top of page

 ద్విపాద కవితలు  

1. అమ్మ పలుకునేగా..!

ఆదిస్వరంగా నేవిన్నది..!!

2. దేవుడికి మరో పేరుందా..!

నేను నాన్ననే పిలుస్తానే..!!

3. మువ్వలు ముడిచాయి..!

మౌనాలు మ్రోగగానే..!!

4. ఓడిపోతూనే ఉంటుంది..!

మరణపరీక్షలో మాత్రం నెగ్గలేనంటూ...జీవితం..!!

5. సిరి'మువ్వలకు గురువెవ్వరో..!

గుండెను చీల్చేసినా రవళించేలా సంగీతశిక్షణనిస్తూ..!!

6. నిరంతర వాహినినే..!

మోదాన్నీ, ఖేదాన్ని ప్రవాహంగా మలుచుకుంటూ..!!

7. ఉలిక్కిపడుతున్న మనసు..!

ఈడబిడ్డ "ఆడ"బిడ్డై వెళ్ళిపోక తప్పదని తలచిన ప్రతిసారీ..!!

8. ఇంకా ఎన్నాళ్ళో..!

ఏకాంతంలోనూ నీ జ్ఞాపకాలనే వెంటపంపడం..!!

9. సుస్వరాల కోయిలమ్మ..!

ప్రకృతిబడిలో సంగీతపాఠాలను నేర్పే పంతులమ్మ..!!

10. మనసును అంతలా గారాం చెయ్యకు..!

నీపిచ్చిలో పడి మతి పోగొట్టేసుకునేంతగా..!!

11. నా మదిలో వెన్నెల కురుస్తోంది..!

మనోవేణువు తలపుల భూపాలాన్ని ఆలపిస్తుంటే..!!

12. గుండె ఝల్లుమంది..!

కరిగిపోని కలేదో నా రేయిని ఛెళ్ళున చరిచిపోతుంటే..!!

13. నీలో పోల్చుకోవాలనుకున్నా..!

తడారని స్మృతులజాడల్ని..!!

14. భావాన్నలా మోస్తున్నా..!

చలించని తన హృదయం జ్వలిస్తుందేమోనని..!!

15. తనో మౌని..!

నేనో యోగి..!!

16. నాకేదో అయినట్టుంది..!

గతంలోని మౌనాల నిక్షిప్తాలను ఛేదిస్తుంటే..!!

17. వేణువుకెంత ఆరాధనో..!

రాధామనోహరునకు విధేయునిగా తనూ మారుతూ..!!

18. నేడే లేపనం..!

నిన్నటి గాయాలకు..!!

19. వేసేద్దాం సిరు’లొలికే నవ్వుల జరిమానాలు..!

హృదయాన్ని ఛిద్రం చేసిన వాళ్ళందరికీ..!!

20. ఎవరు తెరుస్తారో ప్రతిరేయీ..!

వెలుగు కుంకుమను పరిచేందుకై గగనాన నక్షత్రపు భరిణెలను..!!

21. నిశ్శబ్దం నవ్వుకుంది..!

తాకిపోయే ఊహల ఉనికిని మరవనీయని తన మౌనచాతుర్యానికి..!!

22. మనోక్షేత్రం సారవంతమైనట్టుంది...!

ఆనందంలో నానేసిన క్షణబీజాలను నాటుకుంటున్నా..!!

23. పుట్టినింటికి అతిధిగానే మిగిలిపోయాను..! 

నేను అత్తింటి  సొమ్మునైపోగానే..!!

24. నువ్వు రెప్పేయకలా..!

కరిగి కనుమరుగైపోతోంది కనుపాపలో దాగిన నా రూపం ..!!

25. కవ్విస్తోంది కాలం..!

పట్టపగలైనా ఆడపిల్లలకు స్వాతంత్య్రమొస్తుందేమో చూడమంటూ..!!

26. కల్పనగ మారాలనుంది..!

విశ్వనాధుని మరో కిన్నెరసానినై జనించేందుకై ..!!

27. పవనుడేమి చెప్పి ఉంటాడో..!

ఎంత బుద్ధిగా తలలాడిస్తూ వింటున్నాయో ముద్దు పూబాలలు..!!

28. నా గుండె బరువెక్కింది..!

కామాంధుల చేతిలో నలిగిపోతున్న పసిమొగ్గలను చూస్తూ నిస్సహాయతతో..!!

29. కలికాలం..!

ఫోన్ ఇచ్చింది నేనైతే నువ్వు మాచెల్లితో మాట్లాడుతుండడం..!!

30. కలల్ని భరించలేకున్నా..!

జీవితమే ఒక స్వప్నమై మిగిలిపోయాక..!!

31. నిలదీసి అడగాలనుంది..!

నాలో ఏ మూలనైనా నాకంటూ నేను మిగిలున్నానేమోనని..!!

32. మానవత్వం మరణించిందేమో..!

మానవరూపంలో తిరిగే దానవులకు చిక్కిపోగానే..!!

33. ఈ చందరయ్యతో పడలేకున్నాం..!

అమాసొస్తే చాలు బడెగ్గొట్టెస్తాడేంటో..!!

34. ఏ నేతగాడు నేసాడో..!

నిశి సుందరి వస్త్రాన్ని రంగు వెలియనంత మన్నికగా..!!

35. వెన్నెల్లో ఆడ'పిల్లనై మెప్పించాలనుంది..!

వీరేంద్రుడంతటి మరోయద్భుతం తారసపడితే..!!

36. కాలవైద్యం కూడా వికటిస్తున్నట్లుంది..!

గాయాలన్నింటినీ స్రవాలుగానే జార్చేస్తూ..!!

37. ఋతువునై నవ్వాలనుంది..!

వానకారుకోయిలనై తొలకరిలేఖలపై ఆషాడపల్లవాల్ని లిఖించేందుకై ..!!  

38. కన్యాశుల్కమో...వరకట్నమో..!

బలిపశువులు అయ్యేది మాత్రం ఆడబిడ్డలే..!!

39. నిశ్శబ్దపోరాటం నాది..!

గాయాల్ని, హేయాల్ని దాచుకున్న మది మడతలను విప్పుకుంటూ...!!

40. గడ్డ  కట్టిన ప్రేమ..!

నీ జ్ఞాపకాలలో కరిగిపోతూ..!!

41. మణిమాలిక..!

మదిని మీటే అక్షరగీతిక..!!

42. కంటిపై కునుకెక్కడిదీ..!

మన బంధాలన్నీ జ్ఞాపకాలుగానే మిగిలిపోతుంటే..!!

43. అన్వేషణ సాగిస్తున్నా..!

నా(నీ)లోని నాకై ..!!

44. విజేతనై నిలవాలనుంది..! 

అణగారని మదికోరికలపై సంగ్రామాన్ని సాగించి..!!

45. ఓ నలిగిన జ్ఞాపకం..!

గతకాలపు దొంతరలనుండి జారిపడుతూ..!!

46. ఛిద్రమైన చిత్తం..!

మధురోహల పునాదులను నువ్వు పెకలిస్తుంటే..!!

47. ఇంకా ఎన్నాళ్ళో..!

గుండెల్లోనే నిను గుట్టుగా దాచుకోవడం..!!

48. గతం చేసిన గాయం..!

గొప్ప గుణపాఠాన్ని నేర్పిస్తూ..!!

49. ఒక తీయని స్వప్నం..!

కనురెప్పల పానుపుపై శయనిస్తూ..!!

50. వెదుక్కుంటూనే ఉన్నా..!

బాల్యంలో నేను పారేసుకున్న మానవత్వాన్ని..!!

51. గర్వపడుతున్న గుండె..!

మరణించాక కూడా మరొక ప్రాణానికి ఆయువు పోసినందుకు..!!

52. వడ్లగింజలే ఆయుధాలట..! 

భ్రూణహత్యల సంగ్రామంలో..!!

53. చీకటి అలుగుతోంది..!

నువ్వు నా కలగా మిగిలిపో'యావనే..!!

54. ఎన్నాళ్ళయ్యిందో కదూ..!

ఒకరి మనసును ఒకరం చూసుకుని..!!

55. ఇంకా ఎన్నాళ్ళో..!

గుండెలపై భారంగా నిను మోయడం..!!

56. వెన్నెల కుసుమం..!

చీకటి కన్నియ సిగలో వెలుగులీనుతూ..!!

57. గడవని క్షణాలే బయల్పడుతున్నాయి..!

ఒంటరితనపు మడతలను విప్పుకున్నపుడల్లా..!!

58. వేదనేగా..!

వ్రాసుకునేందుకో ప్రేరణ..!!

59. అహం'కారం..!

మనిషితనాన్ని మంటగలిపేస్తూ..!!

60. నా జీవితం..!

ఒక శూన్యం నుండి మరొక శూన్యంలోకి పయనిస్తూ..!!

61. ఓ నిశ్శబ్దమేఘం..!

మనోగగనంలో కురిసిపోతూ..!!

62. ప్రశ్నాపత్రాలే అన్నీ..!

జవాబుల్లేని బ్రతుకుల్లో..!!

63. నీడదెంత ఒదిగే గుణం..!

నే మిద్దెనెక్కినా తాను మాత్రం నేలమీదనే తారాడుతూ..!!

64. నీ అంతరాత్మని అడిగిచూడు ఒక్కసారి..!

కాలమంతా నా ధ్యానమే దేనికని ?..!!

65. అనురాగ సంగమమే..!

పాలూతేనేలమై కలిసిపోతూ..!!

66. ప్రేమిస్తూనే ఉంటా..!

నాకై కన్నీరు కార్చే నిష్కల్మషమనసుల్ని..!!

67. శంకుస్థాపనకు ముహూర్తం పెట్టేసుకున్నా..!

నా హృదయసీమలో నిర్మించే నీ స్మృతుల సౌధానికై..!!

68. వసపిట్ట విసుక్కుంటోంది..!

మాట్లాడే అవకాశాన్ని తనకు మిగల్చడంలేదని..!!

69. పురుగులమందే నయం..!

మోసం చెయ్యకుండా చంపేసింది రైతన్నను..!!

70. మేఘునిది రాతి గుండేమో..!

చెమర్చడం కూడా మానేసింది వర్షించడం మాట అటుంచి..!!

71. పచ్చబొట్టుగా నిను దిద్దేసుకున్నా..!

దేహంపైనే కాదు హృదయంపైకూడా..!!

72. నిరంతర శ్రమజీవియే కాలం..!

ఋతువుల హారాలను అల్లేస్తూ..!!

73. నిండు ముత్తైదువ నీలాంబరి..!

అరుణబింబపు సిందూరం దిద్దుకుని..!!

 

74. ఆనందనౌకకెంత సంబరమో..!

నవ్వులనదిపై తేలిపోతూ..!!

 

75. గరికపూలకే సాధ్యం..!

కొండల్లోనైనా, లోయల్లోనైనా స్వచ్చంగా జీవించగలగడం..!!

 

76. నిన్నే చూపిస్తా..!

నా ప్రాణానికి రూపాన్ని అడిగితే..!!

 

77. శిక్షను భరించే భారం హృదయానికెందుకో..!

తప్పు చేయడం మనస్సు తత్వమైతే..!!

 

78. "శాంతి"కోసమే వచ్చాడట తిక్కలోడు..!

శాంతిపోరాటానికై పిలుపు ఇవ్వగానే..!!

 

79. కుండపోతగా వర్షిస్తూనే ఉన్నాయి నయనాలు..!

నీ జ్ఞాపకాల గాలితెరలు తాకగానే..!!

 

80. నాన్నకే బాధ్యతలు గుర్తుచేస్తేఎలా ?

విధించేసాముగా కన్ననేరానికి భరణంతోనూ పెనాల్టీ కట్టే శిక్షను..!! (పెన్షన్ - భరణం)

 

81. పెదవంచుకి నవ్వుల రంగేస్తున్నా..!

గాయాలెంతగా ఎదను తడుముతున్నా..!!

 

82. వెదుకుతూనే ఉన్నా..!

జారిపడిన జ్ఞాపకాన్ని..!!

 

83. వీర జవానులే వారు..!

దేశంకోసం కత్తిదూసే సైనికులు, సమాజంకోసం కలంపట్టే కవులు..!!

 

84. రాత్రి బడికిపోతున్నాను..!

చంద"మామ"మాస్టారు ప్రేమ పాఠాలను నేర్పిస్తున్నారని తెలిసి..!!

 

85. అంతమెరుగనిదే కుంతీపుత్రుల చరితం..!

చెక్కతొట్టి భారతం మొదలు కుప్పతొట్టి భారతం వరకు..!!

 

86. కలలొలుకుతున్నాయి..!

కన్నులలో నీ రూపాన్ని నింపుతూ..!!

 

87. పండే భూమికి పలుగుల గాయాలు..!

పండని ప్రేమకు పలుకులే గాయాలు..!!

 

88. రెప్పలపై మోస్తూనే ఉన్నా..!

రాత్రి నిద్రలేమి బరువుని..!!

 

89. మృత్యువుదే విజయం..!

ప్రతి జీవితోనూ ఆడే ఆటలో..!!

 

90. ప్రశ్నల బాణాలనెక్కుపెడుతూనే ఉంటుంది మస్తిష్కం..!

సవ్యసాచి అమ్ములపొదిలోని అక్షయ తూణీరాల్లా..!!

 

91. వాడు మనిషే..!

కళ్ళ నుండి నీళ్ళను తోడుకుంటున్నాడుగా..!!

 

92. "భామ"చారులే కొందరు..!

బ్రహ్మచారుల ముసుగులో..!!

 

93. నీ ఊహల పల్లకీని మోస్తున్నా..!

నీ జ్ఞాపకాల నీడలే బోయీలుగా..!!

 

94. తారలకు ఎంత ఇష్టమో..!

చంద్రయ్య మాస్టారి రాత్రిబడంటే..!!

 

95. కాలం ఓడిస్తూనే ఉంటుంది..!

రాలిపడ్డ ప్రతి క్షణాన్ని..!!

 

96. వదిలేయ్యవూ నన్నిలా..!

బ్రతకాలనుంది నాలా..!!

 

97. అమ్మ..!

ఈ జన్మ ప్రసాదించిన ఆదిగురువు..!!

 

98. చెల్లిస్తూనే ఉన్నా కన్నీటి మూల్యాన్ని..!

నీ ప్రేమలో భంగపడిన హృదయానికి..!!

 

99. గతమే ఆవృతమౌతోంది..!

నాలో నేనే జాగృతమౌదామని అనుకుంటుంటే..!!

 

100. అనురాగసౌధాన్ని నిర్మిస్తున్నా..!

మమతలచలువరాళ్ళను పరుచుకుంటూ..!!

 

101.  కళ్ళు చెమరిస్తున్నాయి..!

ఏ గాఢస్పర్శ గుండెను తడిమిందో..!!

 

102. ఒక చిన్ని అనురాగస్పర్శ..!

వేవేల మమతలవీణియలను మీటుతూ..!!

103. ఆశల సౌధాలనే నిర్మించుకున్నా..!

అడియాసల పునాదులు సాక్షిగా..!!

 

104. విరామమెరుగని వింతలే..!

నరుని నటనలు, విధాత ఘటనలు..!!

 

105. ఆశల దీపాలు ఎన్నెన్నో..!

కలల గూటిలో మిణుకుమిణుకుమంటూ..!!

 

106. జీవితసారం ఇంతేనేమో..!

సాఫీగాను సాగనివ్వదు...సూఫీగాను ఉండనివ్వదు..!!

 

107. మహాత్ముని కలెప్పటికి నెరవేరునో..!

పట్టపగలే స్త్రీ స్వేచ్ఛను హరించే స్వచ్చ భారతంలో..!!

 

108. అసంపూర్ణ చిత్రమే జీవితం..!

కాలపు కేన్వాసుపై ఆశ నిరాశల రంగులను దిద్దుకుంటూ..!!

 

109. ఉరితాడునే'సుకుంటోంది చేనేతమగ్గం..!

చిరిగిన దుస్తులను, కాలేకడుపులను పూడ్చలేక..!!

 

110. నిలువెల్లా గాయాలనే చేసినా..!

మదివేణువుకెందుకో నీతలపుల గేయాలే..!!

 

111. నీ ఊసులనే మోసుకుని వెళుతున్నా..!

నా ఒంటరి ప్రయాణానికి తోడుగా..!!

 

112. వానజాణ అల్లరిపిల్లనే..!

మబ్బుల మెట్లనుండి చిలిపిగా దూకేస్తూ..!!

 

113. మదిగోడలపై చెదరని చిత్రం..!

బొమ్మగా ముద్రించుకున్న పసితనం..!!

 

114. అల్లుకుంటూనే ఉన్నా..!

ఆశల దారాలతో బ్రతుకు పటాన్ని..!!

 

115. మనసు ముసురేసుకుంది..!

అను’రాగజల్లులను కురిపించిపోరాదూ..!!

 

116. నాకేదో అయినట్టుంది..!

రగిలిస్తున్న నీస్మృతులతో..!!

 

117. నా స్మృతి గ్రంథానివే నీవు..!

మది అల్మరాలోని అరలన్నీ నింపుకుంటూ..!!

 

118. స్వేచ్ఛకు రెక్కలు తొడుగుతున్నా..!

ఛిద్రమైన హృదయాన్ని భద్రపరుచుకుంటూ..!!

 

119. నిశ్సబ్ధాన్నిపరిచయిస్తున్నాను..!

నిను నింపుకున్న ఏకాంతానికి...మౌనినై..!!

 

120. వెన్నెల ఊయలను వేస్తున్నా..!

జాబిలిమామతో ఊగే మనస్సుకు..!!

 

121. ఒట్టేసి చెపుతున్నా..!

నీ మది గది గడపదాటిపోనని..!!

 

122. నయనాలు సఖ్యతను మరచినట్లున్నాయి..!

కలతనోకంట, మమతనోకంట నింపుకుంటూ..!!

 

123. తరువులకూ తప్పని వేదనే..!

ఏ గుడికో, ఏ సిగకో విరితనయలను సాగనంపడం..!!

 

124. భావ గుళికలు..!

ఏకాంతపు మనియాదలకు సాంత్వనను చేకూరుస్తూ..!!

 

125. మదికొలనులో నీ రూపం పొంగిపూస్తోంది..!

నీలిమబ్బులో జాబిలిమామ తొంగి చూడగానే..!!

 

126. వెదుకుతునే ఉన్నా..!

కన్నీరు కార్చడమాపేసి నాకై కన్నీటిని కార్చే కళ్ళకోసం..!!

 

127. మనోగవాక్షాలను తెరిచాను..!

అంతర్యానంలో దాగిన చిక్కుముడులను విప్పుకుందామనే..!!

 

128. ఉక్కిరిబిక్కిరి అవుతున్నా..!

అంతుచిక్కని సందేహాల సంద్రంలో మునిగి..!!

 

129. చెక్కిళ్ళు ఆర్తిగా హత్తుకుంటూనే ఉన్నాయి..!

ఆరాధనల్లో కురిసే కన్నుల కుంభవృష్టిని..!!

 

130. ఆరాధన, ఆవేదనలు..!

అనుక్షణం బ్రతుకును వెంటాడే జీవన'నాదాలే..!!

 

131. నా మనసుకి తప్పని అవహేళన..!

నీపై ఆరాధనని విప్పిచెప్పి లోకువయ్యిందిగా..!!

 

132. నిత్య కళ్యాణమే వసంతావనికి..!

ముస్తాబౌతున్న తరువులతో మురిసిపోతూ..!!

 

133. కిరణాలతో మేఘుని గాఢచుంబనాలకేమో..!

మింటినింట సప్తవర్ణపు పసి'డిరాగాలు..!!

 

134. హృదయపు కుఢ్యంపై వాలుతూనే ఉంటాయి..!

రేయింబవళ్ళను మరచి, నీ స్మృతులవిహంగాలు..!!

 

135. సాగే ప్రవాహమే జీవనది..!

గతం వర్తమానాలను కలుపుతూ..!!

 

136. కన్నీటి అర్ఘ్యమిస్తున్నా..!

దోసిలట్టిన వేదనలను..!!

 

137. ప్రతి జీవికీ తప్పని రా(గీ)త..!

బ్రతుకుపత్రంపై వీడ్కోలు సంతకం చేయడం..!!

 

138. ఎదకోయిల విహరిస్తోంది..!

చైత్రస్వప్నంలో మైమరచిపోతూ..!!

 

139. కబుర్లపోగేగా మది..!

నీ సమక్షంలో బెట్టుచేస్తోందేమిటో...ముక్తసరిలా..!!

 

140. గాలి కూడా గాంధర్వమైపోతుంది..!

ఉఛ్ఛ్వాసనిశ్వాసలే మువ్వలమురళులై మ్రోగుతుంటే..!!

 

141. చకోరినై వేచి ఉన్నా..!

నీ పిలుపుల చినుకులకై..!!

 

142. మది తలుపులను తెరిచుంచాను..!

ఆత్మబంధువై నువ్వు అడుగిడుతావనే..!!

 

143. నువ్వు పరిచయమయ్యాకే..!

మరో వసంతం ననుపలుకరించింది..!!

 

144. అగణిత నక్షత్రకాంతులే..!

నీ కన్నుల్లో వెలిగేనవ్వుల దివ్వెలు..!!

 

145. ప్రేమకీ ఒక రోజంట..!

తప్పదు మరి సంస్మరణ"దినం"...మరణిస్తూనే ఉంటుందిగా ప్రతిరోజూ..!!

 

146. తాళి బరువైపోతోందట..!

మనస్సు మళ్ళిపోయినట్లుంది...మగని నుండి మరొక త(ని)నవైపుకు..!!

 

147. జీవితాంతం మచ్చలుగా మిగిలేవే గాయాలు..!

మనస్సుకు తగిలినవైనా, దేహానికి తగిలినవైనా..!!

 

148. ముగించక తప్పదు జీవితాన్ని..!

నమ్ముతూనో, నమ్మిస్తూనో, నటిస్తూనో..!!

 

149. సహజ నటినే మది..!

అంతరంగపు వేదికపై నవరసాలనొలికిస్తూ..!!

 

150. ఆదర్శాలను గాలికొదిలేద్దాం..!

ప్రతిష్ఠించుకున్నాంగా...ఊరిలో వారికో విగ్రహం..!!

 

151. అలసిపోయిన నిగ్రహం..!

దిక్కుతోచక అలమటిస్తూ..!!

 

152. మౌనయుద్ధం..!

ఊపిరి పొలిమేరల్లోనే దాగిపోతూ..!!

 

153. చెక్కిలి సిగ్గిల్లుతోంది..!

పెళ్ళిబొట్టు ముద్దాడగానే..!!

 

154. ఎన్ని స్మృతుల గుప్తనిక్షేపాలను దాచుకున్నాయో..!

ప్రేమనిధులను నింపుకుంటూ...నా మదిపొరలు..!!

 

155. నాకు మాత్రం నువ్వే ప్రపంచం..!

నీ చుట్టూ ఉన్న ప్రపంచమేదైనా..!!

 

156. పదాలన్నీ అపురూపాలైపోతున్నాయి..!

మదిలో మెదిలే భావం నీవవగానే..!!

 

157. హృదయం ముక్కలైపోతోంది..!

నిర్లక్ష్యమనే చట్రంలో నలిగి నుజ్జైపోతూ..!!

 

158. మనస్సుని పాదుగొల్పుతున్నా..!

ప్రేమపంటలను పండించుకుందామనే..!!

 

159. దారిమళ్ళిపోతుంటాయి భాగ్యాభాగ్యాలు..!

కష్టాలనుండి సుఖాలకు...సుఖాలనుండి కష్టాలకు..!!

 

160. బ్రతుకుపాటను పాడక తప్పడం లేదు..!

రక్తకన్నీటితో హృదయం గడ్డకట్టుకుని పోతున్నా..!!

 

161. మౌనంలోనే నింపుకుంటున్నా నిశ్శబ్దాన్ని..!

మాటలలో నింపే బాషానుభవంలేకనే..!!

 

162. కలల రేకులు వాడిపోతున్నాయి..!

కన్నీటి కొలనులో పూసాయిగా..!!

 

163. జాలిగా పలకరిస్తున్నాయి..!

బాల్యానికే అంకితమైపోయిన కొన్ని ఆనవాళ్ళు..!!

 

164. మనస్సు శిలగా మారిపోయింది..!

నువ్విసిరిన మాటలరాళ్ళన్నీ తాకగానే..!!

 

165. తోలుతూనే ఉంటాడు కాలచోదకుడు..!

వత్సరాల బండిని గడియలనే అశ్వాలతో పరుగులను తీయిస్తూ..!!

 

166. నీ కలలతో జోగుతున్నాయి కనులు..!

తలపుల విశ్రాంతి శిబిరాన్ని చేరుకోగానే..!!

 

167. బోసినవ్వులకే కాదు..!

అమాయకత్వంలోనూ పసివాడే బాపూజీ...అర్ధరాత్రి పడతిస్వేచ్ఛకై ఆశపడుతూ..!!

 

168. మన భరతమాతకు స్వతంత్య్రమా.?ఎప్పుడొచ్చింది..!

స్త్రీలోలురంతా రోడ్లపై విచ్చలవిడిగా సంచరిస్తుంటే..!!

 

169. మనసు పొగులుతోంది..!

నీ ఏకాంతం నను చుట్టుముట్టగానే..!!

 

170. మౌనంతో పెదాలను అతుకుతున్నాను..!

ప్రేమను గెలవాలనుకున్న ప్రతిసారీ..!!

 

171. కలలదుస్తులను ఆరేసుకుంటున్నా..!

మనసు తీగపై రంగురంగుల ఆశలతో..!!

 

172. చీత్కారాలు తప్పవుగా..!

లోపలొకమాట, బయటొకమాట మాట్లాడే వారి ఆంతర్యం బహిర్గతంకాగానే..!!

 

173. (వి)చిత్రమైన చికిత్సే..!

విరక్తి చెందిన హృదయాలకు అనుభవసారం..!!

 

174. అధికారజులుం మారదేమో..!

కాలం సాగిపోతున్నా...వ్యవస్థస్వరూపాలెంతగా పరిణితిచెందుతున్నా..!!

 

175. మరువలేకపోతోంది మానసం...!

ప్రేమకు నీవిచ్చిన వీడ్కోలు బహుమతిని..!!

 

176. ఆశల విహంగమౌతున్నా..!

విశ్వాసవీచికలపై రెక్కలార్చుకుంటూ..!!

 

177. వరదలై ప్రవహిస్తున్నాయి..!

బొట్లు బొట్లుగా జారుతున్న ఆవేదనలన్నీ..!!

 

178. మార్మోగుతూనే ఉంటాయి గతకాలపు జ్ఞాపకాలు..!

అంతరాంతర కుహరాల్లోని ప్రశాంతతను భంగపరుస్తూ..!!

 

179. నిలిచిపోవాలని ఉంది..!

నీ గుండెల్లో చెరగని చిత్రపటంలా..!!

 

180. స్పర్శిస్తూనే ఉంటుంది మరుపురాని గతం..!

గాయాలను రేపుతూనో, అనుభవాలను నేర్పుతూనో..!!

 

181. అమ్మ, నాన్నల ఆత్మీయస్పర్శలే..!

స్వచ్ఛంగా తాకే చెలిమిసమీరాలు..!!

 

182. విషాదాన్ని ముడేసుకుంటున్నా..!

కోరికలను హత్తుకుంటూ..!!

 

183. ఆత్మవిశ్వాసం చెమ్మగిల్లుతోంది..!

నిరాశాపొరలమాటున ఇంకిపోతూ..!!

 

184. మనసు ప్రక్షాళనమయ్యింది..!

నువ్వు పరిచయించిన కన్నీటి బిందువులతో..!!

 

185. కన్నీటితోనే ఉప్పును పండిస్తున్నా..!

రైతన్నలకు పంటలపై వ్యామోహం తీరనే తీరదు ఎందుకనో..!!

 

186. తరలిపోతున్నా కాలప్రవాహాన్నై..!

కాలంచేసే గాయాలన్నీ పాతనీరులా కొట్టుకుపోవాలనే..!!

 

187. అలుపెరుగని శిల్పులే..!

మన జీవితశిల్పాలను చెక్కుతూ...అమ్మానాన్నలు..!!

 

188. విలవిలలాడుతోంది మది..!

నీ కలలకత్తుల ఉచ్చులో చిక్కుకోగానే..!!

 

189. హృదయమే చదవగలదేమో..!

కన్నీటితో వ్రాసుకున్న...నా ప్రేమకధను..!!

 

190. అంతర్జాలం ఒక మాయాజాలమే..!

మరో ప్రపంచంలోకి మనల్నినెట్టేస్తూ..!!

 

191. మౌనాన్ని వీడుతోంది నిశ్శబ్ధం..!

నీతో తనివితీరా ముచ్చట్లాడేందుకై..!!

 

192. నిర్ధయగానే గడిచిపోతున్నాయి..!

నీ నిరీక్షణలో జాలిలేని కల్పాలెన్నో..!!

 

193. ఎగిసిపడుతున్న మనసు..!

ఆటుపోట్లకు గురైన ప్రేమసంద్రాన్ని తలపిస్తూ..!!

 

194. వేణువై శ్వాసించాలని ఉంది..!

నువ్వు గాంధర్వమై ఊపిరిలూదగానే..!!

 

195. తుమ్మెదలైవాలతాయి కుర్రకారు చూపులు..!

కన్నెపిల్ల వయస్సు విరులైవిచ్చుకోగానే..!!

 

196. నీ ప్రేమసుమాలనే ఏరుకుంటున్నా..!

నువ్వెంతగా ఎదలో ముళ్ళనేదించిపోయినా..!!

 

197. కుములుతున్నాయి కోర్కెలన్నీ..!

ఊరడించే జ్ఞాపకమైనా వదలకుండా నువ్వెళ్ళిపోయావనే..!!

 

198. తొలిపేజీలో జననం, తుదిపేజీలో మరణం విరించి విరచితం..!

మనం వ్రాసుకోవలసినవే…జీవిత పుస్తకంలోని మిగిలిన పేజీలన్నీ..!!

 

199. నువ్వు పరిచయమయ్యాకే..!

మానిపోయిన గాయాలన్నీ సలపరమై కలవరపెట్టింది..!!

 

200. ప్రణ(వ)య భావగీతికలెన్నో..! 

లిపిలేని కంటి(కొంటె)భాషలో..!!

 

201. తేటి స్వరంలో మధువులఝురులే..!

సుమకాంతల సొగసులు వెల్లివిరియగానే..!!

 

202. దశమగ్రహమంటే ఉలికిపాటెందుకో..!

జీవితకాలం పట్టి పీడిస్తూ కూడా..!!

 

203. శోకంతోనే పెనవేసుకుంటోంది..!

జన్మ జన్మల మన ఋణానుబంధం..!!

 

204. కురిసిపోతూనే ఉంటుంది కాలమేఘం..!

జీవులకు క్రమంతప్పకుండా సంతోషవిషాదాలజల్లులను..!!

 

205. మౌనమూ మధురమే..!

సమయం సఫలమైతే..!!

 

206. పూతవయసులోనే దాచిపెట్టుకున్నా..!

లేలేత వలపు చిగురుల ప్రేమకావ్యాలెన్నో..!!

 

207. చినుకులాలపోస్తోంది మేఘమాలిక..!

ఆమని ఒడినింపిన పూబాలలకు ముద్దుమురిపాలతో..!!

 

208. పులకలు అంకురిస్తున్నాయి..!

నీతలపుల స్వేదపుజల్లులకు..!!

 

209. నాలో నేనే లయమౌతున్నా..!

నీ కంటిచూపులే పూవింటి తూపులై నను హత్తుకుపోతుంటే..!!

 

210.వేదనలకు మరుగే తెలియదు..!

మనోసాగరంనుండి కనుకొలనులకు వెల్లువైపోతూ..!!

 

211. విరుల తేనియ చినుకులే..!

పసిపాపడి తొలి పలుకులు..!!

 

212. ఆశలరెక్కలను తొడుక్కున్నా..!

విహంగమై అందలమంతా తిరిగేసి వద్దామనే..!!

 

213. కుంచెలెరుగని చిత్రకారులే మగువలు..!

వాకిట వర్ణాలతో రంగవల్లులనద్డుతూ..!!

 

214. అనుకోని అతిథి గతం..!

వర్తమానపు తలుపులను తడుతూ..!!

 

215. గతమెపుడూ ఘనమైనదే..!

వింతపోకడలంటిన వర్తమానంకంటే..!!

 

216. కన్నీరు హత్తుకుంటోంది ఆర్తిగా..!

గతం తడిమిన ప్రతిసారీ..!!

 

217. తెరవని పేజీలే కొన్ని..!

నా జీవన్నాటక"ప్రతి"లో చరిత్రలైమిగులుతూ..!!

 

218. జీవితమొక వీధినాటకమే..!

చావు తెర పడేవరకు..!!

 

219. చెదిరిపోతోంది గతం..!

మడతపడిన జీవిత పేజీలకు ముఖచిత్రమౌతూ..!!

 

220. మదిమూలల్లో ముడతనైపోతున్నా..!

నువ్వు విసిరేసిన ఏకాంతపు నిశీధిలో..!!

 

221. జీవించాలనుంది..!

మళ్ళీ మనిషిగా ఆవిర్భవించి..!!

 

222.ఆముద్రిత రచనలెన్నో..!

మనసు భాండాగారంలో సజలంగా తాకుతూ..!!

 

223. మౌలికంగా ఒంటరినే..!

మధురంగా ఏకాంతాన్ని ఆస్వాదించటం సాధించాక..!!

 

224. వెదుక్కుంటూనే ఉన్నాను..!

కోపంతో నేను విసిరేసుకున్న బంధాన్ని..!!

 

225. హృదిని కాల్చుతూనే ఉంటాయి..!

దిగుళ్ళనెగళ్ళు ...సెగలను రేపుతూ..!!

 

226. మూయని పుస్తకమే నాజీవితం..!

పేజీలన్నిటిలో నీస్మృతులనే నింపుకుంటూ..!!

 

227. ప్రకృతికెంత గడుసుదనమో..!

క్రొత్తరాగాలను అల్లమని ఋతువుకు కబురంపిస్తూ..!!

 

228. వచ్చీపోయేవే రేపుమాపులు..!

విరామం ఎరుగని జీవితపు ఏకపాత్రాభినయంలో..!!

 

229. తుదిమెరుగులను దిద్దుకుంటున్నా..!

మదిగోడలపై ముద్రించుకున్న నీ చిత్రానికి..!!

 

230. జాలిగా పలకరిస్తున్నాయి..!

చరితగానే మిగిలిపోయిన గతవైభవపు చిహ్నాలు..!!

 

231. కవులంతా తమ కర్తవ్యాన్ని మరిచినట్లున్నారు..!

నీ యవ్వనసొగసులను పొగిడే ద్యాసలోపడి..!!

 

232. యవ్వనపు కోయిల..!

చిలిపి కలల కొమ్మల్లో ఊయలలూగుతూ..!!

 

233. యవ్వనం మౌనవిస్తోంది..!

భావాలేవో బంధిస్తుంటే..!!

 

234. చెల్లిస్తూనే ఉన్నా కన్నీటి రుసుమును..!

హృదయాన్ని నీకు తాకట్టుపెట్టిన నేరానికి..!!

 

235. విరబూస్తోంది వసంతగానం..!

కాలపు కోయిల గళాన జీవనగీతమై..!!

 

236. ప్రతిబింబించాలని ఉంది..!

నీకై దాచిపెట్టుకున్న ప్రేమ క్షణాలన్నిటా..!!

 

237. తుషార వజ్రాలదెంత సోయగమో..!

గరికపూలను కూడా అలంకరిస్తూ..!! 

 

238. వచనమై ఒదిగిపోతున్నా..!

మనసుకి భావాక్షరాలతో బాహ్యరూపాన్ని అద్దుకుంటూ..!!

 

239. కలగా ముగిసిన జ్ఞాపకాలు..!

కలదిరుగుతున్నాయి...మదితలుపులు తెరవగానే..!!

 

240. నీలి సరోవరం..!

తారాకలువలతో ము(మె)రిపిస్తూ..!!

 

241. నీకై వెదుకులాడడమే..!

నా కనులకు అలవడిన వ్యసనం..!!

 

242. శైశవంలో మూసిన గుప్పిళ్ళకు అర్ధం..!

ప్రపంచాన్ని గుప్పిట చేజిక్కించుకోవాలని కలగనడమేనేమో..!!

 

243. వైరుధ్యాలెక్కువే మానవజాతికి..!

ఏకరీతిని విస్మరిస్తూ, వింతరీతిని అనుకరిస్తూ..!!

 

244. వెల్లువై తాకుతున్నాయి కలవరపు చినుకులు..!

తలపుల కంటకాలు రేపిన గాయాలతో..!!

 

245. వలపు వానలు..!

గుండెల్లో ప్రేమ చినుకులై గిలిగింతలిడుతూ..!!

 

246. గుండెల్లో ప్రణయఝురులై  ప్రవహిస్తూ..!

అలవోకగా జారుతున్నాయి ప్రేమచినుకులు..!!

 

247. కళ్ళకు ఒత్తులనే వెలిగిస్తున్నా..!

కన్నీటి చినుకులనే చమురుగపోసి..!!

 

248. రెప్పల చాటునే నిలువరిస్తున్నా..!

కన్నీటి చినుకుల పరవళ్ళను..!!

 

249. కూలిపోతోంది కలలకోట..!

కన్నీటి చినుకులే వరదలై ముంచేస్తుంటే..!!

 

250. నిరంతరం సాధన..!

స్థితప్రజ్ఙత సాధించాలనే.!!

 

251. అతికించుకుంటూనే ఉన్నా..!

అవసరానికో చిరునవ్వును…బ్రతకక తప్పదుగా..!!

 

252. జీవన్మరణాల లిఖితమే జీవితం..!

ఒక ప్రాణికి పునాది, మరొక ప్రాణికి సమాధి..!!

 

253. మనసు నవ్వుకుంటున్నది..!

వసివాడిన ఆశల పరిమళమేదో తాకుతుంటే..!!

 

254. పేరు ముందెన్ని బిరుదులుంటేనేమిలే..!

మనసంతా...బురదనే నింపుకున్నాకా...!!

 

255. చెదరని స్మృతులెన్నో..!

అనుభవాల పొరల్లో నిక్షిప్తాలుగా ఒదిగిపోతూ..!!

 

256. చెరిగిపోతున్నాయి..!

కనుమరుగైపోతూ నీ జ్ఞాపకాల చిరునామాలు..!!

 

257. అమ్మ(తనం) తత్వం..!

అపురూపంగా బిడ్డల్ని గుండెల్లో దాచుకోవడమే..!!

 

258. మగతనమంటే..!

శౌర్యంలోనూ సుమబాలల సున్నితత్వం కలిగుండడమే..!!

 

259. నీ రాకతో ప్రవేశిస్తోంది..!

నేను పారేసుకున్న పసితనం..!!

 

260. కళ్ళారా చూసుకుంటున్నా..!

చెలి(మి) రూపంతో నడిచే నాప్రాణాన్ని..!!

 

261. పిల్లగాలికి ఎంత గర్వమో..!

చెలి కురులను తాకుతోందని..!!

 

262. గుర్తుచేస్తుంటాయి చేజారిపోయిన బాల్యాన్ని..!

లేతకాయల్ని చిదిమినపుడల్లా పాలుగారుతూ..!!

 

263. రెప్పల మాటున దాచి ఉంచాను..!

కన్నుల్లో వెలిగే చెలికాని రూపాన్ని..!!

 

264. విస్మయందేనికో..!

కలవని భూమ్యాకాశాలే మన మనసులని తెలిసి కూడా..!!

 

 265. నీ ప్రేమ సముద్రమే..!

నీ కోపం ప్రళయమైనా..!!

 

 266. మౌనానికే కాదు..!

బంధానికి కూడా భాష ఉండదు..!!

 

267. ఈర్ష్య పుట్టిస్తున్నాయి..!

సొట్టబుగ్గలతో ఊసులాడుతూ చెలి ముంగురులు..!!

 

268. వెలుగు పుష్పాలే..!

నీ కన్నుల్లో వెలిగే దివ్వెలు..!!

 

269. హరివిల్లుకెంత నేర్పో..!

చెలి పెదవి విరుపును ఒంపులోదాచుకుంటూ..!!

 

270. ఏ సంకెలనేసి బంధించాలో..!

పిల్లగాలులై సాగే ఊహలను..!!

 

271. మౌనమే కదా అడ్డుగోడ..!

మనిద్దరి హృదయాల పంతాలకు..!!

 

 272. రైతెప్పటికీ రాజే..!

మరణంతో జయిస్తాడుగా బానిస బ్రతుకును..!!

 

273. నయనాలలో నడయాడుతోంది..!

నీకై కన్న ప్రతీ మధురస్వప్నమూ..!!

 

 274. నిత్యం దీపావళే..!

కలియుగ నరకాసురుల వధను మొదలెడితే..!!

 

 275. ఎక్కడ పడితే అక్కడే వేలల్లో ఉన్నారు..!

మానభంగాలు చేసేముందు కీచకుని పూజించే కామాంధులు..!!

 

276. కలియుగంలో ధర్మం కృంగకేమిచేస్తుంది..!

అవినీతి పునాదులపై నిలబెడుతుంటే..!!

 

 277. అరుదైన వరం నీ పరిచయం..!

అపూర్వమే నన్ను మాత్రమే వరించడం..!!

 

278. మనసు నవ్వుకుంటున్నది..!

ఛిద్రంలోనూ నీ చిత్తరువును దర్శిస్తూ..!!

 

279. అడుగుకో అక్రమార్క చక్రవర్తి..!

పట్టువదలక అక్రమాలకు కొమ్ముకాస్తూ..!!

 

280. దుర్భిణితో గాలిస్తున్నా..!

మానవత్వపు జాడలు కొన్నైనా దొరుకుతాయేమోనని..!!

 

281. కాన్వెంటు చదువులు..!

అమ్మ అనే పదానికి అర్ధానికై నిఘంటువులను ఆశ్రయిస్తూ..!!

 

282. ప్రపంచంలో సగంమంది పేదలే..!

కూటికి కరువై కొందరు, బట్ట బరువై మరికొందరు..!!

 

283. అందం ఉండాల్సింది..!

మనిషికి కాదు…మాటకు, మనస్సుకు..!!

 

284. కొనుక్కుందామా కాస్త సంస్కారాన్ని..!

ఏ విఫణిలోనైనా దొరుకుతుందేమో..!!

 

285. హృదయానికి నను హత్తుకోవూ..!

నీ శ్వాసకు ఊపిరినౌతా..!!

 

286.  నా గొంతు శృతిచేసుకునేది..!

నీ హృది సవ్వడులసరిగమలనే..!!

 

287. నా ఆత్మకి ప్రతిరూపం..!

నీ రూపంలో సంచరిస్తూ ..!!

 

288. ప్రతి దుఃఖబిందువులో నీవే..!

నాజీవనకావ్యంలో అక్షరాలుగా మారుతూ..!!

 

289. తీయని గాయాలనే చేస్తూ..!

నీమాటలెపుడూ కమ్మని గేయాలే..!!

 

290. కొమ్మను వీడే విషాదంలో..!

రాలిపోయే పూలకెన్ని గాయాలో..!!

 

291. రాధమ్మ మనసెంత గాయపడిందో..!

కన్నయ్య అంద(ని)రివాడు అవుతున్నందుకు..!!

 

292. ఎన్ని గాయాలను మోసి ఉంటుందో వెన్నెలమ్మ..!

ప్రతి తారతో సరసాలాడే నెలరేడును తలచి..!!

 

293. వరమై నను వరిస్తావా..!

విరహశాపకూపము నుండి బయటపడిపోవాలనుంది..!!

 

294. మానసిక వికలాంగులే కొందరు..!

గర్వంగా మూర్ఖత్వాన్ని ఆపాదించుకుంటూ..!!

 

295. సుదీర్ఘ వసంతాలే..!

నీతో గడిపే మధురమైన క్షణాలన్నీ..!!

 

296. పేదరైతులే పాచికలు..!

దళారులాడే జూదంలో..!!

 

297. నీ నామస్మరణలతోనే..!

ఆధరాలకిన్ని అమృతగానాలు..!!

 

298. అర్పిస్తున్నా మదిని శతపత్రంగా..!

ఆరాధనల మొగ్గలను తొడుగుకుంటూ..!!

 

299. మనసు నవ్వుకుంటున్నది..!

అధరపు ముద్రలకై చూపులసైగలు చిటికలేస్తుంటే..!!

 

300. సంయోగ భూమికలే..!

నీ ఊహలతో రమించే నాహృదయజతులు..!!

 

301. మమతల జ్యోతులనే వెలిగిస్తున్నా..!

హృదయాన్నే ప్రమిదగ చేసుకుంటూ..!!

 

302. ఎదకన్నులతోనే ఆస్వాదిస్తున్నా..!

ప్రతి ఋతువు ఒక చిత్రమైతోస్తుంటే..!!

 

303. స్వప్న శయ్యపైనే శయనిస్తున్నా..!

జ్ఞాపకాలతోనే నిను హత్తుకుపోతూ..!!

 

304. మాతృపితృ దినోత్సవాలకే అక్షరనీరాజనాలు..!

గుప్పెడు మెతుకులు పెట్టాల్సివస్తే కడుపేదలే... కొందరు కన్నబిడ్డలు..!!

 

305. అమ్మ అలుపెరుగని సహనశీలే..!

వృద్దాశ్రమంలో ఆశ్రయానికై...దరఖాస్తు వరుసలో గంటలు తరబడినిలుచున్నా..!!

 

306. వయసైపోతుందంట..పయనమైపోతున్నారు వృద్దాశ్రమానికి..!

అమ్మానాన్నలకు మించిన త్యాగమూర్తులు ఉండరు కదూ మరేలోకంలో..!!

 

307. ఆక్రమించేసావుగా మొత్తంగా హృదయాన్ని..!

ఇదేనేమో సొమ్ము ఒకరిది, సోకు మరొకరిది అంటే..!!

 

308. చెలిమి ఆత్మాహుతికి పాల్పడుతుందేమో..!

తన ముసుగులో జరిగే గోముఖవ్యాఘ్రాల నయవంచనలను తట్టుకోలేక..!!

 

309. నవ్వుల నెలవే మనసంతా..!

చెలిమిగువ్వై నీవు ఒదిగిపోతుంటే..!!

 

310. బంధీయైన రంగుల బాల్యమే గుర్తొస్తోంది..!

పుస్తకంలో దాగున్న నెమలిఫింఛాన్ని చూసినప్పుడల్లా..!!

 

311. వెళ్ళిపోయావుగా ఒక్క స్మృతినీ వదలక..!

అనంతమైన విరహంలో నను ముంచేసి..!!

 

312. జీవిత రహదారిలో..!

పోవుబాటే  కాని...తిరుగుబాట ఉండదెందుకనో..!!

 

313. మరణం ననుపలుకరించబోతే..!

ఋణాల(ను)మాఫీ  చేసేసుకుంటాను, చెల్లిపోని బంధాలకు వడ్డీలను కట్టేసి..!!

 

314. దేవుడు మోసగాడు..!

ఆత్మబంధువులపైనే విసిరేస్తాడు, కర్కశంగా మృత్యుపాశాన్ని..!!

 

315. అరుదైన వరం నీ పరిచయం..!

మరణమే...నిను వీడిన క్షణం..!!

 

316.  త్రిశంకుస్వర్గమే..!

సగటు బ్రతుకుల మనుగడ..!!

 

317. నామనసే మొదటి శ్రోత..!

నీకైనేనాలపించే ప్రతి ప్రేమగీతానికి..!!

 

318. కళ్ళకింత క(ఇ)ష్టం దేనికో..!

కన్నీళ్ళు ఇంకిపోగానే, మళ్ళీ కలలను కనడం మొదలెట్టెస్తూ..!!

 

319. ఆశలన్నీ గగనపు సుమాలే..!

అందకుండా చోద్యం చూస్తూ..!!

 

320. మనోక్షేత్రమంతా ఆశల అంకురాలే..!

స్వేదంతో సేద్యంచేసే రైతన్నలకు..!!

 

 321. ఒంటరిగా దాటలేకున్నా..!

వియోగాలు అడుగడుగునా ముంచేసే జీవితవైతరణిని..!!

 

322. రాళ్ళూ ముళ్ళూ ఐతేనేం..!

దారిపొడవునా ఆర్తిగా హత్తుకున్నాయిగా..!!

 

323. వీడని వేదనల ము(సు)డులే..!

నిరాశల రెక్కలను విప్పుకుంటూ..!!

 

324. నిజం..!

నిరాడంబరంగా వెలుగులు చిమ్మే దీపం..!!

 

325. తొలిముద్దు స్పర్శలే..!

తడియారని నీ తలపుల తాకిడులు..!!

 

326. అపూర్వ చింతామణివే..!

అర్ధంకాని ప్రశ్నలేస్తూ, నను వేధిస్తూ..!!

 

327. మనం మనలాగే ఉందామా..!

అరువు తెచ్చుకున్న మనస్సునొదిలేసి..!!

 

328. ఆశలన్నీ కొలువు తీరుతున్నాయి..!

ఊహావేదికపై సంబరాలు చేసుకోడానికేమో..!!

 

329. బిడియపు గడియను తెరుస్తున్నాను..!

ప్రేమమార్గాన్ని సుగమనం చేద్దామనే..!!

 

330. నీ మనస్సులోకి దారిచెప్పవూ..!

నా జీవితంలోకి నడిపించుకోవాలనుంది..!!

 

331. చిరుమొలకకు ఎంత చిద్విలాసం..!

తొలకరిజల్లు ఆర్తిగా తడమగానే..!!

 

332. విడదీయలేని రహస్యమే..!

మనోగతంలోని మౌనాల నిక్షిప్తాలను ఛేదించడం..!!

 

333. కనురెప్పలు బరువైపోతున్నాయి..!

కళ్ళల్లో తడివై నువ్వు చేరగానే ..!!

 

334. కనురెప్పల మాటున కదలాడుతుంటే కలవనుకున్నా..!

కలలోని వరమై వరించావని నమ్మలేకున్నా..!!

 

335. అరుదైన వరం నీ పరిచయం..!

అసంభవమే నిన్నీ జన్మలో మరవడం..!!

 

336. చినుకుల కూనిరాగాలు..!

మేఘుని ప్రశాంతతకు భంగం కలిగిస్తూ..!!

 

337. గమ్యమెరుగని బాటసారినే..!

కాలచక్రపు జాడలలో నిరంతరం పయనిస్తూ..!!

 

338. మది వెన్నెల నావలా పయనిస్తోంది..!

నీ కలల తరగలు ఎగసిపడుతుంటే..!!

 

339. వీరబ్రహ్మంగారు ఇంత అమాయకులేమిటో..!

జనాల వింతపోకడలన్నీ కలియుగాంతంలోనే అని పొరపాటుగా ఊహించారు..!!

 

340. లోకంలో మూడొంతులు పరమానందయ్య శిష్యులే..!

తాము నేర్చినదే విద్యయని భ్రమపడుతూ..!!

 

341. స్వచ్ఛతా రంగునద్దుకుంటోంది..!

నయవంచనలతో ముఖపుస్తకం చెలిమి మంత్రజాలమిసిరేస్తూ..!!

 

342. వలపురాగం హోరెత్తుతోంది..!

ఎదతలుపులను బద్దలుకొడుతూ..!!

 

343. చినుకై రానా..!

నిను స్పర్శించేందుకై..!!

 

344. కలల లయల పిలుపులకేమో..! 

చెక్కిలిపై జారుతున్నాయి చిలిపి తలపుల స్వాతిజల్లుల చినుకులు..!!

 

345. ఇంకిపోతున్నాయి ఆశలు..!

కలల వెనుక కన్నీటిచినుకులై రాలిపోతూ..!!

 

346. మనసు మరలకుంది..!

వానచినుకులలో తడిచి మురిసిన బాల్యంనుండి..!!

 

347. తారలమ్మలు తెగ హొయలు పోతున్నాయి..!

వెన్నెలరేడు పడమటి తలుపునుండి తొంగిచూడగానే..!!

 

348. అంతస్తుల ద్వారాలను మూసేస్తున్నారు..!

ఆకలికేకలు నచ్చని ధనికవర్గం..!!

 

349. ఎప్పుడూ నిండుచూలాలే ప్రకృతికాంత..!

నిత్యం పచ్చనిబిడ్డలకు జన్మనిస్తున్నా..!!

 

350. విచిత్రమైనదే కాలం..!

నీవురావన్న వాస్తవాన్ని నిశ్శబ్దంగానే  అదృశ్యంచేసేస్తూ..!!

 

351. బాల్యపు గడియలనే లెక్కించుకుంటున్నా..!

కన్నీటిసాగరాన్ని ఈదుతున్న ప్రతిసారీ..!!

 

352. మట్టిబూట్లపై మమకారం పోనేలేదు..!

నా పసిపాదాలను ఆర్తిగా హత్తుకున్నాయిగా బాల్యంలోని వర్షకాలంలో..!!

 

353. వెదుకుతూనే ఉన్నా..!

జ్ఞాపకాల చిరునామాలకై..!!

 

354. పరిభ్రమిస్తూనే ఉంటుంది జీవితం..!

జ్ఞాపకాల వలయాలలో చిక్కుకుని..!!

 

355. గుండెకు అడ్డుపడుతోంది..!

అస్పష్టమైన ఒక చేదు జ్ఞాపకం..!!

 

356. మహిళలకో ప్రత్యేక దినమెందుకో..!

నిత్యం పెడుతూనే ఉన్నారుగా ఏదోక రకంగా ది(తద్ది)నం..!!

 

357. మహిళలకు సు'దినమే..!

ఆడబిడ్డలు పట్టపగలే స్వేచ్చగా తిరిగగలిగితే..!!

 

358. స్వాతంత్య్రసమరంలో మ్రోగించింది నాటి నా(రీ)రి భే(రీ)రి..!

స్వేచ్చాపోరాటంలోనే జీవితాన్ని ముగిస్తోంది నేటి నారి..!!

 

359. లంచానికీ ఒక లెక్కుంది సుమా..!

ఓటుకైతే నోట్లు ...సీటుకైతే కోట్లే..!!

 

360. నా ఆశలనే ముడుపులుగా కట్టుకుంటున్నా..!

అశ్రువుల ప్రవాహాలతో దోసిలి నింపుకుంటూ..!!

 

361. ఆశల రెక్కలపై ఎక్కిందిగా..!

అందలమెక్కి తిరుగుతోంది మది..!!

 

362. నాన్న చెంతకే పరుగులు..!

హృదయం తడిబారిన ప్రతిసారీ..!!

 

363. మనస్పూర్తిగా నవ్వడం కష్టమే..!

వెతలకు అలవాటుపడిన మనస్సుకు..!!

364. గిరిగీస్తూనే ఉన్నా కన్నీటిసంద్రానికి..!

కనురెప్పల తీరాన్ని దాటిపోవద్దని..!!

 

365. పరువానికి పదనిసలే..!

పదమై నన్నల్లుకుపోతుంటే..!!

 

366. కనురెప్పల మాటున కదలాడుతుంటే కలవనుకున్నా..!

ఎదలోతుల్లో చమరింతవై తడుముతావని ఊహించనేలేదు..!!

 

367. అనురాగం శృతి తప్పిపోతోంది..!

నువ్వు మౌనరాగం ఆలపించగానే..!!

 

368. నిన్నెందరు ప్రేమిస్తే నాకేంటి..! 

ఇవ్వమంటున్నది నీ హృదయాన్నేగా..!!

 

369. నుదుటి ముడతలకు అర్ధం..!

బ్రతుకుబాటలో తిరిగిన మలుపులేనేమో..!!

 

370. కురూపులెందరో..!

మనసులో లేని సౌందర్యాన్ని ఒలకబోస్తూ..!!

 

371. ఆడవారికి స్థానం లేదంట..!

ఘనమైపోతున్న మన దేశ సంస్కృతిలో..!!

 

372. విరహిస్తే తెలిసేది..!

కన్నీటి విలువేమిటో..!!

 

373. జారిపోతూనే ఉన్నా..!

కన్నీటి జలపాతాన్నై దిగులు దిగుడుబావిలోకి..!!

 

374. రెప్పల దుప్పటిని కప్పేసుకున్నా..!

నులివెచ్చని కలలకౌగిలిలోకి ఒదిగిపోతూ..!!

 

375. కాలపేటిక..!

మృతచరితలెన్నింటినో భద్రపరుస్తూ..!!

 

376. మదిగదినంతా దులిపేసాను..!

మూలలలో పట్టిన వెతలబూజులను సైతం..!!

 

377. పొగిలి పొగిలి వర్షిస్తున్నాయి కన్నీటి మేఘాలు ..!

అప్పగింతలపర్వం ముగిసిపోయిందిగా పుట్టినింటి బంధాన్ని తెంచుకుంటూ..!!

 

378. ఏరుకుంటున్నా..!

పసిజ్ఞాపకాల గవ్వలను…మనోసంద్రతీరంలో..!!

 

379. జ్ఞాపకాల తివాచీనే పరుస్తున్నా..!

కాలం పరచిన తిన్నెలపై..!!

 

380. ఒంటరిపక్షినై విలవిలలాడుతున్నా..!

నీ జ్ఞాపకాల హోరుగాలికి చిక్కి..!!

 

381. కలల వీణలేవో జోలలు పాడుతున్నాయి..!

కల'వరాలే ఎద సవ్వడిలో సంగీతమాలపిస్తుంటే..!!

 

382. పరువానికి పదనిసలే..!

నీ కొంటెచూపులతో గారడీలేవో చేస్తుంటే..!!

 

383. రాలిపోయే స్వప్నసుమాలెన్నో..!

మోడువారిన బతుకుతోటలో..!!

 

384. రాజుకుంటూనే ఉన్నాయి..!

జ్ఞాపకాల నిప్పురవ్వలు గతాన్నెంతగా కాల్చేస్తున్నా..!!

 

385. క్షణికమే సప్తవర్ణచాపం..!

నా కంట కరిగిపోయే నీస్వప్నాల్లా..!!

 

386. కన్నీళ్ళలో నానిపోతావేం..!  

కనుపాపలో ఒదిగిపోతావనుకుంటే.!!

 

387. దిగాలు పడుతోంది..!

దగాపడ్డ హృదయం ప్రేమమైకంలో పడి మ(గ)తి తప్పగానే..!!

 

388. నల్లకలువలై సుమిస్తున్నాయి..!

సంతోషాల కొలనులోని ఎద చక్షువులు..!!

 

389. మధుపాలకెంత సమానత్వమో..!

కుసుమకాంతలందరి  అధరమధువులను చిలిపిగా గ్రోలేస్తూ..!!

 

390. కనుపాప కునుకు వీడింది..!

అలజడి రెక్కలు విప్పుతుంటే..!!

 

391. నీమాటలకే కాదు, జ్ఞాపకాలకూ పదునెక్కువే..!

గునపాలై దిగిపోతున్నాయి గుండెల్లోకి సూటిగా..!!

 

392. భలేవాడివే నువ్వు..!

ఏదొకటి పాడమంటే వేలంపాట పాడొస్తావా..!!

 

393. కనురెప్పల మాటున కదలాడుతుంటే కలవనుకున్నా..!

కెంపువై నిదురలేమిని బట్టబయలు చేస్తావనుకోలేదు..!!

 

394. "మమ" అనుకోమంటే..!

"మామ" అన్నాననేగా వచ్చిపడింది అసలుతంటా..!!

 

395. హృదయం విలపిస్తోంది.!.

గుండెకు గాయం చేసి నువ్వు వీడ్కోలు పలుకుతుంటే..!!

 

396. మనస్సుతో ముచ్చటించే ఆశలెన్నో..! 

నీరన్నదే ఎరుగని ఎండమావిలా..!!

 

397. నవ్వుల నౌకలెన్నో..!

కనుకొలనులో తిరుగాడుతూ..!!

 

398. మరుమల్లెలు చేసే బాసలెన్నో..!

కురులని ఎప్పటికీ  వదలమంటూ..!!

 

399. ఒడిసిపట్టుకోవాలనే ఉంది..!

గాయపడిన నా మనసులోని మనిషిని..!!

 

400. సమిధనౌతున్నా..!

బ్రతుకు చేసే యాగంలో..!!

 

401. నన్ను వెదుక్కోవాలనే ప్రయత్నిస్తున్నా..!

అంతిమ ప్రస్థానం అయ్యేలోగా..!!

 

402. నిలదీసి అడగాలనుంది..!

మనసును ఒలకబోసి వెళ్ళిపోవడం దేనికని..!!

 

403. పరువానికి పదనిసలే..!

అను'రాగమై నన్నల్లుకుపోతుంటే..!!

 

404. అనుభవాల అరలను సర్దేసుకుంటోంది గతం..!

నిన్నామొన్నలతో నింపేస్తూ, రేపటిని ఆహ్వానిస్తూ..!!

 

405. మనోశిబిరాన్ని మూసేశాను..!

నిట్టూర్పుల శరణార్థులను బయటే నిలిపేస్తూ..!!

 

406. ప్రశ్నల కోతలెన్నో..!

చిధ్రమైన హృదయానికి మాయని గాయాలౌతూ..!!

 

407. అలుపెరుగదు మనస్సు..!

గతంలోకి పరుగులిడుతున్నా..!!

 

408. నవ్వులను వెంటేసుకొస్తోంది..!

చిన్ననాటి ఊహొకటి మమతల ఊటలతో..!! 

 

409. మరుగుపడవెందుకనో జ్ఞాపకాలు..!

ప్రాయం పరుగులుతీస్తూ కాలగమనంలో కలిసిపోతున్నా..!!

 

410. భలేవాడివే నువ్వు..!

నీ తలపుల్లో తడిచి ముద్దయ్యానంటే బట్టలు మార్చుకోమంటూ..!!

 

411. మాటనేర్పిన మౌనంతో..!

జతపడుతోంది హృదయం..!!

 

412. నీ నామకోటినే లిఖిస్తోంది..!

కులుకులతో కలం, ప్రేమలేఖను వ్రాసేందుకై వలపుసిరాను నింపగానే..!!

 

413. మించిపోలేదింకా సమయం..!

చరితగానే మిగిలిపోయిన గతవైభవచిహ్నాల్ని పొందుపరిచేందుకు..!! 

 

414. నిలదీసి అడగాలనుంది..!

ఒంటరితనపు కొక్కేనికి నన్ను వ్రేలాడదీసిపోయావెందుకని..!!

 

415. నీ ఊహల భ్రమరాలెన్నో..!

మది కమలాన్ని గిచ్చేస్తూ..!!

 

416. చెక్కిలిపై జారే చినుకుపాయలు..!

కలతలలో కనులను తడిపేస్తూ..!!

 

417. చినుకు రవ్వల చిలకరింతలే..!

చెదిరిన హృదయపు చమరింతల్లో ..!!

418. చెలిమి హృదయానికెంత ఆరాటమో..!

నిశ్శబ్ధంగా జారిపోయే కన్నీటి చినుకులను ప్రేమగా అదుముకోవాలని..!!

 

419. నా వ్యసనమే నీవు..!

మార్చుకోలేని అలవాటుగా మారిపోతూ..!!

 

420. వెదుక్కుంటూనే ఉన్నా..!

తప్పిపోయిన నా బాల్యపు దారి(బాట)కై..!!

 

421. వలపు బీజం చల్లిపోయావుగా..!

వేచిచూస్తూనే ఉన్నా ప్రేమమొలకలకై..!!

 

422. నిరాశల పాయలై ప్రవహిస్తున్నాయి..!

పొంగిపొరలుతూ...జ్ఞాపకాల నదులు..!!

 

423. సడిచేయకుంది ఏకాంతం..!

గతం, వర్తమానాల మధ్య చిక్కిపోతూ..!!

 

424. ఇన్ని పూజలెందుకో..!

ప్రత్యక్షదైవాలను విడనాడి...కనిపించని దేవుళ్ళకై..!!  

 

425. నీలో నేను, నాలో నీవు..!

ఈ అద్వైతం అమరమే కదూ..!!

 

426. వేలకొద్దీ గురుతులే..!

గతాలను స్మరించుకుంటుంటే..!!

 

427. జ్ఞాపకాల సీతాకోకచిలుకలు..!

బాల్యపు వీధుల్లోకి పరుగులు తీయిస్తూ..!!

 

428. గుండె దోసిట పట్టలేకున్నా..!

నువ్విచ్చిన ప్రేమ కానుకను..!! 

 

429. మౌనంగానే చక్షువులను తాకుతోంది..!

కారు చీకటిలో సైతం, నీ హృదయరాగపు సవ్వడి..!!

 

430. పళ్ళన్నీ పీకించుకొచ్చేసింది తింగరబుచ్చి..!

బోసినవ్వులంటే నాకు ప్రాణమనగానే..!!

 

431. చిలిపి చినుకుల సందడికేమో..!

పురివిప్పి నర్తిస్తోంది వనమయూరం..!!

 

432. నిశ్శబ్ధాన్ని మీటుతూనే ఉంటాను..!

నీ ఊహలను నిద్రపుచ్చేవరకు..!!

 

433. జ్వలిస్తోంది ఏడేడు రంగుల దీపం..!

నీలవేణి గుండెల్లో రగిలే చినుకురవ్వలకు..!!

 

434. గతంలోకి పయనిస్తోంది మనోవాహనం..!

పోగొట్టుకున్న మధురక్షణాలను వెదుక్కుంటూ..!!

 

435. క్షేత్రం గాత్రమౌతోంది..!

చెమట తొలకరికేమో..!!

 

436. ఓ అందమైన సామ్రాజ్యం ..!

కుతంత్రాల లోకంతో బంధం తెలియని నా బాల్యం..!!

 

437. నీ చూపులు చురకత్తులే..!

హృదయాన్ని తీపిగాయాలతో నింపేస్తూ..!!

 

438. ఎన్నెన్నో తీయని కలలు..!

కనుల కౌగిలిలో ఒదిగిపోతూ..!!

 

439. నిలదీసి అడగాలనుంది..!

చిన్నాభిన్నమైన నేను'లను ఎలా వెదికేదని..!!

 

440. నిర్భయచరితలుగానే మిగిలిపోతున్నాయి..!

మదాంధుల పదఘట్టనలు…పైశాచిక కామక్రీడలతో..!!

 

441. చెమ్మగిల్లుతుంది హృదయం..!

నీ ఎడబాటు రాల్చుతున్న కన్నీటితో..!!

 

442. చిగురిస్త్తున్నాయి మౌనాలేవో..!

మాటలమారాకులను తొడుగుతూ..!!

 

443. నా అస్థిత్వాన్ని కోల్పోతున్నా..!

నిన్ను కాంచిన తన్మయత్వంలో..!!

 

444. ఆశలతో సహవాసం చేస్తున్నా..!

నీ జ్ఞాపకాల పరదాలమాటున..!!

 

445. కాళ్ళకు చక్రాలను తగిలించుకుందో ఏమో..!

పరుగెడుతూనే ఉంటుంది అలుపెరుగని కాలం..!!

 

446. నిశ్శబ్దం ఊసులాడుతోంది..!

నడక కలల దారులకే పరిమితమౌతుంటే..!!

 

447. మొరాయిస్తోంది కలతనిద్ర..!

కనులగడపలోకి అడుగిడనంటూ..!!

 

448. కొల్లగొట్టకు నా మౌనాన్ని..!

బాసల రాశులన్నీ బయటపడేదాకా..!!

 

449. నీతులకు తక్కువేం లేదుగా..!

ఆడవారి ప్రేమ నీటిమూటంటూ, మగవారి ప్రేమ రాతికోటంటూ..!!

 

450. తిరిగిరాని గతాన్నై మిగిలిపోతున్నా..!

మరపురాని స్మృతులెన్నో రగిలిస్తుంటే..!!

 

451. మళ్ళీ జన్మంటూ ఉంటే..!

మా అమ్మలాగనే పుట్టాలనుంది, దిగులును మోసిందిగా జన్మంతా..!!

 

452. ఆరని కన్నీళ్ళ చారలెన్నో..!

మదితల్పంపై మరకలుగా మిగిలిపోతూ..!!

 

453. గడుసుపిల్లలై బైటికి పరుగులు తీస్తున్నాయి..!

మదితలుపు తెరవగానే జ్ఞాపకాలన్నీ నన్నేమారుస్తూ..!!

 

454. కుదురెరుగదు మనసు..!

అవిరామమైన సమరాలతో..!!

 

455. అనామకమైన దిగుళ్ళు..!

కలకలాలను సృష్టిస్తూ..!!

 

456. జీవితపు విస్తరిని వడ్డిస్తున్నా..!

మనసులోని ఆనందపు భక్ష్యాలతో..!!

 

457. కలలహారుతులనే వెలిగిస్తున్నా..!

కనుప్రమిదలలో, కలతల చీకటిముసురులను పారద్రోలడానికై..!!

 

458. కన్నీటి చినుకుల ప్రవాహాలే..!

గుప్పెడంత గుండెలో వరదలైపారుతూ..!!

 

459. తలపుల తలుపులనే తెరిచుంచాను..! 

నీ పిలుపుల సడులేవో వలపు జావళీలను ఆలపిస్తుంటే..!!

 

460. చంటిపాపనై నిదురించాలనుంది..!

నీఎదతల్పంపై కంటిపాపగా నను లాలిస్తుంటే..!!  

 

461. వెతుకుతున్నాను నిఘంటువులన్నీ..!

నీ మనోశాస్త్రంలోని పదాలకు అర్ధాలకై..!!

 

462. భలేవాడివే నువ్వు..!

మచ్చలేని చంద్రుడునువ్వంటే, పుట్టమచ్చలెన్నున్నాయని లెక్కించుకుంటూ..!!

 

463. మదిలో అలజడుల తరంగాలెన్నో..!

నువ్వు విసిరేసే మాటల గులకరాళ్ళు సృష్టించే ప్రకంపనాలతో..!!

 

464. కలలో సైతం దోచుకోలేని సంపదలే..!

అమాయకమైన నా బాల్యపు జ్ఞాపకాలు..!!

 

465. జీవితాన్నే కానుక చేస్తా..!

చేజారిన కాగితపు పడవల బాల్యాన్ని తిరిగి నాకిస్తానంటే..!!

 

466. తడుపుతున్నాయి ..!

వలపుల తొలకరులేవో...వసంతగానాలై..!!

 

467. కుప్ప నూర్చితే ధాన్యపు పంటలే..!

కలం నూరితే విప్లవాల మంటలే..!!

 

468. కాలాన్ని నిందించడం దేనికి..!

జ్ఞాపకాలనే నీవు మిగిల్చిపోయాక..!!

 

469. నవ్వులతో ముస్తాబౌతున్నా..!

కన్నీటి చారికల మరకలను చెరిపేసుకుంటూ..!!

 

470. మౌనమే మిగిలింది..!

మనసుకు నిను ఆర్తిగా హత్తుకున్నాక..!!

 

471. మనస్సుకెపుడూ నత్తనడకే..!

బాల్యపుతోవలోకి మరలగానే..!!

 

472. ఎదురుచూపు తప్పడంలేదు..!

వేకువ కలలకి, వేకువలకి మధ్య నలిగే వెతలతో..!!

 

473. గతపు నివురు..!

చిటపటలాడుతోంది, కన్నుల్లో నిప్పుకణికగా మారుతూ..!!

 

474. కూననై ఒదగాలనుంది..!

పసిదనపు పాటనయ్యేందుకు..!!

 

475. పెదవి దాటని నాదమౌతున్నా..!

నీ తలపుల కొనగోటితో కోటి రాగాలను మీటుకుంటూ..!!

 

476. వసంతమై తరలివస్తున్నా..!

ఎలకోయిలవై పలుకరిస్తావనే..!!

 

477. ఉల్లాసపు మెరుపుముత్యాలు..!

సంతోషాలను దాచిన కనుదోయిలో వెలుగులీనుతూ..!!

 

478. మరణాన్నైనా వరిస్తా..!

మన జీవనరేఖలో మెరుపుగ నిలిచేందుకు..!!

 

479. అనురాగసౌధంలో మెరుపులే..!

కన్నుల్లో వెలిగే మమతానురాగాల కాంతులు..!!

 

480. చెక్కిలిని మీటుతూనే ఉంటాయి..!

వెచ్చగా జారిపోతూ నీ జ్ఞాపకాల కన్నీటి జలపాతాలు..!!

 

481. నిశీధి కన్నియకు కులుకు(మెరుపు)లెక్కువే..!

చుక్కల చీర కట్టి రేయంతా పున్నమిరేడుకై హోయలొలకపోస్తూ..!!

 

482. అమ్మంటే..!

గుడిలేని దైవం...పూజలెరుగని దేవత..!!

 

483. సుమలతలకు ఎందుకో అంత పర'వశం..!

మధుపం గ్రోలింది పూలకన్నెల ఆధరమధువులనైతే..!! 

 

484. ఆలోచనల చూరులనుండి జారిపోతున్నాయి..!

నదులుగా సాగిపోవడానికేమో...స్వప్నాలు..!!

 

485. నీ పిచ్చిలో పడిపోయినట్లే ప్రేమ..!

యవ్వనంలోనే నా వయస్సు ఆగిపోగానే..!!

 

486. శరాలై దూసుకొస్తున్నాయి..!

కనురెప్పల మాటున దాగిన భావాలన్నీ..!!

 

487. సిరి'మువ్వలపై అలిగాను..!

సవ్వడించాయిగా…రహస్యంగా నిను కలవాలనొస్తే..!!

 

488. నీ ప్రేమరాగాలనే ఆలపిస్తున్నాను..!

ఏకాకిగానే...శీతాకాలపు కోయిలనై..!!

 

489. సర్దుకుపోవడం నేర్చుకున్నాను..! 

దూరమైన ప్రాణబంధాన్ని శ్వాసగా నింపుకుంటూ..!!

 

490. కొంటెచూపులను విసిరేయకలా..!

అందుకున్నాగా నీ తలపుల సందేశాలను..!!

 

491. మనసుకు స్వచ్ఛత కలుగుతోంది..!

నెమలీకల నెయ్యాల ఊసులేవో పసిచేతులతో మదిని నిమరగానే..!!

 

492. గుండె భారమయ్యింది..!

అమ్మ వ్రాసిన లేఖనందుకోగానే కన్నీటితో లిఖించి పంపినందుకేమో..!!

 

493. చీకటి కన్నెకి సిగ్గెక్కువే..!

తూరుపు తలుపు ప్రక్కనే దాక్కునుంటుంది సూరీడు వెళ్ళేవరకు..!!

 

494. కలం కన్నీరు కారుస్తోంది..!

నవరసాల భావసంద్రాన్ని వదిలి విరహసంద్రంలోనే కొందరు ఈదులాడిస్తుంటే..!!

 

495. మౌనాల మేనాలో వేచి ఉన్నా..!

నీ పలుకులే బోయీలై ఊరేగిస్తాయనే..!!

 

496. పసిపాపలై ఒదిగిపోతున్నాయి కలలన్నీ..!

కనుపాపవై నువ్వు లాలించగానే..!!

 

 497. నీ సరాగాల గానాలకేమో..!

మది విరహవీణియలనే మీటుతోంది..!!

 

498. ఇల్లంతా మంజీరాలు మ్రోగుతున్నాయి..!

చిట్టితల్లి కేరింతలతో ఆడుకుంటునట్లుంది..!!

 

499. రాత్రయితేగాని ఇల్లు గుర్తుకురాదు..!

పగటిపూట పత్తాలేకుండాపోయే తుంటరికలలకు..!!

 

500. కళ్ళింత బేలలేమిటో..!

కలతతాకగానే మడుగులైపోతూ..!!

 

501. క్రొత్తగా రెక్కలు తొడుగుతున్నాయి ఊహలు..!

న(ని)న్ను మళ్ళీ ప్రేమించడం మొదలెట్టాకా..!!

 

502. గతాలై జారిపోతున్నాయి క్షణాలన్నీ..!

నిట్టూర్పులై విసిగించే జ్ఞాపకాలతో..!!

 

503. రాలిపోయే ఆశలే అన్నీ..!

ఊహల కొమ్మన ఊగిసలాడుతూ..!!

 

504. మురిసిపోతోంది నింగిలోని హరిచాపం..!

మేఘుడు చిమ్మిన కల్లాపితో, రవికిరణం రంగవల్లులను దిద్దగనే..!!

 

505. చెవులు చిల్లులు పడిపోతున్నాయి..!

మదిసంద్రం హోరు ప్రళయమైపోతుంటే..!!

 

 

506. మౌనమే మిగిలింది..!

 

నాలో నిను ఒంపుకున్న హాయేదో సుతిమెత్తగా స్పృశిస్తుంటే..!!

507. విషాదభావాలను వదలమంటావేం..!

 

నా మనస్సుకు అవేగా సాంత్వనకూర్చుతున్నాయి..!!

508. వెలుగు పక్షీ ఎగిరిపోతుంది..!

 

దీపపుగూటిలోని చమురు ఆయువావిరవ్వగానే..!!

509. చెక్కిలిపై అతుక్కుంటున్నాయి..!

 

నీ చూపులే సూటిగా ఆయస్కాంతాలై..!!

510. సిరి'మువ్వలకెన్ని హొయలో..!

 

నీ పారాణి పా(ప)దజతులతో రవళిస్తూ..!!

511. అంకితమైపోతున్నా..!

 

నీ పెదవంచున పల్లవినైపోతూ..!!

512. జీవితాన్నే అంకితమిస్తా కాలానికి..!

 

నామధురమైన బాల్యాన్ని నాకిచ్చేస్తే..!!

513. వేదనలకే అంకితం..!

 

నిదురను చెరిపేసే కన్నీటి కలవరాలన్నీ..!!

514. (అ)పరిచిత సంభాషణలెన్నో..!

 

గాలితరంగాలపై తేలిపోతూ..!!

515. అక్షరపొదిలో దాగున్నాయి..!

 

భాష్యాలకందని రూపాలెన్నో..!!

516. గత జ్ఞాపకాలన్నీ లంకెబిందెలే..!

 

మదిపొరల త్రవ్వకాలలో బయటపడుతూ..!!

 

 

517. మధూలికనై వేచి చూస్తున్నా..!

తుంటరితుమ్మెదవై వచ్చే నీకోసం..!!

 

518. నెట్టేసావుగా నా నుండి నన్ను..!

నా మదిలో నిన్నే ప్రతిష్టిస్తూ..!!

 

519. రంగులను మార్చడం నేర్చుకుంటున్నాను..!

జీవితంలో కొత్త వర్ణాలను నింపుకునే నేర్పు తెలియక..!!

 

520. కలలు కంటూనే ఉన్నా..!

నువ్వు కనిపిస్తావనే ఆశతో..!!

 

521. కన్నీటి ఆతిధ్యాన్ని సిద్డంచేస్తున్నా..!

విషాదతిధివై వచ్చే నీకై..!!

 

522. ష్..సడి చేస్తావెందుకే సిరి'సిరిమువ్వా..!

తలపులలోని తన ఊసులకు భంగం వాటిల్లేలా..!!

 

523. అలసటకు అర్ధం తెలియకున్నది..!

అమ్మో క్యాంటీన్, న్నాన్నో ఏ.టీ.ఎంఔతున్న ఆధునికతరపు సౌకుమార్యానికి..!!

 

524. ప్రేమ గొప్పదే..!

నిన్ను నన్ను కలిపి మనల్ని చేసింది కదా..!!

 

525. ఆత్మీయంగా పిలవ్వచ్చుగా నన్ను..!

చేజారిన కాలాన్ని కాలేనుగా…నీ హృదయంలో ఖైధీనయ్యాక..!!

 

526. నను పరామర్శించేవి నీ జ్ఞాపకాలే..!

మోదముతో ఉన్నా, వేదనలో కూరుకున్నా..!!

 

527. కనులకెంత ప్రశాంతతనో..!

వర్షించిన నీ జ్ఞాపకాలవాన వెలిసిపోగానే..!!

 

528. చినుకుకొకింత గర్వమే..!

బిందువై వచ్చి తాను సింధువైపోతున్నానని..!!

 

529. ఉదయభానుడికి ప్రాణసంకటమే..!

చుక్కల భామలను ముద్దు ముచ్చట్లతో అనునయించి పంపేసరికి...!!

 

530. నీ రూపాన్నే ప్రతిబింబిస్తున్నాయి..!

నా చెక్కిలిపై జారిన కన్నీటి బిందువులను తరచి(తడిమి)చూసుకుంటుంటే...!!

 

531. కలకూజితాలే..!

నీ పలుకుల్లోని పదాలన్ని..!!

 

532. ఎదురు చూపులనేమో..!

క్షణాలన్నీ బరువైన యుగాలుగా మారిపోతున్నాయి..!!

 

533. హృదయాన్ని వేడుకుంటున్నా..!

నీజ్ఞాపకాల్ని సైతం కన్నీరుగా జార్చేయమని..!! 

 

534. నీవెపుడూ నాతోనే..!

పెదవిపై కెంపులా...చెక్కిలిపై కెంజాయలా..!!

 

535. అమ్మ ఎపుడూ ఇంతే..!

నాలుగు మెతుకులు తినమంటూ విసిగిస్తుంది, పనులతో సతమతమైపోతుంటే..!!

 

536. పెళ్లి పనుల జాబితానిలా వ్రాసాడేంటో తింగరోడు..!

తాళిబొట్టు, తలంబ్రాలు, పెళ్ళికొడుకు ఓ పెళ్ళికూతురంటూ..!!

 

537. చేరువయ్యేదాన్నే కాదు..!

విడిపోయే శిక్షను నువ్విధిస్తావని తెలిస్తే..!!

 

538. మాటలిసిరే తూటాలే మిన్న..!

మౌనం చేసే గాయాలకన్నా..!!

 

539. ఒదగాల్సింది ఆరడుగుల్లోనేగా..!

మనమెంత ఎత్తుకెదిగిపోయినా..!!

 

540. కన్నె’కలువ తెగముస్తాబౌతోంది..!

ఏ తలపు తోపుల విహారానికి పిలిచాడో చంద'మామ..!!

 

541. కన్నీటి కాలువ ఇంకిపోదేమిటో..!

ఏతమేసి ఎంతగా తోడేస్తున్నా..!!

 

542. తడిసిన పేజీలే తగులుతున్నాయి..!

మన ప్రేమడైరీని తడుముకున్నపుడల్లా..!!

 

543. కన్నీటి వాగులై పొంగి పారుతున్నాయ్..!

పదిలపరుచుకున్న జ్ఞాపకాలన్నీ కడలిగా మారుతూ..!!

 

544. గతంలోకే పరుగులు తీస్తుంటుంది..!

నువ్వు లేని నిన్నల్లో నీకై వెంపర్లాడుతూ పిచ్చిమనస్సు..!!

 

545. మనస్సునింతగా గాయపరచాలా..!

నా ప్రేమ లోతెంతో తెలుసుకునేందుకు..!!

 

546. వెదుక్కుంటూనే ఉన్నా..!

నీ మాటలతూటాలతో చిధ్రమైపోయిన నా మనస్సు చిరునామాకై..!!

 

547. వలపు తుమ్మెదలు వలసపోతున్నాయి..!

మనోవనానికి విరహశిశిరం తాకగానే..!!

 

548. ష్ ..నెమ్మదిగా మాట్లాడు..!

మంజీరాలులిక్కిపడుతున్నాయి నీ పలుకులకు తమ అందెలను జార్చుకున్నామేమోనని..!!

 

549. ఏకాంతపు సేతువు..!

గతవర్తమానాలను కలుపుతూ..!!

 

550. గతం వెక్కిరిస్తోంది..!

కాలపుదోసిలి నుండి అలవోకగా జారిపోతూ..!!

 

551. మంద్రంగా మారిన తటాకాన్ని నేను..!

అలజడియలలను సృష్టించే గులకరాయివి నీవు..!!

 

552. బ్రతక(డం)నేర్చావు సరే..!

జీవించడం ఎప్పట నుండి మొదలెడతావు..!!

 

553. ప్రేమను పంచాల్సింది..!

పెదవులతో పలికించి కాదు, మనస్సుని మౌనంగా అర్పించి..!!

 

554. గొణుక్కుంటున్నా అంటున్నారంతా..!

నాలోని నీతో నెమ్మదిగా ముచ్చటిస్తుంటే..!!

 

555. నీలి కన్నుల్లో నీ రూపం..!

చుక్కల దుప్పటిపై మురిపించే శశాంకునిలా..!!

 

556. రంగులకలలన్నీ జారిపోతున్నాయి..!

కళ్ళలోని ఉప్పునీటి సంద్రాలలోకి మెల్లగా..!!

 

557. రేయంతా దాగుడుమూతలే..!

నీ కలలతో ఆటలాడే కనురెప్పలకు..!!

 

558. మనస్సు చెమ్మగిల్లుతోంది..!

అమ్మప్రేమ తడిమినప్పుడల్లా..!!

 

559. నిత్యం పేరంటమే వాసంతికకు..!

తరువులు జరుపుకునే శ్రీమంతాలతో..!!

 

560. నిరీక్షణ తప్పదేమో మదితీరానికి..!

అలవై నువ్వు తాకేవరకు..!!

 

561. మనోగగనమంతా నీ జ్ఞాపకాలే..!

శ్వేతకపోతాలై స్వేచ్చగా విహరిస్తూ..!!

 

562. ఎద చిగురులు తొడుగుతోంది..!

నీకు ప్రేమపుష్పాలను అర్పించాలనే..!!

 

563. రామరాజ్యం తిరిగొస్తే..!

అగ్నిపునీతలమవ్వాలేమో అడుగడుగునా అగుపించే రావణజగతిలో..!!

 

564. తొలకరించవూ..!

మన దూరాలను చెరిపేసే స్వాతిచినుకులా..!!

 

565. నీ ప్రేమ ఎప్పటికీ అక్షయమే..!

లెక్కలేని చుక్కల్లో అమృతాన్ని నింపేస్తూ..!!

 

566. అక్షరరాశులకై గాలిస్తున్నా..!

నీపై కవనానికై పదాలను కూర్చుకుందామనే..!!

 

567. స్మృతుల కావ్యమే..!

హృదయాంతరాల్లో పెల్లుబుకుతున్న నా ప్రేమ..!!

 

568. ఎదకోయిల రాగాలాపన చేస్తోంది..!

మల్లెల మాసమని భ్రమిస్తోందేమో నీ నవ్వులు చూసి..!!

 

569. నీ తలపుల జల్లుల్లో తడిచిపోతున్నానంటే..!

పడిశం పట్టేస్తుందని విసుక్కుంటోంది తింగరబుచ్చి..!!

 

570. మానవత్వం పరిమళిస్తోంది..!

మనిషి(మంచి)తనం రూపంలో..!!

 

571. తడుముతోంది గతించిన బాల్యం..!

వెన్నెలలో తడిసిన ప్రతిసారీ..!!

 

572. మౌనమే మిగిలింది..!

ప్రేమసౌధం నుండి నువ్వు నిష్క్రమించాకా..!!

 

573. మదితలుపులు తెరుచుకుంటున్నాయి..!

నిశబ్దంలో నాదంలా వినిపించే నీ గుండెచేసే సవ్వడితో..!!

 

574. పరాజితనౌతూనే ఉంటాను..!

నీ జ్ఞాపకాలను జయించలేని ప్రతిసారీ..!!

 

575. భావాల భాండాగారమౌతోంది మది..!

మనోపత్రంపై ...నీ ప్రేమసంతకంతో..!!

 

576. గుచ్చుతూనే ఉంటాయి కొన్ని గతాలు..!

మదిపొరలలో దాచినా మధ్యమధ్యలో తలెత్తుతూ..!!

 

577. గొప్ప ప్రతిభున్న ఇంద్రజాలికుడే రైతన్న..!

మట్టితో అద్భుతమైన మహేంద్రజాలాన్ని (పండిం)చేస్తూ..!!

 

578. నీ జ్ఞాపకాల దుకాణాలెన్నో..!

ఏకాంతపు బజారంతా నిండిపోతూ..!!

 

579. ప్రతిమాసం మధుమాసమే..!

సిరిమల్లెలతో పోటీపడే నీ నవ్వులతో..!!

 

580. నీ నవ్వుల రవళులా..!

సెలయేటి గలగలల సవ్వడులనుకున్నా..!!

 

581. వసంతవిరులకు జాతరలట..!

మధుమాసపు కోయిల గానవాహినిలో మునిగితేలుతూ..!!

 

582. నీవు నా జీవనశ్వాసవు ..!

మరువడానికి ఆశవు కాదు..!!

 

583. విధిరాతెంత విచిత్రమో..!

అందాల కమలానికి బురదవలువలను చుట్టబెడుతూ..!!

 

584. అంత చొరవేంటి నీకు..!

నా కాలాన్నంతా దోచేసుకుంటూ..!!

 

585. ఈ జన్మలో ప్రయాణం..!

మన మనస్సుల ప్రణయంతోనే..!!

 

586. కనులముందు నిలుస్తోంది..!

కొత్త బంగారులోకం నీ రాకతో..!!

 

587. కట్టేద్దామా వెతలకు చలానాగా..!

ముఖానికి పులుముకున్న చిరునవ్వులన్నిటిని..!!

 

588. కలలపంట ఎండిపోతోంది..!

మనస్సు ఎంతగా బోరుబోరుమని వర్షిస్తున్నా..!!

 

589. కాళ్ళెలా కందిపోయాయో చూడు..!

నిను కలియ తిరగొద్దన్నానందుకే నా కలలో సైతం..!!

 

590. కన్నుల్లో కలలతారకలెన్నో..!

చుక్కల్లో కలిపేస్తాడనెరుగని ఒక కన్నెవధువుకు..!!

 

591. సిరి'మువ్వలు సందడి చేస్తున్నాయి..!

నీ నవ్వులకు పోటీగా పందెం ఏమైనా వేసావా..!!

 

592. పడిశం పట్టేసినట్లుందే..!

అందుకే నా కలలవానల్లో నానిపోవద్దంటున్నది..!!

 

593. నిశ్శబ్దగీతాన్ని ఆలపిస్తోంది మనోగగనం..!

మలిసంధ్యవై నువ్వు తరలిపోతుంటే..!!

 

594. నీకై నిరీక్షిస్తూనే ఉన్నా..!

నన్ను వీడిన ఘడియనుండి..!!

 

595. ఋణం తీర్చుకుంటున్నాయి పురుగుమందులు..!

నేలతల్లి కన్న ముద్దుబిడ్డలను మళ్ళీ మట్టిలో కలిపేస్తూ..!!

 

596. సందేశాలను మోసుకొస్తాయనేమో..!

మెయిళ్ళుకు, మొయిళ్ళకీ అవినాభావ సంబంధం..!!

 

597. మరుపు ఒక వరమే..!

వేటాడే నీ స్మృతులకు..!!

 

598. బంధమంటే..!

వెంటేసుకుని రావడమే చావునుకూడ పుట్టుకతోపాటే..!!

 

599. కాశీయాత్రనే మానేసుకున్నాను..!

ఈ జన్మకు నిన్నొదులుకోవడం ఇష్టంలేకనే..!!

 

600. నన్నుకాని తలిచావా..!

పదేపదే  పొలమారిపోతుంటేను..!!

 

601. చెల్లిపోని బంధాలే..!

నువ్వే కాదు, నీ స్మృతులుకూడా..!!

 

602. స్పందనవే నీవు..!

హృదయాన్ని కుదిపేస్తూ..!!

 

603. అర్దాయుష్షుతో వెళ్ళిపోతూ ఆనందాలు..!

దీర్ఘాయుష్షును పోసుకుంటూ...వేదనలు..!!

 

604. ఆస్వాదిస్తున్నా జన్మంతా..!

అణువణువూ నువ్వు నింపిన ఆనందాలను..!!

 

 605. రాలిపోయే కలల కొమ్మలెన్నో..!

ఆవేదనల సుడిగాలికి చిక్కి..!!

 

 606. కమ్మని కవితలై ఒదిగిపోతున్నాయి..!

కనుపాపల దుప్పటిలో...కలలన్నీ..!!

 

 607. మరో సప్తజన్మల బంధాన్ని ముడేసుకుందామా..!

అష్టమజన్మకు మనమే శ్రీకారం చుట్టుకుంటూ..!!

 

608. అత్తా అంటూ ఆత్మీయంగా పిలుస్తుంటే మురిసిపోయాను..!

అందమైన కూతురుందన్న విషయాన్ని పసిగట్టిన కుర్రకారంతరంగమెరుగక..!!

 

609. ఊహలపై'నే అలుగుతున్నా..!

నా కంటే ముందే నీ చెంతకు పరుగులుతీస్తున్నాయనే...!!

 

610. రేయి ఏమి చిలిపి ఊసులాడుతుందో..!

సిగ్గుల అరుణాలను పులుముకొస్తుంటాడు ఉదయభానుడు..!!

 

611. జొరబడిపోతున్నాయి గతాలన్నీ..! 

మదితలుపులను తెరుచుకుంటూ..!!

 

612.  ఏకాంతంలోకి ఎగిరిపోతోంది..!

పెదవివిప్పని మౌనమేదో..!!

 

613. సాహిత్యపు వేదికపై నర్తిస్తున్నాయి..!

అక్షరాలే అందియలై...పదరవళులతో..!!

 

614.  ఎంతని వెదికివేసారను..!

నాలోని నీకై అంతుచిక్కని జాడకై..!!

 

 615. జ్ఞాపకాల మజిలీలెన్నో..!

తన్మయత్వపు గతంలో తారాడుతూ, పా(పో)రాడుతూ..!!

 

 616. మారుతున్నాయి చెత్తకుప్పలు..!

శిశుదేహాలకు సజీవసమాధులుగా..!!

 

617. నాకు నేను అపరిచితనే..!

మదిని నువ్వు దొంగిలించినప్పటినుండి..!!

 

618. గాయాల ప్రవాహాలెన్నో..!

 చెక్కిలిపై జారిపోతూ..!!

 

619. కళ్ళేమో కలలు కనే రహస్యాన్ని కనిపెట్టేసాయి..!

మనసేమో సాకారం చేసుకునే విద్యను పసిగట్టేసింది..!!

 

 620.  ఏ"మార్చటం"..!

నువ్వు పరిచయించిన పదమే జీవితానికి..!!

 

621.  గుండె చేజారిపోయింది..!

వంచనను సైతం ప్రేమనుకుని మోసపోయేంతగా..!!

 

622.  జ్ఞాపకాల్లోకి తొంగి చూస్తున్నా..!

మెరుపులా మెరిసి మాయమైన మన గతాన్ని సృశిస్తూ..!!

 

623. ఊహల కట్టడాలే నిర్మిస్తున్నా..!

అనుభూతుల శిఖరమంచున మెరుపునౌతూ..!!

 

624. ప(పు)లకరిస్తోంది బాల్యం..!

పున్నమినవ్వుల మెరుపులతో..!!

 

625. కన్నీటి చెలమలు ఎండిపోతున్నాయి..!

ఆత్మఘోషను, కంఠశోషను మిగులుస్తూ..!!

 

626. నిను తాకిన క్షణాలు..!

కన్నులలో జ్యోతులుగా మారేవే..!!

 

627. నువ్వు సంధిస్తూనే ఉంటావు..!

వెతలు నింపే అస్త్రాలను..!!

 

628. మదికి నిత్యాలాపనే..!

నీ జ్ఞాపకాల సమ్మోహన గీతాలతో..!!

 

629. తృటిలో చేజారిన ఘడియలెన్నో..!

మదిలో చెదరని గతాలుగా..!!

 

630. కాలపు కనికట్టో కాకతాళీయమో తెలియకుంది..!

గతమంతా వర్తమానమై నను వెంటాడుతుంటే..!!

 

631. కాలం కలహిస్తోంది..!

ఓరిమినే ఆశ్రయిస్తూ శూన్యంగానే మిగిలిపోతున్నానని..!!

 

632. నన్ను నేనే మరచిపోతున్నా..!

నా హృదయాన్ని దోచుకున్న నీకోసం అనుక్షణం నిరీక్షిస్తూ..!!

 

633. కన్నెకలువకి ఎంత మురిపెమో..!

జాబిల్లి కురిపించే వెన్నెలజల్లంటే..!!

 

634. హరివిల్లు అద్దిన సప్తవర్ణాలు..!

గగనపు కాగితంపై అద్భుతచిత్రాలు..!!

 

635. మాననిగాయమై నీవు..!

నినుమరువడం తెలియని గేయమై నేను..!!

 

636. నీ ఊహలతో వింత యుద్ధం..!

ఎంత లోతైన గాయానికైనా సిద్దపడుతూ..!!

 

637. మారణాయుధమే నేనౌతా..!

ఆపదే నిను గాయం చేస్తే..!!

 

638. ప్రేమను పంచింది అమ్మైనా..!

ప్రేమలా పరిచయమయింది నువ్వేగా..!!

 

639. కళ్ళేమో కలలు కనే రహస్యాన్ని కనిపెట్టేసాయి..!

ఉద్వేగపు అలలేవో మది తీరాన్ని తాకుతున్నాయి..!!

 

640. ఎగిసిపడే భావపు అలలెన్నో..!

సాహితీ సంద్రంలో ఉరకలేస్తూ..!!

 

641.  నన్ను నేనే మరచిపోతున్నా..!

నా హృదయ ఫలకంపై నీ రూపాన్ని చిత్రిస్తూ..!!

 

642. జలప్రళయమే..!

కరిమబ్బు మనస్సు చెదిరినా, కనుమబ్బు గుండె పగిలినా..!!

 

 643. మనస్సు పడింది నీ మాయలో..! 

తనకు ఏంకావాలో తెలుసుకోలేనంత (గ)మత్తులో..!!

 

 644. గుబాళిస్తున్నాయి జ్ఞాపకాలు..!

వాడినా కురులనొదలని మొగలిరేకుల పరిమళంలా..!!

 

 645. మదితలుపులు తెరిచి ఉంచాను..!

జ్ఞాపకాల అతిధుల కోసమని..!!

 

646. అమ్మకు చీరకొంగంటే ఎంతిష్టమో..!

అశ్రువులను హత్తుకుంటుంది కదా..!!

 

 647. వెదుకుతూనే ఉన్నా జవాబులెన్నో..!

నీ పలుకుల మలుపులలో బదులే దొరక(లే)ని ప్రశ్నలకై..!!

 

 648. అరవిరిసిన నీ నవ్వులనే అద్దుకుంటున్నా..!

నా మనోసుమంపై అనురాగపు పుప్పొడిగా..!!

 

649. మౌన భావాలు మధురమే..!

మనోసాగరతీరాన్ని ఆనందపుఅలలుగా తాకుతుంటే..!!

 

650. అమ్మకు పునర్జన్మనే మనయాగమనం..!

అమ్మప్రేమ కోటిజన్మలైనా అమరం ..!!

 

651. పగిలిన హృదయపు నీడలెన్నో..!

ఎద దిక్కులలో కమ్ముకుంటూ..!!

 

652.  ఇరు మనస్సులే సాక్ష్యాలు..!

ఊహలలోనే కలుసుకునే అమరప్రేమకు..!!

 

 653. మనస్పూర్తిగా  ప్రేమించబడాలనుంది..!

కాలాన్ని వెనక్కి తిప్పగలిగితే బాగుండును..!!

 

654.  నేను అనుభవిస్తున్న జీవితకాలపు శిక్ష..!

పరిణయానికి ముందే నువ్వు పరిచయంకాకపోవడం..!!

655.  దిగులు తీరాలకు తరలిపోతున్నాయి..!

ఆశాతరంగాలు అడియాశలతో అల్లకల్లోలమైపోతూ..!!

 

656. ఒక తీయని ముద్దిస్తాను..!

నిను పరిచయించిన క్షణాలకు..!!

 

 657. పరిచయమౌతూనే ఉంటుంది..!

నిత్య నూతనత్వంతో ప్రేమెంత ప్రాచీనమైనదైనా..!!

 

 658. పునర్జన్మ ఎత్తుతోంది నా హృదయం..!

నీ ఊసులు ప్రేమగా హత్తుకున్నాక..!!

 

 659. నిశ్శబ్దం నవ్వుకుంది..!

మత్తువీడని తలపులేవో పులకింతలబాణీలను కూర్చుకుంటుంటే..!!

 

660. మధుర జ్ఞాపకాలేవో మనసును తాకుతున్నాయి..!

అలుపులేని ఆనందాలేవో అంబరాన్ని చేర్చుతుంటే..!!

 

661. బిడియాల్ని పూర్తిగా వదిలేసింది నామనసు..!

నువ్వెంతగా గాయపరుస్తున్నా నిన్నే స్మరిస్తూ..!!

 

662. నీ చరణాల శ్రుతులనే వింటున్నా..!

చిరుగాలి సవ్వడిలో సైతం పరవశంతో..!!

 

663. అక్షరాలు సైతం అలంకారంగానే మిగిలాయి..!

నా బాధలను పంచుకోలేని అసహాయతతో..!!

 

 664. తెల్లారగానే ముసుగు తన్నేస్తున్నాయి..!

రాత్రంతా దాడిచేసిన కలలన్నీ..!!

 

665.  జేబురుమాలుకే తెలుసు నాన్న కన్నీటి రహస్యం..!

హత్తుకుందిగా ఆర్తిగా తనహృదయాన్ని నా అప్పగింతలప్పుడు..!!

 

666. ఒక పిచ్చి కల..!

అర్ధరాత్రి కాదు, పట్టపగలే ఆడపిల్లలకు స్వాతంత్య్రం వచ్చినట్లు..!!

 

667. ఎడబాటు కుంపటిని రాజేసిపోయావుగా..!

తగలబడిపోతున్నాయి మదిలోని జ్ఞాపకాలన్నీ..!!

 

668. చమటబిందువులే రూకలట..!

పసిడి పంటలకై రైతన్నకున్నపెట్టుబడిగా..!!

 

669. కలవరపెడుతున్న నేటి ఆశలతో..!

కనుమరుగైపోతున్నాయి నిన్నటి కలలన్నీ..!!

 

670. కాలపు లోలకం ఊగిసలాడుతోంది..!

జీవన్మరణాల లెక్కలను హెచ్చ(రి)వేస్తూ..!!

 

671. చెప్పాలనే ఉంది..!

నేనంటే నాకెంతో ఇష్టమని, నువ్వంటే మాత్రం ప్రాణమని.!!

 

672. కళ్ళేమో కలలు కనే రహస్యాన్ని కనిపెట్టేసాయి..!

హృదయం పరుగులు తీస్తోంది ఆనందపుటంచులను తాకడానికై..!!

 

673. తోడుకుంటూనే ఉన్నా..!

కన్నీటి జ్ఞాపకాలెన్నిటినో మౌనప్రవాహాల నుండి..!!

 

674. వేకువరేఖల సంతకంతో..!

పులకిస్తోంది పుడమిపచ్చదనం..!!

 

675. కలలు కనడం మానవెందుకనో..!

కన్నుల్లో కన్నీటివరదలు పారుతున్నా..!!

 

676. నీ నవ్వుల చందనపు చల్లదనాలకేమో..!

మండుటెండ సైతం వెన్నెలై విరబూస్తోంది..!!

 

677. మెరుపు కలలెన్నో..!

వలపు మబ్బుల మాటున మెరిసిపోతూ..!!

 

678. ప్రేమించాగా ప్రాణపదంగా..!

అభినయిస్తావే కలలో సైతం అపరిచితుడిలా..!!

 

679. మదికింత ఎదురుచూపులుదేనికో..!

వెలివేసావన్న జాడనే మరిచి, సిగ్గును సైతంవిడిచి..!!

 

680. నెలవంకకు ఎన్నిగిలిగింతలో..!

నీలాంబరి నడుమును హత్తుకుంటూ..!!

 

681. బాపూజీ మళ్ళీ జన్మిస్తే..!

భంగపాటు తప్పదేమో మనం అనుసరిస్తున్న(అ)హింసామార్గాన్నిచూసి..!!

 

682. వడబోస్తూనే ఉన్నా కాలాన్ని..!

నిను కోల్పోయిన క్షణాలకై..!!

 

683. కష్టమౌతోంది మనస్సును మరల్చుకోవడం..!

మత్తులోముంచే నీమాటల బారినుండి..!!

 

684. అప్రమత్తమౌతూనే ఉంటాయి..!

కొంగును పరుచుకుని మరీ అశ్రుబిందువులు..!!

 

685. నన్ను నేనే మరచిపోతున్నా..!

అనుక్షణం జీవితంలో నటిస్తూ..!!

 

686. ఏరుకుంటూనే ఉన్నా..!

జ్ఞాపకాల దారుల్లో చేజారిపోయిన మధురక్షణాలన్నింటినీ..!!

 

687. లెక్క పెట్టుకోనేలేదు..!

ఎన్నిసార్లు మరణించానో నిను ప్రేమించాకా..!!

 

688. నీ పిలుపుకేనేమో..!

కరిగిపోతోంది శిలగా మారిన హృదయం..!!

 

689. రెప్పలకుంచెతో చిత్రిస్తున్నా నీ చెక్కిలిపై..!

మదిదర్పణంలో చిక్కుకున్న నా మనోహరాన్ని..!!

 

690. సంధ్య ఎరుపై జారిపోతున్నాయి..!

చెక్కిలిపై సిగ్గుల మెరుపులన్నీ..!!

 

691. నీ నవ్వుల వానలే..!

మదిలోగిలిలో కురిసి మురుస్తూ..!!

 

692. వసంతాలలో మునిగితేలుతున్నాయి..!

మధుమాసపు సుధలను గ్రోలుతూ అల్లరితూనీగలు..!!

 

693. నాచెవికి మధుర సంగీతాలే ..!

బుజ్జగించే నీ అనునయాలు..!!

 

694. ఆరు ఋతువులలోను కోయిలనే అవుతున్నా..!

నీకోసం మనసు పాడే మధురగీతాలతో..!!

 

695. పట్టేది మౌనాక్షరీ వ్రతమే ..!

నీవు లేని క్షణాలలో..!!

 

696. పుడమి చీరకి  అద్దకాలు..!

శశిరపు రంగురంగుల పత్రాలు..!!

 

697. అక్షరాల తివాసీ పరుస్తున్నా..!

నీ ప(పా)ద'ముద్రలను భద్రపరచుకుందామనే ..!!

 

698. పరవశినే నీవెదురుగయుంటే..!

మౌనమందాకినినై పులకిస్తూ..!!

 

699. సిగ్గులసిగ మాటున ఒదిగిపోతూ..!

నీవు ముడిచిన మల్లెలమాలలు..!!

 

700. ఆశాకెరటాలకెంత తొందరో..!

నీ మదితీరాన్ని తుళ్ళింతలతో తాకాలని..!!

 

701. నన్ను నేనే మరచిపోతున్నా..!

నీ స్వప్నాల డోలికలనూగుతూ..!!

 

702. గుండెదారులన్నిటిలో బీటలు..!

నీ జ్ఞాపకాలు భూకంపాల్లా కుదిపేస్తుంటే..!!

 

703. దిగులు పక్కేసింది మది..!

హృదిని వీడిపోతున్న నీకై బెంగగా బేలగా రోదిస్తూ..!!

 

704. కోయిలవై వస్తావా..!

వసంత గీతికనాలపిస్తూ నా మనోవనానికి..!!

 

705. భానుడికిదేమి సరసమో..!

సిగ్గులసింధూరాలే పూయిస్తాడు సంధ్యాసుందరి బుగ్గలనుగిల్లిపోతూ..!!

 

706. తరువుల సిగల్లో హరితాన్ని తురిమేస్తూ..!

రంగేళీ వినోదమే వనరేడుకి మధుమాసమంతా..!!

 

707. అభిసారికయింది వసంతసఖి..!

చైత్రసఖుని రాకకై వేయి కనులతో..!!

 

708. మాయమవుతోంది మా మనసుల్లో..!

మా'నవతను నింపే మంచితనం..!!

 

709. పరవశిస్తోంది అవని జవ్వని..!

పరిమళ సుమరాగాల గారాలతో..!!

 

710. కనుసైగలతో కవ్వించకలా..!

నీలిమబ్బుజాడకే నర్తనమాడే, మయూరమైతోంది మది..!!

 

711. మమతల దీపాలనే వెలిగిస్తున్నా..!

కనుప్రమిదలలో ప్రేమచమురునే పోసుకుంటూ..!! 

 

712. నిశబ్దపు రాజ్యంలో యామినినై నేను..!

మౌనపు దర్బారులో మూగమౌనివై నీవు..!!

 

713. కన్నీటి దీపాలను వెలిగిస్తున్నా..!

మదిగూటిలోని చీకట్లను తొలిగించుకుందామనే..!!

 

714. చెరపతరం కానిదే ..!

జీవితకాన్వాసుపై గీసుకున్న పసితనపు బొమ్మ..!!

 

715. కవిత్వమే జీవితమైపోతోంది..!

బ్రతుకుబొమ్మను వర్ణిస్తూ..!!

 

716. అలమటిస్తూనే ఉన్నా నీకోసం..!

నిశబ్దపు వీధిలో ఒంటరిమలుపునై..!!

 

717. లాలనగా నువ్వనునయిస్తుంటే..!

ఒ(రి)దిగిపోవాలనే ఉంది ఎద పానుపుపై..!

 

718. పరిధుల్లేని ప్రేమే మనది..!

గీతమై నీవు, గానమై నేను కలసి ఏకమౌతూ..!!

 

719. తారలమ్మదెపుడూ ఒకటేతీరు..!

చందరయ్యనే రూపాన్ని మార్చేదెపుడూ... పెరుగితరుగతూ..!!

 

720. కన్నీటి చెలమలతోనే స్నేహం..!

నమ్మిన ప్రేమ నీరుగారిపోతుంటే..!!

 

721. వి(ని)ర(హి)చిస్తూనే ఉంటాను..!

మదిలో మెదిలే అలజడుల ఘోషలను..!!

 

722. భావాక్షరాల దీపికలే వేదికలట..!

ముందు ముద్దుమురిపాలకాపైన కోపతాపాలకు..!!

 

723. నాలోని నీకై ఆరావెదికే వారికోసమే..!

పదే పదే తెరుస్తూనేయున్నా హృదయగవాక్షాన్ని..!

 

724. సిగ్గుల వాకిట్లోనే వేచియున్నా..!

కొన(కను)గోటి కొంటెతనంతో మదినిమీటుతావనే..!!

 

725. కోకిలమ్మ బడిలోనే నేర్చుకుంటున్నా..!

నీకు స్వరార్చనలు చేద్దామనే ... క్రొత్త క్రొత్త బాణీలెన్నో..!!

 

726. ప్రేమ తలుపులను తెరిచేసాను..!

సాదరంగా నీకాహ్వానం పలకాలనే..!!

 

727. బ్రతుకు పుటలను తిరగేస్తూనే ఉన్నా..!

మనోగతంలోనికి నెట్టేసిన క్షణాలను గుర్తుచేసుకుంటూ..!!

 

728. తడుముకుంటూనే ఉన్నాను..!

నువ్వొదిలేసి వెళ్ళిన ఆఖరి ఘడియలను..!!

 

729. విరామచిహ్నం  పెడుతోంది నిద్ర..!

తలపుల కవనాలకు కునుకుతీస్తూ..!!

 

730. పెదవులకెన్ని కెంపులో..!

నీ ఊసులే సిగ్గులై పలుకరిస్తుంటే..!!

 

731. వలువలను అలవోకగా జార్చుతుంది నిశి..!

శశి అందాలను నిండుగా చూపడానికై ..!!

 

732. గుండె బరువెక్కిపోతోంది..!

మింగుడుపడని దుఃఖం గొంతుకు అడ్డుపడిపోతుంటే..!!

 

733. చిన్నమాట చాలుగా..!

గాయపరచడానికైనా...అనునయించడానికైనా..!!

 

734. నిరీక్షణాసేతువు నిర్మిస్తున్నా..!   

విరహసముద్రాన్ని దాటాలనే..!!

 

735. సుమకన్నెలకెంత విరహమో..!

తుమ్మెదల చుంబనాల రుచి మరిగి..!!

 

736. ఎదురుచూస్తూనే ఉన్నా..!

విరహపు చివరి అంచువరకూ నువ్వొస్తావనే..!!

 

737. మీనలోచననే ..!

విరహప్రవాహనికి ఎదురీదుతూ..!!

 

738. విరహపు మబ్బులెన్నో..!

ఏకాంతనిశీధిలో నిరీక్షణల జల్లులను కురిపిస్తూ..!!

 

739. ఎండిపోతోంది విరహపు ఏరు..!

ఏకాంతపు క్షణాలు తడారిపోతుంటే..!!

 

740. విరహపు తరంగాలు..!

కన్నీటి సంద్రంలో దుఃఖాశ్రువులై ఎగసిపడుతూ..!!

 

741. ఎదురుచూపుల క్షణాలు..!

విరహపు ఎడారిలో వాలే మరీచికలే..!!

 

742. వర్షిస్తూనే ఉన్నాయి..!

విరహపు అంచుల చుట్టూ ఎదురుచూపులు..!!

 

743. నిరీక్షణల జల్లులు..!

విరహపు చూరుల నుండి జారుతూ..!!

 

744. మనసు ముత్యాల దీవని మురవటం దేనికి..!

ఆనక మడుగులో ముంచారని వగచటం దేనికి..!!

 

745. విరహపు వానలో తడిచిపోతున్నా..!

ఏకాంతపు సరిగమలేవో మీటుతుంటే..!!

 

746. రగులుతూనే ఉన్నా..!

విరహపు చితిపై ఊపిరివై వస్తావనే..!!

 

747. విరహపు నది ప్రవహిస్తోంది..!

నిరీక్షణల అలలతో ఎగసెగసిపడుతూ..!!

 

748. ఎఱ్ఱ కలువలౌతున్నాయి కనులు..!

విరహపు తటాకంలో సుమిస్తూ..!!

 

749. నిరీక్షణల క్షణాలెన్నో..!

విరహశిశిరంలోనే రాలిపోతూ...!!

 

750. వసంతాన్ని మీటుతోంది..!

స్వరపేటిక వీణియపై కొమ్మగూటిలోని ఎలకోయిల..!!

 

751. ప్రేమలోనో, క్షమలోనో..!

నన్నూ నిన్నూ కలిపేవే స్వప్నాలు..!!

 

752. మనోద్వారం తెరిచాను..!

నీ(నా) అంతర్గత సంభాషణలు వినిపించాలనే..!!

 

753. మనిషిగా నటించడం నేర్చుకుంటున్నా..!

మానవత్వపు తెరలను కప్పుకుంటూ..!!

 

754. పదాల సీతాకోకకలు..!

సాహితీవనంలో విహరిస్తూ..!!

 

755. ధరణి మదిలో పులకింతలు..!

అల్లరి చినుకుల చుంబనాలకే..!!

 

756. కలం కన్నీటి పర్యంతమౌతోంది..!

అక్షరాల అస్త్రసన్యాసం చేశాననే..!!

 

757. వెన్నెల జలపాతాలే..!

కరుణను కురిపించే అక్షరాల అనునయాలు..!!

 

758. ఆర్తిగా హత్తుకుంటూనే ఉన్నా..!

ఏళ్ళతరబడి చేజార్చుకున్న క్షణాలను..!!

 

759. మమతలమడతలను విప్పుకుంటోంది..!

ప్రవాసపు వనవాసానికి వచ్చిన మదిడైరీ..!!

 

760. దూరాల భారాలే..!

ఆత్మీయస్పర్శలను కాజేస్తూ..!!

 

761. తేటికి తీయని పట్టు చిక్కేది..!

సుమకాంతల అధరపు మధువుల మీదనే..!!

 

762. మదిమడి నాటుకుంటోంది..!

మౌనంలో అంకురించే మధురమైన నాదాలని..!!

 

763. మనసు పొరల్ని త్రవ్వుకుంటున్నా..!

గతకాలపు స్మృతులను వెలికితీయాలనే..!!

 

764. విషాదం కునుకుతీస్తుందిగా..!

అందుకే మదికి సమాధిని కట్టేసాను..!!

 

765. దృశ్యమై  గోచరిస్తోంది బాల్యచిత్రం..! 

అదృశ్యమైపోయిన పసితనాన్ని వెక్కిరిస్తూ..!!

 

766. ఎన్నిసార్లు గీసుకున్నానో..!

నిన్ను నింపుకున్న ఏకాంత చిత్రాన్ని..!!

 

767. మెరిసిపోతోంది..!

పెదవంచున వ్రేలాడుతున్న నవ్వుల నెలవంక..!!

 

768. ఏమి గొడవపడిందో ఏమో..!

వెలివేస్తోంది వెన్నెలరేడుని తన తలపే కిట్టదంటూ నిశీధికాంత..!!

 

769. వెంటాడుతూ వేధిస్తూనే ఉంది..!

రాత్రిలో రాలిపడ్డ దుస్స్వప్నం..!!

 

770. శ్వాసనే బంధిస్తున్నా..!

జాడతెలియని నీ కలల వేటలో..!!

 

771. నా ఊపిరిని ఒడిసి పట్టుకుంటున్నా..!

నీ మది నాలోనే శ్వాసించేలా..!!

 

772. నీ శ్వాసే సవ్వడి చేస్తోంది..!

నా చిట్టి గుండెలో లయబద్దమౌతూ..!!

 

773. మనసు పొరల్ని త్రవ్వుకుంటున్నా..!

జ్ఞాపకాల నిక్షేపాలను దాచుకునేందుకై..!

 

774. పలుకులకెంత సౌరభం..!

పూలకంటిన పరిమళంలా..!! 

 

775. తొలి ప్రేమలో..!

ఎన్నెన్ని తీయందనాలో ..!!

 

776. ఆకళింపు చేసుకున్నా..!

అలుపెరుగని బ్రతుకులోని ఆరాటాలను, పోరాటాలను..!!

 

777. ఈదుతూనే ఉంటావు..!

నా కంటిముత్యానివై..!!

 

778. నీ మౌనాన్నే వింటోంది మది..!

నా ప్రేమ శ్వాసయై నిండుతుంటే..!!

 

779. విషాదాల వీణనే..!

శోకరాగాలను పలికిస్తూ..!!

 

780. చినుకులకింత సిగ్గు దేనికో..!

మబ్బుల చా(మా)టునే దాగుండిపోతూ..!!

 

781. జీవితమే ఒక చిత్రం..!

కాలపు తెరపై చావు, పుట్టుకల చక్రాన్ని తిప్పేస్తూ..!!

 

782. డబ్బుదెంత గడుసుదనమో..!

సృష్టికర్త మనిషినే కీలుబొమ్మగా మార్చేస్తూ..!!

 

783. శ్రీ మన్మధ నామ సంవత్సరం..!

యవ్వనకాలాన్ని మాత్రమే ఆదర్శంగా తీసుకుంటుందేమో..!!

 

784. తేటికి ముద్దులిస్తూనే ఉంటాయి విరులు..!

మకరందాలన్నీ దోపిడీకి గురి అవుతున్నా..!!

 

785. పెదవులపై చిగురిస్తున్నాయి..!

చిరునవ్వుల చెంగలువలు నీఊసుల నెత్తావులతో..!!

 

786. మంచి చెడుల మర్మమేమిటో..!

చేదును తీపిగా, తీపిని చేదుగా జీవితానికి పరిచయిస్తూ..!!

 

787. త్రవ్వుకోవాలని లేదు..!

మది పొరలలో పాతిపెట్టేసిన దిగుళ్ళశిలాజాలను..!!

 

788. ముత్యపుచిప్పను నేనౌతా..! 

నీ కంటిబాష్పాలను ముత్యాలుగా మారుస్తూ..!!

 

789. తీయని రాగాలాపనలనే చేస్తోంది..!

తేనెతుట్టెపై పడిందేమో వానచినుకు..!!

 

790. దేహానికి సుకుమారత్వం ఎక్కువే..!

వేదనాభారాన్నంతా హృదయంపైనే వేసేస్తూ..!!

 

791. కరిమబ్బువై వర్షించేయరాదూ..!

తెలిమబ్బువై తేలిపోయేకంటే..!!

 

792. ఎడబాటే బావుంది..!

నీ జ్ఞాపకాలను రాగాలుగా ఆలపించుకోడానికి..!!

 

793. శ్వాస భారమైపోతోంది..!

మనస్సు మౌనవించగానే..!!

 

794. అలుపెరుగని బాటసారే..!

ఆలోచనల దారుల వెంట పరుగులు తీసే మనస్సు..!!

 

795. నీ సాన్నిహిత్యం మహిమనుకుంటా..!

పరాయీకరణ నేర్చుకుంది మనస్సు..!!

 

796. గమ్మత్తైనదే మన గతం..!

స్వ’గతంలోనూ నిన్నే చూపిస్తూ..!!

 

797. గొల్లుమంటోంది వర్తమానం..!

తనొచ్చినా గత జ్ఞాపకాలను వీడడంలేదనే..!

 

798. గతానికెంత వేడుకనో..!

వేదనాతరంగాలై తాకుతూ..!!

 

799. జాలి తెలియనిదే గతం..!

మానని గాయాలను రే(లే)పుతూ..!!

 

800. మాటలకెంత కినుకో..!

నీమౌనాన్ని మదివింటుంటే..!!

 

801. మూడుముళ్ళు, ఏడడుగులు కలిపి నూరేళ్ళన్నాననే..!

ప్రైవేటుకోసమట, లెక్కలమాస్టారును వెంటేసుకొచ్చింది తింగరబుచ్చి..!!

 

802. వెక్కిరిస్తోంది నీ ప్రతిబింబం..!

మనోదర్పణాన్నివేయివక్కలను చేస్తూ..!!

 

803. ఆనందశిఖరాల్ని అధిరోహిస్తున్నా..!

ప్రేమతరంగాలేవో మదిలో ఉప్పొంగి పొరలుతూంటే..!!

 

804. మిణుగురులకెన్ని మెరుపులో..!

తారలతోనే పోటీపడుతూ..!!

 

805. రగులుతోంది గాయం..!

నా కథే నాకు ఎదురౌతుంటే..!!

 

806. కష్టాలే వద్దనుకుంటే ఎలా..!

సుఖం విలువ తెలియాలిగా..!!

 

807. కలలొలుకుతున్నాయి..!

రెప్పలపై నిప్పులు ఒంపుతూ..!!

 

808. తప్పేగా నీదీ నాదీ..!

మనం ఇద్దరమై కనిపించడం..!!

 

809. మనసు పొరల్ని త్రవ్వుకుంటున్నా..!

నిదురిస్తున్న గతాన్ని తట్టిలేపాలనే..!

 

810. స్వాగతించక తప్పదేమో..!

దశాలీల శకాన్ని…భ్రూణహత్యలను ఆపకుంటే..!!

 

811. స్వేచ్చగా తిరగొచ్చులే ఆడబిడ్డలు, కీకారణ్యంలోనైనా..!

మానవ మృగారణ్యంలో మసలటం అలవాటయ్యిందిగా..!!

 

812. పదం పరవశిస్తోంది..!

పల్లవితో పాటల తివాచీని పరవగానే..!!

 

813. కన్నీటి దరువులే మోగుతున్నాయి..!

నమ్మబలికిన నువ్వు నట్టింటముంచిపోగానే..!!

 

814. తనంతేలే..!

ఎడ్డెమంటే, తెడ్డెమంటూ..!!

 

815. ప్రాణం పల్లవిస్తోంది..!

హృదయాన్ని మీటుతూ..!!

 

816. జీవన సంగీతం..!

అపస్వరాలనే పలుకుతూ..!!

 

817. చైత్రం పల్లవిస్తోంది..!

ఋతురాగాల స్వరాలాపనలతో..!!

 

818. మది ఉల్లాసరాగమాలపిస్తోంది..!

విపంచివై నువ్వు మదిని మీటగనే..!!

 

819. ఎన్ని సరాగాలో..!

సంగీతమెరుగని ఋతురాగాల తీయని స్వరాలాపనలో..!!

 

820. హృదయానికింత వేదన దేనికనో..!

అడియాశల అంచులలో వ్రేలాడుతూ..!!

 

821. ఉత్సాహపు గాలి తెమ్మెరలు వీస్తున్నాయి..!

నీ ఊసుల నెత్తావిలను మోసుకొస్తూ..!!

 

822. అంకురిస్తున్నాయి ఆశలమొలకలు..!

నీ తలపుల చినుకులతో తడవగానే..!!

 

823. వెల్లువైపోతోంది కన్నీటి గంగ..!

మానస సరోవరంలో ఇమడలేక..!!

 

824. అనురాగాల స(ప)రాగమే..!

ప్రతి మౌనమూ ఒక రాగమైతే..!!

 

825. వేకువై వస్తావనే..!

తూరుపునై నేను వేచి ఉన్నది..!!

 

826. సంస్కారమే కదూ..!

మన భాషను మనం గౌరవించుకోవడం..!!

 

827. గాలిలోని మమతలేవో పలుకరిస్తున్నాయి..!

అచ్చంగా అమ్మ మాటలోని స్పర్శలై ఎదను తాకుతూ..!!

 

828. అలకదీరి కలిసేదే కదూ..!

అందమైన బంధం అంటే..!!

 

829. మాతృ హృదయానికి నిర్వేదమే ఎల్లపుడూ..!

పసిమొగ్గలు సైతం కామాంధులకు బలైపోతుంటే..!!

 

830. తొలగించే ప్రయత్నమే చేస్తున్నా..!

మదిలో ముద్రపడిన నీగుర్తులజాడలను..!!

 

831. కంటి నుండి జారిపోతున్నాయి..!

కలలన్నీ కన్నీళ్ళుగా కరిగిపోతూ..!!

 

832. సంధిస్తూనే ఉంటావు..!

దరహాసపు బాణాలెన్నో కనుచూపులతోనే వలవిసిరేస్తూ..!!

 

833. మనసు పొరల్ని త్రవ్వుకుంటున్నా..!

రుధిరప్రవాహాలకు ఆనకట్ట వేయాలనే..!!

 

834. రాత్రంతా ఒకటే కల..!

పగటి కలలన్నీ నిజమైపోతున్నట్లు..!!

 

835. ప్రతి రాత్రి పండుగే..!

నువ్వు కలలలో కొలువైయుంటే..!!

 

836. తీర్చుకోలేనేమో అమ్మ ఋణాన్ని..!

అమ్మనై  మరుజన్మలో అమ్మనెత్తుకునేవరకు..!!

 

837. నిర్దయగా నను కాటేస్తూంది..!

నువ్వీడిన ప్రతిక్షణం కాలనాగైవెంటాడుతూ..!!

 

838. కదిలిస్తూనే ఉంటుంది కన్నీటిని..!

నువ్వు రావని తెలిసిన కాలంలోని ప్రతీ ఘడియా వెక్కిరిస్తూ..!!

 

839. మాటలపై పరచుకున్న మౌనమెంత సుకుమారమో..!

చూపులపై అల్లుకున్న సిగ్గులు పరవశులౌతుంటే..!!

 

840. ఒక మౌనం నీ శ్వాసతో ఊపిరై జతకలుపుతుంటే..!

నీ స్పర్శతో గిలిగింతలనే  కలిగిస్తోంది ఒక ఊహాపవనం..!!

 

841. మాటలను మరచిన మౌనమే..!

మనస్సును మూగనుచేస్తోంది నీ స్నేహ మధురిమలకు మురిసిపోతూ..!!

 

842. నిశ్శబ్దాన్ని నిత్యం సాధన చేస్తున్నా..! 

నీ మౌనంలోని భాషకు అర్ధంవెదకాలనే ..!!

 

843. మౌనం అర్ధాంగీ'కారమే..!

ఏడడుగుల బంధమై నీతో నడవాలనే..!!

 

844. ఆరిపోతోంది ప్రాణదీపిక..!

నీ ఎడబాటు గాలులకు చిక్కుకుని..!!

 

845. ఆలకించవెందుకనో..!

మౌనంగానే నా మదియాలపించే మైత్రీగీతాన్ని..!!

 

846. గడ్డమొస్తే అడ్డమేనంట..!

లాలపోసి జోలపాడిన అమ్మ, చేయిపట్టి నడిపించిన నాన్న..!!

 

847. తీపి కలల చిలిపి తుమ్మెదలెన్నో..!

నీ పలుకుల కొమ్మపై వాలిపోతూ..!!

 

848. ప్రతినిత్యం ప్రభవిస్తూనేవుంటా..!

నిద్దురపోని జ్ఞాపకాలతో, మరణంలేని మనస్సుతో..!!

 

849. గగనం నొసటి  సింధూరం..!

సూరీడద్దిన సోయగాల సింగారమే..!!

 

850. ఆమనిలో వసంతుడు పంపిన కానుకలే..!

తరుకన్నెలు కట్టిన వర్ణచిత్రాల కొత్తకోకలన్నీ..!!

 

851. గురువంటే లెక్కలేనితనమిపుడు..!

తల్లిదండ్రులతో సమానమొకప్పుడు..!!

 

852. ఆ ఒక్కటీ అడక్కు..!

నా దగ్గరుంటేగా నీకివ్వడానికి..!!

 

853. నీ పదఝురులెన్నో..!

హృదయకమల మకరందాలలో..!!

 

854. నేనడిగానా? ఇంత హైరానా దేనికి..!

రోజుకో వింత(క్రొత్త) కథను వినిపించడానికి..!!

 

 855. ఒక కమ్మని కల..!

మన ప్రణయం పరిణయమైనట్లు..!!

 

856. మండిపడుతోంది మది..!

తీయనికలపై పగబట్టి తట్టిలేపే గడియారంపై..!!

 

857. హృదయం ద్రవిస్తోంది..!

బాల్యసీమలో విహరిస్తున్న స్వప్నం చెదిరిపోగానే..!!

 

858. మనసు పొరల్ని త్రవ్వుకుంటున్నా..!

మౌనభాష్యాల అంతు తేల్చాలనే..!!

 

859. నీ స్మృతుల ఆణిముత్యాలెన్నో..!

మది జలనిధిలోనే నిక్షిప్తమైపోతూ..!! 

 

860. మూగబోతోంది ఆమనిరాగం..!

పచ్చాదనాలకు వేటుపడుతుంటే..!!

 

861. జారిపడుతున్నాయి నీ తలపులపూలు..!

మనోధాత్రిపై సువాసనలతో పరిమళిస్తూ..!!

 

862. అద్భుత కావ్యమే..!

నీ మౌనాల ముచ్చట్లు ముద్రిస్తే..!!

 

863. ఎగసిపడే  జ్ఞాపకాల అలలు..!

మనోతీరంలో సజీవ శిలాజాలే..!!

 

864. మనోగగనంలో మెరుపులన్నీ..!

మిలమిల మెరిసే నీ తలపులే..!!

 

865. నీ స్మృతుల శృతులెన్నో..!

స్వప్నాలకే రాగాలు నేర్పిస్తూ..!!

 

866. గుండెను చీల్చేస్తుంటే మెరుపుశరాలు..!

బాష్పజలధారలై కరుగుగుతున్నాయి కరిమబ్బులు..!!

 

867. ముసి ముసి నవ్వుల ముసురులలో జలకమాడుతున్నా..!

ఎద వెన్నెల్లో మదిమౌనాలనే కూనిరాగాలుగా తీస్తూ ..!!

 

868. ఊహల జంపాలలే మదికి హరివిల్లు ఊయలపై..!

నీ మౌనాల వెన్నెలలేవో వన్నెలుగా సృశిస్తుంటే..!!

 

869. ఎక్కడ నేర్చావో ఇంత చాకచక్యంగా..!

హృదయాన్ని ఛిద్రంచేస్తున్న జాడనైనా తెలియనీయకుండా..!!

 

870. ఆత్మీయ నేస్తమే కన్నీరు..!

మనస్సు భారాన్ని తగ్గిస్తూ..!!

 

871. నీ స్వర'సంగీతం..!

నా అంతరంగపు తరంగధ్వనులను మీటుతూ..!!

 

872. విహరించే కలలెన్నో..!

పొత్తుకుదిరిన కొత్తజంటలా..!!

 

873. ఏరుకుంటున్నా పగిలిన మనసుముక్కలని..!

మళ్ళీ అతికించుకుందామనే వ్యర్ధప్రయత్నంతో..!!

 

874. నీవొదిలే వెన్నెలశరాలెన్నో..!

మనోగగనంతో ఊసులాడుతూ..!!

 

875. నవ్వుల చిలకరింతలతోనే సరిపెట్టేస్తావు..!

కులుకుల చిద్విలాసం కావాలనడిగితే..!!

 

876. హిమనగాలై జారిపోతున్నాయి మదిలోకి..!

మలయమారుతంలా స్పృశించే నీయూసులు..!!

 

877. నీ ఊసులరాగాలు..!

నవనాడులను శృతిచేస్తూ..!!

 

878. అమ్మ ప్రేమ ఎపుడూ అక్షయమే..!

చీకటికి చంద్రబింబంలా…ఆకలికి పూర్ణకుంభంలా..!!

 

879. తొలకరి పిలుపులతో మైమరచిపోతూ..!

ఆకుపచ్చకోకను ఆరేసుకుంటోంది నేలమ్మ..!!

 

880. గురితో పనేమి ఉందిలే..!

మాటల శరాలను ఎక్కుపెట్టేవారికి..!!

 

881. పెదవంచుకి నవ్వుల రంగేస్తున్నా..!

గుండెల్లో సుడిగుండాలే మెలిపెడుతున్నా..!!

 

882. మనసు పొరల్ని త్రవ్వుకుంటున్నా..!

అంతరాత్మ ఆంతర్యాన్ని కొలుద్దామనే..!!

 

883. చిత్తం చలిస్తోంది..!

నీ జ్ఞాపకాలచిత్తరువులేవో చిత్రంగా గిలిగింతలెడుతుంటే..!!

 

884. జపతపాలు దేనికో..!

మది దేవళంలో ఉన్నది నేనంటూ..!!

 

885. కమ్మని కవితలల్లేస్తున్నా..!

నీ తీయని కలల ఊసులతో..!!

 

886. ఆకలిపైనే అలిగింది అమ్మ..!

అన్నం వద్దన్నానన్న బాధతో..!!  

 

887. అవని సిగ్గుల మొగ్గైపోతోంది..!

గగనపు తొలకరి తలంబ్రాలకి..!! 

 

888. హృదయాన్ని గిలిగింతలెడుతున్నాయి..!

సూటిగా దిగిపోయే నీ చూపులశరాలు..!!

 

889. ప్రేమలేఖ వ్రాస్తున్నానని పసిగట్టేసాయేమో ..!

అక్షరాలన్నీ చిరునవ్వులు ఒలికించేస్తున్నాయి..!!

 

890. నీ రూపంలోనున్న నాప్రాణం..!

ఊహించనేలేదు నన్ను వదిలిపోతుందని..!!

 

891. మనస్సు నిలదీస్తోంది..!

నీ జ్ఞాపకాలతో ఒంటరిగా చేజిక్కేసరికి..!!

 

892. కనికరం చూపిస్తోంది కరిగిపోతూ కాలం..!

ననువిడిచి దూరతీరాలకు వెళ్ళిపోయావనే జాలితో..!!

 

893. కాలపు ఔషధాన్ని సేవిస్తూనే ఉన్నా..!

గాయపడిన గుండెకు సాంత్వన చేకూర్చడానికై..!!

 

894. ప్రతిబింభిస్తూనే ఉంటాయి..!

కనురెప్పల అద్దాలపై నీ మెరుపులకలలు..!!

 

895. పెద్ద చిక్కే వచ్చిపడింది సుమా..!

గోరంతలను కొండంతలుగా చూపించే ఆలోచనలతో..!!

 

896. మోసపోతూనే ఉన్నా..!

పసితనంలో చందమామను చూసి…పెద్దయ్యాక కలలను మోసి..!!

 

897. హృదయాకాశంలో కుంభవృష్టి..!

ప్రేమించిన నిన్ను నేను కోల్పోతుంటే..!!

 

898. భావరాగాలు మౌనం పాటిస్తున్నాయి..!

మదివీణియ తంత్రులన్నీ తెగిపోగానే..!!

 

899. చులకనయ్యానుగా..!

లేడీస్ ఫస్టన్నారని తొందరపడి మనసిచ్చి..!!

 

900. నా ప్రేమ గెలిచినట్లే..!

అనుక్షణం నీతలపుల్లోనే తారసపడుతూ..!!

 

901. పద మంజీరాలెన్నో..!

సాహితీవేదికపై అక్షర నాయికలై నర్తిస్తూ..!!

 

 902. దిద్దుకుంటున్నా..!

తారలనే అక్షరాలుగా గగనపు పలకపై..!!

 

903.  జీతభత్యాలెరుగని గూర్ఖాలే..!

పగటేల సూరీడు, రాతిరేల చందురూడు లోకాన్ని కావలికాస్తూ..!!

 

904. వేసేసావుగా..!

హృదయానికి నీజ్ఞాపకాల జరిమానాలెన్నో..!!

 

905. అమ్మనే అంటారే త్యాగమూర్తియని..!

భవిష్యనిధిని సైతం మనకోసమే ఖర్చుపెడుతుంటే నాన్న బాధ్యతగా..!!(ప్రావిడెంట్ ఫండ్ - భవిష్య నిధి)

 

906. ప్రతి నిట్టూర్పులోనూ నీవే..!

నిశీధి దర్పణంలో చూపిస్తూ..!!

 

907. ఎదను మీటుతున్నాయి..! 

నీపలుకుల ప్రత్యూషపవనాలు..!!

 

908. గుడి గంటల లయలెన్నో..!

నీ హసపు హొయలలో..!!

 

909. సంతోషపు ముసుగును తొడుక్కుంటున్నా..!

నవ్వులమాటున వేదనలను దాచుకుంటూ..!!

 

910. సంధ్యా భానుడవే..!

తూరుపమ్మనుదుటన కుంకుమ వర్ణాన్ని మీటుతూ..!!

 

911. దృతరాష్ట్రకౌగిలే..!

నన్ను హత్తుకుపోయే వేదనలది..!!

 

912. కలలేమి మిగిలాయని..!

సాకారం చేసుకోడానికి..!!

 

913. చుక్కలతో చెలిమి అడిగావనుకున్నా..!

నీ జ్ఞాపకాలతోనే నెయ్యమందుతాననుకోలేదు..!!

 

914. గుండెల నిండుగా నవ్వరాదూ..!

మనిషితనపు మానవత్వాన్నినింపుకుంటూ..!!

 

915. మౌనాలై మిగిలిపోతున్నాయి..!

ఓడిపోతూ మాటలన్నీ..!!

 

916. తెరిచిన పుస్తకమే నా జీవితం..!

ప్రతిపేజీలోనూ నీ ప్రేమాక్షరాలనే ముద్రించుకుంటూ..!!

 

917. కాలపు ఔషధం..!

నీ జ్ఞాపకాల గాయాలనెన్నో మాన్పిస్తూ..!!

 

918. కనురెప్పలంచున రాలిపోయే కన్నీటి బిందువులే..!

మదిసంద్రంలో పొంగిపొరలే వేదనల వరదలన్నీ..!!

 

919. గడచిపోతూంది కాలం..!

రోజుకోగాయాన్ని మిగుల్చుతూ..!!

 

920. కల్లోలమైపోతున్నాయి కలలన్నీ..!

కన్నీటికళ్ళతో కంటున్నందుకేమో..!!

 

921. కలలొలుకుతున్నాయి..!

అమాసని పున్నమిగా మార్చేస్తూ..!!

 

922. నీ కన్నులతో చూస్తున్నందుకేమో..!

క్రొత్తగా పరిచయమౌతోంది స్వప్నలోకం..!!

 

923. పోల్చుకోలేకపోతున్నా..!

ఎన్ని జన్మలైనా నాలోని నిన్నెదుకుతూ..!!

 

924. రాధమ్మ సొత్తే..!

కన్నయ్య అధరామృతం..!!

 

925. అధరపు వేదికపై నర్తిస్తూ..!

నవ్వుల మువ్వల రవళులు..!!

 

926. నీ కొంటె చూపుల అల్లరులకేమో..!

అధరాలపై తాంబూలమై పండే సిగ్గులెన్నో..!!

 

927. ప్రాణం నను వీడిపోవచ్చు..!

జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి నేను సమాధి చేరేవరకు..!!

 

928. గ్రీష్మానికి ఇంత పరిహాసం దేనికో..!

వసంతానికై ఎదురుచూసే నను వెక్కిరిస్తూ..!!

 

929. . దాడిచేస్తూనే ఉంటాయి నీ ఆలోచనలు..!

నన్ను ఒంటరిగా విడిచెళ్ళిన ప్రతిసారీ..!!

 

930. కలల చివురులు..!

కనురెమ్మల్లో పల్లవిస్తూ..!!

 

931. చెక్కిలి నవ్వుకుంటోంది..!

సిగ్గులను శృతిచేసుకుంటూ..!!

 

932. అమ్మ ఆదిదేవతనే ..!

అమ్మకు మాత్రం నాన్నేగా ఆరాధ్యదైవం..!!

 

933. ప్రేమ ఖైదీనే ..!

నీ జ్ఞాపకాలతో తన్మయత్వపు శిక్షననుభవిస్తూ..!!

 

934. అలా మొదలయ్యింది..!

ఒక చూపుతో మూడు మాటలతో..!!

 

935. కంటిలిపితోనే లిఖిస్తున్నా..!

సువర్ణలేఖలెన్నో ఊహలకాగితాలపైనే..!!

 

936. మడత పెట్టేసా మనస్సును..!

విప్పినా నీవు చూడట్లేదని..!!

 

937. అంతరంగానికి మరణమే..! 

వేదనల పరుగు పందెంలో అలసిపోయి..!!

 

938. నీ నవ్వుల వర్ణాలే..!

మనోపుస్తకంలో ప్రతిపేజీని అద్దుకుంటూ..!!

 

939. మనసు తెరను తీస్తున్నా..!

మొహమాటపు పొరను తొలగిస్తూ..!!

 

940. బంధిస్తూనే ఉన్నా..!

నా కలలన్నిటిని కనురెప్పల జైలులో..!!

 

941. కనుపాపల దుప్పటినే పరిచా..!

తీయని కలలను ఆహ్వానిస్తూ..!!

 

942. పొంగిపోయే స్మృతులెన్నో..!

కంటికొలనులో ప్రవాహాలైపోతూ..!!

 

943. కనుపాపలకు ఎన్ని సిగ్గులో..!

నీ కలలను హత్తుకుంటుంటే..!!

 

944. సత్యమేదో, స్వప్నమేదో తెలియకుంది..!

నీ మాటల మహేంద్రజాలంలో..!!

 

945. ఒరిగిపోయే దేహాలెన్నో మట్టింట..!

జారిపోతూ కన్నీటికధలుగా ప్రతికంట..!!

 

 946. తారలతో సరసాలతో తీరికలేక నెలరేడు..!

వినువీధిలో ఏకాకిగా తిరుగుతూ వెన్నెలమ్మ..!!

 

947. ఎదకన్నుల్లో తారాడే తీయని స్వప్నం..!

తలపుల దుప్పటిలో మత్తుగా జోగుతూ..!!

 

948. తడబడిపోతున్నాయి ఊహలు..!

తొలిసారి నీ వలపులను తాకబోతూ..!!

 

949. ప్రేమ తివాచీనే పరుస్తున్నా..!

నువ్వు నడిచొచ్చే దారంతా..!!

 

950. హృదయాన్ని కావలిగా పెట్టివచ్చా..!

నీ పదసవ్వడిని పసిగట్టమని..!!

 

951. గతం గుర్తుల జాడలెన్నో..!

నువ్వొదిలేసిన ప్రేమ మార్గంలో..!!

 

952. కీర్తిని గెలుచుకోమంటే..!

పక్కింటి "కీర్తిని" తీసుకొచ్చాడేమిటో తింగరోడు..!!

 

953. ఊహల గవాక్షాన్ని తెరిచుంచాను..! 

పొరపాటునైనా ఇటు వస్తావేమోనని..!!

 

954. స్మృతులుగా మిగిలిపోతున్నాయి..!

ఎదలోతుల్ని స్పృశించే హృదయపు చెమరింతలన్నీ..!!

 

955. ఘల్లున మోగే సి(అల్ల)రిమువ్వలే..!

మనోవేదికపై గారాల అనురాగాలన్నీ..!!

 

956. సిగ్గుల కెంజాయలెన్నో..!

భానుని కౌగిట కరిగిపోతూ సంధ్యాసుందరికి..!!

 

957. ఇద్దరి ప్రాణం ముడిపడిపోయింది..!

నిరుటిజన్మ స్నేహబంధాన్నిపెనవేసుకుని..!!

 

958. ఆలపిస్తోంది ఆహ్వనగీతిక..!

సదా నిన్నే స్మరించే ఎదకోయిల..!!

 

959. కన్నీటితోనే కడుగుతున్నా..!

వదలని జ్ఞాపకాలన్నింటినీ..!!

 

960. చెలికాని చిలిపి చూపుల చినుకులెన్నో..!

చెలి నడుమొంపుల్లో మెల్లగా జారిపోతూ..!!

 

961. విషాదాల ముక్కలన్నీ మూటకట్టుకుంటున్నా..!

మదిగదిలో దాచుకున్న ప్రేమగురుతులుగా..!!

 

962. ఊహల గాలిపటం..!

కాలంకొమ్మకు చిక్కుకుంది ఆధారం దొరకక..!!

 

963. నీ మౌనం..!

లయాత్మకంగా కల్లోలపరుస్తూ..!!

 

964. జారిపోతావు ఎందుకనో..!

నాలోని నువ్వు తామరాకుపై నీటిబిందువులా..!!

 

965. నీమాటల ఫిరంగులెన్నో..!

స్వప్నసౌధాన్ని కూల్చేస్తూ..!!

 

966. తీగనై అల్లుకుపోయేది..!

నీ మమతలపందిరికే..!!

 

967. నీ పదరవళులెన్నో..!

ఎదకనుమలలో ప్రతిధ్వనిస్తూ..!!

 

968. దిగులుమబ్బు తునకలెన్నో..!

మనోగగనానికి వ్రేలాడుతూ..!!

 

969. ఎదను హత్తుకుపోయే ఊహలే..!

పూలను విడువని తావులవలే..!!

 

970. వేకువ దీపమే నీవు..!

వెన్నెలై మదిని తాకుతూ..!!

 

971. వేకువ జాడకై వెదుకుతున్నా..!

నిశీధి నీడలంచున వ్రేలాడుతూ..!!

 

972. కొంటెగా కనుగీటుతున్నాడు..!

వేకువ తెరలమాటున తొంగిచుస్తూ తుంటరిసూరీడు..!!

 

973. వరదలైపొంగే కలల వాగులెన్నో..!

కంటి చూరులనుండి జారిపోతూ..!!

 

974. సిగ్గుల ఆరంగేట్రాలే..!

అల్లరి మువ్వవై నను తాకుతుంటే..!!

 

975. జారిపోయే వెతల బిందువులే..!

కన్నీటి సింధువులై ప్రవహిస్తూ..!! 

 

976. సిగ్గుల మొగ్గైపోతోంది మనోసుమం..!

తోటమాలివై నువ్వు స్పృశిస్తుంటే..!!

 

977. ప్రియసఖుని నగవుల ఖడ్గాలు..!

హృదయ తిమిరాలను సంహరిస్తూ..!! 

 

978. భ్రమర హృదయాన్ని మీటుతూ..!

ఘల్లుమనే విరుల అందియలు..!!

 

979. కలలో సైతం ఓడిపోతూనే ఉన్నా..!

విడిపడని తలపులతో గెలవడం చేతకాక..!!

 

980. మది అరలలో సర్దేసుకున్నా..!

నీ తలపుల పుస్తకాలన్నీ..!!

 

981. నీ కథనాలెన్నో..!

"గాథాసప్తశతి"ని మరిపిస్తూ..!!

 

982. నెలవంక నావ..!

చీకటిప్రవాహంలో వెన్నెల అలలపై తేలుతూ..!!

 

983. ఒళ్ళంతా పులకల మొలకలే..!  

నీ స్మృతులపుటలను తిరగేస్తుంటే..!!

 

984. జ్ఞాపకాలు వెనక్కి లాగేస్తున్నాయి..!

కాలం ముందుకు దూసుకెడుతుంటే..!!

 

985. స్మృతులన్నీ వలసపోతున్నాయి..!

మది గదిలో ఒదిగిపోయే జాగాలేకనేమో..!!

 

986. కనుపాపలకూ కష్టమే..!

సిగ్గులభారంతో వాలిపోయే రెప్పలను మోయడం..!!

 

987. కనుకొనల జారే అశ్రుకణాలెన్నో..!

గుండెమంటలను చల్లార్చలేని అసహాయతతో..!!

 

988. మిణుకు మిణుకుమంటున్నాయి..!  

మదివాకిలిలో వెలిగే నీ జ్ఞాపకాలు..!!

 

989. మదికి విహారం ఎక్కువయ్యింది..!

నీ తలపులమార్గం సుగమమైపోతుంటే..!!

 

990. జ్ఞాపకాల గుంపులే..!

మునిమాపు సంధ్యల్లో ముసిరే మేఘాలౌతూ.!!

 

991. వల్లెవేస్తున్నా నీ ఊసులపాఠాలను..!

మదినే పాఠ్యపుస్తకంగా మలుచుకుని..!!

 

992. నింగిని విడిచిన తారకనే..!

నను మరచిన వేళలో..!!

 

993. ఒట్టేసి చెప్పెయ్యవూ..!

గడియైనా ననువీడిపోనని..!!

 

994. నను ప్రేమిస్తావా..!

నీ మనస్సును చూడాలనుంది కనులారా..!!

 

995. నీ గెలుపే కోరుకుంటాను..! 

నేనోడిపోతూ నాలోని నిను గెలిపిస్తూ..!!

 

996. శ్రావణమేఘపు జల్లుల పులకరింతలు..!

చల్లగాలి సంగీతానికి మైమరుస్తూ..!!

 

997. ఒంటరితనానికి వీడ్కోలు చెపుతున్నా..!

నీ జ్ఞాపకాలే తోడైవస్తుంటే..!!

 

998. కరిమబ్బులకి చమరింతలే..!

చిరుగాలి అల్లరిగాస్పర్శిస్తే..!!

 

999. వలసపోతున్నాయి ఆశలన్నీ..!

ఎదురు చూపులన్నీ వెక్కిరించి పోతుంటే..!!

 

1000. మాఘమాసపు పేరంటమంట..!

చల్లని వెన్నెలగంధం పూసుకున్న ధరణికి..!!

 

1001. పిల్లనగ్రోవికి ఎంత గర్వమో..!

కన్నయ్య మోవిని హత్తుకుపోతూ..!!

 

1002.  మట్టిపూలకి ఎంత పరిమళమో..!

తొలకరి ఆర్తిగా స్పర్శించగానే..!!

 

1003. రమిస్తూనే ఉంటుంది మనస్సు..!

ఆంక్షలెరుగని నీ తలపులతో..!!

 

1004. కనుపాపల్లోనే దాచేస్తున్నా..!

అల్లుకున్న తొలివలపులన్నీ..!!

 

1005. స్వాగతం పలుకుతున్నాడు మేఘుడు..!

చినుకు ముత్యాలను కిరణాలతో ముడి వేస్తూ…హరివింటికి..!!

 

1006. ప్రణయ వీచికలెన్నో..!

నీ జ్ఞాపకాలు ఆర్తిగా స్పర్శిస్తుంటే..!!

 

1007. ఎదగాయాలను రేపేస్తూ నిశీధి రాత్రులు..!

మరుపుపూతలను పూసేస్తూ నీ మేల్కొలుపులు..!!

 

1008. సీతమ్మ చరితమంతా రామాయణమే..!

నీగాధలెపుడూ నాకు పారాయణమే..!!

 

1009. మామ మందిరంలో సురభోగాలే..!

తారల విం(పొం)దులలో తేలుతూ..!!

 

1010. అరవైలో వయస్సు, ఇరవైలో మనస్సు..!

కాముడితో చెలిమి ఎక్కువైనట్లుంది పెద్దాయనకి..!!

 

1011. మనసిస్తావా మరి..!

మైసూర్ ప్యాలస్నే చదివించేస్తా కానుకగా..!!

 

1012. అల్లేస్తున్నా ఆశుకవితలెన్నో..!

క్షణమైనా విడవని నీ ఊసులతో..!!

 

1013. వెన్నెలపల్లకీలో ఊరేగుతూ వస్తా..!.

(చంద)మామవి నీవై జతకడతానంటే..!!

 

1014. ఆ'రాధనే సాగిస్తున్నా..!

నా అందాల కన్నయ్యవు నీవని..!!

 

1015. కంటిపాపనై నిత్యం నిరీక్షిస్తున్నా..!

కలల వసంతమై పరిమళిస్తావని..!!

 

1016. మనసిచ్చానుగా..!

మన్నించడం నేర్చుకోక తప్పడంలేదు..!!

 

1017. తోటమాలి ఆదరణ కరువయ్యిందనేమో..! 

వాడిపోతున్నాయి చేమంతుల హేమంతాలన్నీ..!!

 

1018. అలుసే మరి నీకు..!

గుడికట్టానుగా నాకే చోటులేని నా గుండెల్లో నీకై..!!

 

1019. కనురెప్పల అలమరలో దాచేస్తున్నా..!

నీ జ్ఞాపకాల చరిత్రలన్నీ..!!

 

1020. నేనంటే నాకు చాలా ఇష్టం..! 

నాలోని నువ్వంటే మాత్రం ప్రాణం..!!

 

1021. వ్రాస్తున్నా ఎదగొడవంతా..!

నా ప్రేమలేఖల్లోని, ప్రియమైన నీకు..!!

 

1022.  జీవించడం నేర్చుకున్నాగా..!

ఆలపిస్తున్నా స్వేఛ్ఛాగీతికలనే..!!

1023. అన్నీ ఏకాంతపు మజిలీలే..!

నాలో ప్రయాణించే నాకు..!!

 

1024. రగిలించే నిట్టూర్పుల వెతలు..!

చింతల కొలిమిలా కాలుస్తూ..!!

 

1025. అనురాగవసంతం విరబూ(పరిమళి)స్తోంది..!

అనుబంధపు కోయిలవై హాయిరాగమేదో ఆలపించగానే..!!

 

1026. కంటిభరిణలోనే దాచిపెట్టుకున్నా..!

కన్నీటి సిందూరాలన్నిటినీ..!!

 

1027. మదిలోగిలిలో చిరుసవ్వళ్ళు..!

పసిప్రాయపు అడుగులు సుతిమెత్తగా పారాడినపుడల్లా..!!

 

1028. చిట్టి గుండెకూ, చిల్లు కుండకూ..!

అవినాభావ సంబంధమేదో ఉన్నట్లే ఉంది..!!

 

1029. భావాలన్నీ బారులు తీరుతున్నాయి..!

నిన్ను వర్ణించడం మొదలెట్టగానే..!!

 

1030. భావాక్షరాలనట్టుకుని మిడిసిపడ్డానేమో..!

తెలియనేలేదింతవరకూ,  ఇంత(ఎంతో)లోతుగా వ్రాస్తేనే కవిత్వమౌతుందని..!!

 

1031. వెలేసేద్దామా వేదనల నీ(జా)డల్ని సైతం..!

సంతోషానందాల్ని పంచలేని వాటితో మనకేంపనిలే..!!

 

1032. కంటి భాషకు లిపిలేదనుకున్నానిన్నాళ్ళు..!

లిఖిస్తున్నాయిగా నీటిభాషలో చెక్కిలి పత్రాలపై..!!

 

1033. తప్పటడుగులను వేస్తూనే ఉన్నా..!

చేయూతనిచ్చేందుకు(సరిదిద్ధేందుకు) నాన్నున్నారనే ధైర్యంతోనే..!!

 

1034. తానే బరువౌతానని ఊహించలేని పిచ్చినాన్నకు..!

భారమవ్వకూడదనే తాపత్రయమెపుడూ… కొడుకు బ్రతుకుకు..!

 

1035. చదువు పూర్తయ్యిందంట..!

అడుగిడినట్లే పుస్తకాలభారం నుండి బ్రతుకుభారంలోకి..!!

 

1036. కృష్ణపక్షమంటే ముచ్చెమటలే జాబిలికి..!

ఆసాంతం మింగేస్తుందిగా దొరకపుచ్చుకుంటూ..!!

 

1037. ఒయ్యారాలన్నీ మగువలకే సొంతం..!

అణువణువూ ఒదిగొదిగిపోతూ తనువంతా ఒలికొలికిపోతూ..!!

 

1038. అక్షరవారధిని నిర్మించుకుంటున్నా..!

నిన్నూనన్నూ జతకలిపే సేతుబంధనమౌతుందనే..!!

 

1039. పదేపదే అలగకలా..!

కోపంలో నువ్వందంగా ఉన్నావన్నంత మాత్రాన..!!

 

1040. రేయంతా నీకై నిరీక్షణే..!

భక్తీ ముక్తీనెరుగని నీ కలల వింత జాగరణలతో.!!

 

1041. మట్టిగా మారాలనుంది..!

నీ కలల అంకురాలకు జన్మనిచ్చేందుకై..!!

 

1042. కన్నీటి కథలుగానో, మనోవ్యధలుగానో..!

వాడుకోక తప్పడంలేదు అవసరానికిన్ని అక్షరాలను..!!

 

1043. జ్ఞాపకాలన్నీ జారిపోతున్నాయి..!

రుధిరధారలౌతూ గుండెల్లో దింపిన నీ పలుకుతూటాల దెబ్బలకు..!!

 

1044. తుడిచి పెట్టుకుపోతోంది..!

నా చేదు గతమంతా నీ చెలిమి సమీరవీచికలతో..!!

 

1045. అజరామరమే..!

అంతరంగంలో ప్రజ్వలించే నీ జ్ఞాపకాలు..!!

 

1046. దేవుడికి కూడా చేతకాని పని..!

నవమాసాలు మోసి బిడ్డను కనడం..!!

 

1047. దేవుడికి ఎంత మిడిసిపాటో..!

నీ జ్ఞాపకాల నుండి నన్ను విడదీయడం తెలియకపోయినా..!!

 

1048. తన్మయత్వంతో నేలకాగితం..!

నింగికొమ్మనుండి జారిన చినుకులను హత్తుకుంటూ..!!

 

1049. ఆరిపోతున్నాయి అశాజ్యోతులు..!

నిరాశాతైలాల ఆవిరులతో..!!

 

1050. ఎగసి ఎగసి విసిగిపోతున్నది మదిఘోష..!

స్పందనలేని హృది సంద్రాన ఈదలేక..!!

 

1051. ఎదగిరులనుండి జారిపోతున్నాయి..!

తలపుల కులుకులతో వలపు ఝురులు..!!

 

1052. అపస్మారక స్థితిలోనూ నాన్ననే కలవరిస్తూ..!

రక్తమిచ్చి నాకు పునర్జన్మనిస్తున్నారని తెలియక..!!

 

1053. అమ్మ కనుకొలనులో సుడులై తిరుగుతూ..!

నాన్న గుండెచెమరింతలు అమ్మంత బేలకాదుగా..!!

 

1054. చిగురుల ప్రసవవేదనలెన్నో..!

ఆకులు రాల్చిన శిశిరపు కొమ్మలకు..!!

 

1055. మబ్బు కాంతలకెంత కలవరపాటో..!

పవనుని చిలిపి గోటిమీటులతో ..!!

 

1056. చూపులతోనే ముద్దాడనీ..!

కలువరేకుల పాదాలను..!!

 

1057. ఘడియలన్నీ అలిగి కూర్చున్నాయి..!

నీవియోగంలో అక్కరకు రాలేదన్నాననే..!!

 

1058. తెగ మె(ము)రుస్తోంది..!

పున్నమిరాజంపిన చుక్కలచీరను చుట్టుకుంటూ నిశీధికన్నె..!!

 

1059. హృదయగవాక్షానికి తాళమేసేసాను..!

ఏ క్షణాన కనుగప్పి పారిపోతావోయని..!!

 

1060. ఒయారమొలకబోస్తోంది వసంతం..!

కోకిలస్వరం చిలిపిరాగాలతో తనువంతా మీటగానే..!!

 

1061. మౌన(అలుక)మేఘం కరుగుతోంది..!

నీ అనునయాల మలయమారుతం తాక(సోక)గానే..!!

 

1062. వెతలన్నింటిని జల్లించుకుంటున్నా..!

సంతోషాలను మిగుల్చుకుందామనే..!!

 

1063. మృత్యుంజయులే కొందరు..!

అవయవదానంతో అజేయులౌతూ, పునర్జన్మనిచ్చి పుణ్యమూర్తులౌతూ..!!

 

1064. సిగ్గురేకులు విచ్చుకుంటోంది మనస్సు మొగ్గ..!

నీ చూపులకిరణాలు నులివెచ్చగా సృశించగానే..!!

 

1065. అవినాభావసంబంధంమేదో ఉన్నట్లుంది..!

మంకెనల మొగ్గలకి...మగువల సిగ్గులకి..!!

 

1066. స్నేహాల చేతబడులు..!

మాటల మంత్రాలతో మనస్సులను లొంగదీసుకుంటూ..!!

 

1067. కంటిపాపలకెందుకో ఆరాటాలు..!

నీకంట వెలిగే వెండి నవ్వుల దివ్వెలను చూడాలని..!!

 

1068. జంటగా పుట్టిన కన్నులే మన హృదయాలు..!

నినువిడిచి ఉండలేక నీటి మడుగులను తలపిస్తూ..!!

 

1069. నీకళ్ళల్లో వెలిగే మతాబులను చూడాలనే..!

చిరునవ్వులను చిదిమి దివ్వెలుగా వెలిగించుకుంది..!!

 

1070. నీ అంతరాత్మని అడిగిచూడు ఒక్కసారి..!

నీహృదయంలో నీకైనా చోటుందేమో నన్నుకాదని..!!

 

1071. తారల పొదరింటనే నెలరాజుకు ప్రతిరాతిరి మజిలీ..!

వెన్నెలమ్మకు తీయని జ్ఞాపకాలను మాత్రమే వదిలేసి..!!

 

1072. నే శృతి చేసిన వీణియనౌతున్నా..!

నీ స్మృతుల తీగలను మీటగానే..!!

 

1073. నిజమెపుడూ చేదే..!

అబద్ధాల తీయందనాలను మరిగిన మనుషులకు..!!

 

1074. దారి పొడవునా సుగంధాల గుభాళింపులే ...!

నీతో నడిచిన జ్ఞాపకాలపూలు కుసుమిస్తుంటే...!!

 

 1075. పున్నమి ముత్తైదువ..!

మాసానికోమారు పేరంటమాడుతూ..!!

 

1076. విరహసంద్రమౌతోంది..!

నీ కలల అలల తాకిడితో నా రేయంతా..!!

 

1077. తుళ్ళి పడే వాగును నేను..!

వలపుతలుపులు తెరిచే ఆనకట్టవు నీవు..!!

 

1078. కొత్త స్వేచ్చా విహంగాలౌతున్నాయి..! 

కోరికలేవో రెక్కలు తొడిగి సంబరంగా నింగికి పయనమౌతూ..!!

 

1079. కలువ భామకెంత మురిపెమో..!

నెలరాజు కురిపించే వెన్నెల చినుకులు తలంబ్రాలై తాకుతుంటే..!!

 

1080. అలలై ఎగసిపడాలనేమో..!

నయనపు బిందువులన్నీ జారిపోతున్నాయి శోకసంద్రంలోకి..!!

 

1081. గరికపూలకు పులుముతున్నా..!

దోసిలిపట్టిన నీ దరహాసపు పరిమళాలన్నీ..!!

 

1082. ఊహలకు ఊపిరి పోసేది నీవే..!

కలలకు మాత్రం సంకెళ్ళు వేసేస్తూ..!!

 

1083. నీ చిరునవ్వుల సందడికేనేమో..!

కిటికీలను తెరిచి ఆలకిస్తోంది నా చిట్టి గుండె..!!

 

1084. అనుభవాల పూతలను పూసుకుంటూనే ఉన్నా..!

గాయాలతో హృదయం కమిలిన ప్రతిసారీ..!!

 

1085. నీ నామాన్నే జపిస్తోంది..!

మదికెంతగా మరుపులేపనాన్ని పూసుకుంటున్నా..!!

 

1086. హృది సంద్రమైపోతోంది..!

నీ కలల అలల తాకిడితో..!!

 

1087. మరుపు మలామును పూసుకుంటున్నా..!

మచ్చలేని వర్తమానాన్ని మరలావిష్కరించుకుందామనే..!!

 

1088. అలుకకు మౌనాలను నేర్పుతున్నా..!

నీ నిశ్శబ్దంలోని శబ్దాలన్విందామనే..!!

 

1089. నిను చూసాకే మొదలెట్టా సౌందర్యపోషణ..!

ఉదరపోషణను సైతం పక్కకి నెట్టేసి..!!

 

1090. కనులకు కన్నీళ్ళనే మిగులుస్తావు..!

కలలో సైతం కనుమరుగైపోతూ..!!

 

1091. నా మౌనానికి భాషను నేర్పెళ్ళావు..!

రోజంతా నీనామాన్నే జపిస్తూ తరించేలా..!!

 

1092. నీ గారాల లాలనలో ..!

దిగిపోతోంది యుగాల భారమంతా..!!

 

1093. ఘడియలన్నీ మంజీరాలైపోతున్నాయి..!

నీ సమక్షంలో నవ్వులమువ్వలై సవ్వడించాలనేమో..!!

 

1094. ఎంతని దోసిలట్టను..!

రాలిపోతున్న మన పరిచయ క్షణాలకు..!!

 

1095. కలలకు కన్నీటినద్దుకుంటున్నా..!

నా ఒంటరి రాత్రిని నిద్రపుచ్చుకుంటూ..!!

 

1096. నమ్మకపు సౌధాలనే నిర్మించుకున్నా..!

నిందలపలుగులతో పెకలించేస్తావని తెలియక..!!

 

1097. గుప్పెడంత గుండె..!

భావాలదొంతరలెన్నిటినో పేర్చుకుంటూ..!!

 

1098. అందమైన అనుభవాలే..!

నీకై ఆనందంగా ఓడిన మధురక్షణాలన్నీ..!!

 

1099. మౌనపు రంగులనే అద్దుకుంటున్నా..!

నా పలికే పెదవులు నీకు రుచించడం లేదనే..!!

 

1100. గతంలోకి జారిపోతూనే ఉన్నా..!

భవిష్యత్తును గురించి ఆలోచన మొదలు పెట్టిన ప్రతిసారీ..!!

 

1101. ఎన్నని దాచుకోను..!

కనురెప్పల క్రింద నలిగిపోయే నీ కలల విరులను..!!

 

1102. భాష ఎరుగని కన్నీటి సంకేతాలెన్నో..!

విడిపోయే మన మౌనహృదయాలను ఊరడిస్తూ..!!

 

1103. నా గుండె బ(చె)రువైపోతోంది..!

నీ ఎడబాటే వేధిస్తుంటే..!!

 

1104. నేనూ కళాకారిణినే..!

ఊహాచిత్రాలెన్నిటినో గీసుకుంటూ..!!

 

1105. పచ్చజండా ఎగరేస్తోంది..!

చిగురైపోతూ శిశిరం వసంతం పలకరించగానే..!!

 

1106. నువ్వు ఒదిలి వెళ్ళిన ఘడియలు..!

కంటి చివర హిమాలయాలను కరిగిస్తూ..!!

 

1107. చుంబించాలని ఉంది..!

ప్రేమావేశపు జలపాతాన్నై..!!

 

1108. నిను పరిచయించిన క్షణమే..! 

జీవితానికో చిరునామాను నిర్ణయిస్తూ..!!

 

1109. వే(శో)ధిస్తూనే ఉంటుంది విరహం..!

నీ నిరీక్షణలోనే కాక నీ సమక్షంలో కూడా..!!

 

1110. ఓ నిశ్శబ్ద పయనం..!

సుదీర్ఘమైన మౌనంలోనుండి నడిచిపోతూ..!!

 

1111. పట్టి పట్టి సాధిస్తున్నాయి చింతలు..!

చిత్తమంతా తడిచి తడిచి చిత్తడైపోతున్నా..!!

 

1112. అసంకల్పితమైన చిరునవ్వులే..! 

నువ్వు మానసంలో మెదిలిన ప్రతిసారీ..!!

 

1113. మదికి ఉపశమనమే..!

ఆర్తిగా హత్తుకుపోయే నీ జ్ఞాపకాలతో..!!

 

1114. మించిపోలేదింకా సమయం..!

అతిప్రాచీనమైన ప్రేమతత్వం నిత్యనూతనత్వంతో భాసిల్లేందుకు..!!

 

1115. ఏ "కొమ్మ"తేటివో..!

పూరేకులంటి అధరపు మధువులను జుర్రుకుంటూ..!!

 

1116. ఏమి తెలుస్తుందిలే..!

కాసుల పల్లకిలో ఊరేగేవారికి…పేదగుడిసెల ఆకలి చిందులు..!!

 

1117. ఏకాంతసౌధంలో విహరిస్తున్నా..!

ప్రేమ పూల తివాసీని పరుచుకుంటూ..!!

 

1118. చిరునవ్వు తడుముతోంది..!

ఎగసిపడే నా గుండెచేసే చప్పుళ్ళను..!!

 

1119. మాలకడుతూనే ఉన్నా..!

విచ్చుకుంటున్న నా ఆశల మొగ్గలను..!!

 

1120. నిశ్శబ్దంలో ఒదిగిపోవాలని ఉంది..!

కలలను సాకారం చేసుకుంటూ..!!

 

1121. ఇంకా ఎన్నాళ్ళో..!

నీ ఊసులతోనే నాకీ సహవాసం..!!

 

1122. మదిగది మౌనవిస్తోంది..!

నీ ఊసుల జాడలను నెమరేసుకుంటూ..!!

 

1123. నీ ద్వేషం..!

నా ప్రేమను రెట్టింపు చేస్తూ..!!

 

1124. హృదయాన్ని తివాచీగా పరిచాను..!

నీ అడుగులు కందిపోకూడదనే..!!

 

1125. నీ ప్రేమను పొందలేకపోతేనేమి..!

నా ప్రాణమైనా ఇచ్చేస్తాగా నీ కోసమే జీవిస్తూ..!!

 

1126. అక్షరాలతో తూకంవేస్తున్నా..!

గుండె భావోద్రేకపు బరువును కొలుద్దామనే..!!

 

1127. కన్నీటితో సేద్యం చేస్తూనే ఉన్నా..!

వెతల ఏతమేసి జ్ఞాపకాలను తోడుకుంటూ..!!

 

1128. ఉప్పెనంత జ్ఞాపకాలనెలా దాస్తున్నావో..!

ఆ గుప్పెడంత గుండెలో…మరుజన్మకు తోడౌతానని మాటివ్వగానే..!!

 

1129. జ్ఞాపకమై స్రవిస్తూ నీవు..!

గుండెలోని గాయాలను మౌనపు మైనంతో పూడ్చుకుంటూ నేను..!!

 

1130. తెంచుకున్నది మమతను కాదుగా..!

నీపై పెంచుకున్న ఆశలనేగాని..!!

 

1131. అంతా శూన్యమే..!

మన మధ్య బంధమైనా, దూరమైనా..!!

 

1132. అక్షరాలతోనే కాలక్షేపంచేస్తున్నా..!

నువ్వొదిలి వెళ్ళిన శూన్యాన్ని నింపుకుంటూ..!!

 

1133. నను చిత్తరువుగ మారుస్తోంది..!

నీవు విధించిన నిశ్శబ్దశాసనం..!!

 

1134. ప్రేమిస్తూనే ఉంటా..!

వేడుకలోనూ, వేదనలోనూ ఆర్తిగా స్పర్శించే గుండె తడిని..!!

 

1135. హత్తుకోవాలని చూడకు..!

కూలిపోయే నా సైకత హృదయాన్ని..!!

 

1136. దాచుకున్న ఆశలన్నీ జారిపోయాయి..!

మనస్సు జేబుకు చిల్లుపడినట్లుంది..!!

 

1137. జీవిస్తున్న అనుభూతి కలుగుతోంది..!

చితికిన గాయాలు స్రవిస్తున్నప్పుడల్లా..!!

 

1138. కవనాన్నే లేపనంగా పూస్తున్నా..!

గాయాలు నను ముద్దాడినపుడల్లా..!!

 

1139. ఎన్ని గుణించిన క్షణాలు రాలిపోయాయో..!

నేను కాలపు కంబళిని దులుపుకున్నప్పుడల్లా..!!

 

1140. వర్షించే నయనాలనెందుకు నిలువరించలేకుందో..!

వేదనల ఉప్పెనలను మోయగలుగుతున్న ఈ గుప్పెడంత గుండె..!!

 

1141. విస్తరిస్తోంది విచారపు మేఘం..!

దుఃఖపు సుడిగాలులై చుట్టేస్తూ..!!

 

1142. ఊగిసలాడుతోంది జీవితం ఎందుకనో..! 

చావుపుట్టుకలు సహజమని తెలిసినా..!!

 

1143. మదిమేఘం వదిలిన వేదనలే..! 

కంటిచూరులలో చినుకులై జారుతూ..!!

 

1144. గాయాల పోట్లు..!

ఒంటరితనాన్ని మరింత ఛిద్రం చేస్తూ..!!

 

1145. ఉలిక్కిపడుతున్న మనసు..!

రెక్కలు వచ్చిన పక్షులై బిడ్డలు కన్నగూటిని వదిలిపోగానే..!!

 

1146. తెలియదుగా..!

మనం ఎగిరెళ్ళిపోయే రోజేదో..!!

 

1147. చెక్కిళ్ళు తడిచిపోతున్నాయి..!

నీ రూపం ద్రవీభవించి జారిపోతుంటే..!!

 

1148. మంచితనమనే బీజాలను నాటాను..!

మనిషితనాన్ని సాగు చేసుకుందామని..!!

 

1149. నిరీక్షణల తెరలను దించేసా..!

నువ్వు రావని తెలిసిపోయాక..!!

 

1150. నిశీధినై మిగిలిపోయాను..!

చిరుచుక్కవై నువ్వు పలుకరిస్తావనే ఆశతో..!!

 

1151. ఆశలకొమ్మ వాడిపోతోంది..!

ఆవేదనల సుడిగాలికి చిక్కి విలవిలలాడుతూ..!!

 

1152. మనోకడలిపై చిరు అలలే..! 

ప్రకంపనలతో వెల్లువైపోయే జ్ఞాపకాలు..!!

 

1153. కాలానికి వెన్నతో పెట్టిన విద్యయే..!

గతాన్ని క్షణాల్లో కనుల ముందుంచడం..!!

 

1154. కలలు కలవరపడిపోతున్నాయి..!

వేకువలో గమ్యం తెలియక తడబడుతూ..!!

 

1155. రాలిపడే అక్షరాలెన్నో..!

కలంనుండి వ్రేలాడుతూ కాగితంపైకి జారుతూ..!!

 

1156. భావాలు మోకరిల్లుతున్నాయి..!

నిను వర్ణించే అదృష్టం దక్కినందుకు..!!

 

1157. పలుకరించే భావాలెన్నో..!

మది కాగితంపై దిద్దుకున్న అక్షరాలలో..!!

 

1158. పడుచు గతం..!

మదితెరల మాటున దాగుడుమూతలు ఆడుతూ..!!

 

1159. దివ్యస్మృతులెన్నో..!

నవ్వుల్లో ప్రతిధ్వనిస్తూ సిరి'మువ్వలై రవళిస్తూ..!!

 

1160. నువ్వు అగుపిస్తావనే ..!

కలలుకనడం మొదలెట్టాను..!!

 

1161. ఒక జ్ఞాపకం..!

కనుల ముందు స్వప్నమై గోచరిస్తూ..!!

 

1162. దమ్ముకొడుతూ నీవు ధూమపానంలో..!

దమ్ము(శ్వాస)తీసుకుంటూ నేను నీమధురగానంలో..!!

 

1163. పద్దును వ్రాసుకుంటున్నా నీకు ఋణపడినపుడల్లా..!

మరు జన్మలోనైనా తీర్చేసుకోవాలిగా...పిసరంతైనా..!!

 

1164. గతమొక రంగుల చిత్రమే..!

వర్ణరహితమైన ప్రస్తుత కాలంలో..!!

 

1165. గతాన్ని కళ్ళకద్దుకుంటూనే ఉంటాను..!

ఎందరో మహానుభావుల్ని పరిచయించిందిగా..!!

 

1166. గతానికెంత గర్వమో..!

తానో ఘన చరితగా నిలిచిందనే..!!

 

1167. ఆ"రాధ"నే విరహపు వాకిట..!

సరసపు ఊసులకై వేచిచూస్తూ..!!

 

1168. రాధామాధవీయం రమణీయమే..!

రాధమ్మ ప్రేమలోని ఆరాధన…కన్నయ్య వలపులసేవకై మదినివేదన..!!

 

1169. గడ్డిపువ్వుకెంత ఆరాధనో..!

ముద్దుగులాబీల చెంత తనను చేర్చావని..!!

 

1170. ఆధరాలకూ ఆరాధనే..!

తేనెలొలుకు స్వరమధువులను పలికించే వేణువుపై..!!

 

1171. తొలికిరణం..!

చీకటికావల తొంగిచూస్తూ..!!

 

1172. చీకటిదారులలో పయనిస్తున్నా..!

వెలుగురేఖలై తాకే జాడలను వెతుకుతూ..!!

 

1173. వయసు చురకలేస్తోంది..!

మనసు ఉరకలేస్తుంటే..!!

 

1174. కోకొల్లలుగా కలలెన్నో..!

మూసిన కనురెప్పలలో..!!

 

1175. మరుపురాని స్వప్నమే..!

కరిగిపోయిన కాలమంతా..!!

 

1176. నువ్వు దొరికావేమిటో..!

నా కోసం నేను వెదుకుతుంటే..!!

 

1177. ఏకాంతం కూడా సుఖమేలే..!

మదిలో నువ్వు నిం(ఉం)డిపోతుంటే..!!

 

1178. దళారి గ్రద్దలకు చిక్కుతున్నాయి..!

అనాదిగా...రైతులనే పిచ్చుకలు..!!

 

1179. పెళ్ళి అనే పుస్తకానికి..!

ప్రేమనేది ముందుమాట మాత్రమే..!!

 

1180. గుండె రాయిగా మారింది..!

కనులు చిత్తడి అవుతుంటే..!!

 

1181. ఇంకా ఎన్నాళ్ళో..!

పెదవిపై నవ్వులుగా నిను అలంకరించుకోవడం..!!

 

1182. నిశ్శబ్ధం..!

ఇరువురి మధ్యన వారధిగా నిలుస్తూ..!!

 

1183. తెగ భయపెడుతోంది..!

వద్దాన్నా వెంటపడుతూ వయస్సు భూతం..!!

 

1184. పేదవారికి చలికాలమే తెలియదు..!

వెచ్చగా తోడు ఉంటాయిగా ఎల్లప్పుడూ ఆకలి మంటలు..!!

 

1185. గర్భస్రావమే నయం..!

గర్భశోకాన్ని మిగిల్చేవారికంటే..!!

 

1186. చెట్టుదెంత అమాయకత్వమో..!

తనను నరికే గొడ్డలికి తానే గొడ్డలి కర్రనిస్తూ..!!

 

1187. చినుకై ద్రవీభవిస్తోంది..!

ఘనీభవించిన కరిమబ్బు..!!

 

1188. గర్వపడుతున్న గుండె..!

మానవత్వమున్న మనిషి జన్మ ఎత్తినందుకు..!!

 

1189. స్మరిస్తూనే ఉంటాను..!

నను మనిషిగా తీర్చిదిద్దిన గురువులందరినీ..!!

 

1190. రైతెపుడూ కర్పూరమే..!

దళారులు వెలిగించే అధికారపు హారతిలో..!!

 

1191. స్వానుభవం..!

ఆరక వెలిగే తారాదీపం..!!

 

1192. పూల విలువ మరింత పెరుగుతుంది..!

రాలాక తరువు పాదాలకు ప్రణమిల్లుతుంటే..!!

 

1193. గాయపడ్డ మనసుకేగా తెలిసేది..!

సూటిపోటి మాటల పదునేమిటో..!!

 

1194. గతాన్ని తవ్వుకుంటున్నా..!

నను నేను గుర్తుకు తెచ్చుకుందామనే..!!

 

1195. ఆపలేవుగా కలలను, కన్నీ ళ్ళను..!

కనురెప్పలెంతగా కాపలా కాచినా..!!

 

1196. ఆకలిరాగాలెన్నో..!

పేదరికపు తంత్రులను మీటుతూ..!!

 

1197. ప్రేమరేణువులను పోగేసుకుంటున్నా..!

నీ నవ్వుల పూవులను సేకరించుకుంటూ..!!

 

1198. వెదుకుతూనే ఉన్నా..!

నీవు ఒదిలి వెళ్ళిన జ్ఞాపకాలపాదముద్రలకై..!!

 

1199. ఇంకా ఎన్నాళ్ళో..!

కన్నుల వెలుగుల్లోనే నిను నిలుపుకోవడం..!!

 

1200. అపుడపుడూ తెరిచి చూస్తున్నా..!

జీవనగ్రంథంలోని మన చెలిమిపేజీని..!!

 

1201. ఊసులన్నీ పోగేసి ఉంచా..!

నీ ఏకాంతంలో జతపడదామనే..!!

 

1202. వింతగానే ఉంది..!

ఒంటరితనపు శత్రువుతో చెలిమి చేయడం..!!

 

1203. నీమాటల తూటాలు చీ(పే)ల్చాయేమో..!

విలవిలలాడిపోతోంది ఆశల కపోతం..!!

 

1204. గుండె గులాబీ విస్తుపోతోంది..!

నిర్లక్ష్యపు ముల్లుతో గుచ్చుతుంటే..!!

 

1205. చీకటికన్య సిగ్గుపడుతోంది..!

తొలికిరణపు నులివెచ్చని ముద్దుల గాట్లతో..!!

 

1206. నిశీధి సామ్రాజ్ఞి..!

రాత్రిరాజ్యపు నిశ్శబ్ద సింహాసనాన్నిఅధిరోహిస్తూ..!!

 

1207. అల్పసంతోషినే..!

నీ విజయాలనే నావిగా మలుచుకుంటూ..!!

 

 1208. పుణ్యాలఖాతాను తెరుచుకున్నా..!

మనిషితనానికి విలువనిస్తూ..!!

 

1209. అడుగుపెట్టాలనే ఉంది బడి ఒడిలో..!

వదిలి వచ్చిన బాల్యాన్ని వెంటతెచ్చుకుంటూ..!!

 

1210. కనులకు రాజీనామా తప్పదేమో..!

ఎదురుచూపుల ఉద్యోగం భారమౌతుంటే..!!

 

1211. సంతోషపుగుళికలను మింగుతున్నా..!

గతస్మృతుల గాయాలనుండి సాంత్వన పొందాలనే..!!

 

1212. మరుపులేపనం పూసుకుంటున్నా..!

తడారని మనస్సుతో గుండె గాయాలకు..!!

 

1213. నేలకాంతపై జల్లుతూనే ఉంటాడు..!

చినుకుజల్లుల వసంతాలను వానచెలికాడు..!!

 

1214. అలసిన గుండె సొలసిపోతోంది..!

చివరిచూపును నీపైనే నిలుపుకుంటూ..!!

 

1215. నిదురకింత ఖుషీ దేనికో ..!

రాత్రంతా నాతో దాగుడుమూతలాడుతూ..!!

 

1216. వెదుక్కుంటూనే ఉన్నా..!

దొరకనిది నీ హృదయమని తెలిసికూడా..!

 

1217. పూడ్చి పెట్టేస్తున్నా..!

మనసు ఊటబావిని ప్రేమవరదలు ఉప్పొంగిపోకూడదనే..!!

 

1218. నా హృదయానికి రక్షణకవచాన్ని తొడిగేసుకున్నా..!

నీ జ్ఞాపకాల శూలాలు గాయపరచకూదడనే..!!

 

1219. ఏ మత్తు జల్లిపోయావో..!

దారితప్పిపోతున్నా నీ మంత్రనగరిలో..!!

 

1220. జల్లెడ పడుతూనే ఉన్నా గంపెడు జ్ఞాపకాలను..!

గతంలో పారేసుకున్న నన్ను నేను వెతుక్కుందామనే..!!

 

1221. ఆశల చివురులను తొడుగుతోంది మనస్సు కొమ్మ..!

శిశిరం తాకినా వసంతాలను నింపుకుంటున్న వనంలా..!!

 

1222. తాకిపోతూనే ఉంటాయి గాయాలెన్నో..!

కలలు కనే కనులకు…కలతలు మోసే హృదయానికి..!!

 

1223. మానసవనంలో విరబూస్తున్నాయి..!

అనుభూతుల సుమాలెన్నో మరందాల జడివానలతో..!!

 

1224. నవ్వుల నెలవంక విచ్చుకుంటోంది..!

అధరపు గగనంపై మెరుపులనద్దుకుంటూ..!!

 

1225. మదిని తట్టిపోతోంది..!

నువ్వంపిన జ్ఞాపకమేదో వాస్తవంలోకి గతాన్నొంపుతూ..!!

 

1226. పుటలుగానే మిగిలిపోతున్నాయి..!

ఎదురుచూపులో కరగని గడియలన్నీ కాలగ్రంధంలో..!!

 

1227. ఇంకా ఎన్నాళ్ళో..!

చెక్కిలిపై కన్నీరుగానే నిను జార్చుకోవడం..!!

 

1228. కన్నుల కాంతికి కొదవెక్కడ..!

హృదయమందిరాన ప్రేమదీపం నువ్వయ్యాక..!!

 

1229. ఏ స్వరాలను మీటుతుందో..!

అలలలయలతో జాలువారే సెలయేటివిపంచిక..!!

 

1230. మంజీరమై రవళిస్తున్నా..!

నీ పలుకుల శృతిలయలతో నర్తిస్తూ..!!

 

1231. ఇరు మనస్సుల ముచ్చట్లాట..!

రంగుల కలలనద్దుకునే రాత్రిలోనే..!!

 

1232. మనసెరిగిన విలుకాడివే..!

నా అంతరంగపు రహస్యాలను చేధిస్తూ..!!

 

1233. ఆడతనమే ముడిసరుకు..!

రంగుతెరల విపణిలో..!! (సినీ, మోడల్, నాటకరంగపు తెరలపై అని అర్ధం)

 

1234. కాలానికి సైతం లొంగనిదే విషాదం..!

ఒక్కో జీవితాన్ని ఒక్కోలా కడతేరుస్తూ..!!

 

1235. సిరా చుక్కగా మారాలనే ఉంది..!

కవుల కావ్యాలను అల్లే భాగ్యానికై..!!

 

1236. చూపులతోనే స్పృశిస్తావు..!

మౌనతరంగాలను మీటుతూ..!!  

 

1237. విషాదాస్త్రాలను సంధిస్తూనే ఉంటుంది..!

అక్షయతూణీరాలకి లోటులేని కాలధనువు..!!

 

1238. చైతన్యపరచాలనుంది పల్లెతల్లి బడిలో..!

పాశ్చాత్య సంస్కృతి పొత్తిళ్ళలో నిదురిస్తున్న నేటి యువతరాన్ని..!!

 

1239. ప్రేమెపుడూ చిరంజీవియే..!

యుగయుగాలుగా కాలానికి నేస్తమై మిగులుతూ..!!

 

1240. హృదయాన్ని ఛిద్రంచేయడానికి అరక్షణం చాలుగా..!

గాయం మానడానికే…జీవితకాలమైనా సరిపోదు..!!

 

1241. జీవితాన్నే కలగా మార్చేసావు..!

కలలాంటి జీవితాన్ని కోరుకుంటే..!!

 

1242. పరుగులుతీస్తున్నాయి కోరికలన్నీ..!

పగ్గాలెరుగని పసిమనసుల్లా..!!

 

1243. తల్లిబాష పరాయిదైపోతోంది..!

పరభాషకు బానిసలమై'పోతుంటే..!!

 

1244. ఎగబ్రాకక తప్పదు..!

జీవితపు జారుడుబల్లపై..!!

 

1245. హృదయపు తడి ఆరకున్నది..!

నువ్వు నింపిన వేదనల ప్రవాహాలన్నీ ముంపుకు గురిచేస్తుంటే..!!

 

1246. ష్...సడిసేయకలా..!

నీకై కంటున్న కలలన్నీ చెదిరిపోతున్నాయి..!!

 

1247. మురిపించి మైమరిపిస్తోంది..!

ప్రేమామృతాన్ని కురిపించిపోయిన ఓ జ్ఞాపకం..!!

 

1248. ఏ వేదనాగ్రీష్మమంటిందో అధరవనానికి..!

మొగ్గలుగానే రాలిపోతున్నాయి చిరునవ్వులన్నీ..!!

 

1249. తలపులమొలకలతో సస్యశ్యామలమే..!

నా సౌందర్యక్షేత్రం వసంతాలెన్ని పైబడుతున్నా..!!

 

1250. ఏ అందం వలవిసిరేసిందో ..!

మనస్సు గండుతుమ్మెదలా చెలరేగిపోతోంది..!!

 

1251. మనిషి వర్ణాన్ని పులుముకుంటున్నా..!

మానవత్వనిరూపణ పరీక్షలో నెగ్గాలనే..!!

 

1252. ప్రియ శత్రువులంతా మనవెంటే..!

అందమైన సుకుమారమో, అద్వితీయమైన ప్రతిభనో వెంటేసుకుని తిరుగుతుంటే..!!

 

1253. పాలచుక్కల్లా జారిపోతుంటాయి..!

కాలపొదుగునుండి ...క్షణాలన్నీ..!!

 

1254. నువ్వు జ్ఞాపకంగా మిగిలాకనే తెలిసింది..!

నిను పరిచయించిన గడియ విలువేమిటో..!!

 

1255. వర్తమానాన్ని నిలదీయక తప్పదేమో..!

గతాన్ని సమీక్షించుకుంటున్న ప్రతిసారీ..!!

 

1256. సాగిపోతూనే ఉంటుంది సృష్టి స్రవంతి..!

మనిషి మనుగడతో తనకు పనేముందనుకుంటూ..!!

 

1257. ఎదురుచూపుల గేలమేస్తున్నా..!

రేపటి రేవులో ఆశల ఎరలనేస్తూ..!!

 

1258. క్షణాలన్నీ కరిగిపోయేవే..!

ఘనీభవించడం తెలియని జీవిత పయనంలో..!!

 

1259. నాలోని నువ్వే..!

ప్రతి జన్మకు సౌభాగ్యకిరణమై వెలుగుతూ..!!

 

1260. చీకటికెంత భయమో..!

తొలికిరణం తూర్పు తలుపు తట్టగానే..!!

 

1261. రాత్రి కన్నెకు పులకరింతలే..!

పొద్దు పొడుపు సూరీడు నులివెచ్చని కిరణాల ముద్దులకు..!!

 

1262. కలలమిద్దెనే కడుతున్నా..!

మిధ్యాలోకంలో విహరిస్తూ పేకమేడలని తెలిసికూడా..!!

 

1263. చెక్కిలిపై జారుతున్నాయి..!

నీ జ్ఞాపకాలన్నీ కన్నీటిగా కరుగుతూ..!!

 

1264. భద్రంగానే  సర్దుకున్నా..!

గుండె అరలలో మధురానుభూతులు ఎన్నింటినో..!!

 

1265. భ్రమరమంటే ఆరాధనే కుసుమకాంతలకు..!

అధరమధువులను గ్రోలవచ్చి గిలిగింతలిడతాయనేమో..!!

 

1266. మయూరానికి ఆరాధన ఎక్కువే..!

నీలిమబ్బు జాడకే పరవశిస్తూ..!!

 

1267. గర్వపడుతున్న గుండె..!

గుప్పెడంత ఉన్నా నీపై ఉప్పెనంత ప్రేమను దాచుకున్నందుకు..!!

 

1268. కలువ చెలికెంత ఆరాధనో..!

పున్నమి చంద్రుని చిలిపి తలపుకే ఉప్పొంగి పూస్తూ..!!

 

1269. హృదయం ఉప్పొంగి విచ్చుకుంటోంది..!

ఆరాధనా పుష్పమై పరిమళిస్తూ..!!

 

1270. పొన్నలు విరిసేది..!

కన్నయ్య ఆరాధనకే..!!

 

1271. తప్పదులే వేదన..!

ఆరాధించానుగా మరి..!!

 

1272. తేటి పాటలంటే ఆరాధనే..!

విరి తోటలోని సుమకన్నెలకు..!!

 

1273. ఇంకా ఎన్నాళ్ళో..!

తలపులతోనే సర్దుకుపోవడం..!!

 

1274. చెక్కిలికింత ఆరాధనదేనికో..!

కన్నుల్లోని కుంభవృష్టిని ఆర్తిగా హత్తుకుంటూ..!!

 

1275. ఆవేదన, ఆరాధన..!

అనుక్షణం బ్రతుకును వెంటాడే జీవననాదాలే..!!

 

1276. ఆరాధనల అపశృతులే..!

శోకాల తీవెలను మీటే వేదనాతంత్రులు..!!

 

1277. ఆరాధనే..!

కరిమబ్బులకు మెరుపు తీగలంటే..!!

 

1278. మనసుకెందుకో ఇంత ఆరాధన..!

లగ్గాలు పెట్టె మాఘమాసమంటే..!!

 

1279. ఆరాధిస్తూనే ఉంటాయి నా కనులు ..!

గుండెల్లో నింపుకున్న నీ రూపురేఖలను..!!

 

1280. ఆవేదనే ఆరాధనౌతుంది..!

చెంప తడిని ఇంపుగా హత్తుకుంటూ..!!

 

1281. ఆరాధనా ఒక వేదనే..!

నిదురను చెరిపే కల"వర"మౌతూ..!!

 

1282. ఆరాధిస్తూనే ఉంటుంది..!

నీకై వెదికే నీలాల కనుదోయి..!!

 

1283. సుమకాంతల మదిలో ఆరాధనలే..!

రాగాల తుమ్మెద ఝుమ్మనగానే..!!

 

1284. నిన్నారాధిస్తూనే ఉన్నా..!

పెళ్ళియజ్ఞంలో నేను సమిధగా మిగిలిపోయినా..!

 

1285. లోకువే మరి నీకు..!

నిన్నారాధిస్తున్నానని నోరు జారానుగా..!!

 

1286. ఆరాధనకూ అవహేళన తప్పలేదు..! 

మనసువిప్పి చెప్పి లోకువయ్యిందిగా..!!

 

1287. మనోసుమం వాడిపోతోంది..!

నువ్విసిరేసిన నిర్లక్ష్యపు క్షణాలలో నలిగిపోతూ..!!

 

1288. మదిగదంతా చీకటే..!

గడ్డకట్టిన దిగుళ్ళతో..!!

 

1289. చుక్కానెరుగని నావే బ్రతుకంటే..!

కష్టాల సుడిగుండాలలో చిక్కుకుంటూ..!!

 

1290. మబ్బుల ఘర్షణలే మెరుపురుములు..!

మనసుల సంఘర్షణలే కన్నీటివర్షాలు..!!

 

1291. పారేసుకున్న వ్య(క)ధలెన్నో..!

తిరుగుబాట లేని జీవన పయనంలో..!!

 

1292. అనాహతమే..!

నా కవితానా(నం)దం..!!

 

1293. ఎగిసి ఎగిసి పడుతూనే ఉంటాయి..!

హృదయతటాకాన్ని కలచివేస్తూ ఆవేదనల కల్లోలతరంగాలు..!!

 

1294. దాతగానో, గ్రహీతగానో..!

కడలికి, గగనానికి వీడనిది ఋణానుబంధమే..!!

 

1295. జీవన్మరణాలకు తర్కమెక్కువే సుమా..!

ఒక ప్రాణికి పునాదినేస్తూ…మరొక ప్రాణిని సమాధిచేస్తూ..!!

 

1296. నిషిద్ధాల జాబితాలో చేర్చేసుకున్నా..!

రక్తపోటును పెంచే జ్ఞాపకాలన్నింటినీ..!!

 

1297. సగం దేహం నగ్నమే..!

ధనికులకు బట్టకట్టడం బరువైపోతూ పేదలకు కట్టుబట్టే కరువైపోతూ..!!

 

1298. యువత నలుగుతోంది..! 

మాదకద్రవ్యాల కౌగిలిలో..!!

 

1299. చిత్రమైనదే కాలం..!

కొందరికి చెప్పి…మరి కొందరిని చెప్పకుండానే తీసుకుపోతూ..!!

 

1300. పునర్జన్మ ఎత్తుతూనే ఉంటుంది అమ్మ..!

 ప్రతి కానుపులోనూ తిరిగి జన్మిస్తూ..!!

 

1301. వేలుపట్టి నడవాలని ఉంది..!

నాన్నకు మళ్ళీ పసిపాపనౌతూ..!!

 

1302. నవ్వుతెరల మాటున దాచేస్తున్నా..!

కన్నీటిలో కరిగిపోతున్న కలలెన్నింటినో..!!

 

1303. లెక్కలు కడుతూనే ఉన్నా..!

కాలపు పద్దుల నుండి జారిపోయిన ప్రతి క్షణాన్నీ..!!

 

1304. ఇంకా ఎన్నాళ్ళో..!

మన మనసులతోనే మాంగల్యాన్ని ముడేసుకోవడం..!!

 

1305. మరోపేజీలోకి  ప్రవేశిస్తోంది కాలం..!

రోజుల పుటలను తిరగేసుకుంటూ..!!

 

1306. చినుకుల నర్తనాలే..!

చిరు సవ్వడులతో మేఘాల రాగాలాపనలకు..!! 

 

1307. నేలమ్మ పొంగి పరవశిస్తోంది..!

స్వాతిచినుకులు ఎదను మీటగానే..!!

 

1308. ముత్యపు చినుకుకెన్ని భంగిమలో..!

తామరాకు వేదికపై నర్తనమాడుతూ..!!

 

1309. గిలిగింతల సరాగాలే..!

తొలకరి చినుకులకు నీలిమబ్బులు కనుగీటగానే..!!

 

1310. మది త(ల)లుపులను తెరిచేయకలా..!

నీవైపే పరుగు తీస్తోంది నాహృదయం…పరిసరాలను మరచి..!!

 

1311. ఈ జన్మకెంత ఆత్రమో..!

మరుజన్మలో నిన్ను ఎలా కలవాలనే ఆలోచనలోనే మునిగిపోతూ..!!

 

1312. తనయునికినే మరిచింది వింతగా..!

నీ జాడలలోనే గుడ్డిగా నడుస్తున్న నా మనస్సు..!!

 

1313. తూర్పు పడమర ఎదురెదురు దిక్కులే..!

కలవలేకున్నా ఒకదానినొకటి చూసుకునే మనలా..!!

 

1314. తలపుల వనాలను పెంచినది నేను..!

తుంటరి భ్రమరమల్లే వెంటబడేది నీవు..!!

 

1315. నా మదికెంత అలుకో హృదిపై..!

నీఊసుల సవ్వడినే ఊపిరిగా జీవిస్తోందని..!!

 

1316. కొల్లగొట్టడమే తెలుసనుకున్నా హృదయాన్ని..!

పగలగొట్టడం కూడా నీకు వెన్నతో పెట్టిన విద్యేనని తెలుసుకోలేక..!!

 

1317. నీ నవ్వులతో కట్టుకున్నవే..!

మది సాగరంలో ముత్యపుసౌధాలు..!!

 

1318. నవ్వులనే చిదిమి పెట్టుకున్నా వెన్నెల దీపాలుగా..!

గగనపు కోనేట ఆరని కార్తీకదీపాలై వెలుగొందాలని..!!

 

1319. మది పురివిప్పిన మయూరమై నర్తిస్తోంది..!

నీయడుగుల హంస'ధ్వని సవ్వడులతో జత(శృతి)కలుపుతూ..!!

 

1320. సిగ్గుల ముసురులేవో కమ్ముకుంటున్నాయి..!

నీ చూపుల చినుకులు చిటికెలతో సవ్వడి చేస్తుంటే..!!

 

1321. రంగుల కలలై వెలిసిపోతున్నాయి..!

మనసు కాన్వాసుపై ముద్రించుకున్న నీ స్మృతుల చిత్తరువులు..!!

 

1322. చిలిపి తిల్లానాలే..!

మనోవేదికపై నీ తలపులెపుడూ...!!

 

1323. నా మనసులో వెన్నెల కురుస్తోంది..!

నీ జ్ఞాపకాలు మంచుపూలై జారుతుంటే..!!

 

1324. కాలపు అంచుల్లోనే వేచియున్నా..!

మరుజన్మకైనా జతౌతావనే ఆశతోనే..!!

 

1325. మనోక్షేత్రం సుసంపన్నమౌతోంది..!

నీ ఊహల చివురులను తొడుగుతూ..!!

 

1326. నీ ఊహలెపుడూ..!

చెక్కిలిని సుతారంగా సృజించే మలయమారుతాలే..!!

 

 1327. నీ జ్ఞాపకాలెపుడూ..!

గుండెల్లో శాశ్వతంగా దిగబడిన కంటకాలే..!!

 

1328. నిజాలను వెలికితీస్తూనే ఉన్నా..!

గతజ్ఞాపకాల పొరలను త్రవ్వుకుంటూ..!!

 

1329. గంగాయమునల సంగమమే..!

కలనైనా నువ్వు కానరాని నాకనుదోయిలో..!! 

 

1330. పరిభ్రమించే తుమ్మెదలే నీతలపులెపుడూ..!

 నాయూహల మేనిసుమం చుట్టూ..!!

 

1331. నా మదినే సమర్పిస్తా ప్రేమకానుకగా..!

హృదయస్పందనలతోనే నీ ఊహాస్వరాలను మీటుకుంటూ..!!

 

1332. అనాధలై మిగిలిపోయాయి..!

నీతో సప్తపది భాగ్యానికి నోచుకోలేని నా అడుగులన్నీ..!!

 

1333. గెలుచుకున్నా నీ మదిలో స్థానాన్ని..!

కోల్పోయానని గుర్తించనేలేదు నా హృదయాన్ని..!!

 

1334. నీలిమబ్బులను వేడుకున్నాను..!

విన్నవించమని నా హృదయ సందేశాన్ని..!!

 

1335. సిగ్గుల మరుమల్లెలేవో సైగలు నేర్చుకుంటున్నాయి..!

అల్లరితుమ్మెదవై నువ్వు చెక్కిలి మీటుతుంటే..!!

 

1336. మధుర జ్ఞాపకాలు మనసును తాకుతున్నాయి..!

మదివాకిట సంబరాలు రంగవల్లులై దిద్దుకుంటుంటే..!!

 

1337. మనోవనమంతా విస్తరించిన వలపు కొమ్మలే..!

తీపిరాగాల కోయిలవై నువ్వు వాలగనే ..!!

 

1338. హృదయకుసుమం ముడుచుకుంటోంది..!

నీ చిగురుటాకు చూపుల మధ్య చిక్కిపోగానే…సిగ్గులమొగ్గైపోతూ..!!

 

1339. మధుర జ్ఞాపకాలు మనసును తాకుతున్నాయి...!

చెక్కిలిమాటున చిలిపి పరదాలకు తెరతీయగనే..!!

 

1340. ఇంకా ఎన్నాళ్ళో..!

వేదనలచట్రంలోనే కడతేరిపోవడం..!!

 

1341. అల్లుకుంటున్నా నే ఆశల హరివిల్లునై..!

చినుకువై నువ్వు మదిని తడిపేస్తుంటే..!!

 

1342. మాటల తూటాలతో హృదిని ఛిద్రం చేసిపోతావు..!

శకలాలకేమి తెలుసు పాపం కలవడం కల్లయని..!!

 

1343. నీ మది వాకిటనే నిరీక్షిస్తున్నా..!

వలపు తలుపులను తెరుస్తావనే ఆశతో..!!

 

1344. "వాణి" దూరమైనప్పటి నుండే  మది భారమైందిట..!

దూర'వాణి, ఆకాశ'వాణి, కీర'వాణి, చర'వాణిలను నేనడుగుతుంటే..!!

 

1345. మరీచికలకెంత సంబరమో..!

తమ ఛాయలను నానయనాల కాంచుతూ..!!

 

1346. నల్లపూసను చేసానని యాగీ చేస్తావేమి..!

ఎదపై నిన్నెప్పుడూ మోయాలని నేత(ల)పిస్తుంటే..!!

 

1347. అవకాశం చేజారిపోయిందా, వదిలేయరాదూ..!

మరో సువర్ణావకాశమే ఉందని నీకోసం, వేచి ఉండొచ్చుగా..!!

 

1348. లతలన్నీ తెగ వయ్యారాలు పోతున్నాయి..!

కుసుమ కాంతలు తమను హత్తు(అల్లు)కున్నాయనేమో..!!

 

1349. వేరుచేయడమెలాగో తెలియడంలేదు..!

కరిమబ్బు క'న్నీళ్ళలో ఒలికే ఆనందభాష్పాలను..!!

 

1350. మనోనేత్రంతో చూస్తున్నాను..!

నిన్ను చూసుకోడానికి రెండుకళ్ళూ చాలడంలేదనే..!!

 

1351. కన్నీటి పర్యంతం అవుతున్నాయి మేఘమాలికలు..!

కన్నీరింకిపోయిన తటాలకు జలనిధులను చేకూర్చాలనే..!!

 

1352. చేజారిన నామనస్సును పట్టుకునే ప్రయత్నంలో..!

నేనోడిపోతూనేయున్నా…నీమనస్సును గెలిచాననే గర్వంతో..!

 

1353. మాలికలు మూలికలే..!

సాహితీ వైద్యానికి ..!!

 

1354. వెన్నెలమ్మకు నెలరేడిచ్చిన పెండ్లికానుక..!

నీలిరంగుపై పసిడితారకలద్దకంతో చుక్క'లచీర..!!

 

1355. నీనవ్వుల తివాచీని పరిచావా..!

పూలన్నీ మూతి ముడిస్తేనూ..!!

 

1356. సాహితీవనంలో నాడు నాటిన విత్తులే..!

నేడు పదభావాక్షరాల చిగురులను తొడుగుతూ..!!

 

1357. కుసుమ కాంతలకు ఒళ్ళుమంటే మరి..!

చిలిపిగా మధుపాలను గ్రోలేసే భ్రమరాలంటే..!!

 

1358. మదికి తడి తగిలే వరకు తెలియనేలేదు..!

నీ జ్ఞాపకాల బిందువులు సింధువులై తాకాయని..!!

 

1359. సుమలతలు నివ్వెరబోతున్నాయి..!

నువ్వు నన్నల్లుకున్న తీరును చూసి..!!

 

1360. మనసును అంతలా గారాం చెయ్యకు..!

మౌనంగానే మదికి అల్లరిని నేర్పేస్తుంది..!!

 

1361. నీనవ్వుల కాగడాను వెలిగించాను..!

నిశీధి నీడలను పారద్రోలుదామని..!!

 

1362. ఉప్పొంగే ఆశల కెరటాలెన్నో..!

మనోసంద్రమంతా ఉప్పెనలై ఉరకలేస్తూ..!!

 

1363. స్వర్ణోదయమే కోటిదివ్వెల కాంతులతో..!

నువ్వు మేల్కొలుపులను పాడుతుంటే..!!

 

1364. గురితప్పని నీ చూపులశరాలకేమో..!

లేలేత ఊహలేవో తప్పటడుగులేస్తున్నాయి..!!

 

1365. నీ ప్రేమహస్తాన్ని చేజారనివ్వకు..!

పోగొట్టుకున్న నాహృదయం దొరికేవరకు..!!

 

1366. ఎదలోయల్లో నీ జ్ఞాపకాల సిరిమువ్వల రవళులే..!

మదిపాయల్లో నీ తలపుల విరిజల్లుల కవ్వాలీలతో..!!

 

1367. నీ తలపుల అస్త్రాలే..!

నా ప్రేమాంబులపొది నిండుగా..!!

 

1368. మాటల పూతలనే పూసేస్తావు..!

నువ్వు మంత్రించిన హృదయ నగరిలో ప్రతి గడపకూ..!!

 

1369. ప్రేమామృతంలో తడిచి ముద్దవుతున్నాను..!

నువ్వింతగా ముద్దు చేస్తుంటే..!!

 

1370. మనోగగనంలో హరివిల్లులూయలలై ఊగుతున్నాయి..!

నీ తలపుల రంగులన్నీ ముచ్చటగా అద్దుకున్న నాయూహలు..!!

 

1371. ఎంత ఘాటుప్రేమనో..!

ఎక్కువైన మమ'కారంతో..!!

 

1372. గుండెల్లో నీయూసుల గాజుదీపం పగిలిపోయింది..!

జ్ఞాపాకాల శకలాలను మాత్రంమే మిగిల్చి..!!

 

1373. ఇంకా ఎన్నాళ్ళో..!

ఎదురుచూపులతోనే వేసారిపోవడం..!!

 

1374. వసివాడని తేనెలపుష్పమే మది..!

తీయని తలపుల మకరందాలనూరిస్తూ..!!

 

1375. కోటివర్ణాల వసంతమే నామదికి..!

నీతలపుల్ని అనంతకోటి నింపుకుంటూ..!! 

 

1376. కన్నీటి అలలపై తేలియాడే వ్యధలనావలు..!

గుండెల్లో సుడిగుండాలై తిరిగే నీజ్ఞాపకాలు ..!!

 

1377. అక్షరతోరణాలనే కట్టుకుంటున్నా మది వాకిట..!

నీ కవనానికి కావ్యకన్యకనై పోవాలని..!!

 

1378. జ్ఞాపకాల వంతెనలు నిర్మిస్తున్నా..!

సుడులుతిరిగే ఊహల సుడిగుండాలపై..!!

 

1379. ఏడురంగుల దీపాలే..!

నీ మోమున అరవిరిసిన నగవులవర్ణాలు..!! 

 

1380. చిగురిస్తున్నాయి శిశిరాలు..!

కుసుమించే ఆశల పల్లవాలతో..!!

 

1381. నీ ప్రేమస్పర్శకు కరిగిపోతున్నా..! 

వర్షపుబొట్టునై మేఘాలయంచున జారిపోతూ..!!

 

1382. జ్ఞాపకాలచీకట్లు వలవిసిరేస్తున్నాయి..!

విషాదపు నిశీధిలో ఆశాదీపాలను కొడగట్టిస్తూ..!!

 

1383. మది పసిమువ్వై నర్తిస్తోంది..!

నీ గారాల నయగారాలకు..!!

 

1384. నీ ప్రేమచమురుతోనే..!

నే అనురాగపు దివ్వెలను నింపుకుంటున్నది..!!

 

1385. మనోగగనంలో గుట్టుగా దాగుండిపోతావా..!

కరిమబ్బు పరదాల మాటున చిలిపిగా దోబూచులాడే వెన్నెలరేడువై..!!

 

1386. వెన్నెలరేయిలో కూడా గ్రీష్మపు నిట్టూర్పులే..!

ఊహల్లో సైతం నువ్వు కనుమరుగైతే..!!

 

1387. వెన్నెల వానల్లో తేలియాడే నౌకలే..!

గగనతీరాన మెరసే అందాల నెలవంకలు..!!

 

1388. నాగుండె గుడినే ఆరా తీస్తున్నా..!

కనిపించని దైవం(శిల్పం)గానే మిగిలిపోయావు ఎందుకని..!!

 

1389. కిస్మిస్ ఇమ్మంటే..!

మిస్సులు దొరకడం కష్టమిక్కడ కిస్సులు ఇవ్వడానికి అంటున్నాడాతిక్కలోడు..!!

 

1390. హృదయబింబం ప్రతిబింబిస్తోంది..!

హృదిలో దాగుండిపోయిన నిన్నే చూపిస్తూ..!!

 

1391. మనోవనమంతా విరబూసిన పున్నాగలే..!

 జ్ఞాపకాల పరిమళాలను వెదజల్లుతూ..!!

 

1392. ఆశలసరాలుగా అల్లుకుంటున్నా..!

మదిసౌధంలోని నీ జ్ఞాపకాల మౌక్తికాలనే..!!

 

1393. కన్నీటి నావనై సాగిపోతున్నా..!

వేదనల అలలపై తేలిపోతూ..!!

 

1394. మనస్సుతో ఆడుకోవద్దు..!

ఎన్ని ఆటలాడినా నేను పెట్టలేదుగా నీకే హద్దులు..!!

 

1395. నా ప్రాణమే..!

నను వీడిపోతూ నీ రూపంతో..!!

 

1396. చిరకాల పరిచితురాలినే..!

అ’పరిచితురాలినై మిగిలిపోతూ నీ మదికెపుడూ..!!

 

1397. నీ ప్రేమ పూర్ణబింభాన్ని పొందాలనే..!

వలపుల పోగులెన్నో అర్పిస్తున్నా బాలచంద్రునికి..!!

 

1398. ఒంపుసొంపుల గౌతమినే..!

నీచూపుల అలలతాకిడితో..!!

 

1399. నీకు ముద్దొచ్చే చిలకమ్మను నేను..!

 

అలిగి బ్రతిమాలించుకేనే గోరింకవు నీవు..!!

1400. పూలవాగులా పొంగే నీజ్ఞాపకాలు..!

 

మదికోనేటిలో విచ్చుకున్న కన్నెకలువలు..!!

1401. అంత'రంగం అంతా తలపుల క్రీడలే..!

 

ఎత్తుకు పైఎత్తులేసే వలపుల చదరంగాలతో..!!

1402. ఎగిసిపడుతున్న మనసు..!

 

చిధ్రమైన నా హృదయం వెదజల్లుతున్న వేదనల నిప్పురవ్వలతో..!!

1403. ఎదవీణను మీటేది నీ తీయనిస్వరాలే..!

 

ఆశల బాణీలతో ప్రేమరాగాలను నేర్పుతూ..!!

1404. నీ జ్ఞాపకాల గమకాలెన్నో..!

 

నా గుండె వేగంతో పోటీగా తాళం వేస్తూ ..!!

1405. వాడిపోతున్న కుసుమాన్నే..!

 

నీ జ్ఞాపకాలనే పిందెలుగా తొడుక్కుంటూ..!!

1406. ప్రేమాక్షరాలనే నింపుకుంటోంది..!

 

నా జీవితడైరీలోని...ప్రతి పేజీ..!!.

1407. ఎగసి పడుతున్నాయి తపనల అలలు..!

 

తనివితీరా తన మదితీరాన్ని ముద్దాడాలనే..!!

1408. కోనేటి అలలపై కార్తీకదీపాలే..!

 

వెలిగే తారలమ్మల ప్రతిబింబాలు..!!

1409. లౌ'డుగా మాట్లాడమంటే ప్రేమగా అనుకున్నా..!

 

గట్టిగా మాట్లాడమనా…వినపడదని చెప్పొచ్చుగా..!!

1410. చినుకుల చిత్రాలేవో గీస్తున్నాయి..!

 

మెరుపుల కలలతో మేఘమాలికలు..!!

1411. కవనవనం పుష్కలమే..!

 

అక్షరసేద్యంతో ఫలవంతమౌతూ..!!

1412. నిశి రాతిరి ఒడిలోనే కునుకుతీస్తున్నా..!

 

నీ ఊసులు ఎంతగానో చిచ్చుపెడుతుంటే..!!

1413. బంధీనయ్యాను..!

నీ జ్ఞాపకాల కౌగిలిలో విడిపించుకోలేనంతగా..!!

 

1414. పడిలేచే కెరటంలా మనస్సు..!

మౌనానికే పలుకులు నేర్పుతోంది మాటలు నేర్చిన కోయిలమ్మలా..!!

 

1415. వసంత ఋతువులో తరువులా..!

ప్రేమచిగురులు తొడుగుతోంది మనోవనమంతా..!!

 

1416. జారిపోవాలనుంది కన్నీటిముత్యమై..!

నీ చెక్కిలిపై…ఘడియైనా చోటిస్తే..!!

 

1417. మరణానికైనా అడ్డుచెప్పను..!

మరుజన్మలోనైనా మనసిస్తానని నువ్వు మాటిస్తే..!!

 

1418. స్వప్నమై మిగిలిపోతాను..!

నీ కనుల మాటునే కొలువిస్తానంటే..!!

 

1419. అలనై ఎగసి పడుతున్నాను..!

నీ నవ్వుల సంద్రాన..!!

 

1420. నీ మనోతీరం చేరాలనే..!

నా ప్రేమనావ పయనం..!!

 

1421. సిరి’మువ్వలై రవళిస్తున్నాయి..!

అభినయ గీతికలంటి నీ నవ్వులు..!!

 

1422. ఎదచాటున విరిసే సుమధురరాగాలెన్నో..!

నీమౌనస్వరాలను మీటే మానసవీణియకు..!!

 

1423. నే విన్నది..!

హృదయం పగిలిన శబ్ధాన్నే...తనెళ్ళిపోయాకా..!!

 

1424. ముప్పై రోజుల్లో కన్నడం ఇమ్మంటే..!

ముప్పై రోజుల్లో కనడ'మెలాగని ఆరాదేనికో..!!

 

1425. పరవశిస్తోంది ఎదమూలల్లో ఓ జ్ఞాపకమేదో..!

నీ మాటల ముత్యపుమూటలను విప్పుకుంటూ..!!

 

1426. సిరిమువ్వనై రవళిస్తున్నా..!

నీ నవ్వుల సుస్వరాలలో తరించాలనే..!!

 

1427. వెలిగించుకుంటున్నా చిరునవ్వుదివ్వెలెన్నో..!

నీ చెలిమిచమురు తోడుంటుందన్న భరోసాతోనే..!!

 

1428. మావి చిగురుదో…వేప వగరుదో..!

వసంతకోకిల స్వరాలకు ఆనం'దామృతాన్నందించే హర్షణీయాతిశయం..!!

 

1429. మనోతీరానికెంత సంబరమో..!

సంతసాల తరంగ కన్నెలు హత్తుకోగానే..!!

 

1430. భావాలను తేలికపర్చలేకున్నా..!

నీకై అల్లుకునే అక్షరాలు బరువౌతున్నకొద్దీ..!!

 

1431. అల్లుకుంటున్నా అనురాగపదాలెన్నిటినో..!

ప్రేమ(విశ్వ)నిఘంటువులో మనకో పేజీని మిగుల్చుకుందామనే..!!

 

1432. వాడిపోతున్నాయి చెలిమి చెంగల్వలన్నీ..!

అనుబంధాలన్నీ అనుమానాలై అవహేళనచేస్తుంటే..!!

 

1433. పెరిగిపోతూ నిరీక్షణాకాలం..!

పెంచుతోంది మదికి తరగని భారం..!!

 

1434. పుప్పొడి స్వరాలనే ఆలపిస్తున్నాయి..!

ఊహలరెమ్మలకు విరబూసిన ఊసులసుమాలు..!!

 

1435. తుడపలేకున్నా..!

కాలపు కాటుకమరకలను…కన్నీటినెంతగా కరిగిస్తున్నా..!!

 

1436. మంద్రస్వరంతో ఆలపిస్తోంది పసితనాల గతం..!

చిరుప్రాయపు గుండె తలుపులను మీటుకుంటూ..!!

 

1437. సప్తవర్ణాలనద్దుకుంటోంది..!

పుటపుటలోనూ తననే నింపుకున్న కలలపుస్తకం..!!

 

1438. అంకురిస్తున్నాయి బిడియాలమొలకలు..! 

జ్ఞాపకాల విత్తుల పొత్తాలను విచ్చుకుంటూ..!!

 

1439. ఆర్తిగా పొదువుకుంటోంది..!

నా(వె)న్నలాంటి  చెలిమి హస్తం…నాకన్నీటి వానలకు ఛత్రమౌతూ..!!

 

1440. తడారకుంది నా రేయంతా..!

ఏ స్మృతుల తేమగాలి విసురులు తాకి పోయాయో..!!

 

1441. కన్నీటిజ్ఞాపకాల్ని జార్చేస్తుందనే..!

వానజల్లులో తడిచి నేను ముద్దైపోతున్నది..!!

 

1442. నిశ్శబ్దం నవ్వుకుంది..!

రిక్త హృదయంలోకి చొరబడి జ్ఞాపకాలు చేసే సందడికి..!!

 

1443. శుభ్రపరుస్తూనే ఉంటాయి..!

జీవన ప్రాంగణాలనెపుడూ కాలపు హస్తాలు..!!

 

1444. చీకటి భాషను అలవర్చుకుంటున్నా..!  

నిశ్శబ్ద తీరాలకు తరలిపోదామనే..!!

 

1445. సంతృప్తిసౌధాన్ని నిర్మిస్తున్నా..!

వర్తమానంలోంచి జ్ఞాపకాల్లోకి రహదారిని పరుచుకుంటూ..!!

 

1446. విసిరిపోరాదూ ఒక చిన్న చిరునవ్వుని..!

తాకిపోయే శీతలమౌనాలకు చెలిమి శిశిరసుమాలనద్దుతూ..!!

 

1447. అలుపెరుగని బాటసారే..!

మరుక్షణానికి మరో చిరునామాను వెదుక్కుంటూ సాగిపోయే మరణం..!!

 

1448. అబ్బురాల అంచులనే తాకుతున్నా..!

నిబ్బరాల సిగ్గులేవో విస్మయపరుస్తుంటే..!!

 

1449. వెన్నెల వానల్లో తడవాలనుంది..!

చందమామై తాను నవ్వుతుంటే..!!

 

1450. కనుదోయిలో దాచుకున్న పరవశాలెన్నో..!

నీ ఎదపుటలపై ఒక తీయని సంతకమై మిగిలిపోవాలనే..!!

 

1451. తనెంత స్వార్ధపరురాలు..!

కర్రలరథమెక్కి వెళ్ళిపోయింది హాయిగా…నాకింకా పరిచయంకాని మరోలోకానికి..!!

 

1452. నా గెలుపు శాశ్వతమౌతోందని అర్ధమయ్యింది..!

అసంఖ్యాకంగా శత్రువుల సంఖ్య పెరిగిపోతుంటే..!!

 

1453. అపర దానకర్ణులెందరో..!

తల్లిదండ్రులను నిష్కల్మషంగా వృద్ధాశ్రమాలకు దానమిచ్చేస్తూ..!!

 

1454. అలుకల సుమాలన్నీ రాలిపోతున్నాయి..!

నీ అనునయసమీరాలు స్పృశించగానే..!!

 

1455. మౌనంతోనే ముచ్చటిస్తున్నా..!  

అర్ధంచేసుకునే మనస్సు నీకుందని గ్రహించగానే..!!

 

 1456. నాతో గొడవపడలేవా..!

మన ప్రేమ మరింత పటిష్ఠమయ్యేలా..!!

 

1457. ఆషాఢభూతులు దిగదుడుపే..!

నమ్మించి నట్లేట్లో ముంచేవారి ముందర..!!

 

1458. పేరెనుక భూషణలు కొందరికి..!

పలుకులేమో దూషణలు అందరిపై..!!

 

1459. పరిమళాల ధూపమేసిపోతున్నాయి..! 

గుండె నిండా నిండిన నీయూహలజాడలు..!!

 

1460. ఎవరు తాపి ఉంటారో..!

పూలరెక్కలకు సుగంధాల అత్తరులను..!!

 

1461. మృదువుగా తాకిపోయే అలలే నీయనునయాలు..!

మదీతీరాన్ని సముదాయించి వెనక్కి పరుగులుతీస్తూ..!!

 

1462. మౌనాలవిత్తులను రాల్చుకుంటూ..!

మొదలయ్యాయి దుఃఖాలంకురించడం..!! 

 

1463. మనస్సుకు దగ్గరగా రాకు..!

దూరాన్ని మిగుల్చుకోవడం కష్టమౌతోంది..!!

 

1464. పుస్తకపూజ మంచిదన్నాను..!

ముఖపుస్తకానికి  తెగ హారతులనిచ్చేస్తున్నాడు తింగరోడు..!!

 

1465. ప్రత్యేకదినం ప్రకటించక తప్పదేమో..!

కాలగమనంలో అంతరించిపోతున్న సంప్రదాయదుస్తులకు..!!

 

1466. మాయామోహినియే..!

వద్దంటున్నా నన్ను కౌగలించుకునే ఒంటరితనం..!! 

 

1467. ప్రేమగోదారి పోటెత్తుతోంది..!

ఏ మధురభావాలు ఉప్పెనలై పొంగాయో..!!

 

 1468. ప్రేమాంతం ఉండదేమో..!

యుగాంతం వచ్చినా..!!

 

1469. అంతరాల్లేని ఆదిమానవులే నయం..!

అస్తిత్వాన్ని నిలుపుకోలేకపోతున్న ఆధునికులకంటే..!!

 

1470. మధుపాత్రగా మారుతోంది..!

నీ జ్ఞాపకాలసేవనంతో పొంగు(నిండు)తున్న నామనస్సు..!!

 

1471. ఈ అం(మం)తర్జాలమేమిటో..!

జీవనగమ్యాన్ని ఒత్తిడొత్తిడి తొక్కిళ్ళకు గురిచేసేస్తూ..!!

 

1472. ప్రతి పుటలో నీ చిత్ర'ములే..!

రతీపతి వ్రాసుకున్న సౌందర్య నిఘంటువులో..!!

 

1473. తాకిపోతూనే ఉంటావు..!

గుండెల్లో ఉప్పొంగే సంద్రంగానో, అనునయాలసమీరంగానో..!!

 

1474. గుండెకెంత సవ్వడో..!

ఆరడుగులందగాడితో ఏడడుగులేస్తుంటే..!!

 

1475. అతి కష్టమైపోతోంది..!

హిమనదాలనిలా కనుకొసల్లోనే బంధించి ఉంచాలంటే..!!

 

1476. కవ్విస్తోంది కాలం..!

నీ సమాధికో చరితను మిగుల్చుకోమంటూ..!!

 

1477. తుడవాలని లేదు తడిచిన హృదయాన్ని..!

కురిసి ము(మ)రిపించింది నీ ప్రేమజల్లులేగా..!! 

 

1478. కొన్ని చరిత్రలెపుడూ సింధూరవర్ణాలే..!

రక్తాన్నొలికించి మరీ అమరమౌతాయిగా..!!

 

1479. అనుభవరుధిరం చిమ్ముతోంది..!

ఏ నయవంచనల కత్తి పోట్లు మనస్సును చీల్చేసాయో..!!

 

1480. మనోతీరాన్నడిగి చూడు..!

పారుతున్నది కన్నీటినదియనే సాక్ష్యమిస్తుందో లేదో..!!

 

1481. నేను నచ్చడంలేదుట..!

మౌనమే నా సమాధానం అయినప్పటినుండి..!!

 

1482. అందరూ వార్తా'హరులే..!

మరి అన్వేషకులెవరో నిజాలను నిగ్గుతీసేందుకై..!!

 

1483. నిను తలుచుకోవడమేగాని..!

తెలియకుంది…కలుసుకోవడమెలాగో..!!

 

1484. లేవడమెలాగో తెలియకుంది..!

పడింది నీ ప్రేమలో కదా..!!

 

1485. కవులదంతా కల్పనేనని ఆడిపోసుకుంటారేమిటో..!

మనస్సునే అక్షరతివాచీగా పరిచేస్తుంటే..!!

 

1486. అభూతకల్పనయని కొట్టిపారేస్తావెందుకు..! 

నీకై నేను పునర్జన్మలను ఎత్తుతూనే ఉన్నానని నిరూపించుకుంటున్నా..!! 

 

1487. నీ దారెంటే పడుతుందేమిటో..!

మదినెంతగా ప్రక్కదారి పట్టిస్తున్నా..!!

 

1488. ముందడుగేస్తే తొందరపాటంట..!

వెనుకడుగేస్తే గ్రహపాటంట…మాయాదారిలోకం పలుగాకుల విం(సం)తే కదూ..!!

 

1489. ప్రహారీగోడతో పనేముందిక..!

రహదారిని నేనయ్యాక..!!

 

1490. మదియలల హోరు పెరుగుతోంది..!

ప్రేమసంద్రం మంద్రమై సవ్వడిస్తుంటే..!!

 

1491. నీతో జతపడలేనిక..! 

నాలోకి నేను పయనించే సమయమాసన్నమయ్యిందిగా..!!

 

1492. ఉలిక్కిపడుతోంది నవసమాజం..!

కుళ్ళిపోతుందన్న మాట విన్న ప్రతిసారీ..!!

 

1493. గీయని చిత్తరువే నా మనస్సు..!

అవసరంలేదిక నవ్వుల రంగుల పూతలతో..!!

 

1494. నా దృశ్య'రూప'కం నచ్చిందన్నావుగా..!

మరి ప్రేమతెరను తీయగరాలేవా..!!

 

1495. సత్యానికో సమాధి తయారైనట్లే..!

అసత్యపు స్మశానవాటికలో పాతిపెట్టేసేందుకై..!!

 

1496. విశ్లేషణ మొదలయ్యిందిట..!

వృద్ధాప్యం పలుకరించినట్లుంది..!!

 

1497. మన చెలిమి కాగితాలను చించేసాను..!

వ్రాసుకున్న మాటలన్నీ అందనంత దూరానికెగిరిపోవాలనే..!!

 

1498. హిమశిల్పాన్నై కరిగిపోతున్నా..!

నీ పలుకుల వడగాల్పులు నిర్ధయగాతాకుతుంటే..!!

 

1499. శ్వాసను నిలిపేయాలనుంది..!

జ్ఞాపకాలను మోసుకుంటూ వర్తమానంలోకి సాగిపోతానంటే..!!

 

1500. ప్రేమిస్తున్నాడట..!

తెలివిగానే పెట్టాడు కామించడానికో ముద్దుపేరును..!!

 

1501. ప్రాణదీపం ఆరిపోయేది..!

జీవితానికో కొస'మెరుపునిచ్చేందుకే..!!

 

1502. బుద్ధికిదేం మాయరోగం..!

వయసొచ్చినా పెరగనంటూ..!!

 

1503. దేహమంతా విషపూరితమైందట..!

కాటేసిపోయింది నాలుకల భుజంగాలుగా మరి..!!

 

1504. స్మృతులక్షేత్రాన్ని దున్నుకుంటున్నా..!

కలిమిపంటలను పండించుకునేందుకో…గుండెమంటలను చల్లార్చుకునేందుకో..!!

 

1505. వింతపరిమళమేదో తాకుతోంది..!

ఏ మరులు విరులై విచ్చుకుంటున్నాయో..!!

 

1506. బంగారు మామవే నాకెపుడూ ముద్దొస్తూ..!

అన్నిటికీ తలూపే అమాయకపు బసవన్నలా..!!

 

1507. ఇంత మొండిదేమిటో నా మనస్సు..!

నన్ను కాదని నీకు ఒత్తాసుపలుకుతూ..!!

 

1508. తుమ్మెదనై పరిభ్రమిస్తున్నా..!

నవ్వుల పూవులపైనే..!!

 

1509. సిగ్గులమొగ్గలు విచ్చుకుంటున్నాయి..!

చెక్కిలిపై తన అధరపు సంతకాలకు..!!

 

1510. ఊహలనావ ఊగిసలాడుతోంది..!

వలపులరేవులో నీ జ్ఞాపకాల అల(ల)జడికి...!!

 

1511. ఛేదించ సాధ్యంకాని మిస్టరీవే..!

బర్మిడాట్రయాంగిల్లా జ్ఞాపకాలను మింగేస్తూ..!!

 

1512. వలపుముత్యాలెన్నో జాలువారుతున్నాయి..!

నీ చెక్కిలిని తాకిన తమకంతో ..!!

 

1513. చిలిపి ఊహలకెపుడూ పంతాలే..!

నీ జ్ఞాపకాలతోనే పోటీకిదిగుతూ..!!

 

1514. మది సాగర కెరటాలలో ఈదుతూ..!

తలపుల గాలానికి చిక్కిన చిరుచేపనే..!!

 

1515. సిరిమువ్వల నర్తనాలే..!

నీ ఊపిరి వేణువువై పలుకరిస్తుంటే… నా హృదికి..!!

 

1516. ఆశల దీపాలనే వెలిగిస్తున్నా..!

చిరుగాలులకారని జ్ఞాపకాల జ్యోతులుగా..!!

 

1517. తారసపడే తారకలే తలపులన్నీ..!

విరహపు గగన వీధుల్లో..!!

 

1518. నవ్వుల నక్షత్రాలేనేమో..!

నీలిమబ్బు కురులపై విరిసిన మెరుపులమల్లెలు..!!

 

1519. నీ ఊపిరిలోనే జీవిస్తున్నా..!

నీ నీడను నేనై నీ వెంటే పయనిస్తూ..!!

 

1520. గాయమై గుండెను కోస్తావెందుకు..!

చితిలో కూడా నిను వీడనని బాసలే చేసినా..!!

 

1521. నాతోనే ఉంటావు నువ్వెప్పుడూ..!

భౌతికంగా దూరమైనా నాప్రేమధామంలోనే జీవిస్తూ..!!

 

1522. మనోకోయిల మూగబోయింది..!

కూయడమేలేదెందుకనో వసంతమై నువ్వు వచ్చినా..!!

 

1523. ప్రశాంత సరోవరమే నామది..!

నీజ్ఞాపకాల అల(ల)జడులెంతగా తాకుతున్నా..!!

 

1524. కాలమైతే కరిగిపోతోంది..!

భవితనేమో అధునికతకంకితమిస్తూ..!!

 

1525. మది కెరటం అలసిపోతోంది..!

ఊహల ఘోషలమధ్య ఎగసిపడుతూ..!!

 

1526. మనస్సు మూగబోతోంది..!

నీ తలపుల తపోవనంలో తచ్చాడుతుంటే..!!

 

1527. చిలిపికధనాలేవో చివురిస్తున్నాయి..!

మనసుకొమ్మన నీ పరిచయ నవవసంతంతో..!!

 

1528. రెప్పలమాటునే మేఘాలను నింపుకున్నాను..!!

కన్నుల్ని కలలవర్షాలతో నింపుకోవాలని..!!

 

1529. కరుగుతున్న హిమశిఖరాలే జ్ఞాపకాలు..!

మంచుదిబ్బగా మారిన హృదయాలలో..!!

 

1530. కనురెప్పలు నిదురను మరచి కాపలాకాస్తున్నాయి..!

కలగా నువ్వు మరలి పోతున్నావనే..!!

 

1531. ఊహల అలలెన్నో నిశబ్దమేలుతున్నాయి..!

మనోసాగరాన నీ స్పందనల గలగలలను వినే అవకాశాన్నికోల్పోతూ...!!

 

1532. మౌనాలేవో పెదవి విప్పుతున్నాయి..!

మాటలు నేర్చిన కూనలమ్మలౌతూ..!!

 

1533. జ్ఞాపకాల బృందావనిలో విహరిస్తున్నా..!

మనోవేణువు ప్రణయరాగమే ఆలపిస్తుంటే..!!

 

1534. త్రవ్వే కొద్దీ తరగని ఊహాజలమే..!

సాహితీ సేద్యంలో పండించే తేట నీటి ఊటలాంటి భావాల కవనం..!!

 

1535. కనుపాపలకు పరిచయిస్తున్నా..!

చిరునవ్వుల వెన్నెలను..!!

 

1536. కన్నుల్లో కలల పంటలెన్నో..!

ఆకు వక్క సున్నం వేయకనే పండిపోయే కిళ్ళీలా..!!

 

1537. నీ జ్ఞాపకాలకే నేనంటే మక్కువ..!

ప్రాణంకంటే ఎక్కువగా నన్నేఅంటిబెట్టుకుంటూ..!!

 

1538. నిరీక్షణకు ఇంత సంబరం దేనికో..!

ఎదురుచూపులతోనే నిన్ను ఎదలో నింపేసుకుంటూ..!!

 

1539. లాకులు తెరిచినా గంగ పొంగదే..!

రైతుల కన్నుల్లో వరదలై పోటెత్తుతూ..!!

 

1540. కలలూ మొరాయిస్తున్నాయి..!

నీతోనే వెళ్ళిపోతామంటూ..!!

 

1541. అపుడపుడూ నువ్వు నచ్చవెందుకనో..!

నీ పంతాన్నేనెగ్గించుకుంటుంటే..!!

 

1542. చేజారి పగిలిపోతున్నాయి..!

ఆశలన్నీ...గాజు పూవులౌతూ..!!

 

1543. మా పల్లెల్లో కోకొల్లలే..!

పచ్చదనాలపానుపులు, అభిమానపు చిరునగవులు..!!

 

1544. జనన మరణాల చక్రాలు ...!

పెరిగే వయసును…తరిగే ఆయువును కొలిచే ప్రమాణాలు(కొలమానాలు)..!!

 

1545. కంటిబాషను నేర్చుకోవడం పొరపాటైపోయింది..!

కొంటెగా కనుగీటినట్లే ఉంది ఏ కంటిని చూస్తున్నా..!!

 

1546. వెదుకుతూనే ఉన్నా నా హృదయం ఎక్కడుందోయని..!

నువ్వు వశీకరణ విద్యను నేర్చుకున్నావన్న మాటనే'మరచి..!!

 

1547. జ్యోతి'ప్రజ్వలనకు పిలిచారంటే ..!

ఇద్దరూ అందగత్తెలేనాయంటూ ఆరా తీస్తాడేంటో..!!

 

1548. దుస్తులే భారమట నవతరానికి..!

ఆది మానవులే నయమనిపిస్తూ..!!

 

1549. భూమాతకెంత మురిపెమో..!

తన గుండెను చీల్చుకుని వస్తున్నా…పచ్చని పసిరికలంటే..!!

 

1550. రామకోటి సమర్పించడానికి రామాలయానికి రమ్మంది బామ్మంటే..!

ప్రేమకోటి సమర్పించడానికి ప్రేమాలయానికెపుడు రానంటున్నాడేమిటో గడుచోడు..!!

 

1551. ఒకదాని వెంట మరొకటి సాగిపోతుంటాయి..!

కవాతుచేసే జవానుల్లా...మబ్బుల గుంపులు..!!

 

1552. లిఖిస్తున్నా మధురోహలెన్నిటినో..!

అదృశ్య వర్ణవీచికలతోనే..!!

 

1553. కాలానికెంత పక్షపాతమో..!

నీసమక్షంలో పరుగులెడుతూ, నిరీక్షణలో నత్తనడకనడుస్తూ..!!

 

1554. దయామయుడవే..!

దీనజనావళికై శిలువపై నెత్తురు చిందిస్తూ..!!

 

1555. అయోనిజనే..!

జ్ఞాపకాలలో మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ..!!

 

1556. తటిల్లతనే..!

కన్నుల వెలిగే ఆనందపు మేఘమాలికలో..!!

 

1557. అతిశయమే..!

పుట్టుకతోనే రంగురంగుల కోకలు చు(క)ట్టిన సీతాకోకలు..!!

 

1558. అపురూపమే అమ్మకెపుడూ..!

అడ్డాలనాటి బిడ్డలు గడ్డాలకు ఎదిగినా..!!

 

1559. అభిసారికనే..!

నాలోనే ఉన్న నిన్ను నాతోనే కలుపుకునే చొరవచేస్తూ..!!

 

1560. కవ్విస్తోంది కాలం..!

నేను గతాన్ని సమీక్షించుకుంటున్న ప్రతిసారీ..!!

 

1561. వాసంతికనౌతున్నా..!

మధుమాసపు కోయిలంటి నిన్ను స్వాగతించేందుకై..!!

 

1562. విరిజల్లులే..!

వాసంతిక ఒక  అరనవ్వు నవ్వగనే..!!

 

1563. మొయిలురేడుకి  పరవశాలే..!

రైతన్న కన్నుల్లో కురిసే ఆనందభాష్పాలకు..!!

 

1564. ఓనమాలను దిద్దడం మొదలు పెట్టాను..!

నీకు ప్రేమ లేఖను వ్రాద్దామనే..!!

 

1565. ఎవరు గిచ్చారో గగనాన్ని ప్రేమగా..!

గోరుముద్రనే నెలవంకగా తురుముకుంది సిగపూవుగా..!!

 

1566. కన్నులే కుంచెలౌతున్నాయి.!.

నీ ఊహల చిత్రీకరణతో పులకిస్తూ..!!

 

1567. కంట తడి పెడుతోంది కంటిపాప..!

నన్వీడిపోతున్న నీడవైన నిను చూసి..!!

 

1568. ఆత్రంగా వెదుకుతున్నా నీకై..!

నువ్వే నేనైన నాలోనే..!!

 

1569. మనస్సుకు మాటలు నేర్పావపుడు..!

బాధల బడిలో చేర్చావిపుడు..!!

 

1570. కాలమెంత గడుసరిదో కదా..!

మన కోసం తానాగదు…తనతో రమ్మనీ పిలువదు..!!

 

1571. నీ పెదవులపై కొలువుండాలనే..!

నే చిరునవ్వుగా మారింది..!!

 

1572. అక్షరాన్నే అవుతున్నా..!

నా ప్రేమను లేఖగా మలిచేప్రయత్నంలో..!!

 

1573. కలనైనా కలగనలేదు..!

కలగానే కరిగిపోతావని..!!

 

1574. చెక్కిలికింత సిగ్గులు దేనికో..!

ముద్దు'గులాబీ మొగ్గలే తొడుగుతుంటే..!!

 

1575. విజయమే వరిస్తేఎలా..!

అపజయాలకూ చోటివ్వాలిగా…జీవితలోతును కొలవాలంటే..!!

 

1576. నా గుండె బరువెక్కింది..!

చేజారిన పసిజ్ఞాపకాలు తడుముతుంటే..!!

 

1577. అపురూపం నీ చిత్రం..!

హరివిల్లునే కుంచెగా మలచి సృష్టికర్త చిత్రించిన తీరు..!!

 

1578. వెదుకుతూనే ఉంటాను..!

కోటిజన్మలైనా నీయునికికై..!

 

1579. ప్రకృతి నాట్యానికి చిగురుటాకుల తాళమట..!

శ్రవణ నిఘంటువులోని పుటలను తిరగరాస్తూ..!!

 

1580. మత్తకోకిలకు మరుపు ఎక్కువైనట్లుంది..!

మధుమాసానికి ముందే మైమరుస్తోంది..!!

 

1581. విలపిస్తున్నాడు కన్నీరుమున్నీరుగా..!

ఎవరు గాయపరిచారో మేఘుని హృదయాన్ని..!!

 

1582. మనస్సును మభ్యపెట్టుకుంటున్నా..!

ప్రేమను చంపుకునే సాధనలో నేనోడిపోతూ..!!

 

1583. మదిప్రాకారాన్ని దాటుతున్నాయి..!

ఊహల అశ్వారోహణం చేస్తోన్న తలపులు..!!

 

1584. హోయలుపోతోంది శ్రావణ మేఘం..! 

చినుకుల జూకాలను పెట్టుకుని..!!

 

1585. దేనినైనా వదులుకుంటానన్నావు నాకోసం..!

నన్నే వదులుకుంటావనుకోలేదు నీకోసం ..!!

 

1586. దిద్దుకుంటా పారాణినే..!

నీ ముద్దుల ముద్దబంతుల రేకులతో..!!

 

1587. నీ ముద్దులమురిపాలకే...!

సిగ్గుల మందారాలు నా కళ్ళల్లో..!!

 

1588. మొదటి ఎడబాటును రుచి చూసిన తరుణం..!

పలకాబలపంపట్టి అమ్మనొదిలి చదువులమ్మను చేరిన క్షణం..!!

 

1589. ఏ శస్త్రం ఛేదించలేదు..!

నినుగప్పిన నా అనురాగకవచాన్ని..!!

 

1590. కన్నీటికెంత లోకువో నేనంటే..!

నాకోసం కాక నీ కోసమే వాటినెక్కువ ఖర్చుచేస్తున్నానని..!!

 

1591. నిన్ను చూసాయి కాబోలు ..!

నిన్నటి అద్భుతాలన్నీ తలదించుకుంటున్నాయి..!!

 

1592. నీ ఇంటిపేరునే చేర్చుకోవాలనుంది..!

నా పేరుకి ముందు ఇంటిపేరును మార్చాలనెందరో వేచియున్నా..!!

 

1593. నీ పరిచయంతోనే తెలిసింది..!

జ్ఞాపకాలకూ పరిమళం ఉంటుందని..!!

 

1594. వన్నెలరాజు వలపు సంతకాలకేమో..! 

వెన్నెలమ్మ హృదికిన్ని పరవశాలు..!!

 

1595. నీ కళ్ళతో వెలుగుని చూపించావు..!

నాకళ్ళకు కలలు కనడం నేర్పేస్తూ..!!

 

1596. కనుపాపలకెంత కలవరమో..!

కనుమరుగైపోయే నీ రూపాన్ని చూపేందుకై..!!

 

1597. అలలు ఎగిసిపడేది తీరందాటాలనేమో..!

నా కలలు పయనమయ్యేది మాత్రం…నీయెదతీరాన్ని తాకాలనే..!!

 

1598. ఊహవై తట్టిలేపేస్తావు..!

కలలోకొస్తావని నే రెప్పలు మూయగనే..!!

 

1599. వెన్నెలమ్మతో నెలరాజు సరసాలకేమో..!

గగనపు చెక్కిలిపై సిగ్గుల ఇంద్రదనస్సు విరిసింది తుళ్ళింతలతో..!!

 

1600. వేపపూల వసంతం..!

తలపుల ఉగాదులతో..!!

 

1601. తారావళీ మౌక్తిక శోభితాలే..!

నీలాంబరి చీర మడతల్లో..!!

 

1602. కంటి ప్రమిదల్లో ఆశలవత్తులెన్నో..!

కన్నీటి చమురులతోనే వెలిగిస్తూ..!!

 

1603. ఊహలన్నీ గాల్లోని మేడలుగానే కట్టేస్తావు..! 

మాటలన్నీ నీటిపై రాతలుగానే రాసేస్తూ..!!

 

1604. మనోవనమంతా అంధకారమే..!

చిక్కగా వికసించిన చీకటి రాత్రిపూలతో..!!

 

1605. నీ అంతరాత్మని అడిగిచూడు ఒక్కసారి..!

నువ్వెంతగా నా ప్రేమను వెలివేస్తున్నావో..!!

 

1606. జ్ఞాపకాల శబ్దాలు..!

అంతరంగంపై శాశ్వత శిల్పాలను చెక్కుతూ..!!

 

16o7. ఒంటరైపోయింది స్వప్నం..!

నీ తుంటరితనం తోడు లేక..!!

 

1608. నీపరిచయపు నెత్తావులే..!

మనోవనమంతా గుబాళిస్తూ..!!

 

1609. సువాసనల ప్రవాహమే..!

నీతలపుల వీవనలలో..!!

 

1610. కన్నులతీరంలో పోటెత్తే వరదలు..!

మదిలో జ్ఞాపకాలనదుల పొంగులతో..!!

 

1611. తారలనెవరు చూస్తారు..!

శరశ్చంద్రికలు కొలువైన నీ కళ్ళుండగా..!!

 

1612. ఆశలన్నీ అర్పణలే అంతరంగానికి..!

నేలలో ఇంకిపోతున్న చినుకుల్లా..!!

 

1613. మనోగగనమంతా ఆనందాల పతంగాలే..!

నీతలపుల దారాలతో ఎగురుతూ..!!

 

1614. అంతరంగం విషాద జలసమాధే..!

ఊహల్లో నువ్వు కనబడకుంటే ..!!

 

1615. మనసెలా పసిగట్టిందో నీ పదధ్వనిని..!

పులకిస్తోంది తొలకరికి పులకరించే పుడమైపోతూ..!!

 

1616. మదిలో విరిసే సంతోషాల హరివిల్లులే..!

కోయిలల కుహుకుహులను తలపించే పలుకులతో..!!

 

1617. నిజం చెప్పవూ నిన్నొకటి అడుగుతున్నా..!

నాకంటే మరోలోకం నీకుందంటే నమ్మేదెలా..!!

 

1618. నువ్వు వదిలేసిన ఈ ఏకాంతం..!

ఏకకాలంలో వేల సుడిగుండాల్లో చుట్టేసినట్లు..!!

 

1619. మది జోగుతోంది కలల లోకంలో..!

నీ మాటల మత్తుగుళికలను మింగి..!!

 

1620. ఋతువులు విడ్డూరంగా దారి తప్పాయి..!

వసంతాలన్నీ నీలోకి, గ్రీష్మాలన్నీ నాలోకిప్రవేశిస్తూ..!!

 

1621. నీ మేని పరిమళం..!

నువ్వు కనుమరుగైనా నాలోనే గుబాళిస్తూ..!!

 

1622. స్వచ్ఛతల కొలనులో ఉన్నట్లుంటుంది..!

మల్లెలాంటి నవ్వులను చూస్తుంటే ..!!

 

1623. పాడుకుంటూనే ఉన్నాను..!

కన్నీటి పాటలెన్నిటినో ఎడారి కోయిలనేనౌతూ..!!

 

1624. వేచి ఉన్నా నీకై..!

మమతల మాలికలెన్నో అల్లుకుని..!!

 

1625. కోకిలమ్మ అలుగుతోంది..!!

తన గానంకంటే నీపలుకులే ప్రియమయ్యాయని..!!

 

1626. ఇంకిపోయిన ఒయాసిస్సులే..!

నీచే హతమైన నా ఆశలు..!!

 

1627. గోపాలుని ప్రేమ గోపెమ్మలందరికీ సమం..!

రాధమ్మకు మాత్రం మాధవుడే జీవితం..!!

 

1628. విసురుతూనే ఉంటాడు వసంతుడు..!

ప్రతి తరువుపై వలపుశరాలనెపుడూ ..!!

 

1629. భావాలకెన్ని పరిమళాలో..!

నా తలపుల తోటమాలివి నీవైతే..!!

 

1630. ఆదమరచిపోతూ ఉంటాను..!

నీ ఊహలలోనే కాలాన్ని మరుస్తూ..!!

 

1631. కరుగుతూనే ఉంది కాలం..!

హృదయాన్ని శిలగా మిగిల్చి..!!

 

1632. మల్లెల కాలమట..!

మరుడికి మురిపెమేగా..!!

 

1633. కలగా కరిగిపోతోంది జాముకాలం..!

వ్యధగానే  జీవితకాలాన్ని మిగులుస్తూ..!!

 

1634. ఎంత ఆశయో నా మదికి..!

నన్ను నేను నీలా ప్రేమించాలని..!!

 

1635. ఏ కల్మషం ఎరుగనిది చిరుప్రాయమే..!

 

నీపై నాకున్న ప్రేమంత స్వచ్చంగా..!!

 

1636. నీజ్ఞాపకాలెపుడూ తీయనివే..!

మదిని చెరగని గాయాలుగా మారుస్తున్నా..!!

 

1637. ఊహలకు ఊపిరి పోసిన నువ్వే ..!

కలలకు మాత్రం సంకెళ్ళు వేస్తావెందుకనో..!!

 

1638. కనురెప్పలపైనే వ్రాసాను ప్రేమలేఖలను..!

కనీసం కలలోనైనా చదువుతావని..!!

 

1639. ఆనందలోకమే సృష్టిస్తాను..!

ఒక్క మాట చెప్పవూ నీప్రేమ నాకే సొంతమని..!!

 

1640. నాగుండె బరువెక్కింది..!

భరతమాత గుండెను ముక్కలుగా చీల్చుతుంటే..!!

 

1641. రెక్కలు విచ్చుకున్న విహంగాలే ఊహలు..!

నీ నవ్వులన్నీ మోహనరాగాలైన వేళలో..!!

 

1642. ఆశలెన్నో చిగురిస్తున్నాయి రేపటి వెలుగై వస్తావని..!

కనబడని స్వరాలేవో వినిపిస్తున్నాయి ఆయువై నడిపిస్తావని..!!

 

1643. వింత మైకమేదో కమ్మేస్తోంది..!

నీ చూపులొచ్చి వాలుతుంటే..!!

 

1644. నా కనులతోనే వ్రాస్తున్నా కవితలెన్నో..!

మదిలో మాటలనే ప్రణయాక్షరాలుగా మారుస్తూ..!!

 

1645. మరుమల్లెల వానలే..!

సుగంధాలను నింపే నీ మాటలు..!!

 

1646. మౌక్తికాలను పోగేస్తున్నా..!

నీ నవ్వుల వానల్లో తడుస్తూ..!!

 

1647. మది చంటిపాపై మారాంచేస్తోంది..!

నువ్వు అనునయంగా లాలిస్తుంటే..!!

 

1648. వికసిస్తున్నాయి సిగ్గులమొగ్గలు..!

ఊహల తొలకరులతో..!!

 

1649. నింగివనంలో విరబూసిన తారాసుమాలు..!

తోటమాలి చంద్రయ్యకు వెన్నెలహారాలు..!!l

 

1650. నా ఊహలనావ..!         

నీ కలల అలలపై తేలిపోతూ..!!

 

1651. నీ అలుకలే నాకు మనోహరం..!

నా అనునయాలే నీకు సుమహారమౌతుంటే..!!

 

1652. మురిసిపోతోంది నా మది..!

నీ  అనురాగాల లాలనతో..!!

 

1653. గాలికి ఆరని చిరుదీపాన్నే..!

నీ గుండెగుడిలో వెలిగినంతవరకూ..!!

 

1654. మదిలో తారాదీపాలు నీ నవ్వులు..!

హృదికి మలయమారుతాలౌతూ నీ ఊసులు..!!

 

1655. నువ్వు నడిచొచ్చే దారుల్లో కోకిలల స్వాగతాలు..!

నీ పాదాల సవ్వడికి మురిసిపోతూ విరుల తివాచీలు..!!

 

1656. నీ కన్నుల వెలిగే దివ్వెలే ..!

నా కళ్ళకి వెన్నెలకాంతులను పంచుతూ..!!

 

1657. సిరిమువ్వలతో కలిసి క్రొత్తగా రవళిస్తున్నాయి..!

మురళికందని స్వరాలంటి నీ స్వరగమకాలేవో..!!

 

1658. నీ పెదవి విప్పని మౌనాలకే ..!

నా కనులు దాచలేని జలపాతాలు..!!

1659. నీతోనే వేస్తున్నా సప్తపదులు..!

సప్తజన్మలకు వారధిగా నిలిచిపోవాలని..!!

 

1660. ఒక కలగానే మిగిలిపోయావు..!

కనుల మాటున కొలువున్నావనుకుంటే..!!

 

1661. తెగ మెలికలు తిరిగిపోతోంది లేఖిని..!

నీకు ప్రేమలేఖ వ్రాయడం మొదలెట్టగానే..!!

 

1662. నాకు చుక్కలనే చూపిస్తావు..!

నువ్వు  చుక్క'లెంటే పరుగుతీస్తూ..!!

 

1663. ఊహలకేమి ఊసులు నేర్పావో..!

గుసగుసలాడుతున్నాయి నన్ను చూస్తూ..!!

 

1664. మౌనంగా ఉన్నావనుకున్నా..!

మదిలో నన్ను దాచుకున్నావనుకోలేదు ఇంతపురూపంగా..!!

 

1665. వెదుకుతూనే ఉంటా..!

వేయిజన్మలైనా నీ ప్రేమ భాష్యానికై..!!

 

1666. చక్రవడ్దీని చెల్లిస్తున్నా..!

మరు జన్మలోనైనా నీప్రేమకు అసలు ఋణం తీర్చుకోవాలిగా..!!

 

1667. పెదవులపై పలికించే ప్రేమే అనుకున్నా..!

గుండెల్లో వెలిగించుకున్న అనురాగ దీపమనుకోలేదు..!!

 

1668. గుప్పెడంత గుండె అలసి సొమ్మసిల్లిపోతోంది..!

ఉప్పెనంత నీ ప్రేమప్రవాహాన్ని దాచుకోలేక..!!

 

1669. మరి నీకంటదే, ఏ కల్మషం..!

ప్రేమపక్కనే పొంచి ఉంటుందట ద్వేషం..!!

 

1670. వేచి చూస్తుంటా వేయి యుగాలైనా..!

జన్మంతా నీకే కానుకను చేస్తూ..!!

 

1671. దగ్గరకాలేరు  కొందరు బంధువులు దరినేవున్నా..!

దగ్గరివారే మనసుకెపుడూ…ఆత్మబంధువులు దూరానవున్నా..!!

 

1672. నీ పరిమళాన్నే తలపిస్తూ..!

మనోవనంలో ఆశల కుసుమాలు..!!

 

1673. ఈజన్మలో చేసేది నీకోసం నిరీక్షణే..!

మరోజన్మైనా నా అన్వేషణ నీకొరకే...!!

 

1674. నేనౌనంటే నువ్వు కాదంటావు..!

అచ్చం నా మాట వినని నా మనసులా..!!

 

1675. మరులనెత్తావినే నింపేస్తాయి..! 

మనోవనంలో నీ ఆశల కుసుమాలు..!!

 

1676. తలపుల్లో నందనాన్నే నింపుకుంటున్నా..!

నాకు అశోకవనాన్నే మిగిల్చినా ..!!

 

1677. అలుకే ముద్దంటావు..!

ముద్దంటే చేదంటావే..!!

 

1678. మళ్ళీ జన్మించాలనుంది..!

తుళ్ళే పసిప్రాయానికై ..!!

 

1679. ఊహాలోకాన్ని వదలాలని లేదు..!

నువ్వెక్కడ కనుమరుగౌతావోననే భయంతో..!!

 

1680. శోధిస్తూనే ఉన్నా మనోసాగరాన్ని..!

నీ ప్రేమముత్యాలను ఏరుకోవాలనే ..!!

 

1681. చిగురించనీ ఆశల శిశిరాలను..!

జీవనయానంలో నవవసంతాన్ని నింపిపోయేలా...!!

 

1682. నా కన్నుల్లో తారకలు..!

నీ చిరునవ్వుల ప్రతిబింబాలే..!!

 

1683. ఎంత నేర్పరివో..!

గుండెలోని హాలాహలం చల్లార్చి…మాటలతోనే అమృతాన్ని చిలికించేస్తూ..!!

 

1684. మనస్సు పరిమళిస్తోంది..!

వసంతుడివై  వలపుల పల్లవులేవో నువ్వాలపిస్తుంటే..!!

 

1685. నీ నవ్వుల తివాచీ పరిచావా..!

అందరాని పాలపుంత చెంతచేరిందని భ్రమపడ్డాను..!!

 

1686. తెలిమబ్బులపై విహరిస్తోంది మనసు..!

ఊహలవర్ణాలనే పులుముకున్న హరివిల్లుగామారి..!!

 

1687. తనువుకే కాదు..!

మనస్సుకూ అలుపేనంట…జ్ఞాపకాలభారాన్ని మోసిమోసి..!!

 

1688. మొగ్గనై  వేచి ఉన్నా..!

ఏ క్షణాన నీ వలపుల తొలకరులతో మురిపిస్తావోయని..!!

 

1689. మాయదారి సిన్నోడు..!

గుండెల్లో ప్రేమ అయస్కాంతం పెట్టుకుని తిరుగుతున్నాడట నాకైయనుక్షణం..!!

 

1690. హంసలదీవికి దారి చెప్పవూ..!

ఈ క్షణమే ప్రేమగతులను నేర్చేసుకోవాలి రాయంచల శిక్షణలో..!!

 

1691. అంతిష్టం దేనికో నువ్వంటే గుహలకు..!

అనుక్షణం ప్రతిధ్వనిస్తున్నాయి నీ నామాన్నే..!!

 

1692. వలపు దోసిలి పట్టవూ..!

నీతో గడిపిన క్షణాలన్నీ ప్రేమ జల్లులుగా కురిపిస్తాను..!!

 

1693. ఒట్టేసి చెప్పు మరి..!

ఎల్లకాలం నాతోనే ఉండిపోతానని..!!

 

1694. స్తుతిస్తూనే ఉంటా భాష ఉన్నంత వరకూ..!

నిను ధ్యానిస్తూ ఉండాలనే…చివరి ఘడియవరకు..!! 

 

1695. కవనం ఒక అందమైన వనం..!

అలుపెరుగని అక్షయమే కవుల కల'కలం..!!

 

1696. నీ ఊహలను హత్తుకోవాలని కోరిక..!

గతజన్మ బంధం కూడా గుర్తుకువచ్చేలా..!!

 

1697. మధుపాల మధురచుంబనాలకేమో..! 

సిగ్గుల పుప్పొడిని జార్చుతున్నాయి కుసుమకాంతలు..!!

 

1698. ధరణిపై నవ్వుల పువ్వులను రువ్వేస్తూ..!

చినుకు ముత్యాలతో తేలిపోతున్నాడు మొయిలురేడు..!!

 

1699. అక్షరాలన్నీ మెరిసే తారకలే..!

నీ పదాలను అల్లుకుంటుంటే..!!

 

1700. కన్నీటితో తొణికింది మదికొలను..!

నను విడిచిన మరుక్షణమే ..!!

 

1701. ఆనందంలో కనురెప్పల తాళాలు..!

గతకాలం హత్తుకున్న ప్రతిసారీ..!!

 

1702. మనోవిల్లును ఎక్కుబెట్టిన శ్రీరాముడవని మురిసా..!

ఇల్లిల్లునూ చక్కబెట్టే శ్రీక్రుష్ణుడివని ఆదమరిచిపోతూ..!!

 

1703. ఋతువులనే శృతి చేస్తున్నాయి..!

నీపలుకులను నేర్చిన కోయిలలు..!!

 

1704. నే వసంతమై వస్తా..!

సుగంధమై నన్నంటే ఉంటానంటే..!!

 

1705. జాబిలమ్మ వెన్నెల పిండారబోసుకుంది..!

చుక్కల వడియాలను పెట్టుకోవాలనేమో..!!

 

1706. నీ జ్ఞాపకాలను హత్తుకున్న ప్రతిసారీ..!

మనలో కలిసిపోతున్నా ననునేను వదులుకుంటూ..!!

 

1707. వయస్సుతో అనుభవం వస్తుందో లేదో..!

అనుభవిస్తే మాత్రం వయస్సు పెరుగుతుంది..!!

 

1708. లిపిలేని కంటి బాషతో..!

మనసూ నేర్చింది మాటలెన్నో..!!

 

1709. మనసూ మాటలు నేర్చింది..!

మౌనమనే ప్రేమాక్షరాలనే వల్లిస్తూ..!!

 

1710. జ్ఞాపకాల చివురులెన్నో..!

మోడువారిన మదితోటలో..!!

 

1711. మనోవనిలో కన్నయ్యవే కలలెన్నో నింపేస్తూ..!        

మధువనిలో రాధమ్మనే కలలకొలనులో కలువనైవికసిస్తూ..!!

 

1712. నాలో సగమై నినునిలిపేసే..!

వరాలనే దైవం మనకందిస్తూ..!!

 

1713. చినుకువై నువ్వు తాకగానే..!

నిదురమబ్బులన్నీ ఇంద్రవర్ణాలైపోతున్నాయి కన్నుల్లో..!!

 

1714. మెరుపులే దీపాలట జాబిలమ్మ మందిరానికి..!

తారలే తోరణాలట వెన్నెలమ్మ ముఖద్వారానికి..!!

 

1715. కరిమబ్బుల చిరుజల్లులకేమో..!

ధరణికి హరితవర్ణ పల్లవులతో పరవళ్ళు..!!

 

1716. సుమబాలల నర్తనాలు..!

మలయమారుతాల గ(జ)తులకు..!!

 

1717. పూటలో రాలిపోయే విరులే తలపులు..!

మాసిపోని మమతల మరులంటి జ్ఞాపకాలతో..!!

 

1718. మదిలో నిండిన మహారాజు గారాలు..!

ఒడిలో నిండిన యువరాజు మారాములు..!!

 

1719. ఆశావిహంగాలు ఎగిరిపోతున్నాయి..!

నీగుండెగూటిని చేరే దారి తెలియక..!!

 

1720. గుండె పగిలిన చప్పుడుకేమో..!

దొర్లిపోతోంది కాలం దుఃఖగీతమాలపిస్తూనే..!!

 

1721. నిను చేరాలనే తపనతోనే..!

సెకనుకోసారి లెక్కిస్తున్న నిమిషాలెన్నో..!!

 

1722. నా ఆశలెపుడూ వేకువ కిరణాలే..!

నీ మాటలెపుడూ నీరవపు తెరలే..!!

 

1723. ఏ బిడ్డనైనా కడుపున మోసేది అమ్మనే..!

ఆడబిడ్డ నిండుగా ప్రేమించేది మాత్రం నాన్ననే..!!

 

1724. నీ కలల ఆమని..!

మది అంచులలో వేలాడుతూ ఓ సుందర పూవని..!!

 

1725. వసంత సమీరాల జల్లులు..!

నీపదాల విరుపుల హరివిల్లులు..!!

 

1726. మదివీణకి ఎన్ని సరాగాలో..!

కలలోని నీ చిలిపినాదాలతో..!!

 

1727. పదంతో పదం కలిపి పాడితే ప్రణయరాగం..!

పాదంతో పాదం జత కడితే జీవనరాగం..!!

 

1728. ముత్యాల తోటలు..!

నీ దరహాసపు జల్లులతో విరబూస్తూ..!!

 

1729. కరగనీయకు నా కలల్ని..!

కంటున్నాగా తీయని తలపుల్ని..!!

 

1730. మధువుల వరదల్లో మునుగుతూ మధుపాలు..!

సిగ్గుతెరల్లో దాగిపోతూ సుమాల సోయగాలు..!!

 

1731. తనువుకెంత మైమరపో..!

నీ కలల కౌముదిలో విహరిస్తుంటే..!!

 

1732. కనురెప్పలు పాడేవి కన్నీటి పాటలే ..!

మదిలో ఎగసిపడే అలల లయలతో..!!

 

1733. సర్వం కోల్పోతున్నా..! 

నాలో ఉన్న నిన్ను పోగొట్టుకున్నాక..!!

 

1734. చెక్కిలిపై సిగ్గులు జ్ఞాపకాలమొగ్గలే..!

అంబరానికి తళుకులు తారాసుమాలల్లే..!!

 

1735. శశిరేఖలనే దర్శిస్తా..!

తొలిస్వప్నమై నీవొస్తే..!!

 

1736. జాబిలమ్మ పహారా..!

వెన్నెల కాగడాతో చుక్కలతోటకి కాపలాగా.!!.

 

1737. అలుపు తెలియదు కలల కంటికి..!

మరుగు తెలియదు ఊహల మింటికి..!!

 

1738. ఆశల పూవని..!

నీ ఊహల పరిమళాలతో సుమిస్తూ..!!

 

1739. కలల పుప్పొడి సిగ్గిల్లింది..!

వలపు సుమాలతో సంగమిస్తూ..!!

 

1740. ఒంటరినే నన్ను నే కోల్పోతూ..!

నా ఊహలతో నేనే రమిస్తూ..!!

 

1741. నీ జ్ఞాపకాల మేఘాలు..!

ఆశల తారకల్ని దాచేస్తూ ..!!

 

1742. ప్రేమిస్తే తలపులతో తంట..!

పెళ్ళైతే  మాటల తూటాలేనంట..!!

 

1743. బ్రతుకంతా వసంతాల తోట..!

నువ్వు నింపిన ఆశలబాటలో..!!

 

1744. కలం కూడా శ్రీనాధుని పక్షమే..!

శృంగారరస ప్రవాహంలో మునకలు వేస్తూ..!!

 

1745. ఆనందాల మజిలీలెన్నో..!

సాగిపోయే నీ కలల యాత్రలో..!!

 

1746. ఇంకిపోని జలనిధులు..!

కనుకొలనుల్లో నిండే గుండెలోని వ్యధలు ..!!

 

1747. ధరణికి కుసుమ తివాచీలు..!

పవనుని చిలిపి అల్లరులకు తరులు జార్చే సిగ్గులసుమాలు..!!

 

1748. కవనానికెన్ని ఉరకలో..!

అక్షరాల జల్లులన్నీ నీపైనే కురిపిస్తూ..!!

 

1749. విత్తులు కూడా రోధిస్తున్నాయి..!

రైతన్నల కన్నీటిజల్లులతో మొలకెత్తడానికి..!!

 

1750. కంటికి మూగవేదనే..!

జార్చే బిందువుకు భాష్యాన్ని వెదకలేక..!!

 

1751. నీ అనుమతి దేనికి..!

నీ జ్ఞాపకాలతో గడిపేందుకు..!!

 

1752. ఒక్కచుక్కనైనా రాల్చలేక మొయిలు..!

కన్నీటిజల్లులను ఆపలేవు నాకనులు..!!

 

1753. వెదుకుతూనే ఉన్నా..!

నడిచెళ్ళిన దారుల్లో జ్ఞాపకాల గుర్తులకోసం..!!

 

1754. చినుకు పడితే అందెలనర్తనం నాటి మదికి..!

చినుకులు రాల్చడమే నిత్యకృత్యం నే(నీ)టి కంటికి..!!

 

1755. నీ పలుకరింతల పరిమళాలతో..!

కుసుమిస్తోంది మది నవవసంతమై..!!

 

1756. కన్నీటి కళ్ళాపేమో చెక్కిలికి..!

చినుకుల కళ్ళాపేమో ధరిత్రికి..!!

 

1757. ధారలుగా రుధిరబాష్పాలు..!

  నీ మాటల కంటకాల తాకిడితో..!!

 

1758. పడిలేచే ఆశల కెరటాలెన్నో..! 

మనోసంద్రంలో తల దాచుకుంటూ..!!

 

1759. ఆలోచనల్లో మాత్రం ఒక్కరమే..!

మనం ఇద్దరుగా కనిపిస్తున్నా..!!

 

1760. ఆలోచనల పర్వాలెన్నో..!

కాలపు పేజీలో ఒంటరితనాన్ని తడుముతూ..!!

 

1761. ఒయాసిస్సుల పలకరింపుల్లా నీ తలపులు..! 

ఎడారిదారుల పయనించే నా జీవనయానంలో..!!

 

1762. జారిపోతున్నాయి  జ్ఞాపకాలు..! 

తామరాకు చెక్కిలిపై కన్నీటి బిందువులుగా..!!

 

1763. జ్ఞాపకాల వరదల్లో కొట్టుకుపోతూ..!

కురిసి జారిపోయే ప్రేమచినుకులెన్నో..!!

 

1764. ఒకరిలో ఒకరు ఒదిగిపోతూ..!

ఏకమౌతున్నాయి రెండు హృదయాలు..!!

 

1765. తన్మయత్వమే హృదికి..! 

నాతోనే ఉన్న నిన్ను నాలో కలుపుకున్న ప్రతిసారీ..!!

 

1766. ఒదిగిపోతోంది నా మది..!  

నీ హృదయ పరిష్వంగంలో..!!

 

1767. నేను పాడే ప్రతిపాటా నీ కలలపాటే..!

తొలిసారిగా నేను విన్నది అమ్మ జోలపాటైనా..!!

 

1768. కువకువల రాగాలెన్నో సుప్రభాత వేదికపై..!

భ్రమరాల రవాలెన్నో సుమాల ఎదలపై..!!

 

1769. పదాలన్నీ చెమ్మగిల్లుతున్నాయి..!

నీ జ్ఞాపకాలన్నీ కవితలుగా మారుస్తుంటే..!!

 

1770. మెలిపెట్టే  స్మృతులెన్నో..!

గతం గవాక్షాల్ని తెరవగానే హృదయాంతరాలలో..!!

 

1771. వత్సరాలను రాలుస్తోంది కాలం..! 

పత్రాలనురాల్చే తరువులతో పోటీపడుతూ..!!

 

1772. కనుపాపలంటే ఎంత ప్రేమనో కన్నీటికి ..!

ఎదలోతుల్లో నుండి మరీ తడుముకుంటూ వచ్చి పలకరిస్తున్నాయి..!!

 

1773. మనస్పూర్తిగా ప్రేమించాలనుంది..!

నీ జ్ఞాపకాల నీడలను సైతం..!!

1774. ధరణిని చీల్చుకొచ్చే హరితఖడ్గాలే..!

హృదయాన్ని చీల్చేసే జ్ఞాపకాలు..!!

 

1775. నువ్వే నేనై మురిసిపోతూ నా నిన్నల్లో..!

నేను నేనుగానే మిగిలిపోతూ నీ నిందల్లో..!!

 

1776. చిరునవ్వుల దీపకళికలే..!

క్రోధపు పెనుగాలుల్లో మిణుకు మిణుకుమంటూ..!!

 

1777. కలల నిశీధిలో..!

వలపుల మెరుపులెన్నో..!!

 

1778. నీ తలపుల విరులే..!

కలల పూదోటలో పరిమళిస్తూ..!!

 

1779. కన్నె మేఘమై వేచి ఉన్నా..!

వలపు చినుకునై నిను తాకాలని..!!

 

1780. చెవిని చేరే కొంటె ఊసులే..!

మది మురళికి స్వరాలుగా మారుతూ..!!

 

1781. కవితా సుమాలు..!

సాహితీ కొలనులో వికసించే పద్మాలు..!!

 

1782. అక్షరాలన్నీ అలిగిపోతున్నాయి..!

నీ ప్రియలేఖకు శ్రీకారం చుట్టలేదని..!!

 

1783. మౌనగీతికలే ఆలపిస్తున్నా నీకోసం..!

మాటలలో చెప్పలేని భావాన్నందిస్తూ..!!

 

1784. నదులై వరదలై పొంగిపోతున్నాయి..!

మది చూరుల నుండి జారిపోయే కన్నీటి చినుకులు..!!

 

1785. కలలు సైతం వెలివేస్తున్నాయి..!

కన్నీటి సంద్రాన్ని ఈదలేక ..!!

 

1786. మౌనరాగమే ఆలపిస్తున్నా..!

మనోతంత్రులను మీటుతూ..!!

 

1787. పసిపాపవేగా నువ్వు..!

అక్కున చేర్చుకుంటున్నానందుకే …మనసు పొత్తిళ్ళలోకి..!!

 

1788. అతికించుకుంటున్నాపెదవులపై చిరునవ్వులనే..!

కన్నీటియాశల్ని కనురెప్పలమాటునే అదిమిపెడుతూ..!!

 

1789. ఏ భూతద్దం వాడాలో..!

నీ మనస్సును చూడాలంటే..!!

 

1790. మణిమాలిక ..!

మధువుల పద సుమవేదిక..!

 

1791. కాలం చూరులనుండి జారిపోతూ..!

వత్సరాల వర్షపు బిందువులెన్నో..!!

 

1792. నా నిఘంటువులో..!

అర్ధంకాని పదానివై  మిగిలిపోయింది నీవే ..!!

 

1793. ఓడి పోయావంటూ గేలిచేస్తావెందుకు..! 

గెలిపించానుగా నిను ప్రేమపందెంలో..!!

 

1794. మనస్సుని బంధించేసాను..!

వెంటాడే జ్ఞాపకాలకు దూరంగా ఉండాలని..!!

 

1795. నిరీక్షణలు తప్పడం లేదు..!

నిన్ను  ప్రేమించాను కదా..!!

 

1796. సాగిపోతూనే ఉంటాయి చిలిపి ఊహలెపుడూ..!

వాన కురిసాక తేలిపోయే మేఘంలా..!!

 

 1797. ఎదలోతుల్లో చమరింతలు..!

మరుగున పడిన తలపులను తోడుతుంటే..!!

 

1798. హృదయం బేలగా గోలచేస్తోంది..!

బంధనాలను తెంచుకోవడం చేతకాక..!!

 

1799. తడి ఆరనివ్వదు మనసు..!

పాతగాయాలను పదేపదే త్రవ్వుకుంటూ..!!

 

1800. మౌనరాగమాలపిస్తున్నా..!

నీ కలల వేదికపై రేయంతా..!!

 

1801. జాజి మల్లెల జంపాలలే..!

జతగా నువ్వు నడుస్తుంటే..!!

 

1802. అక్షరాలకు అంతే లేదు ..!

నీ ప్రేమలేఖలో అక్షయమౌతూ..!!

 

1803. కన్నీటి పొరలమాటున నీరూపం..!

నయనాల చిత్తడిలో తడిసిపోతూ..!!

 

1804. గుండె బావి ఆవిరైపోతోంది..!

నా ఆశలన్నీ తడారిపోతుంటే..!!

 

1805. మనసు పొరల్ని త్రవ్వుకుంటున్నా..!

వెతల కతలను వెలికితీద్దామనే..!!

 

1806. కుసుమిస్తున్నాయి ఆశల కలువలెన్నో..!

వలపు మడుగులో పరిమళిస్తూ..!!

 

1807. రేయినదిలో జాబిలమ్మనే..!

కలల అలలపై హాయిగా ఊయలలూగుతూ..!!

 

1808. వేకువలోనూ కలనేకంటున్నా..!

నీ చిరునవ్వుల సుమాలు వరమాలై నను అల్లుకుపోతుంటే..!!

 

1809. మది తీరం సేదతీరుతున్నది..!

జ్ఞాపకాలు శ్రావణసమీరాలై స్పృశిస్తుంటే..!!

 

1810. వసివాడని పసితనం పరిమళిస్తున్నది..!

మనోవనమంతా బాల్యపుప్పొడిని అద్దుకుంటుంటే..!!

 

1811. మౌనంగానే నిష్క్రమిస్తున్నా..!

ఖాళీ చేయమంటున్న జ్ఞాపకాల మైదానం నుండి ఏకాకినై..!!

 

1812. అనునయ సమీరాలు స్పృశిస్తుంటే..!

కళ్ళలో కురుస్తున్నాయి స్వాతిచినుకులు..!!  

 

1813. వనమంతా సందడులే..!

వసంతుని కళ్యాణానికి కిలకిల వాయిద్యాలతో..!!

 

1814. హేమంతాల వేదికపై కచేరీలెన్నో..!

మత్తెక్కిన భ్రమరాల ఝుంకారాలతో..!!

 

1815. ప్రేమిస్తూనే ఉన్నా..!

నాలోని నిన్ను నాకన్నా మిన్నగా..!!

 

1816. ప్రేమదీపాలను వెలిగిస్తున్నా..!

మది గగనంలో ఆరని తారాదీపాలుగా..!!

 

1817. ప్రేమలేఖలు వ్రాయలేదనేమో..!

వలపు సిరా అలుక పూనింది..!!

 

1818. ప్రేమ దర్పణం..!

నాలో ఉన్న నిన్నే చూపిస్తూ..!!

 

1819. మదిగుహలో ప్రకంపనలు..!

నీ పేరునే ప్రేమగా ప్రతిధ్వనిస్తూ..!!

 

1820. నీ ప్రేమలేఖలతోనేగా..!

నామనోపుస్తకం నిండింది..!!

 

1821. పరవశిస్తోంది హృదయం..!

నీ ప్రేమ అంచులను స్పృశిస్తుంటే..!!

 

1822. నీ పాదానికి అభిషేకం..!

నా మాటల పూలతోనే ..!!

 

1823. శృతి చేస్తున్నాయి మదిని..!

నూతన పదగతులతో వసంతగీతికలు..!!

 

1824. అలలు అలుపెరుగవు..!

అంతమెరుగని కలలవలెనే..!!

 

1825. కన్నీటి బొట్టు జారుతోంది..!

గుండెలోని భారాన్ని దించుతూ..!!

 

1826. గడిచిన ప్రతి క్షణం విలువైనదే..!

గతమై తాకుతూ…అనుభూతులెన్నో మిగులుస్తూ..!!

 

1827. శిశిరమంటి మోడువారుతున్నాయి..!

మనం విహరించిన ఊహల పూదోటలు..!!

 

1828. నీ ఊహాకన్యకలు..!

మది మౌనప్రాంగణలోకి చిరుసవ్వడితో అడుగిడుతూ..!!

 

1829. కాలం నిండుచూలాలే..!

ప్రతి నిత్యం క్షణాల బిడ్డల్నికంటూ..!!

 

1830. కలలెరుగని కలత నిదురలే..!

ఉలికిపాటు పడే మెలుకువలతో..!!

 

1831. చిత్తమంతా చింతలే..!

పోగొట్టుకున్నదేదో పోల్చుకోలేక..!!

 

1832. ఆనందానికి చిరునామాను వెదుకుతున్నా..!

చేజారిన క్షణాలకు విలువకట్టుకుంటూ..!!

 

1833. చెక్కిలిపై జారుతోంది..!

నీ జ్ఞాపకం తాలూకు ఫలితమేదో..!!

 

1834. దాగిపోవాలనే ఉంది..!

నీ గుండె కోటలో ఏ మూల గదిలోనో..!!

 

1835. స్మృతుల గవాక్షాలను తెరిచాను..!

అనుభూతులను ఏరుకుంటూ పాత అనుభావాలనే క్రొత్తగా పరిచయించుకుంటూ..!!

 

1836. కంటిపై కునుకెక్కడిదీ..!

కరిగిపోయిన క్షణాలను నీ సమక్షంలో తిరిగి పొందేవరకు..!!

 

1837. నవ్వుల మౌక్తికాలను జార్చేయకలా..!

వెండిరాశులను నింపుకునే జాగాలేదిక..!!

 

1838. మౌన లేఖలెన్నో..!

మనసు నేర్చిన క్రొత్త భాష్యంతో..!!

 

1839. చెక్కిలిపై మిగిలిన కన్నీటి చారికలు..!

నీ(నా) ప్రేమకు అవశేషాలుగా మిగిలిపోతూ..!!

 

1840. అమృతం తాగుతుందేమో..!

నిత్య యవ్వనంతోనే ఉంటుంది ప్రేమెపుడూ..!!

 

1841. ఎదురు చూస్తూనే ఉన్నా..!

ఆశలచివురులను తొడుగుతూ చైత్రమైవస్తావనే..!!

 

1842. ఎగసిపడుతోంది అంతరంగం..!

పౌర్ణమి నాటి వెన్నెల కెరటమౌతూ..!!

 

1843. అక్షరాలు అజ్ఞాతవాసం చేస్తున్నాయి..!

భావాలన్నీ మౌనంలోనే బందీలౌతుంటే..!!

 

1844. భావాల గువ్వలు..!

కవనగూటిలో బందీలౌతూ..!!

 

1845. గతమై మిగిలిపోతూ..!

ప్రతిక్షణం విలువైనదే..!!

 

1846. కన్నీటిబరువు తెలిసేది..!

చెక్కిలిపై బొట్లుగా జారి గుండె భారాన్ని దించినపుడే..!!

 

1847. మనసు మూగబోతోంది..!

కన్నుల్లో, గుండెల్లో నువ్వు నిండిపోగానే..!!

 

1848. మళ్ళీ జన్మించాలనుంది..!

గుండెగుప్పిళ్ళలో దాచుకున్నఅపురూపమైన నిన్నలలో..!!

 

1849. ఏకాకినై తిరుగుతున్నా..!

గతపు గవాక్షాలను తెరుచుకుంటూ జ్ఞాపకాలవీధులలో..!!

 

1850. కరిగిపోతూనే ఉంటాయి..!

కాలపుకొలిమిలో వత్సరాలు సైతం క్షణాలుగా..!!

 

1851. స్నేహానికీ తప్పని మొహమాటమే..!

గమ్యమనుకుంటే మజిలీగానే వెళ్ళిపోతూ..!!

 

1852. ఆలకిస్తోంది మూగమనసు..!

చెమ్మగిల్లిన కనుల కన్నీటి గాధలను..!!

 

1853. అన్వేషణౌతోంది పయనం..!

పరుగులే ఆరాటమౌతుంటే..!!

 

1854. సాగిపోతూనే ఉంటుంది..!

నిరంతర అన్వేషణ నాలోని నీకై..!!

 

1855. మనసు జార్చుకున్నా..!

నీపై ప్రేమను దాచుకోవడమెలాగో తెలియక..!!

 

1856. గతవర్తమానాలు..!

గొప్ప నాటకాలే అంతరంగశాలలో అభినయిస్తూ..!!

 

1857. జీవనప్రతిలో తెరవని పేజీలెన్నో..!

తీరని ఆశల పుటలుగా, వీడని నిరాశల కధనాలుగా..!!

 

1858. తీయని స్పర్శనద్దుకోవాలని ఉంది..!

స్మృతులవో, అత్మీయులవో ఆవేదనలనడ్డుకోవాలనే..!!

 

1859. నేటికి రేపొక ప్రశ్న..!

నిన్నలను మరువనీయని జ్ఞప్తులదాడితో..!!

 

1860. ప్రశ్నించకలా నా మనసు జాడకై..!

నీ నీడగా మారిందని తెలిసికూడా..!!

 

1861. తెలిసీ తెలియని ఆరాటాలెన్నో..!

అసంబద్ధమనిపించే ప్రశ్నల ధాటితో..!!

 

1862. హృదిలో సంద్రాలై స్రవిస్తున్నగాయాలెన్నో..!

నిట్టూర్పుల ఉప్పెనలతో అలజడుల సునామీలతో..!!

 

1863. మనసు బరువెక్కుతోంది..!                             

కలవరపరిచే కలతల కావడిని మోస్తూ..!!

 

1864. కలదిరుగుతూనే ఉంటాయి గతాలెన్నో..!

మదితలుపులు తెరవగానే కలగా ముగిసినవో, కధగా మిగిలినవో..!!

 

1865. విహారమంతా నీ తలపుల్లోనే..!

కనులకూ…కలలకూ లంకెవేస్తూ..!!

 

1866. మణిమాలిక..!

పద జల్లుల భావమాలిక ..!!

 

1867. సంతోషం తొణికిపోతోంది..!

నీ వెచ్చని ఊసుల ఆలింగనాలతో..!!

 

1868. మనసు ఆవరణలో పచారీ చేస్తున్నాయి..!

స్మృతి పథంలోని దృశ్యాలు సజీవాలైపోతూ..!!

 

1869. రేయికీ వేకువకీ నడుమ కలలగమనం..!

నిదురకీ, మెలుకువకీ మధ్య సహగమనంలా..!!

 

1870. ఆవిష్కరిస్తున్నా..!

మౌలికాంతరాలలో దాగిన రహస్యాలెన్నో..!!

 

1871. తరచి తరచి వెదుకుతున్నా..!

తిరస్కృతిలో చేజార్చుకున్న జ్ఞాపకాలను..!!

 

1872. కప్పుకోక తప్పదుగా..!

జ్ఞాపకాల పొరల్లోని గాయాలనైనా…హేయాలనైనా..!!

 

1873. భావాల మడులలో నాటుతున్నా..!

పదాలకట్టలతో సాహితీక్షేత్రాన కవనపంటలకై..!!

 

1874. మనసుమూతను పెట్టేసాను..!

వెల్లువౌతున్న వేదనలు అన్నీ పొంగిపోకూడదనే..!!

 

1875. ఊపిరి సలపకున్నది..!

నీలోని నన్ను వెదుక్కునే ప్రయత్నంలో..!!

 

1876. మదిని వెంటాడుతోంది..!

చిరపరిచిత రాగమేదో, ఊపిరిగా మారుతూ..!!

 

1877. పహారాకాస్తూనే ఉంటాయి జ్ఞాపకాలు..!

గతసౌధంనుండి నిను జారనీయకుండా..!!

 

1878. ప్రేమగీతాలు ఎన్ని వ్రాయాలో..!

నిను నిన్నుగా ఆవిష్కరించేందుకు..!!

 

1879. నేనొక యజ్ఞవేదికనే..!

ప్రేమాగ్నిహోత్రమై జ్వలించే నీకై హోమాగ్నినౌతూ..!!

 

1880. ఉరుములై ఉరిమే వెతలెన్నో..!

కనులగగనాన కన్నీటిచినుకులై కురిసిపోతూ..!!

 

1881. మళ్ళీ పసిపాపనవ్వాలని ఉంది..!

అమ్మ గర్భాన నిద్రించేందుకై..!!

 

1882. నీలిమబ్బునై తేలిపోతున్నా..!

కన్నీటిని కురిపించిన మదిగగనం తేలికపడగానే..!!

 

1883. కన్నీటివాన కురిసింది..!

గుండెల్లో మకిలిపట్టిన దిగులును కడిగేస్తూ..!!

 

1884. పువ్వై వికసిస్తోంది..!

బోసినవ్వులను తాకిన హృదయపు అరవిందం..!!

 

1885. దిగేకొద్దీ పెరుగుతూనే ఉంది..!

సుళ్ళు తిరిగే అగాధపు లోతు అంతుబట్టని ప్రేమసాగరంలో..!!

 

1886. ఆగక సాగిపోయే కాలప్రవాహన్నే నేను..!

నాతో నడిచొచ్చేవారందరినీ నాలోనే కలిపేసుకుంటూ..!!

 

1887. ప్రతి ఘడియ వర్తమానమే..!

నువ్వొక విలువైన బహుమానమౌతుంటే..!!

 

1888. రాలిపోతూనో, చివురిస్తూనో..!

కొమ్మారెమ్మల సహవాసాన్ని మరిపిస్తోంది మన చెలిమి బంధం..!!

 

1889. అన్వేషణ సాగిస్తున్నా..!

మానవత్వపు జాడ మచ్చుకైనా కనిపిస్తుందేమోనని..!!

 

1890. కవనక్షేత్రాన్ని పండించాలంటే..!

తప్పదేమో కలాలను హలాలుగా మార్చడం..!!

 

1891. కావ్యాలెన్నో మలుచుకుంటున్నా..!

జ్ఞాప"కాల"గమనంలో చివురిస్తున్న బాల్యపు వసంతాలపై..!!

 

1892. మనిషిగా మరణించాలని ఉంది ...!

చరితగా మళ్ళీ జన్మించేందుకు..!!

 

1893. ప్రాధేయపడకు దీనురాలిలా..!

మానప్రాణరక్షణకై గుడ్డిరాజ్యపు దుశ్శాసనుల దర్బారులో..!!

 

1894. గురివిందగింజలు ఎందరో..!

ఎదుటివారి మచ్చలనే వేలెత్తి చూపిస్తూ..!!

 

1895. నమ్మకపు వారధి కూలిపోయింది..!

నీ పలు(గు)కురాళ్ళలో నాణ్యతలోపించగానే..!!

 

1896. ఓటమి తప్పదు ఏ ప్రాణికైనా..!

జీవితం, మృత్యువుతో బేరం కుదుర్చుకున్నాకా..!!

 

1897. మనసు జ్వలిస్తోంది..!

అపరిమితయాలోచనలతో రగిలిపోతూ..!!

 

1898. ముల్లై గుచ్చుతూనే ఉంటావు..!

పూవల్లే మృదువుగా నవ్వుతూనే..!!

 

1899. విజేతనై నిలవాలనుంది..! 

ఓటమి మార్గాలను మూసేస్తూ, గెలుపు ద్వారాలను తెరుచుకుంటూ..!!

 

1900. విజేతనై నిలవాలనుంది..! 

మానవత్వపు నిరూపణ పరీక్షలో నెగ్గి..!!

 

1901. గల్లంతైపోతోంది గతం..!

కాలప్రవాహంలో కొట్టుకుపోతూ..!!

 

1902. సంతలో సరుకుకాదుగా..!

కొనుగోలుచేద్దామనుకునేందుకు మానవత్వం..!!

 

1903. చెల్లిస్తావా తగినంత మూల్యాన్ని..!

నీకై గడిపిన నిదురలేని నా కన్నీటి రాత్రులకు..!!

 

1904. గాయాన్ని పూడ్చడం సాధ్యమేనా..!

విరిగి అతికించుకున్న మనస్సుకు..!!

 

1905. ఎంతొచ్చిందో లాభం..!

ప్రేమవ్యాపారంలో నువ్వేసిన లాభనష్టాల బేరీజులో..!!

 

1906. సంతోషాన్ని నటిస్తున్నా..!

చిరిగిన నవ్వుకి ఆనందపు మాసికేసుకుని..!!

 

1907. అనుబంధాలూ ఆటవిడుపులే..!

జీవితాలతో ఆటలాడుకుంటూ..!!

 

1908. ఆహ్లాదంలోకి ఆహ్వానిస్తున్నాయి..!

జ్ఞాపకాల పుస్తకంలోని యవ్వనపు పుటలు..!!

 

1909. నీ ఎద లయించదెందుకనో..!

నే గాయంమానని వేదననౌతున్నా..!!

 

1910. నేన్నేనుగా జీవించిన క్షణాలన్నీ..!

 ఆనవాలుగా మిగిలిన ఆకృతులే..!!

 

1911. సరిహద్దులను గీస్తూనే ఉంది కలసిరాని కాలం..!

ఇరు మనసుల మధ్యన ఇనుపతెరగా మారిపోతూ..!!

 

1912. ఇంత కలలమోహం దేనికో..!

నిదురరాని నా కనులకు..!!

 

1913. నేర్పుగా ఒడుకుతూనే ఉన్నా..!

ముక్కలు ముక్కలుగా తెగిపోతున్న మన మాటల దారాలను..!!

 

1914. అనుచితపాత్రనై మిగిలిపోయాను..!

నటించడం నేర్వలేని జీవితమనే మహానాటకంలో..!!

 

1915. నను మన్నించవూ..!   

మన ప్రేమగీతంలో నేనొక అపశ్రుతినైనందుకు..!!

 

1916. నిష్క్రమిస్తున్నా..!

మన ప్రేమనాటకాన్ని రక్తికట్టించలేనని తెలిసీ..!!

 

1917. మనసుతెరను తొలగించలేకున్నా..!

ప్రకటించుకోలేని సన్నివేశాలన్నీ ఉదాసీనంగా కనుమరుగైపోతుంటే..!!

 

1918. అనావిష్కృతమౌతోంది ఆలోచనల ప్రాంగణం..!

నాలోనే కరిగిపోయే పలుకులతో, నాలోనే చెరిగిపోయే చిత్తరువులతో..!!

 

1919. నా మనసు ఎప్పటికీ శ్వేతపత్రమే..!

నువ్వు గాయపరచినపుడల్లా రుధిరాక్షరాలతో నింపుకునేందుకు..!!

 

1920. నా రాత్రికి రంగులద్దుతున్నా..!

రాలిన కలలను పేర్చుకుంటూ..!!

 

1921. స్మృతులగాయం మానకుంది..!

జీవితపుస్తకంలోని మన చెలిమిపేజీని చించేసినా..!!

 

1922. మౌనాన్ని పగలగొడుతున్నా..!

మన మధ్యన మాటలవారధిని నిర్మించుకుంటూ..!!

 

1923. మౌనపుతెర జారుతోంది..!

మదియంచులలో వ్రేలాడే భేషజాలు తొలగిపోగానే..!!

 

1924. నివురుగప్పిన నిప్పువే..!

మనసుకుంపటిని రాజేసిపోతూ..!!

 

1925. కనుదోయిలోనే దాగుండిపోతూ..!

కరిగిపోని కలనవ్వాలనుంది..!! 

 

1926. వర్ణచిత్రాన్ని అవుతున్నా..!

సంతకమై నువ్వొలికిపోతావనే..!!

 

1927. గాయాల శకలాలెన్నో..!

కలలదర్పణం పగిలిపోగానే..!!

 

1928. నీ కలల సీతాకోకలే..!

నా కనురెప్పలకాన్వాసుపై వర్ణాలనద్దేది..!!

 

1929. నీ ఊసుల కుంచెలేనేమో..!

నా ఒంటరితనపుగోడపై చిత్తరువులనద్దుతున్నది..!!

 

1930. పేదరికపు శలభాలు..!

ఆకలిమంటలకు ఆహుతైపోతూ..!!

 

1931. రంపాలై కోసేస్తున్నాయి..!

నెత్తురింకిపోయిన క్షణాలన్నీ..!!

 

1932. వ్యర్ధప్రయత్నమే చేస్తున్నా..!

చేజారిపోయిన కొన్ని ఘడియలనైనా దోసిటిమడ్చాలని..!!

 

1933. ఒంటరి ప్రమిదనై మిగిలిపోయాను..!

గాయపడ్డ మదిగూటిలో చీకటినింపుకుంటూ..!!

 

1934. కాలపు కెరటాలు..!

నా ఆశల గుజ్జనగూళ్ళను కూలదోసేస్తూ.!!

 

1935. గుండెలపై చరిచిపోతోంది..!

మగతనిద్రలో నీదైన ప్రతి జ్ఞాపకం..!!

 

1936. కనులు సైతం నను వెలివేస్తున్నాయి..!

నీకై కన్న కలలు కానేరవంటూ..!!

 

1937. మంత్రిస్తోంది మౌనం..!

నీ మాటలగారడీలోకి నను నెట్టేస్తూ..!!

 

1938. నే కాలాన్ని దాచిపెడుతున్నా..!

నీ సమక్షంలో ఖర్చుచేసుకుందామనే..!!

 

1939. రాలిపోకతప్పదు ఏనాటికైనా..!

పూవులైనా…పెదవులపై విరిసిన నవ్వులైనా..!!

 

1940. ఏకాంతపు సౌధాలను నిర్మిస్తున్నా..!

నా ప్రేమను పదిలపరుచుకుందామనే..!!

 

1941. హృదినొక కళాక్షేత్రంగా మలుచుకున్నా..!

నీ జ్ఞాపకచిత్రాలను ప్ర'దర్శించుకునేందుకు..!!

 

1942. ప్రాణవాయువే నీవు..!

నా కణాంతరాలలో వాయులీనమై శ్వాసిస్తూ..!!

 

1943. ఉష్ట్రపక్షులమే మనం..!

కలి'విడిగానే బ్రతుకుతూ…కలిసున్నట్లు నటిస్తూ..!!

 

1944. సమతారాజ్యాన్ని మేల్కొలిపేది..!

కలం'కారుల కలాలు…ప్రజావీరులు గళాలే..!!

(కలం'కారులు - కవులు)

 

1945. పాఠాలు నేర్పి పరీక్ష పెట్టేది విద్య..!

పరీక్ష పెట్టి పాఠాలు నేర్పేది జీవితం..!!

 

1946. స్వేచ్ఛాకాంక్షలతో పరుగులు తీస్తూనే ఉంటాయి..!

మదితలుపులను తెరవగానే పగ్గాలెరుగని కోరికలతురగాలు..!!

 

1947. నీ సమక్షంలో ఉండాలంటేనే భయం..!

నా అస్థిత్వాన్ని ఎక్కడ కోల్పోతానోనని..!!

 

1948. ఎవరికివారే యమునా తీరే..!

మనిషికీ మనిషికీ మధ్య అహంకారపు మహాకుడ్యాలను నిర్మించుకుంటూ..!!

 

1949. జ్ఞాపకాలపేటికలో భద్రపరుచుకుంటున్నా..!

ఒడిసిపట్టుకున్న ఆనందక్షణాలెన్నింటినో..!!

 

1950. కన్నీటిసిరాతోనే లిఖిస్తున్నా..!

వ్యధను అక్షరాలుగా మలుచుకుంటూ మనసుకాగితంపై..!!

 

1951. అంతాన్ని వెదకలేకపోతున్నా..!

అంతులేని మన వింత ప్రేమకధకు..!!

 

1952. వివర్ణమైపోతోంది హృదయం..!

నా మనసులేఖను వ్రాయడం మొదలుపెట్టగానే..!!

 

1953. గుండెల్లో పొడిస్తేనేమిలే..!

నువ్వు దించింది…తేనెలు పూసిన మాటల కత్తులనేగా..!!

 

1954. రైతన్నకు ఎదురుతెన్నులు దేనికో..!

మేఘసందేశాలకై కంటిమేఘాలు కుండపోతలౌతున్నా..!!

 

1955. కన్నీటిపొరలను కరిగించలేకపోతున్నా..!

ముఖానికెంతగా సంతోషపు ముసుగును తొడుగుతున్నా..!!

 

1956. ఆహ్వానిస్తూనే ఉన్నా..!

మన ఏకాంతపు జ్ఞాపకాలను ఎడబాటులో సైతం ఆనందంగా..!!

 

1957. నీకైసాగే అన్వేషణలో..!

గమ్యం తెలియని ప్రయాణమే నాది..!!

1958. మౌనం చేజారింది..!

మన ఒంటరితనంలోని మాటలను ముక్కలుచేస్తూ..!!

 

1959. కోతను కోస్తూనే ఉంటుంది..!

తప్పించుకోతరంకాని కాలం కొడవలి..!!  

 

1960. మాఫీ చేయవలసిన బంధాలబాకీలెన్నో..!

జీవితగమ్యంలో తేల్చుకోలేని లెక్కలతో..!!

 

1961. గమ్యం మనవెంటే..!

జీవితానికి ఒక లక్ష్యమంటూ ఉంటే..!!

 

1962. గమ్యమెరుగని వర్తమానాలు..!

కలలఒడిలో కునుకుతీస్తూ..!!

 

1963. కన్నీటిరుధిరాలై స్రవిస్తున్నాయి..!

గుండెల్లో గుచ్చుకున్న జ్ఞాపకాల గాజుముక్కలు..!!

 

1964. ఒంపుతూనే ఉంటావు..!

కలలను సైతం కల్లోలపరుస్తూ కన్నీటిపాత్రలెన్నిటినో..!!

 

1965. నిలువెల్లా చలిస్తున్నా..!

గతజన్మల గాఢపరిచయమేదో హృదిని హత్తుకోగానే..!!

 

1966. మనల్ని విడదీయగలిగిందనేమో..!

తెగ అక్కసును వెళ్ళగక్కుతోంది ఉబుసుపోనికాలం..!!

 

1967. మారాలనే ఉంది నీ జీవితపు కరదీపికగా..!

నా మనసుకు నాకంటే నువ్వే దగ్గరైపోతుంటే..!!

 

1968. ప్రశ్నార్థకమైపోతోంది నా అస్థిత్వం..!

నీ కోపతాపాలు, ఆత్రాలు, ఆరాటాల మధ్య నలిగిపోతూ..!!

 

1969. అగ్నిపునీతలే కావాలట ధర్మపత్నులుగా..!

వీరు శ్రీరామచంద్రులు కాకున్నా..!!

 

1970. వ్యధలన్నీ వలసపిట్టలై సాగిపోతున్నాయి..!

చెదరని చిరునవ్వులను ముఖాన్నద్దుకున్నాకా..!!

 

1971. కనురెప్పలు బరువెక్కుతున్నాయి..!

నీ నిరీక్షణాక్షణాల భారాన్ని మోయలేక..!!

 

1972. దూకేసే ప్రయత్నం చేస్తున్నా..!

నన్నావరించిన అజ్ఞానపు చీకటిమొనలనుంచి..!!

 

1973. "నేడు" మోసపోతూనే ఉంటుంది..!

"నిన్న" చూద్దాం అనుకుంటూ, "రేపు" చేద్దామని వాయిదావేస్తూ..!!

 

1974. తన్మయత్వం సుడులు తిరుగుతోంది..!

నా మదినది నీ ప్రేమ కడలిలో సంగమిస్తుంటే..!!

 

1975. పేదవారి ఆకలిమంటలు..!

చలికాలంలోనూ వెచ్చదనాన్నిస్తూ..!!

 

1976. కన్నీటి చుక్కలై చెంపల్ని తడుముతున్నాయి..!

నువ్వాడిన కొన్ని పలుకు(గు)లు తలపు(కొ)కోస్తూ..!!

 

1977. కొన్ని జ్ఞాపకాలపేజీలను తెరుస్తున్నా..!

మూసేసిన గతపు గ్రంధంలో పారిపోయిన సంతోషాలను చేజిక్కించుకోవాలనే..!!

 

1978. అందనంత ఎత్తులోనే ప్రేమెపుడూ..!

మనసులతో ఆడుకుని మురిసిపోతూనో…పందెమేసి గెలుపోటములను పరిచయిస్తూనో..!!

 

1979. అసంతుష్ట విజయాలే..!

బతుకుసమరంలో నిర్వేదాలను, నిస్తేజాలను నింపుతూ..!!

 

1980. మనసుత్రాసుపై తూకమేస్తున్నా..!

సుఖదుఃఖాలన్నింటినీ…కడదాకా సమంగా భరించాలనే..!!

 

1981. ఓదార్పుకై చల్లుకుంటున్నా..!

గుండె నుండి చేదుకున్న కన్నీళ్ళనే..!!

 

1982. అన్వేషణ సాగిస్తున్నా..!

నీరవం నిండిన కన్నుల్లో వెలుగుదివ్వెలకై..!!

 

1983. ఛిద్రమైన చిత్తం..!

గాయాలకు తావులేనంతగా..!! 

 

1984. నే నిశినౌతున్నా..!

నీ కలల ప్రపంచాన్ని కావలికాస్తూ..!!

 

1985. గతపు గవాక్షాల్ని తెరిచాను..!

మధురస్మృతులకు మళ్ళీ ఆహ్వానమంపుతూ..!!

 

1986. కాపలాను కాయలేకున్నవి..!

కలలను, కన్నీళ్ళను ఆపలేని కనురెప్పలు..!!

 

1987. మదిని సూటిగా తాకుతున్నాయి..!

సంధించిన మౌనాలన్నీ శరాఘాతాలౌతూ..!!

 

1988. ఆటుపోట్ల అవక్షేపాలెన్నో..!

గతించిపోయిన జ్ఞాపకాలనిక్షేపాలలో..!!

 

1989. హృదయాన్ని తాకిపోతోంది..!

భాషాతీతమైన భావమేదో ఉద్వేగాలఉప్పెనలతో ముంచేస్తూ..!!

 

1990. జలజలా రాలుతున్నాయి జ్ఞాపకాలు..!

గతపు దుప్పటిని దులపగానే..!!

 

1991. శిలగా మారుస్తోంది..!

మదిని తొలిచేస్తూ మౌనపు ఉలి..!!

 

1992. కావలికాస్తుంటారు సూర్యచంద్రులు..!

రేయింబవళ్ళు దివిటీలౌతూ కాలపు రాదారికి..!!

 

1993. తికమకపడిపోతోంది..!

ఏ "కొమ్మ"పై వాలాలో తెలియని వయసు గువ్వ..!!

 

1994. మాటల కచేరీని ఆపరాదూ..!

మత్తిల్లిన మది తెప్పరిల్లేవరకు..!!

 

1995. దూరం తరగదు ఎందుకనో..!

ఎంత దగ్గరగా మనముంటున్నా..!!

 

1996. బ్రతుకొక బొంగరమే..!

ఊపిరున్నంతవరకు తిరుగుతూ, ఊపిరాగగానే ఒరుగుతూ..!!

 

1997. మరణం..!

జీవులు అందుకునే కడపటి కానుక..!!

 

1998. కంట తడి ఆరకున్నది..!

క(ప)న్నీటి జల్లు కురిసింది మది అ(మ)డుగున కదా..!!

 

1999. కన్యాదానాన్ని అందుకోరాదూ..!

మూడు ముళ్ళ బంధంతో ముడిపడిపోతూ..!! 

 

2000. కలం మీద సామే..!

కవనరంగంలో కదం తొక్కడమంటే..!!

 

2001. కంటిమేఘం వర్షిస్తోంది..!

గుండెల్లోని దిగు(బు)లునంతా కుండపోతగా కుమ్మరిస్తూ..!!

 

2002. తమకంతో తడుముతోంది జ్ఞాపకం..!

నిదురించిన గతాన్ని కదిలిస్తూ ని(మి)న్నల్లోకి నను నెట్టేస్తూ..!!

 

2003. మనసు కొమ్మ విరబూస్తోంది..!

వయసుకు వసంతం వచ్చినట్లుంది..!! 

 

2004. స్వేచ్చా విహంగమై విహరిస్తోంది..!

మదిగూటిని వీడిన ప్రేమపావురం..!!

 

2005. కాలాన్ని బంధించాలనుంది..!

నీతో గడిపిన ప్రతిగడియను పదిలపరుచుకునేందుకు..!!

 

2006. జీవనపాత్ర..!

పొంగిపొరలుతూనే  ఉంటుంది...విషాదాలతోనో, సంతోషాలతోనో..!!

 

2007. మూసేయక తప్పలేదు..!

మన ప్రేమపుస్తకంలో నిష్ఫలమైపోయిన పేజీలన్నింటిని..!!

 

2008. కలల్ని భరించలేకున్నా..!

శుభస్వప్నాలకు స్థానం లేకుండా పోతుంటే..!!

 

2009. బరువెక్కిన మేఘాలే..!

నీకై వర్షించబోయే నా కనులు..!!

 

2010. మంటల బావుటాను ఎగరేస్తున్నాడు..!

సూరీడుని రణరంగానికి పిలిచిందెవరో..!!

 

2011. మనసుతో చదువుకుంటావనే..!

నా ప్రేమలేఖలన్నింటిని కంటిలిపితో వ్రాసింది..!!

 

2012. నిన్ను చూడాలనుంది..!

అందుకేగా నను నేనద్దంలో చూసుకుంటున్నది..!!

 

2013. అభిజిత్తునవుతున్నా..!

శ్వేతతుహినంపై నిను చేరేందుకై..!!

 

2014. నేను అక్షరమౌతున్నా..!

నువ్వు బలపమై నను హత్తుకోగానే..!!

 

2015. నమోదు చేసుకుంటూనే ఉంటారు..!

ప్రతి రోజు తమ రాకపోకలను, గగనపుహాజరుపట్టీలో సూర్యచంద్రులు..!!

 

2016. ఏమి వెదుకుతుంటాడో..!

రాత్రంతా చుక్కలకాగడాలను వెలిగిస్తూ వెన్నెలమామ..!!

 

2017. ఏ నక్షత్రపు తునకలు చిక్కుకున్నాయో..!

తన కనులలో వెలుగులై మెరిసిపోతూ..!!

 

2018. మది ప్రేమ రాగమాలపిస్తోంది..!

నాదస్వరమై నువ్వు మీటగానే..!!

 

2019. తపిస్తూనే ఉన్నా..!

నీ తమకంలోనో, నీ ధ్యానంలోనో ప్రాణమై చేరగానే..!!

 

2020. యవ్వనవీణియను మీటకలా..!

నీ వలపు గీతాలనే ఆలపిస్తోంది..!!

 

2021. బంధాలన్నీ కునుకుతీస్తున్నాయి..!

యాంత్రికతదుప్పటిని కప్పుకుంటున్న ఆధునిక జగతిలో..!!

 

2022. కన్నీటి యుద్దాన్ని చేస్తూనే ఉన్నా..!

గాయాలాశ్రువులను నింపుకుంటూ…విషాదాలను హత్తుకుంటూ..!!

 

2023. ఆశల రంగులనద్దుకుంటున్నా..!

మదిగగనంలో విరబూసిన ఆశల హరివిల్లుకి..!!

 

2024. ఉప్పునీటి గాథలే..!

నా తలగడ చెప్పే కధలన్నీ..!!

 

2025. గతానికి బొత్తిగా పనిలేనట్లుంది..!

మదిపొరలను తవ్వుతూ కూర్చుంటుంది..!!

 

2026. కంటిమేఘం వర్షిస్తోంది..!

ఏ స్మృతుల గాలులు వీచా(తాకా)యో..!!

 

2027. మనోవృక్షం పరిమళిస్తోంది..!

నీ స్మృతుల నెత్తావిలను నింపుకుంటూ..!!

 

2028. నీ పరిచయమొక మలుపే..!

గమ్యమెరుగని నా బతుకుయానంలో..!!

 

2029. క్రీడిస్తున్నాయి విరహాలు..!

నా ఒంటరితనపు మైదానాన్ని గేలిచేస్తూ..!!

 

2030. గుండెల్లో జారుతూనే ఉంటాయి..!

నీతో గడిపిన క్షణాలన్నీ గంగాయమునల ప్రవాహాలై సంగమిస్తూ..!!

 

2031. ఏ గతం పొలమారిందో..!

మదిమేఘం కన్నీరై కురుస్తోంది..!!

 

2032. ఓడిపోతూనే ఉన్నా..! 

మనసు శత్రువుతో యుద్దానికి దిగినపుడల్లా..!!

 

2033. మనోక్షేత్రంలో నాటుకున్నా..!

బాధ్యతల బీజాలను…బంధాలను పండించుకోవాలనే..!!

 

2034. నిలదీసి అడగాలనుంది..!

గమ్యం తెలియని జీవితపయనం ఎంతవరకని..!!

 

2035. ఛిద్రమైన చిత్తం..!

గుండెను తుత్తునియలు చేసేసే నీ మాటల శరాఘాతాలతో..!!

 

2036. చిరునవ్వులనే దివ్వెలుగా వెలిగిస్తున్నా..!

మదిగూటిలోని వెతలచీకట్లను పారద్రోలుకుందామనే..!!

 

2037. ఎవరు నేర్పారో త్యాగగుణం..!

తరువులను పత్రాలను రాల్చుకోమని…మరో వసంతమై పలు(పుల)కరించేందుకు..!!

 

2038. వక్కలైపోతోంది ఉరుములపిడుగులతో..!

ఎవరింతగా పిండేసారో మబ్బుల హృదయాన్ని..!!

 

2039. మూగబోయింది నా పలుకులే..!

మనస్సు భాషిస్తూనేయుంది నిరంతరం పలుకరించే నీ జ్ఞాపకాలతో..!!

 

2040. నేనూ…నా నీడే..!

ఏకాంతఒంటరితనాలలో తోడై ఉంటూ..!!

 

2041. క్రొత్త నెత్తావిలేవో స్పర్శిస్తున్నాయి..!

జ్ఞాపకాలమడతలను విప్పుకున్న ప్రతిసారీ..!!

 

2042. జ్ఞాపకాలతోనే చలి కాచుకుంటున్నా..!

దిగుళ్ళ మంచుదిబ్బలు తాకినపుడల్లా..!!

 

2043. బాల్యంవాకిట్లోనే తచ్చాడుతుంటుంది..!

మనసు పసిపాపగా మారిన ప్రతిసారీ..!!

 

2044. క్రొత్త అధ్యాయాన్ని తెరుచుకున్నా..!

మన చెలిమి పుస్తకంలోని పేజీలన్నీ కలతలచెదలు తొలిచేయగానే..!!

 

2045. ఆత్రుతగా వెదుకుతూనే ఉన్నా..!

నా మనసు లోగిలిలోకి నువ్వడిగిడిన తొలి ఘడియలకై..!!

 

2046. ఆశల మంచెనెక్కి కూర్చున్నా..!

మన ప్రేమపంటను కాపాడుకోవాలనే..!!

 

2047. ఏ రహస్యాలను విప్పుతుంటాయో ఏమో..!

తొలిసంధ్యవేళలో చిగురాకులతో ముచ్చట్లాడే తుషారబిందువులు..!!

 

2048. తొలిప్రాయమై పరవశించాలని ఉంది..!

మన ప్రేమ ప్రపంచాన్ని మళ్ళీ క్రొత్తగా పరిచయించుకునేందుకై..!!

 

2049. పొంగి పూస్తోంది వాడని వసంతం..!

నీ నవ్వులమొగ్గలు విచ్చుకుని గుబాళించగానే..!!

 

2050. పడమటి కనుమలకెంత మురిపెమో..!

తొలికిరణాలు కాంతివలువలను జార్చుతుంటే..!!

 

2051. పలుకులన్నీ మౌనాలౌతున్నాయి..!

ఏ ఊసులు తాకి జతులాడుతున్నాయో..!!

 

2052. మనోకడలికెంత ప్రశాంతతనో..!

నీ జ్ఞాపకాలపూడికలను తీసేసి…ఆశల క్రొత్తనీరుని స్వాగతించగానే..!!

 

2053. నీ ప్రతిమనే మలుచుకుంటున్నాయి..!

మట్టిముద్దలుగా చేరుతున్న మధురోహలు..!!

 

2054. తనువు పులకరిస్తోంది..!

తన పలుకుల కృతులు నడయాడగానే..!!

 

2055. ఎన్ని నిశ్శబ్దక్షణాలను చేజార్చుకున్నానో..!

నీయాలోచనల ప్రవాహంలో కొట్టుకుపోతూనే..!!

 

2056. నీకై ప్రాణ(మవ్వా)మివ్వాలనుకున్నా..!

నన్ను వదిలిపోయే దారినడుగుతావని తెలియక..!!

 

2057. మనసే కాదు…కన్నీరూ అంతే..!

నీవైపు పరుగులు తీయొద్దన్నా నీకై జారిపోవద్దన్నాలెక్కచేయక..!!

 

2058. ఒంటరిగా సాగలేనంటోంది మనస్సు...!

నా జతగా తోడై నీయడుగులు నడిచిన క్షణాలనుండి..!!

 

2059. నటించడం నేర్చుకున్నా..!

స్వార్ధపు ముసుగేసుకున్న చెలిమిని ఓడించేందుకై..!!

 

2060. ఒంటరితనాన్ని ఆశ్రయిస్తున్నా..!

భారమైన బంధాన్ని భరించలేని అసహనంతో..!!

 

2061. మువ్వై సవ్వడిస్తోంది హృదయం..!

మానసవీణ మీటిన మౌనరాగాలతో..!!

 

2062. సిరి'మువ్వలై రవళిస్తున్నాయి..!

మౌనస్వరాలన్నీ నీ హాసాలకు శృతులౌతూ..!!

 

2063. మౌనం మనసువిప్పుతోంది..!

మురిపించే నీ పలుకుమువ్వల పరవళ్ళతో..!!

 

2064. అల్లకల్లోలమైపోతోంది అంతరంగం..!

నీ స్మృతుల సుడిగుండాలు కదలాడినపుడల్లా..!!

 

2065. నేను శ్రీమంతురాలినే..!

జారిపోయే ప్రతి కన్నీటియశ్రువుకు విలువనెరుగుతూ..!!

 

2066. మౌనమే సమాధానమౌతోంది..!

ముగిసిన మాటలు సంధించిన ప్రశ్నలకు..!!

 

2067. వెన్నతో పెట్టిన విద్యలే..!

నమ్మి బ్రతికేయడం నాకు, నమ్మిస్తూ బ్రతికేయడం నీకు..!!

 

2068. బేలగా విలపిస్తోంది..!

నీ జ్ఞాపకాలనొదిలి ఉండలేని నువ్వు తాకిన మనస్సు..!!

 

2069. ముట్టడి చేసేస్తూనే ఉంటావు..!

నిను దూరం పెట్టేందుకు ప్రయత్నిస్తున్న నా ప్రపంచాన్ని..!!

 

2070. గాయమవ్వక తప్పలేదు గుండెలోతుల్లో..!

ప్రేమించలేదని ఎంతగా సరిపెట్టుకుంటున్నా..!!

 

2071. జ్ఞాపకాలదే పైచేయి..!

గతమెంత గతించినా వర్తమానంలోకి చొప్పించేస్తూ..!!

 

2072. తికమకలోయల్లోకి జారిపడుతున్నా..!

యవ్వనపు ఊహలు ఊయలలను ఊపేస్తుంటే..!!

 

2073. మానవత్వం మరణించిందేమో..!

మనిషితనం పురాతన త్రవ్వకాలలో బయల్పడుతుంటే.. !!

 

2074. అంకురిస్తూనే ఉంటాయి..!

బీజాలతో పనిలేకనే పుకార్ల కలుపుమొక్కలు..!!

 

2075. విశ్రమించడమే తెలియదు..!

అవిశ్రాంతిగా కలదిరిగే గతకాలపు జ్ఞాపకాలకు..!!

 

2076. మరీచికల మజలీలెన్నో..! 

నువ్వు పరిచయించిన ఒంటరితనపు ఎడారులలో..!!

 

2077. మౌనాన్ని పాటిస్తూనే ఉన్నా..!

మానవత్వం చచ్చిన ప్రతిసారీ..!!

 

2078. పంపకాలు జరుగుతున్నట్లున్నాయి..!

అమ్మ ఎవరి వా(కో)టాలోకి వెళ్ళిందో..!!

 

2079. ఇంద్రధనువునౌతున్నా..!

చినుకువై నువ్వు తడమగానే..!!

 

2080. ఎక్కడని వెదకను..!

నీ మాటల తూటాలకు ఛిద్రమైపోయిన మనసు చిరునామాను..!!

 

2081. ఎక్కడ నేర్చుకుందో సంగీతాన్ని..!

ఏటేటా క్రొత్త బాణీలను కోకిలమ్మలకు నేర్పించే వసంతగాయని..!!

 

2082. మాతృదినోత్సవ సంబరాలట..!

ఏడాదికోమారు అమ్మకు మనుగడను గుర్తుచేస్తూ..!!

 

2083. వాసంత సమీరాన్నినేను..!

గ్రీష్మతాపాల సమరానివి నీవు..!!

 

2084. భారమెరుగనిది బాల్యమొక్కటే..!

స్నేహస్వచ్ఛతను నింపు(నిలుపు)కుంటూ..!!

 

2085. అక్షరమువ్వలు సవ్వడిస్తున్నాయి..!

కవితలను అల్లుతోంది నీపైనేనని పసిగట్టినట్లున్నాయి..!!

 

2086. హరివిల్లును తాకవెందుకనో వానజల్లులు..!

వెలిసిన రంగులతో బోసిపోతుందనేమో..!!

 

2087. కన్నీటి కడలికి గండిపడినట్లుంది..!

ఉద్వేగపు వరదలతో ముంచెత్తుతోంది..!!

 

2088. చెలిమిరాటకు కట్టేసుకుంటున్నా..!

పదిలంగా అల్లుకుంటున్న మన స్నేహలతలను..!!

 

2089. వడదెబ్బకు సొమ్మసిల్లావనుకున్నా..!

నే రాసుకున్న కవితల ప్రభావమనెరుగక..!!

 

2090. వింతజంతువులకు కొదవేమి లేదనిపిస్తోందీలోకంలో..!

ఉదయాన్నే నను నేను దర్పణంలోచూసుకున్న ప్రతిసారీ..!!

 

2091. సూరీడుని పొగడకూడదందుకే..!

గోరెచ్చనోడివని మెచ్చుకుంటే వేసవంతా గుడ్లురుముతుంటాడు..!!

 

2092. గవాక్షాలను తెరవరాదూ..!

ఎంతకాలమని కావలి కాయను నీ మదిగుమ్మం ముంగిట..!!

 

2093. మువ్వలు మౌనాలెరుగవట..!

మౌనవిస్తున్నాయిగా…నీ పలుకులందెలకు ప్రణమిల్లుతూ..!!

 

2094. తుంటరి తుమ్మెదలెపుడూ ఒంటరులే..!

అధరపు సుధలను గ్రోలేవరకే సుమకాంతలతో నెయ్యమైనా, కయ్యమైనా..!!

 

2095. మదికోటను కొల్లగొడుతూనే ఉంటావు..!

ప్రేమతూణీరాలను ఒడుపుగా విసురుతూ..!!

 

2096. చినుకుమువ్వ రవళిస్తోంది..!

చిగురాకు పాదాలను తాకిన తన్మయత్వంలో..!!

 

2097. వెక్కిరిస్తూనే ఉంటుంది గతం..!

కాలపు కారాగారంలో తననెవరూ బంధించలేరన్న ధీమాతోనే కాబోలు..!!

 

2098. కన్నె కమలం కందిపోతోంది..!

తూరుపు తలుపు చాటునుండి సూరీడు కొంటెగా తొంగిచూడగానే..!!

 

2099. నాకోసమే నేను వెతుక్కుంటున్నది..! 

ఎవరి మనసు కోటలో బంధీనయ్యానో తెలియని అయోమమయంలో..!!

 

2100. ఏకాంతంలో ఓదార్పులే..!

నీతో జగడమాడిన చిలిపి ఘడియలన్నీ..!!

 

2101. పిలవని పేరంటానికి వచ్చేస్తావేం..!

తలపుల నోములన్నిటిని భగ్నంచేసేస్తూ..!!

 

2102. బలపం అరిగితేనేగా..!

అక్షరాలు రూపుదిద్దుకునేది..!!

 

2103. మానవత్వం పరిమళిస్తోంది అపుడపుడు...!

మాతృదినానికైనా అమ్మతనం కమ్మదనమౌతున్నందుకు..!!

 

2104. తారలమ్మలకూ పసిడిపై మోజెక్కువే..!

బంగారంలా మెరిసిపోయే పున్నమిచంద్రుని చుట్టూ తెగ తిరిగేస్తూ..!!

 

2105. ఒంటరి తీరాన్నై వేచియున్నా...!

అలగా తాకిపోయిన నీకై ..!!

 

2106. చినుకులకు చిలిపితనమెక్కువే..!

చిటపటల మొట్టికాయలేసి పూలరేకులను రాల్చేస్తూ..!!

 

2107. నటించడం నీకలవాటే..!

నేనేప్పటికీ మోసపోనని తెలుసుకోకపోవడం మాత్రం నీ గ్రహపాటే...!!

 

2108. ఊరడమే తెలుసనుకుంటా ఊటబావిలో నీటిలా..!

సంతోషంలోనూ దుఃఖంలోనూ ఉబికొచ్చే కన్నీళ్ళకు..!!

 

2109. పిల్లనగ్రోవినవ్వాలని ఉంది..!

గాయాలను గేయాలుగా మీటుకుంటూ నీ మోవిని తాకేందుకై..!! 

 

2110. ప్రతిరేయీ పురిటి నొప్పులే..!

నీ కలల బిడ్డలకు జన్మనిచ్చే నా కనుదోయికి..!!

 

2111. అజ్ఞాతవాసం తప్పనేలేదు..!

పన్నెండేళ్ళు పుష్కరుడికైనా, పదునాలుగేండ్లు పురుషోత్తముడికైనా..!!

 

2112. నీరజాలు మూతి ముడిచాయి..!

నీ కనులతో పోటీపడలేకున్నామని..!!

 

2113. చెక్కిలి క్షేత్రం పండుతోంది..!

కన్నీటి పుష్పాలు కురిసిపోగానే..!!

 

2114. అపార్ధాల రాళ్ళ దెబ్బలను తింటున్నారట..!

పాపం నిజాలను నిక్కచ్చిగా మాట్లాడుంటారు..!!

 

2115. జ్ఞాపకాలన్నీ జాజిపూలౌతున్నాయి..!

ఒక్క రేయి జీవితంతోనే నేలరాలిపోతూ..!!

 

2116. ఆర్తిగా ఏరుకుంటున్నా..!

కాలం రాల్చిన మన పరిచయక్షణాలన్నిటిని..!!

 

2117. అలనై తాకుతున్నా..!

ఉలినై నిన్ను గాయపరచడం ఇష్టంలేక..!!

 

2118. నన్నెన్నడూ వీడిపోనని మాటిస్తావా..!

మరణంలో సైతం నీతోడుండిపోతా..!!

 

2119. మానవత్వమెపుడూ ఇంతే..!

చరితగానే  తానుండిపోతుంది మహానీయతత్వం పరిచయిస్తూ..!!

 

2120. మళ్ళీ పయనించాలనుంది మురిపించే బాల్యంలోకి..!

నాన్నతో నడిచే తొలియడుగుల భాగ్యానికై..!!

 

2121. దైవానికి ఎన్నివేల రూపాలో..!

ఇంటింటా నాన్నగా అవతరిస్తూ..!!

 

2122. అమ్మలు అలుక పూనింది..!

అలసొచ్చిన నాన్న'బొమ్మ తనతో ఆడడంలేదని..!!

 

2123. మరణం విస్తుపోతోంది..!

మానవత్వం అవయవదానం చేస్తూ మరికొందరికి జీవమై శ్వాసిస్తుంటే...!!

 

2124. పాఠాలను నేర్పుతుంటాయి..!

జీవితబడిలో ప్రతి గాయమొక గురువౌతూ..!!

 

2125. తళుకులీనుతూనే ఉంటుంది తాజ్మహలెపుడూ..!

ఎందరు బడుగుజీవులు తమ స్వేదజలంతో సానబట్టారో మరి..!!

 

2126. అక్షరపాతమై జారాలని ఉంది..!

కవనకొండల నడుమ భావనయగారాలతో..!!

 

2127. నాన్నా ఒక సైనికుడే (జవాన్)..!

కుటుంబ(దేశ)రక్షణలోనైనా, ప్రేమ(శాంతి)భద్రతలను కాచు(పంచు)టలోనైనా..!!

 

2128. రాదారెపుడూ ఒంటరే..!

వచ్చేవాళ్ళను ఆహ్వానిస్తూ…వెళ్ళేవాళ్లకు వీడ్కోలిస్తూ..!!

 

2129. ఎంతసేపని నిరీక్షించను..!

రాతిరమ్మా వెక్కిరిస్తోంది…విరహబాధను మరింతపెంచేస్తూ..!!

 

2130. ఎవరన్నారు కన్నీళ్ళు ఉప్పనని..!

తీయందనలద్దుకుంటేనూ…నీకై కార్చినందుకేమోలే...!!

 

2131. కలల్ని భరించలేకున్నా..!

నెరవేరే ఆశ లేదని తెలిసాక..!!

 

2132. క(ల)థగానే  ముగిసిపోయింది..!

మరి కలం స్నేహమేగా మనది..!!

 

2133. పోస్ట్ చేయని ప్రేమలేఖలెన్నో..!

నీకై రాసుకున్న స్వాప్నికజగతిలో..!!

 

2134. మనస్సు మీటేవి నీపలుకులొకప్పుడు..!

జ్ఞాపకాలే జావళీలు పాడుతున్నాయిప్పుడు..!!

 

2135. చిటికెన వేలును కలిపింది..!

బొటనవేళ్ళు కలిపేస్తాడని ఎరుగక..!!

 

2136. తలమునకలైపోతున్నా..!

రేయింబవళ్ళు నీధ్యానపు పరధ్యానాన్నెలా పోగొట్టుకోవాలో తెలియని తికమకలో..!!

 

2137. దిగులును వెంటేసుకుని తిరుగుతుంటుందెపుడూ..!

ఏకాంతానికీ విసుగు పుట్టినట్లుంది…ఎపుడూ ఒంటరిగానే ఉండాలంటే..!!

 

2138. నిన్నల్లోకి వెళ్ళాలనుంది..!

మన పరిచయాన్ని మళ్ళీ మొదలెట్టేందుకై ..!!

 

2139. గుండె గూటికి పండుగొచ్చింది..!

నీ జ్ఞాపకాలధూళిని దులిపేయగానే..!!

 

2140. కాసేపైనా విశ్రమించదేమిటో..!

కలతల చిరునామాలనెప్పటికప్పుడు క(న్నీటి)నులకప్పచెపుతూ…హృదయం..!!

 

2141. పుష్పమాసం వచ్చినట్లుంది..!

మది వనమంతా వలపుసుమాలతో గుబాళిస్తుంటేనూ..!!

 

 2142. నీ పలుకుల మువ్వలనే అల్లుకుంటున్నా..!

నా నిశ్శబ్దపు ప్రాంగణాన నర్తించేందుకై ..!!

 

2143. క్రొత్తదనాన్నే పరిచయిస్తుంటావు ప్రతిసారీ..!

నిన్నల్లోని నిన్నెన్నిమార్లు చదువుకుంటున్నా..!!

 

2144. విస్ఫోటనమైపోతున్నాయి..!

వేదనల పిడుగులన్నీ మనోగగనంలో మందుపాతరలైపోతూ..!!

 

2145. నీ స్మృతులు గుచ్చుతూనే ఉంటాయి ..!

మన గతపుపచ్చికను పరుచుకున్న ప్రతిసారీ..!!

 

2146. జవాబులేని ప్రశ్నవే..!

నా జీవనశోధనలో..!!

 

2147. నే శూన్యాలను పారద్రోలుకుంటా..!

నా మౌనాలను నువ్వాలకిస్తానంటే..!!

 

2148. కొంటె ఊసులనాపేయవూ..!

అలసిపోతున్నా మన ప్రణయప్రబంధాలను రచించలేక..!!

 

2149. మహారాణిని చేసావంటే ఆదమరిచిపోయాను..!

నా కన్నీటిరాజ్యానికేనన్న విషయాన్నెరుగక..!!

 

2150. కంటిమేఘాలు వర్షిస్తున్నాయి..!

నీ చెలిమిస్మృతులను చినుకులుగా జార్చేసుకుంటూ..!!

 

2151. అక్షరాలకూ హద్దులవసరమేమో..!

సున్నితహృదయాలను ఛిద్రంచేస్తుంటే..!! 

 

2152. నిత్య యవ్వనులే..!

ఉరకలు వేస్తూ కడలి కెరటాలెపుడూ..!!

 

2153. గుప్పెడు భావాలను అరువీయవూ..!

ఋణం తీర్చుకోవాలనుంది…అమ్మకో కమ్మని కవితను అంకితమిస్తూ..!!

 

2154. రంభాఊర్వసిలే మక్కువందరికీ..!

సీతాసావిత్రులంటూ అవహేళనజేస్తూ..!!

 

2155. నిలదీసి అడగాలనుంది..!

కాలపుగడియారంలో నిష్ఫలమైపోయిన మన ప్రేమఘడియలన్నింటిని..!!

 

2156. మమతలవీణియ నేనౌతా..!

అష్టమస్వరాన్ని పరిచయిస్తూ..!!

 

2157. భావాల ఉలిని చేపట్టాను..!

నీకో అక్షరశిల్పాన్ని కానుకిద్దామనే.!!

 

2158. శతాయుష్మాన్భవ..!

దీవెనలెన్నందుకున్నా చివరకు మిగిలేది ఆరడుగులేగా..!!

 

2159. ఏరుకుంటూనే ఉన్నా..!

చెక్కిలి తోటలోని నీటి పుష్పాలన్నింటిని నువ్విచ్చావన్న మమకారంతోనే..!!

 

2160. యుగాంతం..!

అపుడే రాలేనంటోంది మరి…పాపాలను మోయడమే తనకిష్టమంట..!!

 

2161. మాటల ఉలిని చేపట్టాను..!

నీ మనాసాకృతిని తీర్చిదిద్దుకుందామనే..!!

 

2162. వేదనాశ్రువులను జార్చుకోక తప్పడంలేదు..!

అనుబంధాన్ని అల్లుకున్న ప్రతిసారీ.!!

 

2162. చెక్కులన్నీ చెల్లడం మానేశాయి..!

సంతకించాల్సిన చోటల్లా అప్రయత్నంగా నీ పేరునే వ్రాస్తున్నాననే..!!

 

2163. మన చెలిమి కాగితాలను చించేసాను..!

వ్రాసుకున్న మాటలన్నీ అందనంత దూరానికెగిరిపోవాలనే..!!

 

2164. హిమశిల్పాన్నై కరిగిపోతున్నా..!

నీ పలుకుల వడగాల్పులు నిర్ధయగాతాకుతుంటే..!! 

 

2165. శ్వాసను నిలిపేయాలనుంది..!

జ్ఞాపకాల్ని మోసుకుంటూ వర్తమానంలోకి సాగిపోయేందుకై..!!

 

2166. కాలపుకొలిమిలో కాల్చుకుంటున్నా..!

పలుకుదెబ్బలను తిన్న గుండె పదునెక్కుతుందనే..!!

 

2167. ఒక్కొక్కటిగా చినిగిపోతునట్లున్నాయి..!

మన సంస్కృతి గ్రంధంలోని సంప్రదాయపుటలన్నీ..!!

 

2168. కాలాన్నే ఆడిపోసుకుంటే ఎలా..!

కాళ్ళకు చక్రాలున్నట్లు పరుగులెత్తే మనసు…సంచారీ నిత్యగామినియేగా..!! 

 

2169. భావోద్వేగం అంకురిస్తోంది..!

క(ప)న్నీటివానలు వెలిసిపోగానే..!!

 

2170. వారు ఆధునిక మానవులంట..!

పాత రోతంటూ తెగవిసుక్కుంటున్నారు..!! 

 

2171. గుండెను జల్లెడ పట్టుకున్నా ..!

కలతలన్నిటినీ పూర్తిగా జల్లించేసుకుందామనే..!!

 

2172. నా జీవనదర్పణం..!

గతాన్నే ప్రతిబింబిస్తూ..!!

 

2173. చేదుగతాన్నే మ్రింగుతున్నా..!

వర్తమాననుభవాలకు ఔషధంగా..!!

 

2174. పేజీకో పేరైనా కానరాకుంది..!

నిజాయితీ పుస్తకాన్నెంతగా పరిశీలిస్తున్నా..!!

 

2175. నవకవులకై అన్వేషిస్తున్నా..!

యువకవులను ఎందరినో పరిచయిస్తున్న మా'నవ'యుగంలో..!! 

 

2176. ఆదర్శకవులట కొందరు..!

ఆధునిక కవితారంగాన్ని మాటలగారడీలతోనే బురిడీలుకొట్టిస్తూ..!!

 

2177. విమర్శలే కవితావస్తువులు అవుతున్నాయి(ట)..!

పూర్వకవితా వైభవాన్ని నేటి యుగధర్మ జాడ్యమేదో పట్టిపీడిస్తుంటే..!!

 

2178. స్త్రీలెప్పటికీ పాడియావులే ఈ జనారణ్యంలో..!

ధైర్యస్థైర్యాల అపహరణలతో...ఉత్తమాదర్శగృహిణులుగా కీర్తించబడుతూ..!!

 

2179. మురుస్తున్నది..!

ధరణిని ముద్దాడుతున్న నీ పాదమా...ముద్దాడుతూ మైమరుస్తున్న ఆ ధరణినా..!!

 

2180. మనువురథానికై నిరీక్షిస్తున్నా..!

మాఘమాసమై నువ్వూరిస్తుంటే..!!

 

2181. నాటి సీతాసావిత్రుల ఆదర్శమే కావా(నిలవా)లంట..!

ఉత్తములుకాలేని ఉత్తరకుమారులంటి నేటి (కొందరి)భర్తలకు..!!

 

2182. శాస్త్రీయగేయాన్నౌతున్నా..!

నీ అనునయసంగీతాలు లేపనాలై చల్లబరుస్తుంటే..!!

 

2183. నేనొక సంప్రదాయ పద్యాన్నే..!

ప్రాచీనతనొదలని సనాతనాఛందస్సుతో వెలుగొందుతూ..!!

 

2184. వచనకవిత్వాన్ని నేనౌతున్నా..!

నీ రచనల చాతుర్యానికి దాసోహమౌతూ..!!

 

2185. అలంకారమై విరాజిల్లుతున్నా..!

పసితనమొదలని అమాయకతాహావభావాలతో..!!

 

2186. ప్రకృతితో మమేకమౌతూనేయుంటాను..!

జారిపడే జలపాతంగానో...జాలువారే కన్నీటి తరంగంగానో..!!

 

2187. శేషప్రశ్నగానే మిగిలిపోయావు..!

జవాబెరుగని బ్రతుకుపుస్తకంలో..!!

 

2188. మూగసాక్షి నేనౌతున్నా..! 

నీ నిశ్శబ్దనిష్క్రమణకు..!!

 

2189. మానవత్వం మరణించిందేమో..!

ఉగ్రవాదనరమేధంలో దానవత్వం వికటాట్టహాసం చేస్తుంటే..!!

 

2190. తనువు పరవశిస్తోంది..!

ఏ జ్ఞాపకం అలవోకగా తడిమిపోయిందో ..!!

 

2191. మబ్బులతో మల్లెల సోపానాలనే పరిచావు..!

వెండిమేఘమాలికలను పట్టుపరుపుగ నే కోరినంతనే..!!

 

2192. క్రొంగొత్త రాగాలనే నేర్పుతోంది..!

మునుపెరుగని ఆత్మీయపరిచయమేదో హృదయసరాగమౌతూ..!! 

 

2193. వేవేల వర్ణాలమిళితమే..!

నన్ను సృజించే  నీయూహల హరివిల్లులు ..!!

 

2194. నేను ఎప్పుడూ విరబూసే వాసంతికనే..!

నువ్వెంతగా కలలను రాల్చేసే శిశిరమౌతున్నా..!!

 

2195. మరలమరల పొంగిపూస్తోంది నవవసంతం..!

ఏ  ప్రేమగువ్వల మౌనసరాగం హృదిని మీటుతుందో సౌగంధాలతో..!! 

 

2196. ఆవిర్భవిస్తోంది ..!

సరాగమై కరిగిపోతూ...ఆత్మీయమైన హృదయగానమేదో..!!

 

2197. వసంతాన్నై నవ్వాలనుంది..!

తాకిపోయే అశ్రుశిశిరాలు మరింతగా విసిగిస్తున్నా..!! 

 

2198. సీతాకోకలై విహరిస్తున్నాయి..!

నా స్మృతిసీమపై అలరారే అపూర్వకాలగ్రంధాలన్నీ..!!

 

2199. బాల్యం ..!

ఏ వ్రాతావ్రాయని స్వచ్ఛమైన తెల్లకాగితం..!!

 

2200. కలలరెప్పలు సొలసిపోతున్నాయి..!  

బ్రతుకుముద్ర బరువును తామిక మోయలేమంటూ..!!

 

2201. ఏ మైత్రీవెన్నెల జావళీలో..!   

నా నిర్లిప్తవిభావరిని పారద్రోలుతూ..!!

 

2202. బ్రతుకు తక్కిట..!

కష్టాల తూనికరాళ్ళ బరువు ఓప్రక్కకే నొక్కి పెడుతూ..!!

 

2203. చిరునవ్వుల దీపాల్ని వెలిగిస్తున్నా..!

పెదవుల ప్రమిదలు కాంతివంతమయ్యేలా..!!

 

2204. జీవించడం మొదలెట్టాను..!

బ్రతకడమనవసరమని తేల్చుకోగానే..!!

 

2205. మాతృభాషావంతెన..!

పరసంస్కృతుల ప్రవాహంలో కొట్టుకుపోతూ..!!

 

2206. వెలుగుపొరకెంత నిబ్బరమో..!

చీకటితెరను అలవోకగా చీల్చుకుని తళుకులీనుతూ..!!

 

2207. దరహాసమూ పరిహాసమౌతోంది..!

జీవితముఖంపై వక్రవర్ణాలనద్దుకుంటూ..!!

 

2208. నువ్వులపూవులు విచ్చుకుంటున్నాయి..!

పెదవులతోటలతో  మంచుపుప్పొడినద్దుకుంటూ..!!

 

2209. నా జీవనగ్రంధం రూపుదిద్దుకుంటోంది..!

గాయాలుచెప్పే కధలన్నింటిని పొందుపరుచుకుంటూ..!!

 

2210. అరుదైన అనుభూతులెన్నో..!

అవ్యక్తకావ్యాలుగానో, అంతులేని మౌనాలుగానో మిగిలిపోతూ..!! 

 

2211. నీవొక అల్లరి తుంపరవే..!  

నా చెక్కిలిసంద్రంపై ఓలలాడుతూ..!!

 

2212. అక్షరాలకూ అవిటితనం తప్పడంలేదు..

వత్తుల్ని అణచి వంకర్లుపోతుంటే...!!

 

2213. బ్రతుకనే అబద్దానికి ఆయుష్షెక్కువే..!

మరణమనే నిజాన్ని చంపేస్తుంటే..!!

 

2214. కవిహృదయం గాయపడినట్లుంది..!

అక్షరాలే ఆయుధాలయ్యాయేమో..!!

 

2215. కాలానికి ఋణపడాల్సిందే..!

గాయాల్నిమాన్పి, మచ్చల జ్ఞాపకాలు మిగిల్చినందుకైనా..!!

 

2216. బంధాలు కాలి బూడిదైపోతున్నాయి..!

కాయాలు కాటికెళ్ళక మునుపే..!! 

 

2217. ఎన్నిసెక్షన్లని వెదకను..!

మనస్సును దొంగిలించావని శిక్షించేందుకు..!! 

 

2218. పాషాణహృదయమని విసుక్కుంటావు..!

ఎలా చెక్కుకుం(తుం)దో చూడు నీప్రేమశిల్పాన్ని..!!

 

2219. ఆటస్థలాలలో ఆనందహేల..!

సెలవులిచ్చింది బడికిగాని...బాల్యానికి కాదుగా..!!

 

2220. ఒట్టేసైనా ఒప్పించక తప్పదు అబద్దాన్ని..!

నిజాన్ని నిష్ఠూరిస్తోందిగా అపనమ్మకపు జగతి..!!

 

2221. గాయాల్ని ప్రేమించడానికి అలవాటుపడ్డాను..!

బాధల్ని మరిపించే మత్తుమందదేగా..!!

 

2222. పలుకులు మౌనవిస్తున్నాయి..!

ఎదనిండా మాటల్ని నింపుకున్న మూగదనంతో..!!

 

2223. మరణించాలని ఉంది..!

ఎవరి గుండెల్లో పదిలపడ్డానో తెలుసుకునేందుకై..!!

 

2224. సౌగంధికలు స్పృశిస్తున్నాయి..!

తనే తోటను స్పర్శించి వచ్చిందో..!!

 

2225. తన మాటలే శిలాశాసనాలు అయ్యాయి..!

శిధిలమైన మనస్సుకు ఒంటరి సమాధికడుతూ..!!

 

2226. మనోపంజరం ఒంటరిదైంది..!

ప్రేమచిలుక ఎగిరిపోయిందిగా..!!

 

2227. అమ్మభాష పరాయిదైంది..!

మమ్మీ'గానే మిగిలిపోయిందిగా..!!

 

2228. ఆత్మహత్య లెక్కకేవస్తుందిగా..!

శరీరాన్నే కాదు...మనస్సును చంపుకున్నా..!!

 

2229. పట్టదనుకుంటా గగనానికేదొచ్చినా..!

సంతోషాన్నైనా, దుఃఖాన్నైనా జల్లులుగా రాల్చేస్తూ..!!

 

2230. చెదరని దరహాసమే తనది..!

లోలోన నేనెంతగా నలిగి(కుమిలి)పోతున్నా..!!

 

2231. పవిత్ర నదీస్నానాలు..!

పాపాలమురికిని ఒదిలించుకోడానికి సరిక్రొత్త మార్గాలు..!!

 

2232. నాయకుల్ని నిలదీయడం ఎందుకనో..!

అధికారాన్ని ఓటుపైకమిచ్చి అమ్ముకున్నాక..!!

 

2233. ఆశలదివ్వెలను వెలిగించరాదూ..!

నిరాశాతిమిరాలు వెలవెలబోయేలా..!!

 

2234. పరిణయం విడదీసినట్లుంది..!

ఒకరికి ఒకరై ముడిపడ్డ ప్రణయాన్ని..!!

 

2235. ఆఖరివరకూ జీవనపోరాటమే..!

మరణంతోనే దొరికేది విరామమని తెలిసికూడా..!!

 

2236. పంటచేలు తలవంచాయి..!

కోతలకు సిద్దపడ్డాయిగా..!!

 

2237. అలమటించడం పరిపాటి అయ్యింది..!

ఆశయమనే ఆకలి మొదలవ్వగానే..!!

 

2238. మదికి స్వాతంత్య్రం వచ్చినట్లుంది..!

దోచుకునే హక్కును చేజిక్కించుకోగానే..!!

 

2239. మస్తకం బరువెక్కిందెందుకనో..! 

నా జీవితపు పుస్తకం చదువుకుంటుంటే..!!

 

2240. మనస్సుకు దొంగతనమబ్బింది..!

దాచుకునే అధికారాన్ని నీవు ఇవ్వగనే..!!

 

2241. గుడికేమి తెలుసని..!

దేవుడి వైభవమంతా హుండీలకే పరిమితమని..!!

 

2242. చేయి చాచి ఎరుగడట దేవుడెదుట..!

తలవంచండం తప్ప ...తెలివైన భక్తుడుకదూ...!!

 

2243. కాలానికి అందరూ బంధువులే..!

వచ్చీపోయేవారేగాని ఉండిపోయేవారు లేరుగా..!!

 

2244. అందర్నీ దూరం చేసేస్తుంది మరణం..!

తను మాత్రమే జీవులకతిదగ్గరగా ఉండిపోతూ..!!

 

2245. ఇంత బాధదేనికో మనస్సుకు..!

తిట్టింది తానుగా మరి..!!

 

2246. బిక్షగాళ్ళంటే ఎంత చులకనో..!

దేవుడిముందరంతా బిక్షగాళ్ళమని మరచి..!!

 

2247. మా'నవప్రపంచం ఎంత చిన్నదో..!

మానవత్వపు బరువును మోయలేకుందందుకే..!!

 

2248. ద్వేషించడమెలాగో తెలిసొచ్చింది..!

నిను ప్రేమించడం మొదలు పెట్టగానే..!!

 

2249. అందనిది గగనమని ఒగర్పులెందుకు..!

విషకాలుష్యాలతో నేలను తాకుతుంటే..!!

 

2250. గాయపడ్డప్పుడు తెలిసినట్లుంది..!

గాయపరిచినప్పుడు మృగమైన తానూ మనిషినేనని..!!

 

2251. నలుగురి తోడు దొరికితే చాలు..!

జీవనయాత్రలో కాదు…శవయాత్రలో సాగనంపేందుకు..!!

 

2252. కవనానికీ విసుగొస్తున్నట్లుంది..!

రాతల్లోనే కానీ…చేతల్లో ఉండదనే..!!

 

2253. కలం పదునెక్కినట్లుంది..!

వ్రాతలతో సానబెట్టగానే..!!

 

2254. భావాన్నై వ్యాపించాలనుంది..!

జీవనగ్రంధంలో అక్షరమై ఒదిగుండిపోవడం దేనికని..!!

 

2255. నిశీధి అలిగినట్లుంది..!

కలల్ని కల్లలు చేస్తున్న వెలుతురుపై..!!

 

2256. చావడమే తేలికయ్యింది..!

బ్రతుకు బరువైపోతున్న బడుగు జీవులకు..!!

 

2257. కాగితాలు నిరక్షరాస్యులే..!

తప్పొప్పులను ఎంచలేవుగా..!!

 

2258. జీవితం పట్టభద్రురాలయ్యింది..!

అనుభవాల డిగ్రీపట్టాలనందుకుని .!!

 

2259. కలం రైలు పరుగులెడుతోంది..!

అనుభవాక్షరాలను కాగితప్పట్టాలపై పరుగులుతీయిస్తూ..!!

 

2260. నువ్వే జీవితమయ్యింది ఒకప్పుడు..!

నువ్వులేకున్నా సాగిపోతోంది జీవనమిప్పుడు..!!

 

2261. ఏ జన్మలో పారేసుకున్న జ్ఞాపకాలో..!

ఈ జన్మలో ఏరుకుంటున్నా ఆర్తిగా...!!

 

2262. ముందడుగేస్తూనే ఉంటా..!

జీవితంలో గెలిచేందుకైనా..ప్రేమలో ఓడేందుకైనా..!!

 

2263. మోస్తూనే ఉంటాను..!

నీ ప్రేమాక్షరాలనెన్నిటినైనా మనస్సుకాగితమెంతగా చినిగిపోయినా..!!

 

2264. ఆకలికి వేడితగ్గదేమో..!

అన్నమెంతగా చల్లారిపోయినా..!!

 

2265. మరోబాల్యాన్ని నేనెప్పటికీ కోరుకోను..!

ఆర్తిగా అక్కునచేర్చుకునే అమ్మానాన్నలుండరుగా..!! (మరో బాల్యం - వృద్దాప్యం)

 

2266. వయస్సుతో పనుండదేమో..!

సిగ్గుపడే మనస్సుకు ...!!

 

2267. నిశ్శబ్దపోరాటం నాది..!

వసుధైక కుటుంబమంటి సాహిత్యపు లోకానికై...!!

 

2268. ఋతువునై నవ్వాలనుంది..!

మధుమాసపు మల్లియలకు…వెన్నెల పారిజాతాలనర్పించుకోవాలనే..!!

 

2269. చిన్ని చిన్ని ఆనందాలను సొంతం చేసుకోరాదూ..!

అరుదైన ఆనందాలకై అర్రులుచాచి అల్లరి పడేకంటే .!!

 

2270. నేనొక్కడినే సమాజానికేమి చేయగలననే నిరాశదేనికో ..!

సూర్యుడొక్కడేగా ప్రపంచానికి వెలుగునిచ్చేదియన్న సత్యాన్నివిస్మరిస్తూ..!!

 

2271. కాలం ఒక జవనాశ్వం..!

కదను తొక్కుతుంటుంది...పగ్గాలు తెంచుకున్న రేసు గుర్రంలా..!!

 

2272. మది నావ విహరిస్తూనే ఉంటుంది..!

తన స్మృతులయలలపై  మైమరుపులతోనో...నిట్టూర్పులతోనో..!!

 

2273. జీవితాన్ని చక్కబెట్టేసుకుంటున్నా..!

తెలియని ప్రాణంపోకడతో రాద్ధాంతానికి దిగడందేనికని..!!

 

2274. అనుభవాల్ని బోధిస్తున్నా..!

మోసపూరితచెలుములెన్నో నన్నో గురువుగ మార్చగానే ..!! 

 

2275. నీ మౌనాన్ని కాదు ..!

నే’భరిస్తున్నది నా మరణాన్ని..!!

 

2276. పుస్తకం మోసేది అక్షరాల్ని మాత్రమేనేమో..!

జీవితపుస్తకమ్మోసేది మాత్రం లెక్కలేనన్ని అనుభవాల్ని..!!

 

2277. మనిషిగా మారినట్లే...! 

తప్పుదిద్దుకోవడం మొదలయ్యిందిగా..!!

 

2278. తరలిపోతున్నా కాలాన్నై..!

తనుచేసే గాయాలకతీతంగా..!!

 

2279. అప్పగింతల్లో కన్నీటి వరదలు..!

ఆడబిడ్డదిదే ఆఖరిచూపని కాబోలు..!!

 

2280. అక్షరాలకెంత గర్వమో..!

ఎలా వ్రాసినా కూర్చోబెట్టి చదివించగలమనే ..!!

 

2281. మేఘాలు మోసంచేస్తేనేమి..!

ఉప్పుపంటల్ని పండించగల సత్తా రైతన్నకుందిగా..!!

 

2282. కన్నీటిచినుకులను చిలకరిస్తున్నా..!

మనోక్షేత్రం బీటలువారిపోగానే..!!

 

2283. మానవత్వం ..!

అర్ధాయుష్కురాలేగా ఎప్పటికీ ..!!

 

2284. హృదయం బాధకు గురయ్యేది..!

ప్రేమ ముల్లును దింపినప్పుడే కాదు..తీసుకుంటున్నప్పుడు కూడా...!!

 

 

 

2285. మదిలో చిగురిస్తోంది మరోవసంతం..!

నీ స్పర్శను తాకిన పిల్లగాలులేవో ఎదను మీటగనే..!!

 

2286. మధుమాసపు విలాసాన్ని మరిచింది మానసం..!

జంటబాసిన ఒంటరితనమేదో ఏడారితనాన్ని పరిచయిస్తుంటే..!!

 

2287. నా ఊహా(స్వప్న)లోకం ఉలిక్కిపడుతోంది..!

ఏ వసంత కోయిల స్వనము ఋతురాగాలను ఆలపిస్తున్నా..!!

 

2288. నేను మనస్ఫూర్తిగానే కోరుకుంటాను మరణాన్ని..!

మరో బాల్యమనే గొప్పవరాన్ని పొందగలిగేందుకై..!!

 

2289. చొరబాటుతనం ఎక్కువే నీకు..!

గుండె సరిహద్దులను దాటొచ్చేస్తూ..!!

 

2290. భవితను కోల్పోయారట..!

గతాన్ని మరిచిపోయినట్లున్నారు..!!

 

2291. కడిగేసారుట కత్తులకంటిన రక్తాన్ని..!

చేతులకంటిన పాపపుమరకలు సంగతేమిటో..!!

 

2292. శిక్ష నాకెందుకు పడుతున్నట్లో..!

తప్పు చేస్తున్నది నామనస్సయితే..!!

 

2293. ఎన్ని వేల పేర్లెనుక వెదికానో..!

ఎక్కడైనా మానవత్వమనే ఇంటిపేరు కనపడుతుందేమోనని..!!

 

2294. తానంటేనే తెగపడి చస్తోందిగా..!

మనస్సుకు ఇదేమి మాయరోగమో..!!

 

2295. అబ్బురమే కదూ..!

నింగి కురిసి...నేల తడవగనే  మొలకెత్తే బీజాంకురం..!!

 

2296. కుప్పకూలినట్లున్నాడు కదూ..!

పాపం బరువెక్కిన హృదయాన్ని మోయలేకనేమో...!!

 

2297. సుఖనిద్రే కదూ...! 

ఏ దుఃఖమెరుగని మరణం...!!

 

2298. పూలగుసగుసలకు  అర్థమేమిటో..!

ఇతరుల కోసమే పరిమళాల్ని పంచమనేమో ..!! 

 

2299. నేనో పుస్తకాన్ని అవుతున్నాను..!

చదువులమ్మ వేసిన అక్షరజోలినందుకుని..!!

 

2300. ఒప్పుకుంటానులే..!

నీకు మనసిచ్చి తప్పుచేసింది నేనేనని ...!!

 

2301. ఏ మౌనం మధించిందో..!

ప్రశాంతమైన చిత్తాన్ని హాలాహలపరుస్తూ..!!

 

2302. కరగొద్దనే వేడుకుంటా, కాలాన్ని..!

చెరగని గురుతుగా తానుండిపోతానంటే..!!

 

2303. మనుషులకు ఎన్ని తలపోతలో..!

 మనస్సుకు మాన(దై)వత్వం తోడైతే ..!!

 

2304. ఆరాటపడుతూనే ఉన్నా..!

నీలో ఒదిగిపోయే క్షణాలకై పోరాడుతూ..!!

 

2305. కనులు తెరవడం మానేశాను..!

స్వాప్నికజ్ఞాపికగా నిను మిగుల్చుకోకూడదనే..!!

 

2306. లిఖించబడుతూనే ఉంటాయి..!

చెదిరిన ప్రణయగాధలెన్నో...నిశీధి రాతిగోడలపై..!!

 

2307. తాకట్టు వస్తువులేనేమో..!

అనాదిగా ఆలైనా...ఆలిక్కట్టిన తాళైనా..!!

 

2308. మెలిపెట్టేదే మౌనం..!

గుండెల్లో గుచ్చుతూనో...సుతారంగా విచ్చుతూనో..!!

 

2309. మౌనానికి స్థితప్రజ్ఞత ఎక్కువే ..!

విషాదానందాలను కన్నీళ్ళుగానే హత్తుకుంటూ..!!

 

2310. మోస్తూనేయుంది మౌనంగా..!

నీ స్మృతులాక్షరాలనింకా...మనోకాగితం చినిగిపోయినా..!!

 

2311. జీవహంస ఉన్నంతవరకేగా..! 

దేహపంజరం శ్వాసించగలిగేది..!!

 

2312. వ్యక్తి త్వాన్ని నిలుపుకోగలగాలి చిరస్మరణీయంగా..!

మట్టిలో కలిసిపోయే దేహం వయస్సుతో మనకు పనిలేకుండా..!!

 

2313. దేహం ఎల్లప్పుడూ దేవాలయమే..! 

పవిత్రమైన మనస్సుతో మెలిగినంతవరకు..!!

 

2314. మనుష్యులకెందుకో ఇంత కక్షాకార్పణ్యాలు..!

మూన్నాళ్ళ  ముచ్చటైన జీవితాలకై..!!

 

2315. శిక్షను ఓర్చుకునేదెపుడూ దేహమే..!

మనస్సుచేసే పలురకాల తప్పిదాలకు...!!

 

2316. చిరాయువులే జ్ఞాపకాలెపుడూ..!

వయస్సుతో నిమిత్తంలేకుండా..!!

 

2317. గర్వం ఎక్కువే..!

తలెత్తుకొని పొంగిపోయే...కన్నీటి అలలకు..!!

 

2318. జీవితం అంటే నేర్పింది తానే...!

బానిసత్వానికి అలవాటుపడింది మాత్రం నేను..!!

 

2319. కలతలన్నీ కలవరపడిపోయేలా..!

రువ్వరాదూ...గుప్పెడు నవ్వుల పూవులను..!!

 

2320. గతజ్ఞాపకాలే..!

వర్తమానానికి సరిక్రొత్త శాసనాలను లిఖిస్తూ..!!

 

2321. హంసధ్వనిరాగాన్ని నేర్పిస్తున్నా..!

కల్తీ స్నేహాలకూ(నే)ర్పును పసిగట్టలేని అంతరంగానికి..!!

 

2322. దుఃఖపు బిడ్డలేగా...!

ఎదను చీల్చుకుపుట్టేవి...వేదనలు ప్రసవిస్తుంటే..!!

 

2323. తలొంచుకోక తప్పట్లేదు ఆలికి..!

తాళికట్టించుకున్నప్పటినుండి తనువును చాలించేవరకు..!!

 

2324. అందుకోవాలనే ప్రయత్నం యవ్వనానిది..!

నెట్టేయాలనే ప్రయత్నం వృద్ధాప్యానిది..!!

 

2325. జీవితం పూర్తయ్యిందిట..!

మరి...మిగిలున్న మరణం సంగతేమిటో..!!

 

2326. ఆగకుంది కాలకలం..!

ఆలోచనల కాగితాలు ఎంతగా నలిగిపోతున్నా..!! 

 

2327. అలమటించక తప్పడంలేదు..!

ఆకలితోనో...ఆశయంతోనో..!!

 

2328. దేవులాట అనవసరమే..!

నిందలేని బొందిలకై ..!!

 

2329. సలుపుతూనే ఉంటాయి..!

మనస్సును తాకుతూ...మానిపోలేని గాయాలెన్నో..!!

 

2330. మనిషితనాన్ని చీల్చేస్తోంది..!

కులమనే మారణాయుధం..!!

 

2331. జీవితమెపుడూ నిండుసున్నానే..!

మొదలైనచోటే తుదౌతుంటుందిగా..!!

 

2332. కురిసిపోవాలేమో యాసిడ్ వర్షాలేమైనా..!

మనసుల్లోని కుళ్ళుని శుభ్రపరుచుకునేందుకై..!!

 

2333. నను నేను తడుముకుంటూనే ఉంటా..!

స్వచ్ఛమైన ప్రేమనెవరిదైనా పొందగలిగానేమోననే ఆర్తితో..!!

 

2334. ఓదార్పు ఔషధాన్ని సేవిస్తూనే ఉంటా..!

నను నేను చంపుకుంటున్న ప్రతిసారీ..!! 

 

2335. గుండె ఝల్లుమంది..!

నిన్నల్లోని స్మృతొకటి సన్నల్లోకి జారగనే..!!

 

2336. మధురరాగాలనే ఆలపిస్తుంది గాయపడిన వెదురు వేణువౌతూ..!

మౌనభాష్యాలనే ఒలికిస్తుంది పగిలిన హృదయం ఛిద్రమౌతూ..!!

 

2337. ఓదార్పు దుప్పట్లను కప్పుకుంటున్నా ..!

దూసుకొచ్చే జ్ఞాపకాలపోట్లకు చిక్కకుండా..!!

 

2338. భారమై మిగిలింది..!

చేరువై చేదును మిగిల్చిన చెలిమొకటి..!!

 

2339. మధుర(గేయాలై)గాయాలై తాకుతున్నాయి..!

నిను పరిచయించిన ఘడియలన్నీ ఏకమౌతూ..!! 

 

2340. బ్రతుకూ వాణిజ్యమైపోతోంది..!

అను'బంధాల క్రయవిక్రయాల కొనుగోలుతో సతమతమైపోతూ..!! 

 

2341. మరణించావంటే సరిపోతుందిగా..!

నిన్ను మరిచానని ఎద్దేవా చేసేకంటే ..!!

 

2342. స్మృతుల గాయాలేగా..!

మనిరువురి మధ్యన మిగిలి(నలిగి)పోయిన బంధం..!! 

 

2343. కంటకాలే నయం..!

గుర్తుచేసి మరీ గుచ్చేసే జ్ఞాపకాలకంటే..!!

 

2344. హృది పులకరిస్తోంది..!

తానొక్కో కవనాక్షరసుమంతో తనువుని అలంకరిస్తుంటే..!!

 

2345. గుండె గుమ్మాన్నట్టుకునే వ్రేలాడుతుంటాయి..!

నువ్వు రావని తెలిసినా అలుపురాని ఆశల వీక్షణలు..!!

 

2346. అలుసవ్వక తప్పలేదుట..!

మనస్సుకు పులుముకున్న రంగు వెలిసిపోగానే..!!

 

2347. అనుభవాల నిఘంటువును తిరగేస్తున్నా..!

బ్రతుకుగ్రంధాన్ని ఆవిష్కరించుకునే ప్రయత్నంలో..!! 

 

2348. మాటల సానతోనే పదునెక్కిపోతుందేమో..!

ఆరంగుళాల నాలుక్కూడా చురకత్తైపోతూ..!!

 

2349. విషాదరాగానికే పరిమితమౌతున్నా..!

మన స్మృతుల సరిగమలను మీటుకున్నపుడల్లా..!!

 

2350. మనిషే వాడొకప్పుడు..!

మృగమయాడంతే...మనస్సు వంకర తిరిగిపోవడంతో..!!

 

2351. నిన్నారేపటిల మధ్యనేగా నేడిమిడిపోయేది..!

చావూపుట్టుకల మధ్యలో మనమిమిడిపోతున్నట్లే..!!

 

2352. రెప్పలగూటిలో ఒదగలేకుంది..!

ఉప్పెనై జారిపోతూ క(ప)న్నీటి కలలకడలి...!!

 

2353. ఇంకా ఎన్నాళ్ళో..!

నీ రాకకై కొవ్వొత్తినై కరగడం..!!

 

2354. వలసకు సిద్ధమౌతున్నాయి తెనుగక్షరాలు..!

కార్పొరేట్ సంస్కృతిలో ఇమడలేమంటూ..!!

 

2355. అమృతమైనా గరళమే..!

పంచుకునే తోడులేకుంటే..!!

 

2356. నవ్వుల తేటలను ఒంపుకుంటున్నా..!

కన్నీటి కడవల్ని మరుగుపరుచుకుంటూ..!!

 

2357. శిఖరాలకూ మనిషి బుద్ధులబ్బినట్లున్నాయి..!

ఆకసానికేసే విసురుతుంటాయి చూపులవలల్ని...నిలిచింది నేలపైనేనని మరిచి..!!

 

2358. అర్ధరాత్రి స్వాతంత్య్రం..!

మృగత్వానికి నిర్భయంగా స్వేచ్చారెక్కల్ని తొడుగుతూ..!!

 

2359. ఏకాంతంలోకి పరుగులు తీస్తున్నా..!

నను తలచే నీ క్షణాలలో లిప్తకాలమైనా ఒదిగేందుకై..!!

 

2360. తళుక్కుమన్నదో హరివిల్లు..!

నీ జ్ఞాపకాల ఒంటి విరుపులో..!!

 

2361. రాలిపోయే స్వప్నాలెన్నో..!

కన్నీటిరాత్రులకు సాక్ష్యమౌతూ..!!

 

2362. తొలిపుట నేనౌతా..!

ప్రేమాక్షరాలను పొందుపరుచుకునే నీ జీవితపుస్తకానికి..!!

 

2363. మెరిసిందో చిరునవ్వుల ఇంద్రధనువు..!

మదిమబ్బు కన్నీటివానతో తేలికపడగానే..!!

 

2364. గుప్పెడు వసంతాన్నీయవూ..!

నా నిట్టూర్పుల శిశిరం చివురైపోయేలా..!!

 

2365. మది చెరువు నిశ్శబ్దిస్తోంది..!

నీయూసుల సెలయేటి గలగలలకై..!! 

 

2366. అమృతతుల్యం అవుతోంది..!

కాలరుచుల సమ్మేళనాన్నిసేవించిన జీవితం..!!

 

2367. సిరి'మల్లెలకు తరగని సౌరభాలే..!

గ్రీష్మాల సెగలెంతగా తాకిపోతున్నా..!!

 

2368. అలకతొలకరులను జల్లేయకలా..!

బుంగమూతి చందానికి మరింత వన్నెలనద్దుకుంటూ..!!

 

2369. అవసరానిదెంత స్వార్థమో..!

అనుబంధాల్ని సైతం తాకట్టు పెట్టేస్తూ..!!

 

2370. రాటుదేలుతోంది జీవితం..!

కాలపుగాట్లను మాపుకుంటూ..!!

 

2371. చినుకై జారడమే లక్ష్యమేమో..!

ఆవిరైపోయే ప్రతి నీటిబొట్టుకూ..!!

 

2372. బడాయిపోతోంది చైత్రమాసం..!

కోయిలమ్మకు క్రొంగొత్త బాణీలేవో నేర్పుతూ..!! 

 

2373. నిశ్శబ్దపోరాటం నాది..!

చావు, పుట్టుకల మధ్య నలిగే(మిగిలే) జీవితాన్ని గడిపేందుకు...!!

 

2374. మౌనశిక్షను విధిస్తున్నా..!

నీయూసులు సైతం నను తాకకూడదనే..!!

 

2375. తప్పని గాయాలెన్నో..!

అసూయాద్వేషాల ఆటుపోట్లు తాకిపోయే మనోసంద్రానికి..!!

 

2376. ఏకాంతాన్నే మిగిల్చింది..!

అక్కరకురాని మొహమాటం..!!

 

2377. ఆశల మొగ్గలవైపే మొగ్గుతున్నా..!

రాలిపోయే కలలపూలతో పనిలేదనే..!!

 

2378. వర్తమానానిదెపుడూ మేధావితనమే..!

గతమొడిదుడుకుల్లో ఆరితేరిపోతుందిగా..!!

 

2379. నిజాయితీ నిరుపేదే..!

అవినీతిపరుల రాజ్యంలో..!!

 

2380. గతంలోనే నిలిపేస్తూ..!

గాయమెపుడూ ఘనమే..!!

 

2381. ఓటమిదెంత  ఉదాత్తమైన గుణమో..!

పరాజితులెందరినో అక్కున చేర్చుకుంటూ..!!

 

2382. గతపుదారాన్ని లాగుతున్నా..!

స్వచ్ఛమైన చెలిమిపూవు ఒక్కటైనా చేతికందుతుందేమోనని..!!

 

2383. స్వప్నాల స్వాతిచినుకులెన్నో..!  

నా మది ముత్యపుసౌధంలో నిక్షిప్తమైపోతూ..!! 

 

2384. భవిత భగ్గుమంది..!

గతపుచితికి నిప్పంటించగానే..!! 

 

2385. ఎవరికి బకాయిపడుంటుందో కనుద్వయం..!

జీవితకాలం కన్నీటిరుసుమాన్ని చెల్లించుకుందుకై..!! 

 

2386. కౌమారానిదెంత అమాయకత్వం..!

క్రూరత్వం నింపుకున్న మృగత్వానికి బలైపోతూ..!!

 

2387. చెల్లాచెదురైంది (స్వ)గతం..!

జ్ఞాపకాలపేటిక పగిలిపోగానే..!!

 

2388. ఎవరిని ముంచేసే ప్రయత్నమో..!

మొదలెట్టాడుగా...మదిముసుగును అలంకరించుకోవడం..!!

 

2389. హరివిల్లుదీ పక్షపాత ధోరణే..!

పగటికే మరిన్ని అందాలను అద్దుతుంటుంది...నిశిని వెలివేసేస్తూ..!! 

 

2390. చినుకు తడికి చిగురిస్తోంది మనోక్షేత్రం..! 

ఆనందాల మోదంతోనో...విషాదాల ఖేదంతోనో..!!

 

2391. ముక్కలైపోతోంది మదియద్దం..!

ఏ అనుభవాలరాళ్ళు బలంగా తాకాయో..!!

 

2392. తెగి తీరవలసిందే..!

ప్రాణబంధాలు సైతం...అపవాదు కత్తివేటుతో..!!

 

2393. పిల్లనగ్రోవియే..!

గాయపడుతూ నాగుండెప్పుడూ..!!

 

2394. శిశిరమంటని వసంతాలెన్నో..!

పసిప్రాయపు పూదోటలో విచ్చుకున్న బోసినవ్వులపూలతో..!!

 

2395. వజ్రాలవాన కు(మె)రుస్తోంది..!

ఏ మబ్బుకన్నె వలపువడగళ్ళను జార్చుకుంటుందో..!! 

 

2396. వాడిపోని జాజులే..! 

జ్ఞాపకాల పరిమళాలెపుడూ..!!

 

2397. జడకుప్పెలు గొప్ప నాట్యకత్తెలు..!

తెగ నర్తిస్తుంటాయి...నడుమొంపుల్లోజేరి..!!

 

2398. ఎన్ని యుగాదులొచ్చినా ఇంతే..!

చేదునే పంచిపోతాయి...షడ్రుచుల్నితెస్తున్నా..!! 

 

2399. తీరిపోని ఋణాన్నౌతున్నా..!

మరుజన్మలకై ఎదురుచూపులో..!!

 

2400. కలగానే నే మిగిలిపోయానట..!

హృదయంలో స్థానం దొరకపుచ్చుకోగానే..!!

 

2401. మౌనపు వలువలను జార్చేస్తున్నా..!

పగిలిన నా నగ్న హృదయాన్ని నువ్వు దర్శించాలనే..!!

 

2402. కలలెప్పటికీ మురిపించేవే..!

సాకారమేగా భారమనిపించేది..!!

 

2403. నిత్య వర్షిణిలే కన్నులు..!

కలలనో...వె(కల)తలనో జార్చేసుకుంటూ..!!

 

2404. మౌనాన్ని ఆశ్రయించక తప్పడంలేదు..!

నీహృదయాన్ని కరిగించుకునే ప్రయత్నంలో..!!

 

2405. ఒట్టి భ్రమలేలే..!

కలలైనా, ఊహలైనా...నిజంకాలేని అసహాయతతో..!!

 

2406. గతమెప్పటికీ స్మృతియే..!

వర్తమానానికో మనస్సులేని శిలను పరిచయిస్తూ..!!

 

2407. మదియల్మరా నిండా ప్రేమలేఖలే..!

తికమకపడుతున్నది...నీకివ్వాల్సిన ప్రేమలేఖేదోయనే..!!

 

2408. చెక్కిలి కొమ్మ ఎరుపెక్కుతోంది..!

ఏ రాచిలుకొచ్చి వాలిందో..!!

 

2409. నే నలుపుతెలుపుల గగనాన్నౌతా..!

నువ్వు రంగులవిల్లువై విరుస్తానంటే..!!

 

2410. పిల్లగాలికి విద్యాబుద్ధులు నేర్పిందెవరో..!

లిపులెన్నిట్లో నేర్చిందని...కొంటెబాషల్ని..!!

 

2411. పగటి కలలుగానే మిగిలిపోతున్నాయి..!

చీకటంటే భయపడుతూ...కలలన్నీ..!!

 

2412. గుండెగది ఇరుకైపోయింది..!

బంధాలెన్నిటిని జార్చుకోవాలో..!!

 

2413. రాధమ్మ ప్రేమ ఓడిపోతుందేమో..!

కన్నయ్యమోవికై  తనువంతా గాయాల్ని మోసే మురళి ముందు..!!

 

2414. మనస్సు ముక్కలయ్యిందిట..!

ఏ పలుకువేటు పడిందో బ్రతుకుపై..!!

 

2415. దూరమయ్యిందేమో తాను కనులకు..!

భారమయ్యేది మాత్రమెప్పుడూ హృదయానికే..!!

 

2416. గతపు వలువల్ని జార్చేసుకుంటున్నా..!

వర్తమానపు దుస్తులను అలంకరించుకునేందుకై ...!!

 

2417. భావసౌందర్యం  ఇనుమడిస్తోంది..!

అందమైన అక్షరవన్నెలనద్దుకుంటూ..!!

 

2418. నీకై కంటున్నందుకేమో..!

తెగ వన్నెలనద్దుకుంటున్నాయి...నా కలలన్నీ..!!

 

2419. ఓదార్చేవారు లేకనేమో..!

వాననీటిగానే జార్చుకుంటున్నాయి వెతలెన్నిటినో...మబ్బులన్నీ..!!

 

2420. ఊహలకో రూపం వచ్చింది..!

నా కలలను చిత్రించుకోగానే..!!

 

2421. ఇష్టసఖి వేణువే..!

కన్నయ్యకు అష్టసతులున్నా..!!

 

2422. జాజులను రాల్చుకుంటోంది జాజికొమ్మ..!

వేకువమ్మ వేసిన వెలుగువేటుతో..!!

 

2423. చెంపకెన్ని సిగ్గులో..!

తన పెదవులు నాపేరును ముద్దాడుతుంటే...!!

 

2424. తొలి జన్మ నాదవ్వాలని కోరుకుంటా..!

నీతో సప్తజన్మల బంధాన్ని ముడేసుకుందుకై..!!

 

2425. మంకెనపూలు నిరసిస్తున్నాయి..!

సిగ్గుల్లో చెలి చెక్కిలిపైనే పూయాల్సొస్తోందని..!! 

 

2426. మోహనరాగాన్నే ఆలపిస్తోంది..!

నా ఊపిరివేణువు ...ఊదింది తాననేమో..!!

 

2427. ఆశల చివుళ్ళు మొలుస్తున్నాయి..!

నిరాశల పత్రాలు రాలిపోగానే ...!!

 

2428. సాగిలపడుతూనే ఉంటా..!

నిను నిలు'వరించిన నా స్వప్నాలన్నింటికీ ..!!

 

2429. తీరుబడెక్కువే...వలపుగువ్వలకు..!

తలపులరాగాన్నాలపిస్తుంటాయి... వయస్సు కొమ్మన వాలిపోతూ..!!

 

2430. గాజులైనా...జాజులైనా..!

అతివల అందాలకు దాసోహమనిపించే మోజులే..!!

 

2431. మనస్సుకిన్ని క(వె)తలు దేనికో..!

మైమరపు నిట్టూర్పుల కలయికలతో..!!

 

2432. ఏ ప్రేమతరంగాలు తాకుతున్నాయో..!

నా మనోచక్షువులు కాంతివంతమయ్యేందుకు..!!

 

2433. నే శూన్యంలోకి జారిపోతున్నా..!

ఓ కాంతివత్సరమై వెలుగొందేందుకై ..!!

 

2434. స్వయం ప్రకాశితనే..!

నవ్వుల మల్లెల కాంతి పరావర్తనాలతో..!!

 

2435. స్నేహజలధిని నేనౌతా..!

సాగరకన్యవై  ఈదులాడుతానంటే..!!

 

2436. మౌనమెరుగని సిరి'మువ్వనే..!

నిలువునా గుండెను చీల్చేసినా నర్తిస్తూ..!!

 

2437. శ్వాసను ఆపేస్తున్నా..!

నిను మోయడంకంటే తేలికైన పననిపించగానే..!!

 

2438. నే భావాన్నై నిలిచిపోతా..!

ఓ జ్ఞాపకంగానైనా తడిమేందుకై..!!

 

2439. నువ్వు పరిచయమయ్యాకే..!

కాలగమనంలోకి జారిపోయిన వేదనలన్నీ తిరిగి దాడికి దిగింది..!!

 

2440. పున్నమినై విరియాలనుంది..!

జాబిలివై మనోనిశీధిని తాకే నీకోసం..!!

 

2441. నాదెప్పటికీ స్థితప్రజ్ఞతే..!

వసంతమై పూస్తున్నా...శిశిరమై రాలుతున్నా..!!

 

2442. తన చెలిమిరాట చేయూతతోనేగా..! 

నే స్నేహలతనై అల్లుకుపోతున్నది..!!

 

2443. నేనెప్పటికీ చెదిరిపోని పచ్చి నిజాన్నే ..!

నువ్వు మోపిన అబద్ధపు అపనిందల్లో..!!

 

2444. కాంతికిరణమై వస్తా ..!

నీ మనోచీకటి మరకలను తుడిపేందుకై..!!

 

2445.  ప్రేమించకుంటే వదిలెయ్యి..!

నన్ను ప్రేమించొద్దనే హక్కు నీకెక్కడిది..!!

 

2446. నిరాశావాదులెందరో..!

నిశీధితో విరహిస్తూ...తారోదయాలను నిరసిస్తూ..!!

 

2447. ఆడదే ఆధారమౌతుంది...!

మనోదారాన్ని ముక్కలుచేయకుంటే..!! 

 

2448. బిడియపు బిరడాతో బిగించేయకలా..!

పెదవులమాటునే మౌనం బందీయయ్యేలా..!! 

 

2449. ఆకలి గొప్ప రూపసి..!

ఎందరి ప్రేమనో చూరగొంటూ..!!

 

2450. వెచ్చబడుతున్నాయి కొన్ని క్షణాలు..!

జ్ఞాపకాల శాలువాను కప్పుకోగానే..!!

 

2451. ఓటి కుండే ఎప్పటికీ..!

కన్నీటిధారలను కార్చే శిధిలమనస్సు..!!

 

2452. మరో బాల్యంలోకి అడుగిడుతున్నా..!

అమ్మలు కేరింతలపరవళ్ళలో ఈదులాడుతూ..!!

 

2453. నేనొక గలగలల సెలయేరునే..!

నా బాల్యపు ప్రతిబింబంలో..!! 

 

2454. కాలమెపుడూ ఏకాకే..!

ఒంటరిగానే సాగిపోతూ..!! 

 

2455. స్మృతిపథం నుండి నెట్టేస్తున్నా..!

నిన్వీడిన చీకటి క్షణాలన్నింటినీ..!!

 

2456. నీ జ్ఞాపకాల పరదాలే..!

మదిగది నిండుగా వ్రేలాడుతూ..!!

 

2457. తీరని కోరికే..!

కాలాన్నెనక్కి త్రిప్పే యంత్రంలో తిరిగేయాలన్నది..!!

 

2458. మౌన ప్రేయసి ..!

ఎప్పుడు వెల్లువౌతుందో తెలియని దుఃఖం..!!

 

2459. నీలో పోల్చుకోవాలనుకున్నా..!

నే కోల్పోయిన నా పసితనాన్ని..!!

 

2460. సుఖమెరుగనివే..!

కన్నీళ్ళెప్పటికీ..!! 

 

2461. ప్రేమఊబిలో కాలేసినట్లున్నారు..!

మౌనమృత్యువుకు ఆహ్వానమంపినట్లే..!!

 

2462. మరణమంటే..!

మనస్సు గడ్డకట్టి బిగుసుకుపోవడమే..!!

 

2463. మరణానికెన్ని రూపాలో..!

జీవిజీవికోరకంగా దర్శనమిస్తూ..!!

 

2464. ఉరేసుకుంటూనే ఉన్నాననుక్షణం..!

నీకై పీల్చే శ్వాసను బంధించేస్తూ..!!

 

2465. గుండె ఝల్లుమంది..!

కానరాదనుకున్న బంధమొకటి కనుచూపును మీటగనే..!!

 

2466. ఎన్నిమార్లని మరణించను..!

పలుకుకాట్ల గాయాలతో..!!

 

2467. దుఃఖమెపుడూ వేడిగానే ఉంటుంది..!

కన్నీటి మంటల్లోనే మరుగుతుంటుందిగా..!!

 

2468. ఏ కుత్సితాల గాలివేటుకి రాలిపోయాయో..!

పెదవులతోటలో తొడిగిన ఆనందపు మొగ్గలన్నీ..!!

 

2469. ఆహ్లాదపు గీతాన్నౌతున్నా..!

అక్షరాలన్నీ నను వెదుక్కుంటూ వచ్చాయనే..!!

 

2470. రక్షణ కరువే నాతిదేహానికి..!

కామనేత్రాల దాడుల నుండి..!!

 

2471. రహస్య స్థా'వరమే..!

నిన్ను దాచుకున్న నా మనస్సెప్పుడూ..!!

 

2472. ప్రేమ మత్తును ఎక్కిస్తున్నాయి..!

నీ చూపులే సూదిమందులైపోతూ..!! 

 

2473. గడియపెట్టేసాను మదిగదికి..!

నీ జ్ఞాపకాల్ని జార్చేస్తుందనే..!!

 

2474. పదిల పరుచుకున్నా..!

గుండెభరిణెలో...నీ తలపుల వజ్రాలన్నింటినీ..!!

 

2475. తేలిపోరాదూ..!

అపార్ధానివై..!!

 

2476. నా మౌనం మంచులా కరిగిపోదూ..!

నువ్వు కనుకొనలతో అనురాగాన్ని మీటుతుంటే..!!

 

2477. హృదయం రగులుతున్న అగ్నిపర్వతమే..!

హిమజ్వాలవై నువ్వెంతగా హత్తుకుంటున్నా..!!

 

2478. గగనంసైతం చిన్న(బోతోంది)దైపోతోంది..!

తన మనస్సు విశాలమెంతో అవగతమవగానే..!!

 

2479. ఎగిసిపడే  ఉత్తుంగతరంగాలే...!

మనోతీరాన్ని తాకే నీ తలపులయలలన్నీ..!! 

 

2480. చెక్కిలిచెమ్మ ఆరకుంది..!

ఎదలోయల్లో సంద్రమై నువ్వు ఎగసెగసిపడుతుంటే..!!

 

2481. నింగీనేలను కలిపి కుడుతుంటారు..!

చినుకుదారాలతో...మేఘాల దర్జీలు..!!

 

2482. కంటితడి తప్పడంలేదు..!

గుండె తడిసినపుడల్లా..!!

 

2483. హలం బలం కోల్పోతోంది..!

బక్కచిక్కిపోతున్న రైతన్నల సాగుల్లో..!!

 

2484. ఏ శోకం తాకిడితగిలిందో..!

గంగాయమునలు సంగమిస్తున్నాయి కనుదోయిలో..!!

 

2485. ఆహ్లాదవనంలోకి పరుగులుతీస్తున్నా..!

సుమించిన జ్ఞాపకాలు సౌగంధాల్ని అద్దేస్తుంటే..!!

 

2486. ఒక మిధ్యనే..!

నన్ను నన్నుగా పరిచయించిన క్షణాలన్నీ..!!

 

2487. శిథిలావస్థకు చేరుకుంటోంది..!

నీ స్మృతులనొక్కొక్కటిగా తుడిపేసుకుంటున్న హృదయం..!!

 

2488. మౌనార్చనో...హృదయార్చనో..!

మనస్సంతా ప్రేమగా నింపుకున్న నీకై..!!

 

2489. విరహాల మాలలల్లుతున్నా..!

నా కన్నుల వెన్నెల దారాలతో..!!

 

2490. పెదవుల్లోని పదాలెందుకు..!

నా తన్మయత్వంలోని భావాల్ని వెదుక్కోక..!!

 

2491. కాగితంపూలకు కొదువేముంది..!

పెదవులపై అతికించుకుంటున్న ప్లాస్టిక్ నవ్వులతో..!!

 

2492. పెదవులకెపుడూ  అలంకారమే..!

హృదయపు లోతుల్లోంచి వచ్చే పలుకులన్నీ..!!

 

2493. కలిమి విలువలదే కాలమిపుడు..!

మ(నుషు)నసుల విలువలను చేజార్చుకుంటూ..!!

 

2494. ముద్రించుకుంటోంది బాధామయచిత్రాల్ని..!

నీ వియోగంతో అవస్థలు పడుతున్న నా హృదయం..!!

 

2495. గాథా సప్తశతిని తలపిస్తోంది..!

కవిత్వీకరించుకుంటున్న నా ప్రణయగాథ..!!

 

2496. కర్పూర పరాగమేగా..!

శరత్కాలపు వెన్నెలరాత్రిని వెలిగిస్తున్న...నిశాధిపతి..!!

 

2497. ఆశలన్నీ అడియాసలేనట..!

పేరాశల పడగ నీడల్లో చేరినట్లున్నారు..!!

 

2498. సాగిపోతూనే ఉంటుంది..!

కాలమనే కడలిలో...కాగితప్పడవంటి జీవితం..!!

 

2499. తెగ గుచ్చుకుంటున్నాయట..!

మాటల ముళ్ళు...సత్యాన్నెవరో మాట్లాడుంటారులే..!!

 

2500. పలాయన మంత్రాన్ని పఠించకలా..!

మన  ప్రేమపెన్నిధిని కూలద్రోసిపోతూ..!!

2501. ఆపతరమా..!

ఆకాశగంగనైనా...కన్నీటిపొంగునైనా..!!

 

2502. ప్రతి పూటా ఒక పుటనే..!

బ్రతుకు గ్రంథంలో పాఠ్యమై ఒదుగుతూ..!!

 

2503. అపనిందల పాలయ్యారుట..!

అన్యాయాన్ని ఎదిరించినట్లున్నారు..!!

 

2504. గుండె లయిస్తోంది..!

సిరి'మువ్వై నువ్వు ఎదవేదికపై నడయాడుతుంటే..!!

 

2505. అణువంతైనా ఆగనిదే జీవనయానం..!

ఆశల్నిరేపుతూనో...అడియాసల్ని మిగుల్చుతూనో..!!

 

2506. సమన్వయం కుదరకుంది..!

కలతో కంటితో, మమతో కంటితో...నింపుకున్న సతమతలతో..!!

 

2507. తన తీయనిమాటల ఇటుకలతోనే..!

నేగుండెల్లో కోటను కట్టుకున్నది..!!

 

2508. హృదయం తడిచి ముద్దౌతోంది...!

తన కబురుల చినుకుపూలజల్లులతో..!!

 

2509. విరహమూ చెరసాలే..!

నను బంధిస్తుంటే ..!!

 

2510. నేనొంటరినెలా అవుతాను..!

నను వీడని గతంతో జతపడుండగా..!!

 

2511. శీతల బాష్పాన్నై కరిగిపోతున్నా..!

మమతల సమీరాల తాకిడితో..!!

 

2512. స్నిగ్ధ కుసుమాన్నౌతున్నా..!

సిగ్గుతెరలమాటున ఒదిగొదిగిపోతూ..!!

 

2513. సజాతిధృవాలమే మనం..!

నిరంతరం వికర్షించుకుంటూ..!!

 

2514. తీపిగా(గే)యాల యుగళగీతమే జీవితమంటే..!

గెలుపోటములను అనుకూలంగా మలచుకుంటే..!!

 

2515. రైతన్నల కం(ఇం)ట సంబరాలవానలే..!

అనుకూలించిన కరిమబ్బుల లాస్యపుజల్లులతో..!!

 

2516. హేమంతకోయిలనై విరహిస్తున్నా..!

కాంక్రీటుగొడ్డలికి అనుకూలవతియై తరలిపోతున్న ఆమనికై..!!

 

2517. ఆశలవృత్తం చుట్టూ తిరిగే నిరాశలెన్నో..!

జీవితాన్ని ఎంత అనుకూలంగా మలుచుకుంటున్నా..!!

 

2518. అమరత్వం సిద్ధిస్తోంది..!

ప్రేమామృతాన్ని సేవించగానే..!!

 

2519. భిన్నాభిప్రాయాలు తప్పడంలేదు..!

నన్ను నీలో...నిన్ను నాలో ఇముడ్చుకునే ప్రయత్నంలో..!!

 

2520. కన్నీటి అర్ఘ్యమిస్తున్నా..!

అస్తమిస్తున్న నీ జ్ఞాపకాలకు...సజలనయనాలతో..!!

 

2521. కనులు ఎఱ్ఱకలువలని మురిపిస్తావెందుకో..!

నిదురకునోచని రేయొకటి తోడైందనితెలిసీ..!!

 

2522. ఎవరు విసిరుంటారో ఆత్మీయబీజాన్ని..!

మరుస్థలమంటి మనోక్షేత్రాన్ని సస్యశ్యామలంచేస్తూ..!!

 

2523. సోపానాలుగా పేర్చుకుంటున్నా..!

స్మృతుల దొంతరలన్నింటినీ...నిను చేరేందుకై..!!

 

2524. నిశ్చ(నిర్మ)లమే...నా మనోకాసారమెపుడూ..!

కుసుమించిన నీ ఆత్మీయారవిందాలతో..!!

 

2525. ఏ అడుగుల సడికో..!

తడబడుతోంది నా పాదయుగ్మమ్..!!

 

2526. ఎగిసిపడుతున్న మనసు..!

నువ్వు కల్లోలపరచిన అలజడుల అలలు మదితీరాన్ని తాకగానే..!!

 

2527. ప్రియమైపోతున్నాయి అక్షరాలన్నీ..!

నీకు ప్రేమలేఖను వ్రాయాలన్న తలంపురాగానే..!!

 

2528. ఎన్ని మంచుతుఫానులు కురవాలో..!

హృదయపు బడబాగ్నిని చల్లార్చేందుకై..!!

 

2529. మదన శరాలే..!

హృదయంలోకి చొచ్చుకుపోయే తన పలుకులన్నీ..!!

 

2530. నేనో సాగరతరంగాన్నే..!

నీమనోతీరాన్ని తాకేందుకై  ప్రేమయలలతో పోటెత్తుతూ..!!

 

2531. ఏ కోయిలమ్మ స్వరాన్నిచ్చిందో..!

మురిసిపోతోంది మదికొమ్మ...అను’రాగాలాపనలతో..!!

 

2532. ఎద పొంగిపోతోంది..!

పెనుఉప్పెనై తాకిన ప్రేమ వడితో..!!

 

2533. నే మొండికెరటాన్నౌతున్నా..!

తన మనోకాశాన్ని తాకాలనే పంతంతోనే..!!

 

2534. మూగమురళి సవ్వడిస్తోంది..!!

ఏ అను'రాగం మదిని పలుకరించిందో..!!

 

2535. నేనో శిల్పాన్నైనా..!

నువ్వు ఉలి గాయమై తాకినంతనే..!!

 

2536. గలగల స్వరాలనే మీటుతుంటుంది..!

జలజలపదాల పరవళ్ళతో...సెలయేటికన్య..!! 

 

2537. సడిసేయకే మనసా..!

అలసిన గుడిసెలు ఆదమరిచి కునుకుతీస్తున్నాయిగా..!!

 

2538. వర్ణమయమౌతోంది..!

తన కలలను నింపుకుంటున్న నారేయంతా..!!

 

2539. పొంగే నదినై ప్రవహిస్తున్నా..!

తన  ఊహల చేరికతోనే..!!

 

2540. కనురెప్పలకెన్ని పురుటి నొప్పులో..!

కలల బిడ్డలకు జన్మనిచ్చేందుకై ..!!

 

2541. ఊరేగుతూనే ఉంటాయి..!

నీకై మోసే ఊహలన్నీ...ఆశలమేనాల్లోనే..!!

 

2542. లెక్కేసుకుంటూనే ఉన్నా..!

నిరీక్షణలోని లిప్తకాలానికి ఎన్ని నిమిషాలోయని..!!

 

2543. లయలెక్కువే అలలనర్తకికి..!

సైకతవేదికపై నర్తనమాడుతూ..!!

 

2544. ఎక్కడ నేర్చాయో ఏమో..!

నేపధ్యసంగీతాన్నింతగా...నా హృదయస్పందనలు..!!

 

2545. గ్రీష్మాలన్నీ హేమంతాలౌతున్నాయి..!

తన ఊసుల మంచుపూల తాకిడితో..!!

 

2546. ఏ తారకు వ్రాస్తుంటాడో..!

వెలుగులప్రేమలేఖలను వెండికుంచెతో...వెన్నెలరేడు..!! 

 

2547. భావాన్నలా మోస్తున్నా..!

నిను కన్నీరుగా జార్చుకోవడం కష్టమైపోతుంటే..!!

 

2548. నీలో పోల్చుకోవాలనుకున్నా..!

ఎల్లలెరుగని కలలసౌధాన్ని..!!

 

2549. తోటమాలిని అవుతున్నా..!

కాలపుక్షేత్రాన అనుభూతుల విత్తులను వెదజల్లుతూ..!!

 

2550. అల్లుకుపోతుంటాయి తన్మయత్వంతో..!

పందిరిగుంజల్లే తనను ఆసరా చేసుకుంటూ...నా ఊహలెపుడూ..!!

 

2551. వాహ్యాళియంటే అవగతమయ్యిందిప్పుడే..!

నా ఆలోచనలన్నీ తనవెంటే పరవశలైపోతుంటే..!!

 

2552. పలుకులకెంత పదునో..!

గుండెను గాయపరుస్తూనో...మనస్సును కల్లోలపరుస్తూనో..!!

 

2553. విస్మయమే..!

చిన్ని కొలను విశాలగగనానికి దర్పణమవడం..!!

 

2554. నేనో ఏకాంతవాసినే..!

నీ ప్రేమపిపాసినైనప్పటినుండీ..!!

 

2555. అనుభూతుల గీతాలాపనలే..!

మదిని ఏ స్మృతి సితార మీటిందో మరి..!!

 

2556. మిగుల్చుకుంటున్నా...!

క్షణకాలం అనుభవంతో… జీవితకాలం అనుభూతులెన్నో..!!

 

2557. నాకేదో అయినట్టుంది..!

హృదయపు లోతుల్లోంచి చమరింతల చలమవై నువ్వు తడమగానే..!!

 

2558. బ్రతికేస్తున్నా ఏదోలా..!

జీవించాలనే ధ్యాసలేకనే..!!

 

2559. తులాభారం వేస్తుంటుంది..!

విషాదానందాలను ఎప్పుడూ...కాలపు తక్కెడ..!!

 

2560. మదిలో ప్రవాహాలైపోతున్నాయి..!

ఊరిపోతున్న నీ తలపుల చెలమలన్నీ ..!!

 

2561. జ్ఞాపకాల తివాచీని పరచి ఉంచా..!

సుతిమెత్తగా తాకే నీ పదసవ్వడికై..!!

 

2562. విజయమాధుర్యం తెలిసింది..!

పరాజయాల కషాయసేవనంతో..!!

 

2563. అక్షరాలతోనే సావాసమంటే ఎలా..!

నాసమాధికో చిరునామా ఉండాలిగా..!!

 

2564. కరిగిపోతున్న వేదనాస్మృతులెన్నో..!

నువ్వు వెలుగుకిరణమై నన్ను స్పృశించగానే..!!

 

2565. విరించినే అవుతున్నా..!

నిరంతరం అనుభూతుల సారాలనే లిఖించుకుంటూ..!!  

 

2566. తళుక్కుమనే తారకలే..!

నా మనోకాశంలోని తన జ్ఞాపకాలెపుడూ..!!

 

2567. చిరంజీవినే..!

నీ పరిచయామృతాన్నిసేవిస్తూ..!!

 

2568. నుదిటి సింధూరమే తాను..!

నా జీవనసంధ్యల్లో అరుణమై విరాజిల్లుతూ..!!

 

2569. అనుభవాల భవంతిని నిర్మించుకుంటున్నా..!

గతపు శిధిలశకలాలను తొలగించుకుంటూ..!!

 

2570. కవనసేద్యం చేస్తూనే ఉంటాను..!

నా పార్థీవదేహంపై జల్లబడే పరిమళపు భావకుసుమాలను పూయించేందుకైనా..!!

 

2571. ప్రవహిస్తూనే ఉంటాయి..!

రెప్పలకట్టలను దాటుకుంటూ...జ్ఞాపకాల నదులన్నీ..!!

 

2572. సంధ్య మబ్బునై వేచియున్నా..!

స్వాతిచినుకంటి తన తళుకులకై..!!

 

2573. నే ప్రతిధ్వనిస్తూనే ఉంటాను..!

నీ ప్రేమశిలను తాకినపుడల్లా..!! 

 

2574. నావనై నర్తిస్తున్నా..!

ప్రేమయలలపై తేలొచ్చే నా సరంగుకై..!!

 

2575. పులకింతల రాగాలే..!

పిల్లంగ్రోవయ్యే భాగ్యంతో...పొదలోని వెదురుకి..!! 

 

2576. వేచియుంటా విసుగుచెందక..!

బ్రతుకు చివరైనా కలుస్తావనే ఆశతో..!!

 

2577. పట్టుబడక తప్పదేమో..!

వియోగానికి ఒంటరినై..!!

 

2578. నెమలిపింఛాల సంతాకాలే..!

నా చిరుప్రాయపు పుటలు అన్నింటిలో..!!

 

2579. ఎక్కడ నేర్చిందో..!

అన్ని అష్టాక్షరులను..ఇంతిష్టంగా మురళీసఖి..!!

 

2580. పెదవంచుకి నవ్వుల రంగేస్తున్నా..!

మది రుధిరపులోయల్లోకి జారుతున్నా..!!

 

2581. మనసును అంతలా గారాం చెయ్యకు..!

నాలో ఉన్న నిన్నే బుజ్జగించేస్తుంది..!!

 

2582. ఎంత స్వచ్చందమో..! 

మేఘాల చూరులనుండి జారే చినుకుముత్యాలకు..!!

 

2583. అమ్మ చరితాన్నే..!

ఘనచరితగా నేనెప్పటికీ మెచ్చి దాచుకునేది..!!

 

2584. కనుపాపలకు ఎన్ని తళుకులో..!

తన చిరునవ్వుల పరిచయంతో..!!

 

2585. ఎన్ని చలువ పందిళ్ళను వేసుకున్నానో..!

నువ్వొచ్చే బాటంతా మంచుపూల చల్లందనాలకై..!!

 

2586. నే ప్రకృతినై నర్తిస్తున్నా..!

తన సుమధనువుల కీర్తనలతో..!!

 

2587. గుర్తుపట్టవు ఎందుకనో..!

జన్మజన్మలకూ పరిచయించుకుంటున్నా..!!

 

2588. మధుపాలతో జతకుదిరినట్లుంది..!

తన కలలన్నీ మధువులనే ఊరిస్తుంటేనూ..!!

 

2589. గంధర్వుడవే..!

నా శ్వాసలో గాంధర్వమై చేరుతూ..!!  

 

2590. మిగిలిపోయాంగా..!

నువ్వూనేనులుగానే...మనంగా విడిపోయాకా..!!

 

2591. మౌనమాలనే ధరిస్తున్నా..!

ప్రేమదీక్షనే ఆచరిస్తూ..!!

 

2592. అప్సరసవే నీవు..!

ప్రేమతపస్సును భగ్నపరుస్తూ..!!

 

2593. మదినే నివేదిస్తున్నా నివాళిగా..!

ప్రేమలోనే కైవల్యం పొందేందుకై...!! 

 

2594. ఏ పేరంటానికి వెళుతోందో..!

ఏడురంగుల కోకకట్టి ...గగనకాంత..!!

 

2595. తింగరి భ్రమరాలు..!

సుమకన్నెల కనుగీటుకే గిరికీలు కొట్టేస్తూ..!!

 

2596. చెదిరిపోని తీపికలలే..!

కనురెప్పలపై మధురసంతకాలౌతూ..!!

 

2597. ఏ సందేశాన్ని మోసుకొచ్చాయో..!

మధురకూజితాలతో ప్రియాగమనాన్ని...ప్రేమపావురాలు..!!

 

2598. ఒంటరిని చేసిపోకలా..!

లోకాన్ని మరిచిన మైకంలోనే నన్నొదిలేస్తూ..!!

 

2599. శకుంతలనై విరహిస్తున్నా..! 

క్రౌంచపక్షుల వియోగం మనది కారాదనే..!!

 

2600. జన్మాంతర ఋణభారాన్ని తీర్చుకుంటోంది..!

కలిమిలేములను ఎరుగని స్నేహపెన్నిధి..!!

 

2601. ఎర్రనిపండు..! 

తూరుపు కొమ్మన పూసిన బాలభానుడు..!!

 

2602. వర్ణమాలలను అల్లేయకలా..!

నేసువర్ణమాలను కోరినపుడల్లా..!!

 

2603. మౌనరేఖనే గీసేసావు..!

ఇరుమనసుల మధ్య అపార్ధకుడ్యాన్ని కట్టేస్తూ..!! 

 

2604. సిరి'మల్లెలదెంత స్వచ్ఛత..!

తన మాలలల్లిన సూత్రానికీ సౌరభాలనద్దేస్తూ..!!

 

2605. మదిని ఛిద్రంచేస్తూనే ఉంటాయి..!

పలుకుశరాలను మించిన మౌనక్షిపణులు..!!

 

2606. ప్రేమకై పిచ్చిగా వెదుకులాడుతున్నా..!

పోగొట్టుకున్న చోటే వెదకమన్నారనే..!!

 

2607. కన్నీటి వరదలు ఎంతగా పొంగాలో..!

నీ జ్ఞాపకాల నె(సె)గళ్ళను ఆర్పుకునేందుకై..!!

 

2608. గమ్యమెరుగనిదే నా గమనం..!

సుదీర్ఘమైన సుషుప్తరాత్రుల్లోనే పయనిస్తూ..!!

 

2609. ఏ వెన్నెల పొత్తిళ్ళను పరిచిందో..!

నా అడుగులకు చల్లదనాలపూతలకై...అమ్మఒడి..!!

 

2610. కాలమైతే కరిగిపోతోంది..!

కలవని ప్రేమజంటల మది నదుల్లో గంగలా ప్రవహిస్తూ..!!

 

2611. నర్తిస్తోంది పురులిప్పిన భావోద్వేగం..!

పెదవిదాటని పదాలేవో నిర్నిద్రగానాలౌతుంటే..!!

 

2612. క్షణాల పాపలకింత పరుగులుదేనికో..!

నిమిషకన్నెలై గంటలఒరవడిలో ఉరకలేసేందుకై..!!

 

2613. కన్నీటివర్షం కురుస్తోంది..!

ఏ ఆలోచనల మేఘం కదిలిపోతోందో..!!

 

2614. సతమతమౌతోంది మనస్సు..!

కష్టపడేందుకో...ఇష్టపడేందుకో..!!

 

2615. స్తబ్ధమౌతోంది హృదయం..!

శూన్యపెడారిని దాటిపోగానే..!! 

 

2616. నే జీవనదినే..!

నీ ఆంక్షల ఆనకట్టల్లో బందీనౌతూ..!!

 

2617. వికసిస్తోంది మది మొగ్గ..!

తన లాస్యంతో పులకితైపోతూ..!!

 

2618. జారిపోవాలనుంది..!

నవనీతపు హృదయాల్లోకి..!!

 

2619. సీతాకోకనే అవుతున్నా..!

లాస్యవర్ణాలను పులుముకుంటూ..!!

 

2620. తుంటరి తుమ్మెదనే..!

తన మాటల మధువులను గ్రోలుతూ..!!

 

2621. చెల్లాచెదురైంది హృదయం..!

నీ స్మృతుల పెనుగాలుల తాకిడితో..!!

 

2622. మానసం మౌనాల ముగ్గులేస్తోంది..!

యవ్వనం పరువాల మొగ్గలేయగానే..!!

 

2623. మది కాగితం తడిచి ముద్దయ్యింది..!

ఏ కన్నీటి భావజల్లు కురిసిపోయిందో..!!

2624. బొట్లుబొట్లుగా జారిపోతున్నాయి..!

కంటి చూరులనుండి...జ్ఞాపకాల చినుకులు..!!

 

2625. జ్ఞాపకాల తూనీగలు..!

పసిదనాల నందనంలోకి పరుగులు తీయిస్తూ..!!

 

2626. తనెపుడూ ఇంతే..!

ఊహల్లో మెదులుతూనో...జ్ఞాపకమై మిగులుతూనో..!!

 

2627. నీతోనే నా ప్రతిక్షణం..!

సంభాషణలతోనో...సంఘర్షణలతోనో సాగిపోతూ..!!

 

2628. ఎంత గణిత ప్రావీణ్యమో..!

లెక్కతప్పని చుక్కల ముగ్గుతో రేఖాచిత్రాల్ని గీసే అమ్మకు..!!

 

2629. తెలియనేలేదు హృదయం గాయపడేవరకు..!

పలుకుబాణాలకు...ఇంత పదునుంటుందని..!!

 

2630. కాలపువీధుల్లో విచ్చుకుంటోంది..!

రంగుల చరిత్రల్ని అ(ది)ద్దుకుంటూ...శాంతిచాపం..!!

 

2631. ఏ హాయి సోకిందో..!

తెలిమంచౌతోంది...బరువెక్కిన హృదయం..!!

 

2632. తెలియనేలేదు..!

చెక్కిలి తడిచేవరకూ...గుండె చెమ్మగిల్లిందని...!!

 

2633. మనసుకెన్ని చిత్రవధలో..!

ఒంటరితనపు స్మృతులతో..!!

 

2634. విసుగు పుడుతోంది..!

నవ్వుల ముసుగును ముఖాన నిరంతరమేసుకోవాలంటే..!!

 

2635. ఎవరు వెలిగిస్తారో..!

మిణుగురుల నక్షత్రాలను...ధరణి కోటలో..!! 

 

2636. మదిసంద్రం హోరెత్తుతోంది..!

వేదనావాగులన్నీ సంగమించగానే..!!

 

2637. నేను నిర్లిప్తపు గగనాన్నే..!

తాను వెన్నెలై నిండేవరకు..!!    

 

2638. ప్రియమైనవే..!

మనసైన తన మాటలెపుడూ..!! 

 

2639. తన నవ్వుల పరాగాలతోనేగా..!

నాయధర సుమం విచ్చుకునేది..!!

 

2640. నెమలీకల నెయ్యాలు..!

మనోయవనికపై నాట్యమాడుతూ..!! 

 

2641. మబ్బుకుంచలకెన్ని అందాలో..!

గగనకాన్వాసుపై చిత్తరువులైపోతూ..!!

 

2642. కరిమబ్బుకిన్ని పులకలెందుకో..!

అల్లరి గాలి చిలిపిగా కనుగీటిపోగానే..!!

 

2643. ఏ పరిచిత చినుకు జారిందో..!

మోడైన బతుకు వనం చివురించేందుకై..!!

 

2644. చిత్తరువులౌతున్నాయి..!

అలల కుంచెలతో...సాగిపోయే సెలయేళ్ళన్నీ..!!

 

2645. అస్థిత్వపు పోరాటమే..!

రగులుతూనో, పొగులుతూనో నిశ్శబ్దించే మనసుదెపుడూ..!!

 

2646. ఏ అనురాగపవనం నిమిరిందో..!

కరిగికరిగి కురిసిపోతోంది...కమ్ముకున్న దుఃఖమేఘమంతా..!!.

 

2647. పరిమళసంతకాల్ని చేస్తున్నా..!

మల్లెలనవ్వుల గుబాళింపులతో..!!

 

2648. శకలాలై ప్రోగడుతున్నాయి..!

జారిపడి పగిలిపోతూ...గాజంటి కలలన్నీ..!!

 

2649. స్వప్నమో...సాదృశ్యమో..!

అంతుచిక్కని అంతరంగరహస్యం..!!

 

2650. అందమైనదే ఆశెప్పుడూ..!

మనస్సును తుమ్మెదలా చుట్టూనే తిప్పుకుంటూ..!! 

 

2651. గుండెలపై కురిసిపోతుంటుంది..!

ఏ వర్తమానం పంపకుండానే...కన్నీటివాన..!!

 

2652. సంతోషమో...భావోద్వేగమో..!

కన్నీటి తెరలను దాటుకొచ్చే నీటిచుక్కలకు..!!

 

2653. మనస్సు పారాడుతోంది..!

బాల్యపు అక్షరాలచావడిలో..!!

 

2654. ప్రియమైనదే నాకెపుడూ..!

ప్రేమాలింగనం చేసుకునే నీ ఏకాంతం..!!

 

2655. ఒంటరితనం..!

నన్నెన్నడూ వీడిపోని ఓ ప్రియనేస్తం..!!

 

2656. జీవనసంధ్యకు ఎన్నెన్ని వర్ణాలో..!

తన పరిచయం పల్లవించగానే..!!

 

2657. మించిపోలేదింకా సమయం..!

మా'నవతలో మానవత్వపు పరిమళాన్ని నిలుపుకునేందుకై..!!

 

2658. చిరకాలపు నేస్తమే..!

ఏకాంతంలోనూ ఆర్తిగా హత్తుకునే ఒంటరితనం..!!

 

2659. భావాన్నలా మోస్తున్నా..!

నా రేయిమలుపుల్లో సమాధికానివ్వని స్వప్నాలన్నింటిలో..!!

 

2660. ధ్వనిస్తూనే ఉంటాయి..!

కాలపు అడుగుల సవ్వడిలో... స్మృతులెప్పుడూ ఊపిరి రవళులై ..!! 

 

2661. నా హృదయసౌధానికే చేరుతున్నాయేమిటో..!

నే చిలిపి లేఖల్ని తన చిరునామాకు వ్రాస్తుంటే..!!

 

2662. ఖాళీ చేసేస్తున్నా..!

జ్ఞాపకాల అలమరాను...మధురస్మృతులతోనే  నింపుకుందామని..!!

 

2663. బందీగా పట్టుకోవాలనుంది..!

నిను నింపుకున్న మన గతాన్ని..!!

 

2664. చేజారిపోయిన స్వప్నానివే..!

కలతగానో, మగతగానో...నారాత్రిలోకి చొరబడుతూ..!!

 

2665. ఇంటి దారిని మరిచిపోతుంటాయేమో తారలమ్మలు..!

వెన్నెలరేడు ముంగిట వెలుగురంగవల్లుల్ని దిద్దుతూ..!!

 

2666. విరామచిహ్నాలనెరుగనివే..!

అలుపెరుగక సాగిపోయే సుఖదుఃఖాలు..!!

 

2667. నేనో భగ్నప్రేమికనే..!

తన నగ్న హృదయంలోనే ఒదిగిపోతూ..!!

 

2668. పసిగడుతూనే ఉన్నా మౌనంలోని బాసలెన్నో..!

కనురెప్పల చిటికెల్లోనో...అధరపు విరుపుల్లోనో...!!

 

2669. మళ్ళీ పరుగులుతీస్తోంది చిఱుతప్రాయం..!

తూనీగలెంట సంబరంగా పరుగులెడుతున్న అమ్మలు అడుగులతో జతపడుతూ..!!

 

2670. నీ పలుకుల తారకల్ని పోగేస్తున్నా..!

నా బతుకుతిమిరంలో కాంతిపుంజాల్ని నింపుతాయనే..!!

 

2671. ఎన్ని వేల మైళ్ళు నడిచుంటానో..!

నీతో తొలియడుగు వేసింది మొదలు..!!

 

2672. పరుగుపందెంలో మొదటి స్థానం ఎప్పుడూ నాదే..!

తక్కువ మార్కులొచ్చినప్పుడు నాన్న తరిమింది మొదలు..!

 

2673. ఏ కన్నీటిజల్లుకు కదిలిపోయిందో..!

కాగితాన్నింతగా తడిపేసిన...కలం..!!

 

2674. ఎన్నెన్ని భావాలవానలు కురుస్తున్నాయో..!

నాన్న గుండె గోడెనుక దాచిన మౌనక్షణాల్ని చీలుస్తుంటే..!!

 

2675. జాలిగా పలకరిస్తున్నాయి..!

కలలుగానే మిగిలిపోయిన కన్నీటి రాత్రులు..!!

 

2676. ఊరేగి వస్తోంది..!

ఎలకోయిలల ఋతురాగం...వసంతగాలి పల్లకిలో..!!

 

2677. ఏ గాలి ఈల సంగీతానికో..!

విత్తును పగలగొట్టుకొచ్చే అంకురానికింత సంబరం..!!

 

2678. ఎటుపోతుంటాయో అపుడపుడూ..!

ఓ మాటైనా చెప్పకుండా...పాడాలోచనలు..!!

 

2679. నింగి నుండి జారిపడ్డ ఇంధ్రధనువే..!

నేలపై రంగురంగుల పూలుగా దర్శనమిస్తూ..!!

 

2680. గగనమంతా తప్పెటల మోతలే..!

ఉరుములొక్కసారిగా గుడ్లురిమి చూడగానే..!!

 

2681. పిల్లవాగులకు అల్లరెక్కువే..!

కొండల్లోకో...లోయల్లోకో దూకుడుగా దుమికేస్తూ..!!

 

2682. పాడే కోయిలల్ని చూసాకనేగా..!

నేపలుకుల్లోని మెళుకువల్ని నేర్చుకున్నది..!!

 

2683. కళ్ళు చెమరిస్తున్నాయి..!

ఏ గాఢస్పర్శ గుండెను తడిమిందో..!!

 

2684. ఏకాకియే..!

ఒంటరిగానే వచ్చి, ఒంటరిగాపోయే ప్రాణమెప్పుడూ..!!

 

2685. కాలమైతే కరిగిపోతోంది..!

గాయాల్నలాగే మిగులుస్తూ..!!

 

2686. నవ్వుల సంతకాల్ని చేసుకుందామా..!

మన చెలిమి హామీపత్రంపైన..!!

 

2687. విశాలమైన గగనమే..!

అలజడి రెక్కలను విప్పుకుంటూ...హృదయం..!!

 

2688. చెక్కిలి దోసిట ఒదిగిపోతున్నాయి..!

కనుమబ్బుల జారే ముత్యాలన్నీ...తాను హిమసమీరమై తాకగానే..!!  

 

2689. మృదువైనదే..!

సుతిమెత్తగా హృదయాన్ని కోసేసే గాయమెపుడూ..!!

 

2690. ఆనందం ఎపుడూ ఆకాశమంతే..!

సముద్రమంత విషాదాన్ని పారద్రోలగలిగితే..!!

 

2691. తళుక్కుమందో పాలపుంతల సమూహం..!

తన పెదవి అంచున మెరిసిన...వెండికిరణపు నవ్వులతో..!!

 

2692. మనోపుస్తకం అ(సొ)లసిపోతోంది..!

నీకై నింపుకుంటున్న అక్షరబరువును మోయలేనంటూ..!!

 

2693. రేయీ నిద్రకుపక్రమిస్తోంది..!

నా ఒంటరితనాన్ని ఓదార్చే...ఓపిక, తీరిక తనకులేదంటూ..!!

 

2694. సురక్షితమే మనసెపుడూ..!

నీయాలోచనల పహారాతో..!!

 

2695. జారిపోయే ఘడియలెన్నో..!

నీకై తపిస్తున్నానని మందహసిస్తూనో...పరిహసిస్తూనో..!!

 

2696. సడి చేస్తూనే ఉంటాయి..!

నేనెంతగా నెట్టేస్తున్నా...మదిపొరల్లోకి చొచ్చుకుపోతూ కొన్ని జ్ఞాపకాలు..!! 

 

2697. ఆరారు ఋతువులూ వసంతాలైపోతున్నాయి..!

నిరీక్షణలోనూ వెన్నంటి ఉన్న తన ఊహల లాలనతో..!!

 

2698. గిలిగింతలెడుతోంది కొంటె తెమ్మెర..!

తన ఏకాంతంలో గతి తప్పిన మనస్సును ఆటపట్టిస్తూ..!!

 

2699. నయనాలతోనే లిఖిస్తున్నా..!

నాహృదయలేఖను...హత్తుకునే మనసు తనకుందనే..!!

 

2700. అతికించుకుంటూనే ఉంటుంది..!

క్షణాల ముక్కలను...కాలపు గొలుసు..!!

 

2701. వచ్చీ పోయే అతిథులే..!

నా ఏకాంతమందిరానికి...జ్ఞాపకాలెపుడూ..!! 

 

2702. ఒడిసిపట్టడం నేర్చుకున్నా..!

జారిపోతున్న బంధానుబంధాలను..!!

 

2703. ఏరుకుంటున్నా..!

జ్ఞాపకాల శిధిలాల్ని...పగిలిన గుండెల్లోంచి..!! 

 

2704. దాచుకున్నా మది పుటల్లో..!

బాల్యపు జ్ఞాపకాలన్నీ...నెమలికన్నులుగా..!! 

 

2705. ఎంత బావుందో..!

మాటలకై అల్లుకున్నతన మౌనం..!!  

 

2706. కనుగగనాన శ్రావణమేఘాలే..!

తన చూపుల్లో అనురాగజల్లులై కురిసిపోతూ..!!

 

2707. సిరు'లొలికిస్తున్నాయి..!

మది మాగాణిలో...చిరునవ్వుల జల్లులేవో..!!

 

2708. వెంటాడుతున్నాయి..!

వెతలలోయల్లోకి నెట్టేస్తూ...జ్ఞాపకాల సమూహాలన్నీ..!!

 

2709. జలకమాడుతోంది మది..!

తన ఊహల పన్నీటి తొలకరులతో..!!

 

2710. చిత్రంగా ఒదిగిపోయేవే..!

మదికాన్వాసుపై గీసుకున్న ఊహల చిత్తరువులు..!!

 

2711. ఇరు మనసుల సంగమమే..!

బాసల వెల్లువలో పొంగిపొరలుతూ..!!

 

2712. గుబాళించే సౌరభాలే..!

మౌనాల పొదలనుండి నీ తలపులు..!!

 

2713. పరిశోధకురాలినే..!

నిరంతరం నీ మనోశాస్త్రాన్ని శోధిస్తూ..!!

 

2714. పొంగిపోతున్నాయి..!

ఊసుల సెలయేరులెన్నో...జ్ఞాపకాల ప్రవాహాలుగా..!!

 

2715. అంగడి సరుకులిపుడు..!

ఆత్మీయతానుబంధాలు...అభిమానాలు..!!

 

2716. మనసూ మాటలు నేర్చింది..!

అధరాలపై దరహాసపులేఖలను లిఖిస్తూ..!!

 

2717. నేను అసువులనే విడుస్తాను..!

మరుజన్మకైనా నీవు అనుగ్రహిస్తానంటే..!!

 

2718. ఒంటరిని చేసి వేధించేవే..!

మదిని వీడని మధురస్మృతులన్నీ..!!

 

2719. ఎంత పులకింతో..!

గాలి పాడే జోలలతో...చిరుమొలకలకు..!!

 

2720. కన్నీటి బిందువులకు ఆర్తనాదాలే..!

కలలసౌధాలు కుప్పగా కూలిపోతుంటే..!!

 

2721. నిశ్శబ్ద శరాలెన్నో..!

కాలపు సంకెళ్ళను కర్కశంగా తెంచేస్తూ..!!

 

2722. మనసు పొరల్ని త్రవ్వుకుంటున్నా..!

వేదనాచలమలను తోడి పోసేద్దామని..!!

 

2723. వయస్సుకెంత తుళ్ళింతలో..!

చైత్రకోయిలై తను మైత్రీ రాగమాలపిస్తుంటే..!!

 

2724. శృతిని చేస్తున్నాయి మధురోహలు..! 

మదిగుహలోని ...ప్రేమ ప్రకంపనలతో..!!

 

2725. చిలిపిగా తాకిపోతున్నాయి..!

కొంటె చిరుగాలులేవో...తెగ అల్లరిచేసేస్తూ..!!

 

2726. చందనాల పూతలే..!

నీ అనునయ గంధాలను అద్దుకుంటుంటే..!!

 

2727. మదిమబ్బుల్లో దాగింది నీవే..!

నిండుచంద్రునిలా మెరిసి మురిపిస్తూ..! 

 

2728. అమరగీతమైపోతోంది ..!

పెదవులపై నర్తిస్తూ...నీ నామం..!!

 

2729. వసంతమెపుడూ నా చెంతనే..!

ఆనందాల సుమపరిమళాలను నింపుకుంటూ..!!

 

2730. హృదయాంజలినే అర్పిస్తున్నా..!

జీవితాన్నో ఆహ్లాదమైన బాణీగా కట్టేస్తూ..!!

 

2731. స్పృశిస్తోంది పసిప్రాయం..!

నెమలి పింఛాలతో..!!

 

2732. ఉత్తుంగతరంగమౌతోంది మది..!

స్మృతులసంద్రపు అల్పపీడనంతో..!!

 

2733. ఒంటరి మదికెంత దిగులో..!

గగనమంత శూన్యాన్ని నింపుకుంటూ..!! 

 

2734. సిగ్గు చీర తొలిగిపోతోంది..!

వలపు జోరు పరవళ్ళతో..!!

 

2735. తామరకెంత తన్మయత్వం..!

కొంటెకిరణం కనుగీటగానే..!!

 

2736. సిగ్గుల పంటలే..!

గోరింటకు ఈడొచ్చిందంటే..!!

 

2737. మందహిస్తోంది మధుమాసం..!

మరుమల్లెల పరిమళాలతో..!!

 

2738. ప్రణయ తాళమేస్తూ..!

హృదయానికెంత తన్మయత్వమో..!!

 

2739. పసిపాపనే అవుతున్నా..!

నీ కలల ఒడిలో నిదురిస్తూ..!!

 

2740. తన భావగీతికలు..!

నా తలపుల తుమ్మెదలను నర్తింపచేస్తూ..!!  

 

2741. చెదరని స్మృతులే..! 

హృదయకావ్యంలో సువర్ణాక్షరాలుగా..!! 

 

2742. మనోకెరటం అలసిపోతోంది..!

నిరాశాఘోషలో చిక్కుకుని..!!

 

2743. దరిచేరని నీకై ..!

ఎన్ని వేల నిమిషాలను లెక్కిస్తున్నానో..!!

 

2744. ఎంతాశనో  ఏకాంతానికి..!

నీ తలపులను గాఢoగా హత్తుకోవాలని..!!

 

2745. మదికి ఇంత గారాలతో మారాములా..!

నచ్చాడని  తొందరపడి చెప్పడం తప్పేనేమో..!!

 

2746. మధువుల మత్తులోనే ఖైదీలైపోతుంటాయి..!

సుమాలకౌగిళ్ళలో కరిగిపోయే...మధుపాలు..!!

 

2747. మనసు స్థిమితపడుతోంది..!

మొహమాటపుపొరలు తొలగిపోగానే..!!

 

2748. కనుపాపలకు ఎన్ని సిగ్గులో..!

తన కలలను హత్తుకుంటుంటే..!!

 

2749. విరామచిహ్నం పెట్టేసా..!

నీ తలపుల మంత్రాక్షరాలకు..!! 

 

2750. కంటిపై కునుకెక్కడిదీ..!

చెరిగిపోయిన చిరునవ్వును చెలిమితో చిత్రించేవరకు..!!

 

2751. నీ జ్ఞాపకాలకు గిరిగీసేయవూ..!!

నా హృదిపరిధిలోకి జొరబడిపోకుండా..!!

 

2752. మూడు ముళ్ళూ వేస్తావనే..!

మూడు పదాలనూ నేర్చుకొచ్చింది..!!

 

2753. చినుకుపూలాభిషేకాలతోనే..!

తరుకాంతలు తలారా తానమాడేది..!!

 

2754. చెక్కిలిని గిచ్చేస్తూ..!

నీ ఊహల కందిరీగలెన్నో..!!

 

2755. కన్నీటి  స్నానాలే..!

నవ్వులోను...ఏడుపులోనూ తడిచిముద్దయ్యే నయనాలకు..!!

 

2756. వదలలేమంటూ స్మృతులు..!

మదిగదిలోనే  మసులుతూ..!!

 

2757. కలల వధువులే..!

ఊహల మేనాలో ఊరేగొచ్చే మోహాలు..!!

 

2758. మనోఫలకంపై చెక్కుతున్నా..!

చెదిరిపోని నీ స్వప్నాలనే…శిలాఫలకాలుగా..!!

 

2759. నిన్నల్లోనే మిగిలిపోతూ..!

నేడు తట్టెళ్ళిపోయే క(ప)న్నీటి జ్ఞాపకాలెన్నో..!! 

 

2760. మనోతీరాన్నికోసేస్తున్నాయి..!

ఉవ్వెత్తున పడిలేచే అడియాసల కెరటాలు..!!

 

2761. కన్నీటి క(వ)డగండ్లెన్నో..!

మదిమబ్బు వర్షిస్తుంటే..!!

 

2762. కల చెదిరిపోయింది..!

అచ్చంగా ముగిసిన మన కథలాగానే..!! 

 

2763. జ్ఞాపకాల గీతికలెన్నో..!

హృదయార్పణతో ఆలపిస్తూ..!!

 

2764. ఓ వింత కల..!

నా కలలన్నీ నిజమైపోతున్నట్లు..!!

 

2765. వెతల కథలెన్నో..!

కలవరాలసీమలో విహరిస్తూ..!!

 

2766. అవినాభావ సంబంధమే..!

హృదయానిది...నయనానిది..!!

 

2767. మెరిసిపోతున్నాయి..!

కలల జిలుగులేవో...కనుగవ్వలపై..!!

 

2768. జాబిలమ్మకెన్ని హొ(ల)యలో..!

అలలయద్దంపై ప్రతిబింబిస్తూ..!! 

 

2769. అడుగడుక్కీ సహస్రాక్షులే..!

అతివలను అహల్యలుగా శల్యపరీక్షలకు గురిచేస్తూ..!!

 

2770. చినుకుపూలే తలంబ్రాలు..!

నింగీనేలల పరిణయానికి..!!

 

2771. గాయంచేసే ముళ్ళెన్నో..!

హృదయకుసుమం చుట్టూ..!!

 

2772. నీ ఊసుల అంకురాలు..!

బీడువారిన మనోక్షేత్రంలో...చివురిస్తూ..!!

 

2773. మనమని వేరులేముగా..!

నీదీనాదని భేదాలెంచకు..!!

 

2774. అంతరాలున్నవి..!

నీకూ, నాకే...మనకు కాదుగా..!!

 

2775. మరందాల ఝరులే..!

నీ స్వరపారిజాతాలకు..!!

 

2776. హృదయ నౌక..!

తేలియాడుతోంది...వలపువాగుల్లో..!!

 

2777. కవ్వించే కలలెన్నో..!

తేటులల్లే  కాటేసిపోతూ..!!

 

2778. హృదయానికి ఎంత రోదనో..! 

కన్నీటి ఉప్పెనలలో కొట్టుకుపోతూ..!!

 

2779. విరుచుకుపడుతున్నాడు తనయుడు..!

విల్లురాయని తండ్రిపై తలకొరివి పెట్టేందుకు ఖర్చులివ్వలేదట మరి..!!

 

2780. ప్రతిక్షణం వసంతమే..!

నువ్వే కాలమానమైపోతుంటే..!!

 

2781. ఆశల పూలపడవలెన్నో..!

ఎండమావిలో తేలియాడుతూ..!

 

2782. ఇరువురి లోకమొక్కటే..!

విరహవిహంగాలై  విహరిస్తూ..!! 

 

2783. తెలియకుంది..!

మరణించిన హృదయంతో...మనగలగడమెలాగో..!!

 

2784. పెదవికొమ్మన విరబూస్తూ..!

చిరునవ్వుల విరులెన్నో..!!

 

2785. మాటల గాట్లేగా..! 

మనస్సుపై చెరగని మచ్చలుగా మిగులిపోతూ..!!

 

2786. పుటలన్నీ నీ స్మృత్యక్షరాలే..!

నా జీవనగాథను ఛిద్రంచేస్తూ..!!

 

2787. జాబిలి మొగ్గ..!

చీకటి మడుగులో వికసించే కుముదిని..!!

 

2788. అమృతవర్షమే..!

నువ్వు పలికే ప్రతి పలుకులో..!!

 

2789. వింతగా ఉంది కదూ..!

నేను లేని నాలో నీతో జీవిస్తూ గడపడం..!!

 

2790. తడిసి ముద్దైపోతున్నా..!

నీ మందహాసాభిషేకాలతో..!!

 

2791. ఆశల కలువలెన్నో..!

మానసతటాకంలో సుమిస్తూ..!!

 

2792. వేదనాసుమాలే..!

నిట్టూర్పుల సరస్సుల్లో సుమిస్తూ..!!

 

2793. జ్ఞాపకాలే లేపనాలు ..!

నువ్వు చేసే ప్రతి గాయానికి..!!

 

2794. దిగులు ముసుగేసేసాను..!

తన ఎడబాటు మిగిల్చిన భారంతో..!!

 

2795. రాకపోకలు దేనికి ?

నాలోనినీకు...ఉండిపోరాదా స్థిరంగా ఇచ్చటనే..!!

 

2796. విసిరేస్తున్నా..!

అక్షరాల రాళ్ళనే...భావసంద్రంలో ప్రకంపించేలా..!!

 

2797. హృదయం విలపిస్తోంది..!

నాలో లేని నీకై తడుముకుంటూ..!!

 

2798. మరణాన్ని జయించడం కష్టమే..! 

మానసికంగానైనా లేక శారీరకంగానైనా..!!

 

2799. పరిమళించే నెత్తావిలెన్నో..!

మనోవనాన తన నవ్వుల తొలకరులతో..!!

 

2800. మదిని తాకుతున్నాయి..!

నీ కలల మరువాలెన్నో...మల్లెచెండులై..!!

 

2801. సాగిపోయే సెలయేరులెన్నో..!

ఇరు హృదయసంగమంలో..!! 

 

2802.గుర్తుకొస్తున్నాయి..!

కన్నీటితో కడిగేసిన జ్ఞాపకాలన్నీ..!!

 

2803. స్వరపరుస్తున్నాయి..!

మదిని శృతిచేస్తూ...హృదయనాదాలేవో..!!

 

 2804. హృదయాన్ని దోచేస్తున్నాయి..!

పలకరింపుల ప్రత్యూషపవనాలు..!!

 

2805. అక్షర నక్షత్రాలెన్నో..!

కవనగగనంలో మెరిసిపోతూ..!!

 

2806. హృదయతివాచీనే పరుస్తున్నా..!

నువ్వు నడిచొచ్చే దారంతా...మెత్తందనాలకై..!!

 

 2807. కాలం విస్తుపోతోంది..!

నీతోడిదే లోకమైపోయిందని..!!

 

2808. మనిషినయ్యాను..!

నువ్వు మమతవై అల్లుకోగానే..!!

 

2809. నేనంటే నాకెంత మురిపెమో..!

నాలో నిను దాచుకున్నాక..!!

 

2810. అలసిపోతోంది మౌనం..!

మాటల మాటున దాగుండిపోతూ..!!

 

2811. తట్టుకోవడం కష్టమే..!

మనోసాగరపు ఉరవడిని..!!

 

2812. బారులు తీరుతున్నాయి..!

ఎక్కడలేని జ్ఞాపకాలు...తెగ ఎగబడిపోతూ..!!

 

2813. ఓడిపోతున్నాయి మాటలన్నీ..!

మౌనాలను జయించలేకనే..!!

 

2814. అభినేత్రే నిశి నర్తకి..!

వెన్నెల వేదికపై నర్తిస్తూ..!!

 

2815. నీ పలుకుల పల్లవిలో..!

మత్తకోకిలల మధుర కూజితాలెన్నో..!!

 

2816. బృందావనిలో పొన్నలేనేమో..!

కన్నయ్య మోవిపై రాగాలై కుసుమిస్తూ..!!

 

2817. దివ్వెల వెలుగులే..!

నీ అధరపు నవ్వుల కిరణాలు..!!

 

2818. కువకువల సంధ్యారాగాలే..!

ఊహల పల్లకీలో ఊరేగిపోయే...మదికి..!!

 

2819. జాలువారుతూ చెలినవ్వులు..!

జాబిలమ్మ వెన్నెల్లో నన్ను తడుపుతూ..!!

 

2820. చంచల విన్యాసాలే..!

హరిణాల నయనాలకు..!!

 

2821. మృత్తికకు ఎంత పరవశం..!

స్వాతిచినుకులు ఆర్తిగా హత్తుకోగానే..!!

 

2822. గాయాలై  స్రవిస్తున్నాయి..!

దెబ్బతిన్న జ్ఞాపకాలన్నీ..!!

 

2823. వేదనల ప్రసవాలే మదికి..! 

నాలో నేనే రమించినపుడల్లా..!!

 

2824. మునకలేస్తోంది మది..!

ప్రణయఝురుల ఉరవడులతో..!!

 

2825. లిపిలేని బాషయే..!

ఘోషించే మూగ మనస్సుది కూడా..!!

 

2826. అశ్రువులై జారిపోతున్నాయి..!

కన్నీటి చూరుల్లో...వేదనల బిందువులు..!!

 

2827. కలల మువ్వలెన్నో..!

నడి రాతిరి దుప్పటిని కప్పుకుంటూ..!!

 

2828. గగనపు నీలాలే..!

నీ కన్నుల్లో వెలుగులై ప్రభవిస్తూ..!!

 

2829. అపురూపమైపోతున్నాయన్నీ..!

మనోచక్షువులే నీవయ్యాక..!!  

 

2830. విస్తుపోతున్నాయి..!

మదిగోడన వ్రేలాడుతూ...ఆశల చిత్తరువులు..!!

 

2831. ఊడ్చేస్తూనే ఉంటుంది..!

జారిపడ్డ ప్రతిక్షణాన్ని...జాలిలేని కాలం...!!

 

2832. అమ్మెపుడూ ఇంతే..!

తడారనివ్వదు ...గుండె చమరింతల్ని..!!

 

2833. మునిగిపోతుంది..!

అశ్రుజలధిలో...స్వప్ననౌకెపుడూ..!!

 

2834. నిలిచిపోయింది మది..!

నిను వీడిన క్షణాల వద్దనే..!!

 

2835. సత్యం కాలధర్మం చెందింది..!

మహాత్ముని మరణాన్ని తట్టుకోలేక..!!

 

2836. జ్వలిస్తూనే ఉంటాయి..!

జ్ఞాపకాల జ్వాలలు...మౌనక్షణ కణాలపై..!!

 

2837. హరితవస్త్రం..!

పల్లెవధువుకు ఆమని పంపిన సారెచీర..!!

 

2838. మదికెంత మురిపేమో..!

నేనోడినా గెలుపై నిను వరించిందని..!!

 

2839. అందాల జాబిలమ్మనే..!

మది గగనంలో...మెరిసి మురిసిపోతూ..!!

 

2840. చిత్తమంతా నీ ధ్యానమే..!

విరహబాధను తరచి...తలచి..!

 

2841. పొత్తుకోసమెన్ని జిత్తులో..!

లౌక్యపు ముసుగేసుకుంటూ..!!

 

2842. తలచేదొకటి మనస్సులో..!

పలికించేదొకటి పెదవులపై ..!!

 

2843. వాడిపోని తీయ్యందనాలే..!

చిట్టిపాపల ముద్దుమాటల్లో..!!

 

2844. జారిపోతున్నాయి..!

ఆశాఝరులెన్నో...మనోశిలపై..!! 

 

2845. పరామర్శిస్తూనే ఉంటాయి..!

మాసిపోని కొన్ని గాయాల ఆనవాళ్ళు..!!

 

2846. సాగిపోతున్నాయి..!

వేదనల సెలయేళ్ళు...కన్నీటి ఒరవడితో..!!

 

2847. కనురెప్పలకెంత తన్మయత్వం..!   

తన కలల పుప్పొడిని అద్దుకుంటూ..!!

 

2848. ఆంక్షల కంచె కట్టేసావుగా...!

మన ప్రేమకోట చుట్టూ..!!

 

2849. నిషేధించకలా ఆగమనాన్ని..!

నీ కలలో కూడా చొరపడరాదని..!!

 

2850. నీ తలపులే ..!

మదిగదిలో తారాడుతూ..!!

 

2851. పొంగిపూస్తున్నాయి..!

స్వప్న పంకజాలు...కనుల కొలనులో ..!!   

 

2852. క్షమించరాని క్షణాలెన్నో..!

నువ్విసిరేసిన కాలగమనంలో..!! 

 

2853. తారాసుమాలనే తెంచుతున్నా..!

నవ్వుల పూలదండలతో కలిపి అల్లుకుందామనే..!!

 

2854. నీలి మబ్బులే..!

కన్నుల్లో...సిగ్గుల మేలి ముసుగులేస్తూ..!!

 

2855. తన నాదలహరికేమో..!

నాట్యకేళిలో నినదిస్తోంది నా హృదయం..!!

 

2856. భావసంగమం..!

మస్తిష్కానికి మంచి ఔషదం..!!

 

2857. శశి మోమెంత మనోహరమో..!

మేఘాల పరదాల్లోంచి తొంగిచూస్తుంటే..!!

 

2858. జాగు చేయకలా..!

సొమ్మసిల్లుతున్నాయి కనులు నీకై వేసారి..!!

 

2859. సమిధలా ఆహుతౌతోంది..!

చింతల కొలిమిలో కాలే...హృదయం..!!

 

2860. ఎగరేస్తున్నా..!

కలల గాలిపటాలను...ఆశలదారాన్ని పట్టి..!!

 

2861. అత్యాశనే కదూ...!

నిర్వేదపు నిశిలో వెలుగుపూలకై వేసారడం..!!

 

2862. ఊరేగుతూనే ఉంటాను..!

తుదిశ్వాశ వరకు...భావాల మేనాలోనే..!!

 

2863. ఉలికిపడుతూనే ఉంటాయి..!

ఎద తల్పంపై కునుకుతీస్తున్న మధురోహలు..!!

 

2864. కనులకౌగిలిలో కరిగిపోతూ..!

ఒదిగిపోతున్నాయి కలలన్నీ..!!

 

2865. శిశిరసుమాలై వాడిపోతూ..!

రాలిపోతున్నాయి ఆశలన్నీ..!!

 

2866. కోసిపోతున్నాయి చురకత్తులై..!

మదితీరాన్ని తాకుతూ...నీ కలలయలలు..!!

 

2867. సెలవంటూ సాగిపోతున్నాయి..!

బిడియాలన్నీ...నువ్వూ నేను మనమయ్యాక..!!

 

2868. మది పొద మోడువారుతోంది..!

నవ్వుల పూలను రాల్చుకుంటూ..!!

2869. ఎద కొమ్మల్లో గుబాళిస్తూ..!

ముద్దుగొలిపే మమతల పూబంతులెన్నో..!!

 

2870. ఇరుకైంది హృదయం..!

తన ఆక్రమణతో..!!

 

2871. నన్నే నిలువరిస్తోంది..!

నా నీడగా మారిన నీపయనం..!!

 

2872. తన "చుక్క"ల్ని దోచేస్తారనేమో..!

రాత్రంతా పహారాకాస్తుంటాడు వెన్నెలమామ..!!

 

2873. సాగిపోక తప్పదు..!

కన్నీటి సాగరంపై...బ్రతుకు నావ..!!

 

2874. ప్రవహిస్తోంది మది నది..!

ఆనందాల పరవళ్ళను త్రొక్కుతూ..!!

 

2875. జీవించాలనుంది..!

మళ్ళీ నా జీవితకధలోనే..!!

 

2876. నాలో నాకు నచ్చేది..!

మనసులతో మనసువిప్పి మాట్లాడడం..!!

 

2877. నేను మురిసి విరిసేది..!

నా ఆశయాల పూదోటలోనే..!!

 

2878. ఉక్కిరి బిక్కిరి అవుతోంది..!

ఆలోచనలతో కిక్కిరిసిన మది..!!

 

2879. ఊసులేవో చెబుతుంటుంది..!

ఉల్లాసంలో తేలియాడే చిరుప్రాయపు స్వగతం..!!

 

2880. ప్రేమనై పలుకరిస్తాను..!

మనోగవాక్షాన్ని తట్టగానే..!!

 

2881. నేను ఇంతగా ఇష్టపడేది..!

నాలో ఉన్న నిన్నే..!!

 

2882. ఇంకా ఎన్నాళ్ళో..!

కన్నీళ్ళను మాత్రమే తాగి జీవించడం..!!

 

2883. గుండె ఆగిపోయినట్లే..!

లిప్తపాటు  కాలమైనా నిను తలవకుంటే..!!

 

2884. ఆమని కోయిలనే..!

తన్మయత్వపు రాగాలనే ప్రియమారా శృతిచేకుంటూ..!!

 

2885. దాచుకున్నా..!

ఆశల మూటలెన్నో… మౌన బాసలమాటున..!!

 

2886. నా మనుగడ స'రాగమే..!

నీ మనోమందిరానికి అతిధినయ్యాక..!!

 

2887. నీ జాడలకేమో..!

రెక్కలు తొడుగుతున్నాయి…క్రొత్తగా ఊహలేవో..!!

 

2888. మౌనమువ్వలు నర్తిస్తున్నాయి..! 

తన పదరవళుల సవ్వడిని వినినంతనే..!!

 

2889. తీరాన్నై వేచియున్నా..!

ప్రణయ అలవై తాకిపోయే నీకోసం..!!

 

2890. నేనుగా మిగిలిపోయాను..!

నువ్వు వెలేసిపోగానే..!!

 

2891. గాంధర్వమై చేరావు..!

నా శ్వాశలో లయబద్దంగా రవళిస్తూ..!!

 

2892. మైమరుస్తోంది మానసం..!

మళ్ళీ తన ప్రేమలోనే పడిపోతూ..!!

 

2893. జారిపోవాలనుంది బాల్యంలోకి..!

తూనీగనై ఎగిరిన రోజులు గుర్తొచ్చినపుడల్లా..!!

 

2894. నా మదిలో వెన్నెల కురుస్తోంది..!

నీ నవ్వులముత్యాలను దోసిలి పడుతుంటే..!!

 

2895. నీడనై  దోబూచులాడాలనుంది..! 

తన నీలాలకన్నుల్లో మెరిసే తారకనౌతూ..!!

 

2896. నా ఎదనే అంకితమిస్తున్నా..!

నీ ఊహలే ఊపిరైపోతుంటే..!!

 

2897. పులకించిపోతున్నా..!

తన పారాణి పాదాలకు మువ్వనైపోతూ..!!

 

2898. జీవితాన్నే అర్పిస్తున్నా..!

నీ నీడగానైనా జన్మంతా మిగిలేందుకై..!!

 

2899. తోచనీయవుగా..!

నా జ్ఞాపకాలలోకి  దొంగలా దూరిపోతూ..!!

 

2900. గాజుల సవ్వడులనుకున్నా..!

నీ నవ్వుల గలగలలు వింటూ..!!

 

2901. ఒంటరినే..!

జ్ఞాపకాలతోనే రమిస్తూ..!!

 

2902. మనోదర్పణంలో నీ చిత్రం..!

నా ఊహలకు ప్రతిరూపంలా..!!

 

2903. భావాల తరంగాలౌతున్నాయి..!

మదిపొరల్లో ప్రకంపనాలన్నీ..!!

 

2904. చిగురిస్తున్నాయి చెలిమి పల్లవాలు..!

కొమ్మ'తో బంధాన్ని ని(క)లుపుకుంటూ..!!

 

2905. విఫలమౌతూనే ఉన్నాను..!

నను నేను నియంత్రించుకునే పనిలో..!!

 

2906. వైణికురాలినే..!

రాతి గుండెలో రాగాలను మీటుతూ..!!

 

2907. నే బ్రతికుతున్నది..!

ప్రేమ సంజీవనితోనే..!!

 

2908. మౌనమైపోతోంది మది..!

పసి(డి)తలపులతో మురిసిపోతూ..!!

 

2909. చిన్ననాటి చెలిమొకటి తడిమింది..!

మమతల లేపనాలనే పూస్తూ..!!

 

2910. సిరి చందనాన్నే..! 

నీ మనోకుసుమాన్ని ఆర్తిగా అద్దుకుంటూ..!!

 

2911. ఆత్మబంధం అంటే తెలుసా..!

మనిద్దరి మనసుల కౌగిలింతే..!!

 

2912. మౌనదీపాలే వెలిగిస్తున్నా..!

నీ విరహపు చమురులతో..!!

 

2913. పదాలకూ లోకువే..!

నువ్వు వెలేసిపోగానే..!!

 

2914. సూర్యచంద్రులు..!

గగనపు గూటిలో వెలిగే దివ్వెలు...!!

 

2915. సుఖదుఃఖాలు..!

ప(క)న్నీటిని తోడుకుంటూ..!!

 

2916. కవీ చిత్రకారుడే..!

కలం కుంచెతో కావ్యాలను చిత్రిస్తూ..!!

 

2917. ప్రేమ రోగినే..!

ఔషదానికి లొంగక..!!

 

2918. సంచారినే..!

స్వప్నవీధుల్లో నిరీక్షిస్తూ..!!

 

2919. మమతల సమీరానివే..!

దుఃఖరాశులను ద్రవీభవింపచేస్తూ..!!

 

2920. ఒక చెలిమిహస్తం..!

నన్ను నాకు కొత్తగా పరిచయిస్తూ..!!

 

2921. జీవితమొక క్రీడే..!

గెలుపోటముల కలగలుపులతో..!!

 

2922. రాగాల సరాగాలే..!

నీకై మీటే విరహాల వీణియకు..!!

 

2923. ఒంటరితనం..!

నను నేను చదువుకునే గ్రంధాలయం..!!

 

2924. మది వానై కురుస్తోంది..!

కలతల మబ్బులను కరిగిస్తూ..!!

 

2925. గాజుపూలై జారిపోతున్నాయి..!

వికలమై...పగిలిపోయిన హృదయ శకలాలు..!!

 

2926. మౌనం..!

మనసుని మభ్యపెడుతూ..!!

 

2927. ఎంత అనుబంధం..!

అవనికీ అతివకీ...ఓ(వీ)డిపోని సహనంతో..!!

 

2928. నీడవై ఉన్నావనుకున్నా..!

నాలో లీనమైపోతావనుకోలేదు..!!

 

2929. నిరాశ..!

నను ఒంటరిని చేస్తూ..!!

 

2930. కొన్ని పరిచయాలే..!

తోడై ఓదార్పునిస్తూ..!!

 

2931. ఏకాకినే..!

ఏకాంతంలోనే  కకావికలమైపోతూ..!!

 

2932. సర్దుకుపోతానులే..!

నను అన్నది నా నువ్వేగా..!!

 

2933. నాగమల్లికెంత సింగారమో..! 

నీలికురులకు హత్తుకోగానే..!!

 

2934. కన్యాశుల్కమిస్తాలే..!

నా కలలకాసుల్ని రాశులుగా పోసి..!!

 

2935. జీవితాంతం తడిమేవే..!

పరామర్శించి పోలేమంటూ...కష్టసుఖాలు..!!

 

2936. పూలచెండు మృదుత్వమే..!

చెలి చేతి లాలిత్యపు స్పర్శ..!!

 

2937. సుస్వరాల ప్రవాహాలే..!

జారిపడ్డ చెలి కాలి మువ్వలనవ్వులతో..!!

 

2938. మల్లెల స్వచ్ఛతే..!

సిగలో పరిమళించేది..!!

 

2939. నీ పలుకుల పదనిసలు..! 

మృదుపాణి సరిగమల సంతకాలే..!!

 

2940. సిగ్గుల కెందామరలే..! 

కొంటె చూపులేవో అల్లరిగా ముద్దాడుతుంటే..!!

 

2941. తన స్పర్శల లావణ్యం..!

ఏ కవులకందని కావ్యగ్రంధం..!!

 

2942. ఒంటరి కొమ్మనే ..!

రాలిపోయే ఆశల పత్రాలకు సాక్షినై..!!

 

2943. మరో వసంతమౌతూ..!

 ఆశల లేలేతచివుళ్ళు ..!

 

2944. నిదురరాని రాత్రులెన్నో..!

నిరాశల మడతల్ని నిశ్శబ్దంగానే విప్పుకుంటూ..!!

 

2945. చలువ పందిళ్ళే..!

పల్లెలింటి తరువులన్నీ..!!

 

2946. నిశీధి సంగీతం..!

మౌన హృదయపు సవ్వడితో జతబడుతూ..!!

 

2947. నా శ్వాస గీతిక..! 

నీ గుండెలయలతో మమేకమౌతూ..!!

 

2948. గతాలన్నీ అక్షయాలే..!

ఘనచరితలెన్నిటినో ఊరిస్తూ..!!

 

2949. కునుకు తెలియనిదే గతం..!

వర్తమానమై నిదురకు నోచనీయక..!!

 

2950. గతమెంతో ఘనం..!

నాకో అందమైన బాల్యాన్ని కానుకిచ్చిందిగా..!!

 

2951. కన్నీటి బీజాలెన్నో..!

నయనక్షేత్రాన అంకురిస్తూ..!!

 

2952. తొడిమనై వేచియున్నా..!

తొలకరివై పలుకరిస్తావనే..!!

 

2953. తారోదయమే..!

నీ కన్నుల్లో వెలిగే కోటికాంతులతో..!!

 

2954. నీ తలపుల నెగళ్ళు..!

కోరికల వెచ్చదనాలను రాజేస్తూ..!!

 

2955. ఒక అరకొర లాస్యం..!

విసుగు అంచున వ్రేలాడుతూ..!!

 

2956. నేలతల్లికెంత పరవశమో..!

పూల బాలలను ఒడిలో లాలిస్తూ..!!

 

2957. ఆశల దీపాలు..!

కొనఊపిరితో కొట్టుమిట్టాడుతూ..!!

 

2958. ఆఘ్రాణిస్తూనే ఉన్నా..!

గమ్మత్తైన...నీ పిలుఫుల పరిమళాలను..!!

 

2959. మనస్సుకు మూగ తపస్సే..!

కానరాని నీకై త(జ)పిస్తూ..!!

 

2960. వేదనావాహిని..!

నిరంతరం సాగిపోతూ..!!

 

2961. ములుకులై దిగుతున్నాయి..!

మదిని చేసిన మరుపురాని గాయాలన్నీ..!!

 

2962. నే ఏకాకి గాలిపటాన్నే..!

జనతాకాశంలో... నిస్తేజంగానే ఎగురుతూ..!!

 

2963. విప్పుతూనే ఉంటాయి..!

ముఖాల మడతలు..జీవిత కధలనెన్నో..!!

 

2964. ప్రతిబింబిస్తూనే ఉంటుంది..!

ప్రతి కోణాన్నీ...మనిషి జీవితం..!!

 

2965. దిద్దుకుంటున్నా..!

మనోఫలకంపై చెరిగిన జ్ఞాపకాలను..!!

 

2966. తచ్చాడుతోంది మది..!

జ్ఞాపకాల ఆవరణలో..!!

 

2967. తాత్వికురాలినే..!

కాలం ఒదిలిన జ్ఞాపకాలను మోసుకుంటూ..!!

 

2968. పరవశ గీతాన్నే..!

ఊసుల రాగాలనే...దోసిళ్ళతో నింపుకుంటూ..!!

 

2969. ఎగిరిపోక తప్పదు..!

దేహమనే గూటినుండి...ప్రాణమనే పక్షి..!!

 

2970. మది గదంతా చీకటే..!

గడ్డ కట్టిన దిగుళ్ళతో..!!

 

2971. కాలానికీ కట్టుబాట్లు ఎక్కువే..!

సమాధానంలేని ప్రశ్నల్లోకి నెట్టేస్తూ..!!

 

2972. ఆత్మతత్వం..!

భవబంధపు సంకెళ్ళకు విముక్తినివ్వడం..!!

 

2973. రోజులదే కావొచ్చు…స్నేహం..!

సాన్నిహిత్యం మాత్రమెన్ని యుగాలదో..!!

 

2974. ఇంకేమి మిగిలిందని..!

మళ్ళీమళ్ళీ కోల్పోవడానికి...నిను చేజార్చుకున్నాక..!!

 

2975. మనస్సు భరిణెను తెరిచాను..!

మమతల మణులను పంచుకుందామనే..!!

 

 2976. ఈటెలై తాకుతున్నాయి..!

పలుగులంటి మాటలన్నీ మదిని ఛే(భే)దిస్తూ..!!

 

2977. అనుమానానికి తావే లేదు..!

నమ్మకమై నువ్వు చేరాక..!!

 

2978. నను నేను కోల్పోతున్నా..!

నాయునికిని వెదికే ప్రయత్నంలో..!!

 

2979. వెన్నెల కుసుమాన్నే..!

కోటిపున్నముల కాంతులీనుతూ..!!

 

2980. కనుమరుగవ్వని చిత్రాన్నే..!

కన్నె కలలకు హరివింటి వర్ణాలనద్దుతూ..!!

 

2981. పులకరిస్తోంది తీరం..!

అలల పెదవులతో కడలి ముద్దాడుతుంటే..!!

 

2982. కనులెదురు చూస్తున్నాయి..!

కమ్మని కలలకు ఆహ్వానం పంపుతూ..!!

 

2983. సంగీతాన్ని ఆలపిస్తోంది..!

స్వప్నవేణువేదో...పులకింతలతో..!!

 

2984. మిగిలిపోతూనే ఉంటావు..!

నువ్వో కధలా... వ్యధల గాధలో..!!

 

2985. మనోచిత్రాన్ని ఆవిష్కరించుకున్నా..! 

నీ ముఖచిత్రపు మాయలో పడకూడదనే..!!

 

2986. కనులకు కునుకేరాదు..!

దశాబ్దాలుగా నీకై మేల్కొనే ఉంటున్నా..!!

 

2987. కవనం విశ్రమించదు..!

కలమెంతగా అలసిపోతున్నా..!!

 

2988. పండిపోయే సిగ్గులెన్నో..!

చుంబించే అధరామృతాలతో..!!

 

2989. జ్ఙాపకాల గూళ్ళెన్నో..!

ఎదకొమ్మన అల్లుకుంటూ..!!

 

2990. మది కమలాన్ని గిచ్చేవి..!  

నీ విరహపు  భ్రమరాలే..!!  

 

2991. మనసు పొరల్ని త్రవ్వుకుంటున్నా..!

మది అంతరాల్లో దాగిన నీ రూపాన్నిచూడాలని..!!

 

2992. మెదడుకు మేతెక్కడిది..!

ఆధునిక మెళుకువలే తెగ తళుకులీనుతుంటే..!!

 

2993. చరితలన్నింటికీ కా'రణం..!

ప్రత్యక్షంగానో, పరోక్షంగానో స్త్రీ కన్నీళ్ళే..!!

 

2994. నిను మెప్పించాలనే ఉంది..!

అందమైన కవితనై అల్లుకుపోతూ..!!

 

2995. ప్రకృతినై జీవిస్తున్నా..!

రాగద్వేషాలకు అతీతమవ్వాలనే..!!

 

2996. వేచిచూస్తున్నా తనకై..!

మరో ఆరు జన్మలున్నాయనే నమ్మకంతో..!!

 

2997. అధరవనంలో పూయిస్తున్నా..!

చిరునవ్వుల పూలరేకుల్ని...విరిజల్లునై తాకాలనే..!!

 

2998. పడమటింట జోలపాటలే..!

తూరుపింటి బిడ్డడికి..!!

 

2999. వెన్నెల చీరలే...!

వెండి పరదాలు...భువన భవనానికి..!!

 

3000.  నిఘంటువులో దొరకనివే..!

మౌనవించిన నీ బాసలకు అర్ధాలు..!!

ll 14/10/13 ll

© 2013 by Komal Vadday

bottom of page