటూ పైకోస్తూ ll 18/02/14 ll
220. నీ కలల వానకు వెలిసి పోతూ _ చెక్కిలిపై ముద్దుల తడి ll 20/03/14 ll
221.వెలుగు పుష్పాలై విచ్చుకుంటున్నాయి _ తారా భామలు ll 20/03/14 ll
222.వెలుతురు సౌధం _ నీ నవ్వుల విరుల రధం ll 20/03/14 ll
223.వెలికి తీస్తూనే ఉన్నా _ గుండెలోని సమాధి చిత్రాలను ll 22/03/14 ll
224. వలపు పుప్పొడిని దోచి పారిపోతూ _ తుంటరి తూనీగల్లె ll 22/03/14 ll
225. హరివిల్లు వన్నెలద్దుకుంది_నీ అందాలతో ll 22/03/14 ll
226. హరివిల్లు విరబూసింది _ నీ దరహాసాలను అద్దుకుని ll 22/03/14 ll
227. ప్రేమలేఖగా వ్రాసా నీకే ముందుగా _ నా మదిలో మాట ll 23/03/14 ll
228. నీ పాదాలానే ముద్దిడుతోంది _ మది అందియగా మారి ll 23/03/14 ll
229. నా చిగురాశల గంధం_ నీ శ్వాసకుపంచే మకరందం ll 23/03/14 ll
230. హరివింటి పొదరింట సువర్ణ లేఖలు _ నీ కనుల బాసలు ll 01/04/14 ll
231. పూలమనసుకెన్ని పులకింతలో _ భ్రమరాల ఝుంకారాలతో ll 01/04/14 ll
232. ఝరులకెన్ని లయలో _ గిరుల సిరులను తాకిన తమకంతో ll 01/04/14 ll
233. స్వరాల కొలనులో వికసించే కమలం _ నీకై నే పాడే ప్రతి పదం ll 09/04/14 ll
234. ప్రణయవేదికపై మురళిగీతిక _ నా మూగమనస్సు ఆలాపన ll 09/04/14 ll
235. నా ఊహల స్వేచ్చా విహంగాలు _ నీ హృదయపంజరంలో బందీలే ll 09/04/14 ll
236. నే ఓటమినే కోరుకుంటా _ మన మధ్య వాదమే వస్తే ll 19/04/14 ll
2.37 ప్రణయార్పణమే చేస్తా ప్రాణాన్నే _ నా జతై నువ్వుంటే ll 19/04/14 ll
238. కుహుకుహు గమకాలే పోటీ పడుతున్నాయి నీ పలుకులతో _ చైత్ర వేదికపై ll 19/04/14 ll
239.ఆరు ఋతువుల సంగమం _ మదిమాటున దాగిన నీ తలపుల పూవనం ll 28/04/14 ll
240. కోర్కెల వెంట పయనం_వెంట రావని తెలిసీ ll 28/04/14 ll
241. గుండెనే దిండుగా మార్చుకున్నా _ కన్నీటి చెలమల్ని పీల్చుకోవాలిగా ll 28/04/14 ll
242.నిశబ్ద ఖేదాలెన్నో _ కనులు దాచిన స్వప్నాల మాటున ll 29/04/14 ll
243. మదివాకిట ముసిరిన చీకట్లను తరిమేస్తూ _ నీ తలపులదీపికలు ll 29/04/14 ll
244. నా కన్నీటి సాగరంలో నిమజ్జనమైపోతూ _ నీ జ్ఞాపకాలు ll 29/04/14 ll
245. మదికి విహంగవీక్షణమే _ రెక్కలుతొడిగిన నీ ఊహల రెపరెపలతో ll 01/05/14 ll
246. నయనసాగరాన మునిగితేలుతూ _ నా ఆశల నౌకలు ll 01/05/14 ll
247. కెందామరలెన్నో విచ్చుకుంటున్నాయి చెక్కిలిపై _ సిగ్గుల మొగ్గలేస్తూ ll 01/05/14 ll
248.వేదనాల అలలెన్నో _ సుడిగుండాలై తిరుగుతూ ... మనోసాగరమంతా ll 04/05/14 ll
249. కనురెప్పల కెంత అవస్థ _ జారిపోయే అశ్రువులను పట్టుకోవడం చేతకాక ll 04/05/14 ll
250. మౌనాన్నే ఆశ్రయిస్తున్నా _ నిశబ్ద తలపుల యుద్దానికి ఆయుధంగా ll 04/05/14 ll
251. వసంత సమీరమై సృశిస్తూ _ వసి వాడని నీ ప్రేమ సుగంధాలెన్నో ll 05/05/14 ll
252. నీ తలపుల పరిమళ రాగాలెన్నో _ కుసుమించే నా ఆశల విరులకు ll 05/05/14 ll
253. మనసువాకిట్లో ఊహల రంగవల్లులే _ నీ కలల హరివిల్లులనద్దుకుని ll 05/05/14 ll
254. కలానికెన్ని కులుకులో _ వలపు సిరా... ప్రేమ సాగరమై పొంగిపొర్లుతుంటే ll 09/05/14 ll
255. ఆప్యాయంగా ముద్దాడుతూ నీ జ్ఞాపకాలు _ చెక్కిలిపై జారిపోయే కంటి బిందువులై ll 09/05/14 ll
256. ఆశల మిణుగురులెన్నో.... తళుకుల తారలౌతూ _ నిరవపు నిశీధిలో ll 09/05/14 ll
257. ఆలోచనలన్నీ వలస పోతున్నాయి _ నీ వెంటే సై అంటూ ll 10/05/14 ll
258. పరిమళ రాగాలేవో మీటుతున్నాయి....మనోవనంలో _ కోయిలై నువ్వు వాలుతుంటే ll 10/05/14 ll
259. మనో సుమానికి పరాగాలెన్నో _ నీ తలపుల పుప్పొడులేవో తాకుతుంటే ll 10/05/14 ll
260. ఎద పొత్తిళ్ళలో ఒదిగి పోతూ _ వెచ్చటి నీ తలపుల పసిపాపలు ll 17/05/14 ll
261. వసంత సౌరభాలు _ కలల్లోకి ....నీ నడకల గుబాళింపుతో ll 17/05/14 ll
262. నీ మునివేళ్ళ సవ్వడికేమో ? _ గమకాల సరళీస్వరాలెన్నో ... నా హృదయానికి ll 17/05/14 ll
263. సరిక్రొత్త రాగాలెన్నో సాధన చేస్తున్నా _ వసంతమై నువ్వొస్తే..ఆలపిద్దామని ll 20/05/14 ll
264. దరహాసపు మొగ్గలు తొడుగుతున్నాయి పెదవులు _ నీ ఊసుల చివురులతో ll 20/05/14 ll
265. వర్షించేందుకు సిద్ధమైన దుఃఖపు మేఘాలెన్నో _ నయనాకాశంనుండి తొంగిచూస్తూ ll 20/05/14 ll
266. ఎదను పేల్చేస్తున్నాయి _ నీ చూపుల శతఘ్నులు ll 24/05/14 ll
267. మోహవాహినిలో పరవశిస్తున్నా _ నాలో ఇమిడిన నీలోకి ఒదిగిపోతూ ll 24/05/14 ll
268. నీ పిలుపేమోనని తుళ్ళిపడ్డా _ తొలకరి గాలుల అలికిడులా ? ll 24/05/14 ll
269. చిత్తంలో నీ ఊహల చిత్రాలెన్నో _ హరివింటి వర్ణాలనద్దుకుంటూ ll 30/05/14 ll
270. కంటి అంచున జారిపోతూ _ నిరాశల ధారలు ll 30/05/14 ll
271. నిస్సహాయరాలినే _ నీ జ్ఞాపకాల దాడిలో గాయపడుతూ ll 30/05/14 ll
272. భావాల పూబాటనే పరుస్తున్నా _ కవితవై నువ్వు అడుగిడుతుంటే ll 31/05/14 ll
273. ప్రతి ఋతువూ వసంతమే _ యెద చక్షువులలో ....నువ్వు నిండాక ll 31/05/14 ll
274. మది నిండా మరందాలే _ నీ ఊసుల ఆనంద నర్తనాలకి ll 31/05/14 ll
275. అల్లుకుపోయే రాగాలెన్నో _ ఎదను మీటుతూ ... శృతి చేస్తూ ll 01/06/14 ll
276. ఏ మంత్రం వేసావో ? _ జ్ఞాపకాలు కూడా వలస పోతున్నాయి ..నన్ను విడిచి ll 01/06/14 ll
277. తేలిపోతోంది మానస నౌక _ నీ వలపు గోదారిపై ll 01/06/14 ll
278. దొంగలా దోచేస్తోంది మనోదర్పణం _ నాలో నున్న నీ రూపాన్ని ll 02/06/14 ll
279. మౌనం పహారా కాస్తోంది _ మనస్సు కోటకి ll 02/06/14 ll
280 . కలలన్నీ బందీలైపోతున్నాయి_ కనురెప్పల జైలులో ll 02/06/14 ll
281 .జలతారు వెన్నెలలను కురిపిస్తూ _ నీ నవ్వుల తారకలు ll 03/06/14 ll
282. ఊరుతున్నాయి మమతల ఊటలెన్నో _ నీ మురిపాల చెలమల నుండి ll 03/06/14 ll
283. నవ్వుల స్మృతులెన్నో _ కనుకొలనులో కదలాడుతూ ll 03/06/14 ll
284. తామరాకుపై నాట్యమాడే నీటి ముత్యాలలా _ మది కొలనులో నీ ఊసులు ll 08/06/14 ll
285. తలపుల మొలకలెన్నో _ ఆశల చిగురులు తొడుగుతూ ll 08/06/14 ll
286. శృతిమీటుతున్నాయి మనోతంత్రులను _ వలపుల గానాలేవో ll 08/06/14 ll
287. కనుపాపల తెరలపై వాలిపోతున్నాయి _ ఊసుల సిగ్గులెన్నో ll 09/06/14 ll
288. మనో వేణువు పిలుస్తోంది _ గాయాల స్వరాలతో ll 09/06/14 ll
289. మలిసంధ్య అలుగుతోంది _ వెలుగు జారిపోతోందని ll 09/06/14 ll
290. తరువు వీణలను మీటుతూ _ వాయుగానాలెన్నో ll 10/06/14 ll
291. కన్నీరుగా కురిసిపోతూ _ ఓ జ్ఞాపకమేఘం ll 10/06/14 ll
292. మదికెరటం అలసిపోతోంది _ తలపుల ఘోషతో ll 10/06/14 ll
293. సూన్యపు సూక్తులెన్నో _ రాలిపోయే ఆశలనడుమ జన్మిస్తూ ll 11/06/14 ll
294. పెదవులు వర్షించని పదాలెన్నో _ కంటిలో నీటిపొరల సాక్షిగా ll 11/06/14 ll
295. ఒంటరి కుసుమాన్నే _ దిగులు కొమ్మన వ్రేలాడుతూ ll 11/06/14 ll
296. క్షణమొక యుగమే _ రేయంతా రెప్పపడని కనులకు ll 12/06/14 ll
297. నెలరాజు తోటలో పరిమళిస్తూ _ వేవేల తారాకుసుమాలు ll 12/06/14
298. అర్చనలెన్నో చేస్తున్నా ...మది కోవెలలో _ వలపు విరులతో ll 12/06/14 ll
299. కనుదోయి చెమరిస్తోంది _ నీ పలుకుల ఆలాపనలో లీనమైపోతూ ll 19/06/14 ll
300. పగలంతా నీ నీడై ఉంటా _ రాత్రంతా నా కలవై తోడుంటానంటే ll 19/06/14 ll
301. చిరునవ్వుల సంతకాలే చేస్తున్నా _ నా ప్రేమ పుస్తకంలో ll 19/06/14 ll
302. తొలకరులకెన్ని చిలిపి నర్తనాలో _ మేఘాల పల్లకిలో ఊరేగుతూ ll 20/06/14 ll
303. కన్నీటితోనే లిఖిస్తున్నా _ వెన్నంటే నీ జ్ఞాపకాల జాడలను ll 20/06/14 ll
304. ఎండమావులై పోతున్నాయి…ఆశల ఒయాసిస్సులు _ కనుపాపల ఎడారిలో ll 20/06/14 ll
305. నీ చూపుల నర్తనాలకేనేమో _ ఎదలో అందెలరవళులు ll 21/06/14 ll
306. మనస్సు లిఖిస్తోంది మౌనలేఖలెన్నో _ వలపు మబ్బులొచ్చి వాలుతుంటే ll 21/06/14 ll
307. తాళమేస్తోంది వలపుగీతిక _ మది పాడే జావళీలకు పరవశిస్తూ ll 21/06/14 ll
308. చిరునవ్వుల దీపాలెన్నో _ నీ చెలిమి ప్రమిద నిండుగా ll 22/06/14 ll
309. సొమ్మసిల్లుపోతున్నాయి ఆశలు _ నీ హృదయానికి ..వీడ్కోలు పలుకుతూ ll 22/06/14 ll
310. ఆలపిస్తున్నా ....కోయిలనై _ వసంతమెరుగని ఎర్రని ఎడారుల్లో ll 22/06/14 ll
311. చెక్కిలిని తడిపేస్తూ _ నీ జ్ఞాపకాల ధారలెన్నో ll 23/06/14 ll
312. కనురెమ్మపై వాలుతూ ఓ తీయనికల _ ఊగుతోంది ఊహల ఊయల ll 23/06/14 ll
313. మౌనం నవ్వుతోంది _ ధ్యానభంగం కాగానే ll 23/06/14 ll
314. ఊహల గవాక్షాలనే తెరిచి ఉంచా _ ఆశల రంగవల్లులెన్నో దిద్దుకుంటూ ll 05/07/14 ll
315. భ్రమర"వరు"లు బారులు తీరేది _ విరి వ(మ)ధువులకోసమే ll 05/07/14 ll
316. మది తుంటరి తూనీగౌతోంది _ నీ తలపుల మకరంద పానంలో ll 05/07/14 ll
317. వింత పులకరింతలెన్నో...ధరణికి _ తొలకరి జల్లుల అభిషేకిస్తుంటే 17/07/14
318. నీ మాటల చినుకులెన్నో _ సుధల్లా మదిని తడిపేస్తూ 17/07/14
319. మది తలుపులనే తెరుస్తున్నా _ నీ ఊసుల అలికిడికి 17/07/14
320.సంబరాలు, జల్లులై కురుస్తున్నాయి _ యవ్వనాల మబ్బులే ముసురుతుంటే ll 18/07/14 ll
321. మదికోయిల మూగదైపోతోంది _ వలపువసంతం ...శిశిరమైపోతుంటే ll 18/07/14 ll
322. అల్లుకుపోతూ పరిమళిస్తున్న నీ జ్ఞాపకాలు _ పుష్పగుచ్చాన్ని చుట్టుకున్న సుగంధంలా ll 18/07/14 ll
323. నీ పలకరింతల పరిమళాలకేమో _ మనోవనమంతా పరవశం ll 19/07/14
324. అలసిపోతున్నాయి కనులు _ అలుపెరుగని నీ కలల జోరుతో ll 19/07/14 ll
325. కన్నీటితో కరిగించాలని ప్రయత్నిస్తున్నా. _ మెలిపెట్టేసే నీ జ్ఞాపకాలను ll 19/07/14 ll
ఏక వాఖ్య కవితలు
326. అలలవేదికపై జాబిలమ్మ నర్తనం _ వయారపు వంపులతో ప్రతిబింబిస్తూ ll 20/07/14 ll
327. సంధ్యాసుందరికెన్ని సిగ్గులో _ సింధూరపు చీర చుట్టుకుంటూ ll 20/07/14 ll
328. అర్పిస్తున్నా ప్రేమ పత్రాలెన్నో _ హృదయ కుసుమంతో బాటుగా ll 20/07/14 ll
329. కనుల తోటలో ముకుళాలే _ కలలలో పరిమళించే కుసుమాలుగా మారుతూ ll 21/07/14 ll
330. ప్రణయ సుగంధాలే _ రమించే నీ ప్రేమ పరాగాలతో ll 21/07/14 ll
331. కంటి ముత్యాలు చెప్పే కధలెన్నో _ రెప్పలచూరులనుండి జారిపోతూ ll 21/07/14 ll
332. జారిపోతున్నాయి...నిలవలేమంటూ _ కన్నీటి క్షణాలన్నీ ll 22/07/14 ll
333. స్వప్నాల నింగిలో విరబూస్తోంది _ మనసు లోని (జాబిల్లి)నీరూపం ll 22/07/14 ll
334. ఊహలరేవులో తేలిపోతూ _ కలల నావలెన్నో ll 22/07/14 ll
335. నీ ప్రేమ కావ్యాలే ...నా మస్తక పుస్తకమంతా ll 24/07/14 ll
336. మదిలో అందెలరవళి _ నీ గుండెలోని పిలుపులతో ll 24/07/14 ll
337. చిలిపి మెరుపుల దరహాసాలెన్నో _ కనుమబ్బుల మాటున దోబూచులాడుతూ ll 24/07/14 ll
338. హరివిల్లుతో చిత్రిస్తున్నా ...నీ రూపాన్ని _ మనోగగనంమంతా విరిసేలా (మెరిసేలా ) ll 26/07/14 ll
339. కనురెప్పల గుప్పిటే పట్టి ఉంచా _ నా కన్నులవెలిగే నీరూపాన్ని ll 26/07/14 ll
340. మది చెలమలో ఊరే సుధలే _ నా మౌనం మాటున మసలే నీఊసులు ll 26/07/14 ll
341. మదికెంత ఇష్టమో _ నువ్వు , నేను మనమౌతుంటే ll 27/07/2014 ll
342. కనురెప్పలపై వాలిపోతూ _ కదలనని మారంచేస్తోంది... ప్రణయకాలం ll 27/07/2014 ll
343. మదికి వేణుగానమే _ నా శ్వాసవై నువ్వు చేరగానే ll 27/07/2014 ll
344. తనివి తీరడమే లేదెందుకనో _ నీ ఊసులనెంతగా హత్తుకుంటున్నా ll 28/07/14 ll
345. అధరపు వేదికపై నర్తిస్తూ తారాడే సిరిమువ్వలే _ నీ నవ్వులు ll 28/07/14 ll
346. ప్రేమ చినుకులు జారిపోతున్నాయి _ మరుల మబ్బులు రెప్పలు తెరవగానే ll 28/07/14 ll
347. ఒంటరి మనస్సుకెంత దిగులో_ ఆకాశమంత శూన్యాన్ని నింపుకుంటూ ll 29 /07/ 14 ll
348. అంకితమిస్తా నీకే _ మనోగ్రంధంలో లిఖించుకున్న పద్యాలన్నీ ll 29 /07/ 14 ll
349. నీ ఊసుల జాడను పసిగట్టిందేమో _ పురివిప్పి నాట్యమాడుతోంది...మది ll 29 /07/ 14 ll
350. ఒంటరి పక్షినై అలమటిస్తున్నా _ నీ జ్ఞాపకాల హోరుగాలికిచిక్కి ll 30/07/14 ll
351. ఆకులురాలిన శిశిరపు కొమ్మనే _ నువ్వొదిలిన ఏకాంతపు నిశీధిలో ll 30/07/14 ll
352. వేధిస్తావుఎందుకనో ? _ మదిని వెలివేసింది చాలక ll 30/07/14 l
353. జారిపోయే జ్ఞాపకాలెన్నో _ కన్నీటి చినుకులుగా కరిగిపోతూ ll 31/07/14 ll
354. తడిచి ముద్దైపోతోంది మది _ నీ స్మృతుల తుంపరలకే ll 31/07/14 ll
355. "వాయు"లీనమే మదికి _ నీ ఉచ్వాస నిశ్వాసములతో ll 31/07/14 ll
356. మదిని ముంపుకు గురిచేసేస్తూ _ నీ తలపుల వాయుగుండాలెన్నో ll 01/08/14 ll
357. మనోవీణను సవరిస్తున్నా _ నీ నాదాలనే పలికించాలని (వినిపించాలని) ll 01/08/14 ll
358. రుధిర జ్యోతులెన్నో వెలిగిస్తున్నా _ శిధిలమైన హృదయపు ప్రమిదలో ll 01/08/14 ll
359. కవ్విస్తున్నాయి ..నగవుల నయనాలు _ నవయవ్వన సీమలో విహరిస్తుంటే ll 02/08/14 ll
360. కనుపాపల్లో దాస్తున్నా ... తొలివలపులన్నీ _ నీ చూపులు...అల్లరి పెడుతుంటే ll 02/08/14
361. మదికింత ఆశదేనికో _ కలవని దిశలమే మనమని తెలిసీ ll 02/08/14 ll
362. మరులవేదికపై మోహనరాగమాలపిస్తోంది _ నిన్ను నింపుకున్న హృదయం ll 03/08/14 ll
363. మురళీరవమౌతోంది నా ఊపిరి _ నా శ్వాసవై నువ్వు పల్లవిస్తుంటే ll 03/08/14 ll
364. వాలుచూపుల అస్త్రాన్ని విసిరేయకలా _ తీయని గాయమే చేస్తోంది ... హృదిని తాకి ll 03/08/14 ll
365. ఏ కల కరిగిపోయిందో నింగిలో _కంటికి ధారగా విలపిస్తోంది ll 05/08/14 ll
366. అన్ని ఋతువులు...వసంతాలైపోతున్నాయి _ అనురాగాలు పరిమళిస్తుంటే ll 05/08/14 ll
367. గతం గుర్తులెన్నో _ నే నడిచొచ్చిన దారిలో ll 05/08/14 ll
368. దూసుకుపోయే భావశరాలెన్నో _ సాహితీ సమరంలో ll 06/08/14 ll
369. నీ జ్ఞాపకాల జాడలెన్నో _ నన్ననుసరించే నీడలుగా ll 06/08/14 ll
370. విరహ సముద్రమే...మది _ నీ తలపుల అలలతో పొంగిపొరలుతూ ll 06/08/14 ll
371. ఎదకోయిల ఎగిరిపోయింది _ నీ నవ్వుల వసంతాల జాడలేక ll 07/08/14 ll
372. ఒదిగొదిగిపోయే కలల గువ్వలెన్నో _కనురెప్పల గూటిలో ll 07/08/14 ll
373. నిత్యకళ్యాణమే మదికి _ నీ వలపుల వరమాలలతో ll 07/08/14 ll
374. పులకిత వనమాలినే_ మనోక్షేత్రమంతా ప్రణయబీజాలను నాటేస్తూ ll 12-08-14 ll
375. ఆశల కిటికీని తెరిచి ఉంచా _ తొంగిచూసే అందాల జాబిలివై వస్తావని ll 12-08-14 ll
376. నీ కలలనే మోస్తున్నాయి ....నయనాలు _ నవ్వుల ముత్యాలనే జార్చుతూ ll 12-08-14 ll
377. మరణశయ్యపై విశ్రమిస్తోంది మది _ ప్రేమచితిని పేర్చేసావుగా ll 14-08-14 ll
378. రుధిరధారలనే స్రవిస్తోంది హృది _ నీ మాటల గాయాలతో ll 14-08-14 ll
379. కన్నీటి మబ్బులెన్నో _ మనోగగనంలో తేలియాడుతూ (కురిసిపోతూ) ll 14-08-14 ll
380. మానసనౌకకెన్ని లాహిరిలో_ విరహసముద్రంపై తేలిపోతూ ll 16/08/14 ll
381. పాదాల పారాణిలైపోతున్నాయి _ నీ తలపులు సిగ్గులతో ll 16/08/14 ll
382. ఎగిసిపడే తాపపు అలలెన్నో _ నీ ప్రణయకడలిలో ll 16/08/14 ll
383. తుమ్మెదల కౌగిలిలో వదిగిపోతూ _ సుమకాంతలకెంత అరమోడ్పులో ll 18-08-14 ll
384. నా ఊపిరిని తనతో తీసుకుపోతూ _ నీ ఎడబాటు ll 18-08-14 ll
385. పడమటింట చిలిపి మజిలీలే...దినకరునికి _ సంధ్య వడిలో వాలిపోతూ ll 18-08-14 ll
386. సుమవనంలో విహరిస్తూ అల్లరి తూనీగలై పోతున్నాయి_నీ తలపులు ll 19/08/14 ll
387. ననువీడి వెళ్ళిపోతోంది నీ రూపంలో....ఊపిరి _ మాటమాత్రమైనా చెప్పకనే ll 19/08/14 ll
388. పెదవులపై పండుతూనే ఉంటావు _ చూపులు వాటేసుకున్న ప్రతిసారీ ll 19/08/14 ll
389. ఒంటరి ద్వీపాన్నే _ నీ స్మృతుల ఏకాంతంలో మసిలిపోతూ ll 20-08-14 ll ll
390. మరువలేకున్నా _ నువ్వు మదిని తడిమిన క్షణాలను ll 20-08-14 ll
391. చిప్పిల్లుతోంది హృదయం _ వత్తిళ్ళ పొత్తిళ్ళలో నలిగిపోతూ ll 20-08-14 ll
392. కాలపు చెక్కిలిపై జారుతూ _ తడారని కన్నీటి స్మృతులెన్నో ll 21-08-14 ll
393. బ్రతుకంతా నడిచొస్తా నీకై _ చితిలో సైతం తోడౌతూ ll 21-08-14 ll
394. కంటిలో పొంగుతోంది నర్మద_ కలలన్నిటినీ కన్నీళ్ళుగా జార్చేస్తూ ll 21-08-14 ll
395. కనురెప్పలకెన్ని కళలో _ ప్రతి కలలోనూ నీ కళలే కనబడుతుంటే ll 23/08/2014 ll
396. ఒంటరి వానలే కంటికి _ వియోగం ఎదను తాకుతూంటే ll 23/08/2014
397. వ్రాస్తున్నా ..కన్నీటి లేపనాలానే అద్డుకుంటూ _ గాయాల ఆత్మకధలెన్నో ll 23/08/2014 ll
398. విలవిలలాడుతోంది మది _ మరువలేని గాధలనే తలపోస్తూ ll 24/08/14 ll
399. మది సంచిలో దాచిపెట్టాను _ కనులు చెప్పే గుసగుసలన్నీ ll 24/08/14 ll
400. శిధిలమైపోతోంది హృదయం _ ఆశలన్నీ మట్టిలో కలిసిపోతుంటే ll 24/08/14 ll
401. మనోగగనంలో మెరిసే మేఘమాలికలెన్నో _ దరహాసపు కిరణాలతో ll 25/08/14 ll
402. వలపు నెత్తావులెన్నో _ నవయవ్వన సీమలో ll 25/08/14 ll
403. నిశికాంత ప్రక్క దులిపేస్తోంది _ భానుడు తూరుపుతలుపు తట్టగానే ll 25/08/14 ll
404. అమలినమైన అనురాగమే నాది _ మీరా, రాధమ్మలను మరిపించేలా ll 26/08/14 ll
405. వన్నె తరగని వజ్రానివే _ నీ పలుకుల తళుకులతో ll 26/08/14 ll
406. ప్రాణికి ప్రాణం పోయడమే_ సృష్టి ..మగువకిచ్చిన అపూర్వమైన కానుక ll 26/08/14 ll
407. ఏ "కొమ్మ" మీటిందో _ మదిరెమ్మన పరిమళిస్తున్నాయి, వలపు సుమాలన్నీ ll 11/09/14 ll
408. మౌనంగానే బందీలయ్యే భావాలెన్నో _ మది గదిలో ll 11/09/14 ll
409. చులకనే మరి నీకు _ మనస్సును నివేదించేసానుగా ? ll 11/09/14 ll
410. అంతరంగానికి వేదనల స్పర్శలెన్నో _ స్వప్న శకలాలనే ఏరుకుంటూ ll 12/09/14 ll
411. ప్రతి రోజూ వసంతమే _ నీ మనస్సులో చోటుదొరికినప్పటి నుండి ll 12-09-14 ll
412. కమనీయ చిత్రాలెన్నో _ నా కలల కాన్వాసుపై వర్ణాలనద్దుకుంటూ ll 12-09-14 ll
413. మనస్సంతా గుబాళింపులే _ నీ మైత్రీసుమంతో .ll 13/09/14 ll
414. ఎదను చీల్చే స్వప్నాలెన్నో _ కలత నిదురగా కలవరపెడుతూ ll 13/09/14 ll
415. రుధిర ప్రవాహలెన్నో _ మనోకూపమంతా నింపేస్తూ ll 13/09/14 ll
416. జారిపోతున్నాయి. ఆశలన్నీ.. తామరాకుపై నీటిబొట్టులా _ అల్పాయుష్షుతో జనిస్తూ ll 14/09/14 ll
417. మొగ్గలు తొడిగే కలతల పూలే అన్నీ _ కన్నీటిమడిలో నాటినందుకేమో ll 14/09/14 ll
418. జారిపోతున్నాయి ఆనందభాష్పాలెన్నో _ చెక్కిలిని గిలిపెడుతూ ll 14/09/14 ll
419. తుషారమౌక్తికాలకెంత పరవశమో _ కిరణ స్పర్శలో కరిగిపోతూ ll 17/09/14 ll
420. వేదనాభరితమైన కన్నీటి నాట్యాలెన్నో _ చెక్కిలినే వేదిక చేసుకుంటూ ll 17/09/14 ll
421. కుంచెకెన్ని కులుకులో _ చిత్రకళావిరించి (బాపు) చేతిలో ఒదిగిపోతూ ll 17/09/14 ll
422. శిధిలమైపోతోంది హృదయం _ ప్రేమను నువ్వు పాతరేస్తుంటే ll 18/09/14 ll
423. కలలసౌధం కూలిపోతోంది _ నీ ద్వేషపు శతఘ్నుల దాడితో ll 18/09/14 ll
424. కష్టమే మదికి _ నిన్ను వీడి...మరణయాతననుభవించడం ll 18/09/14 ll
425. హసితం మధురమే _ మధువులను గ్రోలిన అధరంపై జనిస్తూ ll 20/09/14 ll
426. ఎదను గిల్లేస్తూ అల్లరిపెట్టేవి _ నీ కొంటె చూపుల తూపులే ll 20/09/14 ll
427. అధరపు రెమ్మలపై విరబూస్తూ _ నీ నవ్వుల విరులెన్నో ll 20/09/14 ll
428. ఆస్వాదిస్తా జన్మంతా _ అణువణువూ నువ్వు నింపిన ఆనందామృతాన్ని ll 21/09/14 ll
429. చెక్కిలిపై పండే గోరింటలే_ ఎదలోని సిగ్గులన్నీ ll 21/09/14 ll
430. కనుగీటుతున్నాయి కంటి మెరుపులెన్నో _ అధరాలపై కెంపులైపోతూ ll 21/09/14 ll
431. మాట్లాడుకుంటూనే ఉన్నాయి, మనస్సులు _ మనమెంతగా మౌనం పాటిస్తున్నా ll 22/09/14 ll
432. సొమ్మసిల్లిపోయాయి నయనాలు _ తెగిన మనబంధాన్ని తలచి వర్షిస్తూ ll 22/09/14 ll
433. సరిగంగ తానాలడుతోంది సంద్రంలో వెన్నెల భామ _ మామతో కలిసి ll 22/09/14 ll
434. కనులపొంగే వేదనల సెలయేరులెన్నో _ జ్ఞాపకాలను తడుపుకుంటూ ll 23/09/14 ll
435. నడుస్తున్నా .. గడిచి"పోయిన" బాల్యంలోకి _ కల్మషమంటని జాడలకై ll 23/09/14 ll
436. మదికి లేతగాయాలనే పరిచయిస్తున్నా _నీ మాటల కంటకాలే చిరునామాలుగా ll 23/09/14 ll
437. ఎవరు లిఖించారో అంతందంగా _ గగనపుకాగితంపై అక్షర నక్షత్రాలను ll 25/09/14 ll
438. భక్తిధారల ప్రవాహమే _ మది కోవెలలో నువ్వు కొలువైనాకా ll 25/09/14 ll
439. మోహనరాగాలెన్నో చిలికిస్తున్నాయి సిగ్గులు _ చెక్కిలిని మీటుతూ ll 25/09/14 ll
440. రవళించే మదనలేఖలే _ నీ పిలుపులెపుడూ ll 26/09/14 ll
441. పలికించే రాగాలెన్నో _ సప్తపదుల నడకలలో ll 26/09/14 ll
442. పులకింతల మేలుకొలుపులేనేమో _ జాబిలి పూవంటి నీ నవ్వులు ll 26/09/14 ll
443. నీకు వెన్నతో పెట్టిన విద్యే _ నా మౌనాలని నీకనుగుణంగా మార్చుకోవడం ll 27/09/14 ll ll
444. మనోవీణకెన్ని గారాలో_ మౌనస్వరాలన్నీ ప్రణయరాగాలౌతుంటే ll 27/09/14 ll
445. అనుబంధపు జాతరలెన్నో _ మదిని మురిపెంగా పెనవేసుకుపోతూ ll 27/09/14 ll